×
ఖుర్ఆన్, సీరహ్, తౌహీద్, ఫిఖ్ హ్ విషయాలలో కొన్ని ప్రశ్నలు - జవాబులు

    Islamic Quiz

    ﴿ المسابقة الإسلامية ﴾

    ] తెలుగు – Telugu – التلغو [

    Syed Yousuf Pasha

    అనువాదం : -

    పునర్విమర్శ : ముహమ్మద్ కరీముల్లాహ

    2009 - 1430

    ﴿ المسابقة الإسلامية ﴾

    « التلغو »

    ســيـــد يوسف باشا

    ترجمة: -

    مراجعة: محمد كريم الله

    2009 - 1430

    బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం

    క్విజ్ ప్రశ్నలు

    1. దివ్య ఖుర్'ఆన్ లో ఒకే విడతలో పూర్తిగా అవతరించిన పెద్ద సూరా:

    a. అల్-బఖర b. సూరా యూసుఫ్ c. సూరా అల్-ఫాతిహా d. సూరా ఆలి ఇమ్రాన్

    2. ఖుర్'ఆన్ లో ఒక సూరాలో ఒకే వాక్యం 31 పర్యాయాలు పునరావృతం అయ్యింది. ఆ సూరా పేరు ఏమిటి?

    a. సూరా అల్-నూర్ b. సూరా అల్-అంబియా c. సూరా అర్రహ్మాన్ d. సూరా ముజాదిలా

    3. ఈ ప్రవక్త జాతి వారిలో ఆయనను అనుసరించని వారినందరినీ, ఆయన కుమారునితో సహా అల్లాహ్ వరదలు సృష్టించి నాశనం చేసాడు. ఆ ప్రవక్త ఎవరు?

    a. నూహ్ అ.స. b. సాలిహ్ అ.స. c. మూసా అ.స. d. షుఐబ్ అ.స.

    4. ప్రళయదినం సంభవించి తిరిగి అందరూ లేపబడినపుడు ఏ ప్రవక్తకు ప్రసంగించే అవకాశం ఇవ్వబడుతుంది.

    a. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం b. ఈసా అ.స. c. ఇద్రీస్ అ.స. d. షుఐబ్ అ.స.

    5. ఈ ప్రవక్త యొక్క తండ్రి, మరియు కుమారుడు కూడా ప్రవక్తలే. ఆ ప్రవక్త ఎవరు ?

    a. ఇబ్రాహీం అ.స. b. ఇస్మాఈల్ అ.స. c. ఈసా అ.స. d. యహ్యా అ.స.

    6. నరక వాసుల నాయకుడు ఎవరు?

    a. మాలిక్ b. ఇబ్లీస్ c. అందరికంటే తక్కువ శిక్ష పడే అబూ తాలిబ్ d. వీరెవరూ కాదు

    7. సూరా తౌబా యొక్క మరొక పేరు

    a. అల్-బరా b. అల్-హాఖ్ఖ c. ముజాదిలా d. అత్-తలాఖ్

    8. దివ్య ఖుర్'ఆన్ లోని ఏ సూరా లో బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం 2 పర్యాయాలు వస్తుంది?

    a. అల్-నమల్ b. అత్-తౌబా c. అల్-బఖరా d. అల్-ఇన్ఫితార్

    9. దివ్య ఖుర్'ఆన్ లోని ఒక సూరాలో అల్లాహ్ పేరు ప్రతి వాక్యంలో ఒకసారి వస్తుంది. అది ఏ సూరా.

    a. అత్-తకాసుర్ b. అల్-అంబియా c. అర్రహ్మాన్ d. అల్-ముజాదిలా

    10. దివ్య ఖుర్'ఆన్ లో మొత్తం ఎన్ని సూరాలు ఉన్నాయి.

    a. 114 b. 113 c. 112 d. 100

    11. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన 25 వ సంవత్సరం ఖదీజా ర.అన్హా ను వివాహమాడారు. ఖదీజా ర.అన్హా గురించి ఈ క్రింది వాక్యాలలో ఏ వాక్యం నిజం కాదు.

    a. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే వయసులో పెద్ద b. ఆవిడ బాగా ధనవంతురాలు

    c. ఆవిడ తరఫున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యాపారం చేసేవారు d. ఆవిడ క్రైస్తవ మతస్తురాలు.

    12. జిబ్రీల్ అ.స. మొట్టమొదటి సారి వహీ తీసుకువచ్చిన సందర్బం లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా స్పందించారు?

    a. ఇలా జరుగుతుందని వారికి ముందే తెలుసు b. వహీ అవతరించడం కోసం వారు ఎదురు చూస్తున్నారు

    c. భయపడి త్వరగా ఇంటికి చేరుకున్నారు d.అల్లాహ్ వహీ అవతరింపజేసినందుకు సంతోషించి కృతఙ్ఞతతో

    సజ్దా చేసినారు.

