ఇంగ్లండులోని ఒక మాజీ హిందూ మహిళ – నూర్
కూర్పులు
Full Description
ఇంగ్లండులోని
మాజీ హిందూ మహిళ నూర్
﴿قصة نورة ﴾
] తెలుగు – Telugu – التلغو [
అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విమర్శ : షేఖ్ నజీర్ అహ్మద్
2009 - 1430
﴿ قصة نورة ﴾
« باللغة التلغو »
ترجمة: محمد كريم الله
مراجعة: شيخ نزير أحمد
2009 - 1430
ఇంగ్లండులోని మాజీ హిందూ మహిళ - నూర్
ఇస్లాం మరియు హిందూ ధర్మాలలో మహిళల స్థితిపై ఒక సునిశిత పరిశీలన
సారాంశం: నేటి సమాజంలోని మహిళల పరిస్థితిపై స్వయంగా చేసిన పరిశోధన నూర్ ఇస్లాం స్వీకరణకు దారి తీసినది – హిందూ ధర్మాన్ని వదిలి ఇస్లాం స్వీకరించిన ఒక ఆధునిక మహిళ యొక్క స్వీయగాథ. విచ్ఛలవిడితనం నుండి విముక్తి కలిగించిన ఓఅద్భుత ప్రయాణం.
ఏదో ఒక రోజు పెళ్ళి చేసుకుని, పిల్లలను కని, భర్త మంచివాడైనా, కాకపోయినా సరే అతనికి సేవలు చెయ్యడమే మీ (స్త్రీల) జీవిత లక్ష్యమని ఎల్లప్పుడూ నూరిపోస్తుండే ఒక సంప్రదాయ హిందూ కుటుంబంలో నేను పుట్టాను. వయస్సు పెరుగుతున్న కొద్దీ స్త్రీలను వేధిస్తున్న అనేక నిజవిషయాలు కనుగొన్నాను. ఉదాహరణకు వాటిలో కొన్నింటిని ఇక్కడ తెలియజేస్తున్నాను :
* ఒకవేళ ఎవరైనా మహిళ విధవరాలైతే, ఆవిడ ఎల్లప్పుడూ తెల్లటి చీరనే (బట్టలనే) ధరించవలసి ఉంటుంది. శాకాహారాన్నే భుజించవలసి ఉంటుంది. తల వెంట్రుకలు చిన్నగా కత్తిరించుకుని ఉండవలసి ఉంటుంది. ఆవిడ జీవితంలో మరల పెళ్ళి చేసుకోకూడదు.
* సాధారణంగా కాబోయే తన అత్తవారికి పెళ్ళికూతురు కట్నం ఇచ్చుకోవలసి ఉంటుంది. ఇంకా పెళ్ళికూతురు ఇవ్వగలిగే స్థితిలో ఉన్నదా, లేదా - అనే దానితో సంబంధం లేకుండా కాబోయే భర్త తన కోరికలకు అనుగుణంగా మోటారు బైకు, కారు, స్కూటరు వంటి వాటిలో దేనినైనా సరే పట్టుబట్టి మరీ డిమాండు చేయవచ్చు.
* అంతేకాక, పెళ్ళి జరిగి పోయి సంసారం చేస్తున్నా కట్నం ఇంకా బాకీ ఉన్నట్లయితే, ఆవిడను మానసికంగాను, శారీరకంగాను హింసిస్తారు. ఇంకా ఆవిడ వంట చేస్తున్నప్పుడు లేక వంటగదిలో ఉన్నప్పుడు భర్త స్వయంగా లేక తన తల్లితో కలిసి అగ్నిప్రమాదానికి గురైనట్లు కనబడే విధంగా సజీవ దహనం చేస్తారు. అలా చివరికి ఆవిడ జీవితాన్ని "వంటింటి చావు" కబురుతో అంతం చేస్తారు. ఇలాంటి అనేక సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఈమధ్యనే నా తండ్రి స్నేహితుని కుమార్తే ఇటువంటి దుర్ఘటనకు గురవటం స్వయంగా నేను చూసాను!
