పాపాల భారం
ఈ వ్యాసంలో తీర్పుదినాన పాపాత్ముడిపై పాపాల భారం ఏ విధంగా మోపడుతుందో క్లుప్తంగా వివరించ బడింది.
కూర్పులు
Full Description
- పాపాల భారం
- పాపాల భారం ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “ఏ మనిషి సన్మార్గాన్ని అవలంభిస్తాడో ఆ సన్మార్గం అతనికే ప్రయోజనకర మవుతుంది. అలాగే ఎవడు మార్గభ్రష్టుడైపోతాడో, ఆ మార్గభ్రష్టత్వం యొక్క దుష్ఫలితాన్ని అతడే అనుభవిస్తాడు. (ఎందుకంటే) తన భారాన్ని మోసే వాడెవడూ, ఇతరుల భారాన్ని మోయడు. (అల్లాహ్) మేము ఒక సందేశహరుణ్ణి పంపనంత వరకు ఎవరినీ శిక్షించము” (బనీ ఇస్రాయీల్ 17:15) ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “(గుర్తుంచుకోండి!) బరువు మోసేవాడు ఇతరుల బరువును మోయడు. దేనికై మానవుడు కృషి చేస్తాడో, అదితప్ప అతనికి మరొకటేది లభించదు. త్వరలోనే అతని కృషిని చూపబడుతుంది, దాని ప్రతిఫలం పూర్తిగా అతనికి ఇవ్వబడుతుంది. చివరకు నీ ప్రభువు వద్దకే చేరవలసి ఉంది”. (సూరహ్ అన్ నజ్మ్ 53:38-42) అంటే ప్రతి వ్యక్తి తాను చేసిన పనుల ప్రతి ఫలాన్ని మాత్రమే పొందుతాడు. ఒక వ్యక్తి చేసిన పనుల ప్రతిఫలం మరొక వ్యక్తికి లభించదు. ఏ వ్యక్తి అయిన ప్రయత్నం లేకుండా, ఆచరణ లేకుండా దేనినీ పొందలేడు. అలాగే మరొక వ్యక్తి చేసిన పనికి బాధ్యతను తనపై వేసుకోలేడు. అసలు నేరస్తుడి స్థానంలో, అతడి శిక్షను అనుభవించటానికి మరొక వ్యక్తి తనను తాను సమర్పించుకున్నప్పటికీ అతనిని వదలిపెట్టడం జరగదు. ఒక మనిషి ఇతరులకు అపమార్గానికి గురిచేయడం వల్ల వారు పొందే పాపాలకు సమానమైన పాపం, అపమార్గం పట్టించిన వారికి కూడా లభిస్తుంది. ఎందుకంటే ఆ పాపానికి అతను సూత్రధారి. అలాగే ఒక మనిషి ఇతరులకు పుణ్యమార్గం చూపినందుకు గాను వారు ఆ మార్గాన్ని అనుసరించి పొందే పుణ్యాలకు సమానంగా, ఆ పుణ్యమార్గం చూపించిన వారికి కూడా పుణ్యాలు లభిస్తాయి. ఎందుకంటే ఆ పుణ్యం చేయుటకై దారి చూపాడు గనుక. దాని పుణ్యం గురించి అల్లాహ్ ఇలా తెలియజేసాడు. ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “మేము నిశ్చయంగా ఒక రోజున మృతులను బ్రతికిస్తాము. వారు చేసే పనులన్నింటిని మేము నమోదు చేస్తూనే ఉన్నాము. వారు తమ వెనుక వదిలి వెళ్ళిన చిహ్నాలను కూడా మేము నమోదు చేస్తూ ఉన్నాము. ప్రతి విషయాన్నీ మేము ఒక స్పష్టమైన గ్రంధంలో నమోదు చేసి పెట్టాము”. (సూరహ్ యాసిన్ 36:12) ఇంకా అల్లాహ్ ఇలా తెలియజేసాడు, ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “వారు తప్పకుండా తమ బరువులను మోస్తారు . తమ బరువులతో పాటు అనేక ఇతర బరువులను (తమ పిలుపును అనుసరించి చెడుమార్గాన్ని అనుసరించిన వారి పాపభారంలోని కొంత భాగాన్ని) కూడా మోస్తారు. నిశ్చయంగా ప్రళయ దినాన వారిని వారి అభూత కల్పనలను గురించి అడగటం జరుగుతుంది”. (అన్కబూత్ 29:13) మరొకచోట అల్లాహ్ ఇలా తెలియజేసాడు - ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “వారు