    13. స్వర్గలోకపు స్త్రీలలో అత్యుత్తమ స్త్రీగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించిన స్త్రీ ఎవరు?

    a. ఫాతిమా ర.అన్హా b. జైనబ్ ర.అన్హా c. మరియం అ.స. d. వీరెవరూ కాదు

    14. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించే ముందు చిట్టచివరి సారిగా 3 సార్లు పలికిన పదాలు

    a. అస్తగ్ ఫిరుల్లాహ్ b. రబ్బీ ఇర్ హింనీ c. అల్లాహు అక్బర్ d. రఫీఖుల్ అ'ఆలా

    15. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత మంది భార్యలను కలిగి ఉండేవారు (మారియా ఖిబ్తియ్యా ర.న్హాతో సహా)

    a. 8 b. 11 c. 9 d. 10

    16. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలలో బాగా పొడగరి మరియు భారీకాయస్తురాలు ఎవరు?

    a. సౌదా బింత్ జమా b. ఆయేషా ర.అన్హా c. ఖదీజా ర.అన్హా d. వీరెవరూ కాదు

    17. ఈ సహాబీ పేరు దివ్య ఖుర్'ఆన్ లో అవతరించబడింది.

    a. అబూబకర్ ర.అన్హు b. ఉమర్ బిన్ ఖత్తబ్ ర.అన్హు c. జైద్ బిన్ హారిస ర.అన్హు d.ఉసామ బిన్ జైద్ ర.అ

    18. జిబ్రీల్ అ.స. ద్వారా మొట్టమొదటి సారిగా వహీ అవతరించబడినపుడు ప్రవక్త స.అ.సం. వయస్సు అన్ని సంవత్సరాలు

    a. 40 b. 39 c. 42 d. 41

    19. జబల్ అన్-నూర్ పర్వతం మరొక పేరు

    a. హిరా పర్వతం b. తూర్ పర్వతం c. సఫా పర్వతం d. మర్వా పర్వతం

    20. ముగ్గురు వ్యక్తులు ఇస్లాం స్వీకరించకపోయినా ప్రవక్త స.అ.సం. కు తమకు సాధ్యమైనంతవరకు సహకరించారు. వారిలో ఒకరు అబూ తాలిబ్, మరొకరు ముతిం బిన్ అదీ. మూడవ వ్యక్తి ఎవరు?

    a. అబ్దుల్ ముత్తలిబ్ b. సమురా బిన్ జుందుబ్ c. అబుల్ బుఖ్తరి d. వీరెవరూ కాదు.

    21. కాబా గృహాన్ని నిర్మించింది ఎవరు?

    a. ముహమ్మద్ స.అ.సం. b. ఇబ్రాహీం అ.స. c. ఇస్మాయీల్ అ.స. d. ఇబ్రాహీం అ.స. మరియు ఇస్మాయీల్ అ.స. ఇద్దరూ

    22. ఉస్మాన్ ర.అ. కాలంలో చేతి వ్రాత తో వ్రాయబడిన ఖుర్'ఆన్ వ్రాత ప్రతులలో ప్రస్తుతం రెండు మాత్రమే ప్రపంచంలో మిగిలి ఉన్నాయి. వాటిలో ఒకటి తుర్కీ-ఇస్తాంబుల్ లో ఉంది. రెండవది ఎక్కడ ఉంది?

    22.a. బ్రిటన్ – లండన్ b. బబిలోనియా లో ఉంది c. తాష్కంట్ లో ఉంది d. ఇస్లామాబాద్ లో ఉంది.

    23. ఇస్లామిక్ చరిత్రలో మొట్టమొదట ఇస్లాం స్వీకరించిన స్త్రీ ఎవరు?

    a. హలీమా సాదియా b. మైమునా ర.అన్హా. c. ఖదీజా ర.న్హా d. వీరెవరూ కాదు

    24. ఈయన అబ్బాస్ వంశపు ఖలీఫాలలో పేరుగాంచిన ఖలీఫా. ఈయన పరిపాలనలో ఇస్లామిక్ సామ్రాజ్యం బాగా విస్తరించింది. ఈయన కాలంలోనే బాగ్దాద్ ఇస్లామీయ కళలకు, విఙ్ఞానానికి కేద్రంగా ప్రకటించబడింది.

    24. a. ఇబ్న్-అబ్బాస్ ర.అన్హు. b. ఇబ్న్-హజర్ ర.అలై c. హరూన్ అల్-రషీద్ d. ఇబ్న్-ఉమర్ ర.అన్హు .

    25. క్రైస్తవ పాలకులలో సింహ హృదయుడుగా పేరుగాంచిన 'రిచర్డ్' ను ఈ ఖలీఫా ఒడించాడు. ఆ కారణంగా జెరూసలెం ముస్లిముల చేతిలో మరో 750 సంవత్సరాలపాటు ఉండింది. ఆ ఖలీఫా ఎవరు?

    a. సుల్తాన్ సలాఉద్దీన్ b. హరూన్ అల్-రషీద్ c. సుల్తాన్ మెహ్ మెట్ d. నీగస్.