* వీటన్నింటితో పాటు, స్త్రీలు హిందూత్వంలో పురుషులను దేవుళ్ళతో సమానంగా చూస్తారనటంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఒక హిందూ ధర్మ పండుగలో, అవివాహిత కన్యలు ఒక ప్రత్యేక దేవుడి (శివుడి) విగ్రహానికి పూజలు చేస్తారు మరియు వేడుకుంటారు. అలా ప్రార్థించటం వలన అటువంటి (శివుడి వంటి) భర్తలు లభించవచ్చునట. ఒకరోజు నా స్వంత తల్లి నన్ను కూడా అలాంటి పూజలే చేయమని చెప్పింది. ఈ సంఘటన స్పష్టమైన ఋజువులపై కాకుండా కేవలం మూఢభక్తి మరియు మూఢవిశ్వాసాలపైనే ఆధారడి, స్త్రీజాతిని అణచివేతలకు గురిచేసే సంప్రదాయాలను మాత్రమే కలిగి ఉన్న హిందూధర్మం ‘సత్యమైనది కాకపోవచ్చేమోనని’ నన్ను భావించేలా చేసింది.
ఆ తరువాత, పై చదువుల కోసం ఇంగ్లండుకు వెళ్ళాను. కనీసం ఆ దేశమైనా స్త్రీలను అణచివేతలకు గురి చేయదని, స్త్రీపురుషులకు సమాన హక్కులు కలిగిస్తుందని మరియు అక్కడ ఇష్టం వచ్చినట్లు జీవించే స్వాతంత్ర్యం అందరికీ ఉంటుందని భావించాను. అలా నేను ప్రజలతో విచ్చలవిడిగా కలవటం ప్రారంభించి, క్రొత్త క్రొత్త వారితో స్నేహం చేయసాగాను. ఆ విధంగా నేను ఆ నూతన సమాజం గురించి తెలుసుకోవటం మొదలుపెట్టాను. ఇంకా, "సంఘంలో కలిసి పోవటం" కోసం నేను నా స్నేహితులు వెళ్ళే బార్లు, క్లబ్బులు, నాట్యహాళ్ళు మొదలైన ప్రతిచోటికీ వెళ్ళాను. అయితే, ఈ "స్త్రీపురుష సమానత్వమనేది" కేవలం సిద్ధాంతాలకు మరియు ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమైనదని, వాస్తవానికి దానిని ఆచరణలో పెట్టడమనేది అసాధ్యమనే పచ్చినిజాన్ని అతి త్వరలోనే నేను గ్రహించాను.
విద్య, ఉద్యోగం మొదలైని వాటిలో స్త్రీలకు సరిసమానమైన హక్కులు ఇస్తున్నట్లు పైకి కనబడుతున్నా, వాస్తవానికి ఆధునిక సమాజంలో కొత్త కొత్త పద్ధతులలో స్త్రీలు యుక్తిగా, ఇంకా దారుణంగా అణచివేయబడుతున్నారు. నేను నా స్నేహితులతో అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, వారు నన్ను హత్తుకోవటానికి త్వరపడేవారు. ప్రతి ఒక్కరూ నాతో మాట్లాడటం కోసం అతిగా చూపుతున్న ఇష్టాన్ని, ఆసక్తిని నేను గమనించాను. అలా ప్రవర్తించడం అక్కడ మామూలు విషయమేనేమోనని నేను భావించాను. నేను ఎంత అమాయకంగా వారికి లొంగిపోయేదాన్నో ఆ తర్వాత గాని నాకు తెలిసిరాలేదు. నిజానికి వీరు నానుండి దేనిని పొందటానికి ప్రయత్నిస్తున్నారో నేను పసిగట్టాను. వెంటనే నేను నేనేనా, నేను జీవించేది నాకోసమేనా అనే భావనలు నాలో మొదలై, అసౌకర్యాన్ని ఫీలవసాగాను. దీనికి కారణాలు - ప్రజలు నన్ను ఇష్టపడాలనే ప్రయత్నంలో నా ఇష్టాయిష్టాలను ప్రక్కన పెట్టి, వారు మెచ్చే విధంగా దుస్తులు ధరించటానికి నేనే స్వయంగా ప్రయత్నించటం మొదలైనవి. నేను త్వరలోనే నాలో అసౌకర్యపు ఫీలింగులు ఇంకా పెరుగుతున్నట్లు మరియు నా వ్యక్తిత్వం దిగజారి పోతున్నట్లు, అలా క్రుంగిపోతున్న భావనల నుండి బయట పడలేక పోతున్నట్లు గమనించాను. ప్రతి ఒక్కరూ తమలో తాము బాగా ఎంజాయ్ చేస్తున్నామని చెబుతుండగా, నేను మాత్రం దానిని ఎంజాయ్ అనే పేరుతో పిలవలేక పోయాను.
