×
Image

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ధర్మం - (తెలుగు)

ముస్లింలు మరియు ముస్లిమేతరుల కొరకు ఇది ఒక మంచి పుస్తకం. దీనిలో అల్లాహ్ పై విశ్వాసం గురించి మరియు మన ఆరాధనలలోని అనేక తప్పిదాల, కల్పితాల, భ్రమల గురించి చర్చించబడింది. అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన పద్ధతిలో అల్లాహ్ ను ఎలా ఆరాధించాలనే విధానం వైపు ఇది దారి చూపుతున్నది.

Image

మనమంతా ఒక్కటే – మనందరి దేవుడూ ఒక్కడే - (తెలుగు)

హిందూ, క్రైస్తవ మరియు ఇస్లాం దివ్యగ్రంథాల వెలుగులో దేవుడంటే ఎవరు మరియు ఆదం – హవ్వా ఆదిదంపతుల బిడ్డలమైన మనమందరమూ ఏ విధంగా ఒక్కటవ గలము అనే ముఖ్యవిషయాల్ని, అవతరించిన నాటి నుండి ఎలాంటి కలుషితాలకు లోనుకాకుండా స్వచ్ఛమైన రూపంలో మిగిలిన ఉన్న ఏకైక దివ్యగ్రంథమైన ఖుర్ఆన్ మనందరి కొరకు మన సృష్టికర్త పంపిన అంతిమ సందేశమని, దానిని ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవవలసిన ఆవశ్యకతను గురించి సోదరుడు సిరాజుర్రహ్మాన్....

Image

తౌహీద్ ప్రబోధిని (తఫ్హీమ్ అత్తౌహీద్) - (తెలుగు)

ఈ పుస్తకంలో అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని గురించి చాలా వివరంగా చర్చించబడినది. ఇంకా షిర్క్ అంటే బహుదైవారాధన రుగ్మతల గురించి కూడా విశదీకరించటం జరిగినది. అంతే గాక అల్లాహ్ యొక్క సందేశహరుడిని, సందేశాన్ని మరియు అల్లాహ్ కు దూరం చేసే తాగూత్ అంటే దుష్టశక్తుల గుర్తింపు మరియు ఇతర ఏకదైవారధనకు సంబంధించిన విషయాలు కూడా దీనిలో విపులంగా చర్చించబడినవి. ప్రతి పాఠకునికి దీనిలోని విషయాలు ఇహపరలోకాలలో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి.

Image

ఖుర్ఆన్ అవతరణ ఉద్దేశ్యం ఏమిటి ? - (తెలుగు)

ఈ వీడియోలో ఖుర్ఆన్ అవతరణ ఉద్దేశ్యం ఏమిట ? అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.

Image

కితాబుత్తౌహీద్ (ఏకదైవత్వ గ్రంథం) - (తెలుగు)

అత్తౌహీద్ అంటే ఏకదైవత్వం పై వ్రాయబడిన ఉత్తమ పుస్తకాలలో ఇది ఒకటి. దీనిలో సకల లోక సృష్టికర్త యొక్క ఏకదైవత్వం గురించి వివరంగా చర్చించబడినది. అల్లాహ్ గురించి తెలుసుకోదలచిన ప్రతి ఒక్కరూ తప్పక చదవ వలసిన ఒక మంచి పుస్తకం.

Image

మానవులందరికీ అల్లాహ్ సందేశం - (తెలుగు)

ఈ వీడియోలో మానవులందరికీ అల్లాహ్ సందేశం అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుల్ కరీమ్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.

Image

జీసస్ అసలు సందేశం - (తెలుగు)

ఈ పుస్తకంలో జీసస్ (ఈసా అలైహిస్సలాం) యొక్క అసలు సందేశం – బైబిలు మరియు ఖుర్ఆన్ వెలుగులో చాలా స్పష్టంగా, నిష్పక్షపాతంగా చర్చించబడినది.

Image

సమస్త ఆరాధనలు అల్లాహ్ కు మాత్రమే ఎందుకు ? - (తెలుగు)

ఈ వీడియోలో సమస్త ఆరాధనలు అల్లాహ్ కు మాత్రమే ఎందుకు ? అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.

Image

ఆరాధనలు - (తెలుగు)

క్లుప్తంగా బహిర్భూమి అంటే టాయిలెట్ కు వెళ్ళే పద్దతి (కాలకృత్యాలు), స్నానం చేయటం, నీళ్ళులేని పరిస్థితిలో పరిశుద్ధమయ్యే పద్ధతి, ఉదూ, నమాజ్, పండగరోజు చేసే నమాజు, మృతశరీరం - స్నానం, నమాజు, అంత్యక్రియలు, తప్పనిసరిగా చేయవలసిన దానం - జకాత్, ఉపవాసం, మక్కా యాత్ర (హజ్)

Image

దివ్యఖుర్ఆన్ - అల్లాహ్ నుండి ఒక మహాద్భుత మహిమ - (తెలుగు)

దివ్యఖుర్ఆన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై అల్లాహ్ అవతరింపజేసిన ఒక మహాద్భుత మహిమ. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ ఆయత్ లు మరియు హదీథ్ బోధనల నుండి ఈ వ్యాసంలో వివరించబడెను.

Image

భాగస్వామ్యం - (తెలుగు)

ఏకదైవారాధన లో భాగస్వామ్యం మరియు దానిలోని వివిధ పద్ధతుల గురించి ఈ వ్యాసంలో చర్చించబడినది.

Image

ఇస్లామిక్ స్టడీస్ డిప్లొమా పాఠాలు, విద్యాశాఖ, తెలుభాషా విభాగం, రబ్వహ్ ఇస్లామీయ కేంద్రం, రబ్వహ్, రియాద్ - (తెలుగు)

ఇస్లామిక్ స్టడీస్ డిప్లొమా కోర్సు, విద్యాశాఖ, తెలుగు భాషా విభాగం, రబ్వహ్ ఇస్లామీయ కేంద్రం, రబ్వహ్, రియాద్. ఈ కోర్సు 5 సెమిష్టర్లలో దాదాపు రెండున్నర సంవత్సరాల లోపు పూర్తి అవుతుంది. ఒక్కో సెమిష్టరు నాలుగు నెలలు. ముస్లింలకు మరియు నవ ముస్లింలకు అవసరమైన ప్రాథమిక ఇస్లామీయ సబ్జెక్టులు ఇక్కడ ప్రామాణిక ఆధారాలతో బోధించ బడును. వీటిలో కొన్ని - బేసిక్ అరబీ భాష, ఖుర్ఆన్, అత్తౌహీద్ (ఏక దైవత్వం),....