ప్రళయం నాడు తమ బరువులను పూర్తిగా మోస్తారు. దానికి తోడు వారు అజ్ఞానం వల్ల అపమార్గం పట్టిస్తున్న వారి బరువును కూడా మోస్తారు. చూడండి! వారు మోసే బాధ్యతా (ఎంత ) చెడ్డదైనది”. (సూరహ్ అన్నహ్ల్ 16:25) హజ్రత్ ముంజిర్ బిన్ జరీర్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ఎవరైతే ఇస్లాం యెక్క ఒక మంచి ఆచారాన్ని గ్రహించి, దానిని ఆచరిస్తారో, వారికి పుణ్యం లభిస్తుంది. అంతేకాక దానిని చూసి అనుసరించిన ఇతరుల పుణ్యానికి సమానమైన పుణ్యం కూడా వారికి లభిస్తుంది, అయితే ఇతరుల పుణ్యం నుండి రవ్వంత కూడా తగ్గించడం జరగదు. అలాగే ఎవరైతే ఒక చెడ్డ ఆచారాన్ని (ధర్మంలో లేని ఆచారాలను) జారీ చేసి దానిని నేరవేరుస్తారో, వారు దాని పాపభారాన్ని మోస్తారు. అంతేకాక దానిని చూసి అనుసరించిన ఇతరుల పాపానికి సమానమైన పాపభారం కూడా వారు మోస్తారు. అయితే, ఇతరుల పాపభారంలో రవ్వంత కూడా తగ్గించడం జరగదు”. (సహీహ్ ఇబ్ను మాజా) ఒకవేళ ఒక వ్యక్తి పాపాలు చేస్తే ఎంత పాపం చేస్తాడో అంతే దుష్ఫలితం పొందుతాడు. అంతేకాని ఆ పాపానికి బదులుగా ఎక్కువ దుష్ఫలితం పొందడు. అదే ఒక వ్యక్తి పుణ్య కార్యాన్ని చేస్తే దానికి ఎంత పుణ్యమో అంత ప్రతిఫలం ఎలాగూ పొందుతాడు. అంతేకాక కొన్నిసార్లు ఒక పుణ్యానికి బదులు దాని ప్రతిఫలం ఎన్నో రెట్లు పెంచి ఇవ్వబడటం కూడా జరుగును. అల్లాహ్ వైపునుండి ప్రత్యేకమైన సందర్బాలలో మరియు ప్రత్యేకమైన పుణ్యాలను బట్టి అలాంటి అధిక ప్రతిఫలం ప్రాప్తమవుతుంది. కనుక అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “మీరు గనక అల్లాహ్ కు మంచి ఋణాన్నిఇస్తే, ఆయన మీకు దానిని ఎన్నో రెట్లు పెంచి తిరిగి మీకు ఇస్తాడు. మీ పొరపాట్లను మన్నిస్తాడు”. (సూరహ్ అత్ తగాబున్ 64:17) ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “అల్లాహ్ వద్దకు సత్కార్యాన్ని తీసుకువచ్చే ప్రతి ఒక్కరి కొరకు పది రెట్ల ప్రతిఫలం ఉంది. కానీ, దుష్కార్యాన్ని తీసుకువచ్చే వాని కొరకు అతడు ఎంత తప్పు చేసాడో అంతే ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు”. (సూరహ్ అల్ అన్ఆమ్:160) హజ్రత్ అబూ జర్రీన్ రదియల్లాహు అన్హు కథనం: అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం తెలియజేసారు: “ప్రతి పుణ్యం పది పుణ్యాల వంటిది లేక దానికంటే ఎక్కువ. మరియు ప్రతి పాపము ఒక పాపము వంటిది. దానిని కూడా అల్లాహ్ క్షమించవచ్చు. నీవు అల్లాహ్ కు సాటి కల్పించకుండా భూమి నిండా పాపాలు చేసి అల్లాహ్ ను కలిసినా, అల్లాహ్ కూడా భూమి నిండా క్షమాపణలతో నిన్ను కలుస్తాడు”. (అహ్మద్)
పాపాల భారం
﴿ الخطر من المعاصي ﴾
] తెలుగు – Telugu – تلغو [
http://ipcblogger.net/salimumri/
అనువాదం : -
పునర్విమర్శ : ముహమ్మద్ కరీముల్లాహ్
2009 - 1430
﴿ الخطر من المعاصي ﴾
« باللغة التلغو »
http://ipcblogger.net/salimumri/
ترجمة : -
مراجعة : محمد كريم الله
2009 - 1430