స్త్రీలు ఇటువంటి హద్దు మీరిన ఆ విచ్ఛలవిడి జీవన విధానంలో అణచివేయబడు తున్నారని నా అభిప్రాయం; ప్రజల దృష్టి తన వైపు మళ్ళించటానికి మరియు ఇంకా ఆకర్షణీయంగా కనబడటానికి, వారు ఒక ప్రత్యేక పద్ధతిలో మాత్రమే దుస్తులు ధరించ వలసి ఉంటుంది. ఇంకా ప్రజల మెప్పు కోసం ప్రత్యేక పద్ధతిలో మాత్రమే మాట్లాడ వలసి ఉంటుంది. అంతకు ముందు నాకు ముస్లింలతో పరిచయం ఉన్నా ఇస్లాం గురించి నేనంతగా ఆలోచించలేదు. కాని, ఇప్పుడు నేను ఇస్లాం గురించి ఆలోచించసాగాను. ‘నాలో మనశ్శాంతిని, తృప్తిని, సంతోషాన్ని, భద్రతను, గౌరవభావాలను కలిగించే జీవన విధానాన్ని కనిపెట్టడం కోసం, నిజంగా నేను ఏదో ఒకటి చేయాలి’ అని తీవ్రంగా ఆలోచించసాగాను. ప్రతి ఒక్కరూ తమ తమ విశ్వాసాలకు అనుగుణంగా జీవిస్తున్నారు. వారిలా ఏదో ఒకదానిని విశ్వసించటానికి బదులు ముందుగా సత్యమైన మరియు స్వచ్ఛమైన ధర్మాన్ని కనుక్కొని, దానినే విశ్వసించాలని నిర్ణయించుకున్నాను. ఇతరులకు దూరంగా ఉండటంలో తమకు ఆనందం కలుగుతుందని నమ్మే ప్రజలు, తమ విశ్వాసానికి అనుగుణంగానే జీవిస్తారు. ధనం సంపాదించటమే ముఖ్యమని నమ్మే ప్రజలు, ఎలాగైనా తమ లక్ష్యాన్ని సాధించటానికి ప్రయత్నిస్తారు. మద్యం సేవించటం ద్వారా ఎంజాయ్ చేయవచ్చు అని నమ్మే ప్రజలు, అలానే చేస్తారు. కాని, ఇవన్నీ మనల్ని అసలైన గమ్యానికి చేర్చవని నా అభిప్రాయం; వీరెవ్వరూ నిజమైన మనస్తృప్తిని పొందలేరు. గమ్యం లేని ఈ ప్రయాణంలో స్త్రీలు తమ మానమర్యాదలను పోగొట్టుకుంటున్నారు.
‘ఒక మహిళగా తన స్థానాన్ని ఇస్లాం ధర్మం ఎలా ఉన్నతపరచినది’ - నూర్ వివరణ.
"సమాన హక్కుల సమసమాజం" అనే ఘోషణలు మారుమ్రోగిపోతున్న నేటి కాలంలో, మీకు ఒక బాయ్ ఫ్రెండు ఉండటం (అలా బాయ్ ఫ్రెండు లేకపోతే అందరూ మిమ్మల్ని వింతగా చూస్తారు!) మరియు శోభనరాత్రి వరకు కన్యగా మిగిలి ఉండకపోవటం అనేది సాధారణ విషయమై పోయినది. నిజానికిది మహిళలపై ఒక విధమైన అణచివేత. అయితే కొందరు మహిళలు దీనిని గ్రహించటం లేదు. చివరికి ఇస్లాంలో ప్రవేశించిన తర్వాతే, నేను స్పష్టమైన శాశ్వత భద్రత పొందాను. మానవ జీవితపు ప్రతి క్షణాన్ని నిర్వచిస్తున్న ఈ ధర్మం - ఈ విశ్వాసం పరిపూర్ణమైనదే కాకుండా స్పష్టమైనది కూడా. ఇస్లాం ధర్మంలో స్త్రీలు - తల పై భాగం నుండి కాలి బొటన వ్రేలి వరకు పూర్తిగా కప్పుకోవలసి ఉంటుందని అంటే పరదా ధరింవలసి ఉంటుందని, అలా వారు ఎటువంటి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు, హక్కులు లేకుండా అణచివేతకు గురిచేయబడుతున్నారనే తప్పుడు అభిప్రాయం మనలో చాలా మందికి ఉన్నది. కాని వాస్తవానికి, ఇస్లాం ధర్మం స్త్రీలకు అనేక హక్కులను 1400 సంవత్సరాలకు పూర్వమే ఇచ్చివేయగా, ముస్లిమేతర స్త్రీలకు మాత్రం కొన్ని పాశ్చాత్య దేశాలు మరియు కొన్ని ఆధునిక సమాజాలు ఈ మధ్యనే వాటిని కల్పించాయి. కాని, హిందూ స్త్రీల గురించి పైన వివరించినట్లుగా సంప్రదాయాల పరదాలో స్త్రీలను అణచివేస్తున్న సమాజాలు నేటికీ మిగిలి ఉన్నాయి.
ముస్లిం మహిళలకు వారసత్వపు హక్కు ఉన్నది. తమ స్వంత వర్తకవ్యాపారాలు నడిపించే హక్కు వారికుంది. వారికి తమ సంపదపై మొత్తం ఆధిపత్యపు హక్కు మరియు అమ్మకపు హక్కు ఉన్నది. ఇంకా ఆవిడ సంపదలో భర్తకు ఎటువంటి ప్రమేయమూ ఉండదు. చదువుకునే హక్కు వారికి ఉంది. అంతేకాక సరైన మరియు న్యాయమైన కారణాల ఆధారంగా తమ పెళ్ళి సంబంధాన్ని కూడా తిరస్కరించే హక్కు ముస్లిం మహిళలకు ఉంది. స్త్రీలను దయతో చూడమని మరియు వారితో మంచిగా ప్రవర్తించమని పురుషులను ఆజ్ఞాపిస్తూ, స్త్రీల హక్కుల గురించి వారిని తీవ్రంగా హెచ్చరిస్తున్న అనేక వచనాలను దివ్యఖుర్ఆన్ స్వయంగా తనలో కలిగి ఉంది. ఇస్లాం ధర్మం మన జీవితానికి సరిపడే ఖచ్చితమైన మరియు వాస్తవమైన నియమనిబంధనలను తెలియజేస్తున్నది ఎందుకంటే అవి దైవాదేశాలే గాని మానవులచే తయారు చేయబడలేదు; కాబట్టి ఇది ఒక పరిపూర్ణమైన జీవన విధానం.
ముస్లిం మహిళలను ‘మీరు తల నుండి కాలిబొటన వ్రేలి వరకు ఎందుకు కప్పుకుంటారు’ అని తరచుగా ప్రశ్నిస్తూ ఉంటారు. అంతేకాక అలా కప్పుకోవసి ఉండటం మిమ్మల్ని అణచివేతకు గురి చేస్తుందని కూడా ప్రజలు వారితో అంటుంటారు – కాని వాస్తవానికి అది అణచివేత క్రిందికి రానేరాదు. ఇస్లాం ధర్మంలో, వివాహమనేది సమాజ నిర్మాణంలోని ఒక ముఖ్యమైన భాగం. కాబట్టి, స్త్రీలు ప్రతి ఒక్కరికీ తమ అందచందాలను చూపుకుంటూ బయట తిరగకూడదు. వాటిని తన భర్త కోసం పదిలంగా ఉంచుకోవలెను. అలాగే పురుషులు కూడా తమ శరీరంలోని కొన్ని భాగాలను తమ భార్యలకు తప్ప ఇంకెవ్వరికీ చూపించకూడదు. అంతేకాక, సత్సీలత కోసం తమ శరీరాన్ని తామే కప్పి ఉంచాలని ముస్లిం మహిళలను దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు:
"ఓ ప్రవక్తా! నీ భార్యలకూ, నీ కూతుళ్ళకూ, విశ్వాసుల యొక్క స్త్రీలకూ తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడ తీసుకోమని చెప్పు. వారు గుర్తింపబడటానికీ, వేధింపబడకుండా ఉండేందుకూ ఇది ఎంతో సముచితమైన పద్ధతి. అల్లాహ్ క్షమించేవాడూ, కరుణించేవాడూను " (ఖుర్ఆన్ 33:59)
మన చుట్టుప్రక్కలనున్న ఏ సమాజాన్ని పరిశీలించినా, అధికంగా హింసింపబడుతున్నది మరియు దాడులకు గురవుతున్నది స్త్రీలే అనే విషయం తెలుస్తుంది. వారి వస్త్రధారణే దానికి ముఖ్యకారణం. ఇక్కడ నేనొక మాట స్పష్టం చేయాలనుకుంటున్నాను – దేవుడు నిర్ణయించిన ఇస్లాం ధర్మంలోని ఆ నియమనిబంధనలు కేవలం స్త్రీల వరకే పరిమితం కాకుండా పురుషులకు కూడా వర్తిస్తాయి. స్త్రీపురుషులు కలిసిమెలిసి, స్వేచ్ఛగా తిరగకపోవటంలో ఇరువురికీ ప్రయోజనం ఉన్నది. ఏ దైవాజ్ఞ అయినా సరే అది సరైనది, పరిపూర్ణమైనది, స్వచ్ఛమైనది మరియు మానవాళికి ప్రయోజనం చేకూర్చేదే అయివుంటుంది; ఇందులో ఎటువంటి సందేహమూ ఉండకూడదు. ఖుర్ఆన్ లోని క్రింది వచనం ఈ విషయాన్ని స్పష్టంగా వివరిస్తున్నది:
"ప్రవక్తా! విశ్వసించిన పురుషులకు తమ చూపులను కాపాడుకోండి అనీ తమ మర్మాంగాలను రక్షించుకోండి అనీ చెప్పు. ఇది వారికి ఎంతో పరిశుద్ధమైన పద్ధతి. వారు చేసే దానిని గురించి అల్లాహ్ కు బాగా తెలుసు.
ప్రవక్తా!విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పు, తమ చూపులను కాపాడుకోండి అని తమ మర్మాంగాలను రక్షించుకోండి అని, తమ అలంకరణలను ప్రదర్శించరాదని – దానంతట అదే కనిపించేది తప్ప – తమ వక్షస్థలాలను ఓణీ అంచులతో కప్పుకోవాలని, వారు తమ అలంకరణలను వీరి ముందు తప్ప మరెవరి ముందూ ప్రదర్శించకూడదని - భర్త, తండ్రి, భర్తల తండ్రులు, తమ కుమారులు,. . . " (ఖుర్ఆన్ 24:31)
నిజానికి పరదా ధరించటం ప్రారంభించినప్పుడు, నాకు చాలా ఆనందం కలగినది. వాస్తవానికి, నేనే స్వయంగా దానిని వేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మొదటిసారి పరదా వేసుకోగానే నాకు మాటల్లో వివరించలేనంత తృప్తి మరియు సంతోషం కలిగాయి. మరియు అది తెచ్చే మంచిని మరియు శుభాసీస్సులను సంతోషంగా స్వీకరిస్తున్నాను. పరదాలో నేను సురక్షితంగా, భద్రంగా, పూర్తి సంరక్షణలో ఉన్నాననే మనస్తృప్తి నాలో కలుగుతున్నది. నిజానికి పరదా వలన ప్రజలు నన్ను ముందు కంటే ఎక్కువగా గౌరవం ఇస్తున్నారు. నా వైపు చూసే వారి దృష్టిలోనే నాకు చాలా మార్పు కనబడుతున్నది అంటే అంతకు ముందు వలే కాకుండా, పరదాలో నన్ను గౌరవాభిమానాలతో చూస్తుండటం నేను గమనించాను.
ఇక చివరిగా, నేను గ్రుడ్డిగా లేక ఏదో ఒత్తిడికి గురై ఇస్లాం స్వీకరించేలేదని మీకు స్పష్టం చేయాలనుకుంటున్నాను. "ధర్మ విషయం లో ఎలాంటి ఒత్తిడీ లేదు" అని ఖుర్ఆన్ లోని ఒక వచనం ప్రకటిస్తున్నది. స్వయంగా నేను అంగీకరించే ఇస్లాం స్వీకరించాను. పాత జీవితంలో చెడు చూసాను, చెడు వద్దకు చేరాను, చెడులో మునిగిపోయాను కూడా – అలా కథ యొక్క రెండు (మంచి చెడు అనే) వైపులా చూసాను. రెండో ప్రక్క గురించి నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నాకు తెలుసు నేను చేసినది సరైనదే. ఇస్లాం మహిళలను అణచివేయదు. కాని వారికి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను, వారు పొందవలసిన అసలు గౌరవాన్నీ ఇస్తున్నది. ఇస్లాం అనేది మొత్తం మానవాళికోసం దేవుడు ఎంపిక చేసిన జీవన విధానం. ఎవరైతే దీనిని స్వీకరించారో, వారు నిజానికి ఒక సమాజాన్ని ఇంకో సమాజం అణగ ద్రొక్కుచున్న మరియు స్త్రీపురుష సమానత్వపు ఘోషణల పరదాలో మహిళలను నిలువుదోపిడీ చేస్తున్న, వారిని మానభంగాలు చేస్తున్న, హింసిస్తున్న మానవజాతి నియమ నిబంధనల సంకెళ్ళ నుండి బంధ విముక్తులైన వారవుతారు. ఇస్లాంలో ఇలానే ఉన్నది. అది మహిళలకు నిజమైన విముక్తి కలిగిస్తున్నది. వారికి ఇతర ఏ సమాజమూ ఇవ్వని స్వంత వ్యక్తిత్వాన్ని ఇస్తున్నది. మొత్తం మానవజాతి శ్రేయస్సు కోసం దేవుడు నిర్ణయించిన నియమ నిబంధనల పరిధిలో తమ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా స్వేచ్ఛాయుత జీవితం గడపటానికి అవకాశం కలిగిస్తున్నది. మనలోని భ్రమలతో, తప్పుడు అభిప్రాయాలతో అంతిమ కలియుగ దైవధర్మాన్ని పరిశోధించకుండా, దానిలోని సత్యాసత్యాలు తెలుసుకోవటానికి ప్రయత్నించకుండా ఉండటం వలన నష్టపోయేది కేవలం మనమే. కాబట్టి ఈ రోజు నుండే ఖుర్ఆన్ భావాన్ని చదువుతూ, దానిలోని సత్యాన్ని గ్రహించటానికి మనస్పూర్తిగా ప్రయత్నించవలెను. సత్యధర్మాన్ని స్వీకరించటం ద్వారా దేవుడి మెప్పు పొందవచ్చు, ఇహపరలోకాలలో అసలైన సాఫల్యం మరియు మనశ్శాంతి పొందవచ్చు, స్వరంలో శాశ్వతస్థానం పొందవచ్చు , భయంకరమైన మరణానంతర శిక్షల బారి నుండి మరియు నరకాగ్ని నుండి తప్పించుకోవచ్చు.
“తీర్పుదిన అధిపతివైన ఓ అల్లాహ్! మేము కేవలం నిన్నే ఆరాధిస్తాము మరియు సహాయం కోసం కేవలం నిన్నే అర్థిస్తాము. నీవు అనుగ్రహించిన వారి సన్మార్గాన్ని మాకు చూపుము, నీ ఆగ్రహానికి గురి అయిన వారి అపమార్గం నుండి, మార్గభ్రష్ఠత్వం నుండి మమ్మల్ని కాపాడుము.” ఖుర్ఆన్ 1: 4-7