    26. ఇతర మతాలకు చెందిన ధర్మ గ్రంథాలలొ – ఒక మతానికి చెందిన థర్మగ్రంథంలో ఖుర్'ఆన్ పేరు ఎక్కువగా దర్శనమిస్తుంది. ఆ మత గ్రంథం ఏది?

    a. భగవద్గీత b. బైబిల్ c. బైబిల్ పాత నిబంధన d. సిక్కుల గురు గ్రంథ సాహిబ్.

    27. పాకిస్తాన్ దేశపు మొట్టమొదటి అని ఎవరు?

    27. a. పర్వేజ్ ముషర్రఫ్ b. జుల్ఫికార్ ఆలీ భుట్టో c. ముహమ్మద్ ఆలీ జిన్నా d. అబుల్ కలాం ఆజాద్.

    28. ఇస్లామిక్ చరిత్రలో మొట్టమొదటిసారిగా దివ్య ఖుర్'ఆన్ ను ఉర్దూ లోనికి అనువదించిన వారు ఎవరు?

    a. మౌలానా జకరియ్యా b. మౌలానా అబ్దుర్రషీద్ గంగోహీ c. మౌలఅనా షాహ్ రఫియుద్దీన్ ముహద్దిస్ దహెల్వీ d. మౌలానా అబ్దుస్సలాం ఉమ్రీ.

    29. ఇస్లామీయ చరిత్రలో మొట్టమొదటి ఇస్లాం కొరకు ప్రాణత్యాగం చేసిన వారు ఎవరు?

    a. హజ్రత్ హంజా ర.అన్హు b. యాసిర్ ర.అన్హు c. సుమయ్యా ర.అన్హా d) 'b' మరియు 'c'

    30. ఇస్లామీయ చరిత్రలో మొదటి ముఅజ్జిన్ గా పేరు గాంచిన బిలాల్ బిన్ రబహ్ ర.అన్హు ఏ దేశస్థులు?

    a. సిరియా b. యెమెన్ c. అబిసీనియా d. యత్రిబ్.

    31. మీరు మొదటిసారిగా సౌదీ అరేబియా వస్తున్నారు. ప్రయాణానికి ముందు మీకు రక్షణ కవచంగా

    31.ఏమి ఉండాలని మీరు కోరుకుంటారు.

    31.a. తల్లిదండృల దుఆలు ఉండాలని b. కుడి చేతి జబ్బకు ఇమామి జామీన్ కట్టుకుంటాను c. అల్లాహ్ రక్షణ ఉంటే చాలు నని భావిస్తాను d. నన్ను నేను స్వయంగా రక్షించుకోగలను.

    32. మీరు వివాహితులు. మీ భార్యాభర్తలు ఇద్దరిలోనూ ఏ లోపమూ లేదు. సంవత్సరాలు గడిచినా పిల్లలు కలగడం లేదు. అటువంటి క్లిష్టపరిస్థితులలో ఏమి చేయడం ఉత్తమమని మీరు భావిస్తున్నారు?

    32.a. పుట్టపర్తి బాలయోగి ఆలయాన్ని దర్శిస్తే పిల్లలు కలుగుతారు b. మంచి వైద్యులను సంప్రదించడంతో పాటు అల్లాహ్ తో మొరపెట్టుకుని దుఆ చేయాలి. c. మా ఊరిలో ఉన్న/ మా ఊరికి దగ్గరలో ఉన్న ప్రముఖ దర్గాకు వెళ్ళి మొక్కు కుంటే పిల్లలు తప్పనిసరిగా కలుగుతారు d. నాపై నాకు నమ్మకం ఉంది. నాకు పిల్లలు తప్పక కలుగుతారు.

    33. జకాత్ చెల్లించడం చాలా మంచిపని. కానీ విధిగా చెల్లించాలి, జకాతు చెల్లించడం విధి అనడాన్ని నేను ఒప్పుకోను – అని ఎవరైనా అంటే - వారికి సంబంధించి ఇస్లామీయ ధర్మాఙ్ఞ ఏమిటి?

    a. ముస్లింగానే భావించబడతాడు b. ఇస్లాం పరిధినుండి బయటకు వెళ్ళినవాడిగా భావించబడతాడు.

    c. అతను ముస్లిమే గానీ అతను చేసినది ఘోరమైన తప్పు d. ఇవేవీ కావు.

    34. దివ్య ఖుర్'ఆన్ లో అల్లాహ్ మానవులను తాను పుట్టించడం వెనుక కారణాన్ని తెలిపాడు – అది ఏమిటి?

    34.a. కేవలం తనను మాత్రమే ఆరాధించడానికి b. వారిని పరీక్షించడానికి c. చివరికి అందరినీ స్వర్గంలో ప్రవేశింపజేయడానికి, d. ప్రవక్తలను పంపుతూ ఉండడానికి.

    35. ప్రళయ దినం అవతరించడానికి ముందు కనిపించే ఆనవాళ్ళలో ఇది కూడా ఒకటి.

    a. ప్రపంచమంతా బాగా డబ్బుతో నిండి పోతుంది b. చంద్రుడు చేతికి అందేటంతగా క్రిందకు వస్తాడు c. సూర్యుడు తూర్పునుంచిగాక పడమటినుంచి ఉదయిస్తాడు d. ఇవేవీ కావు.

    36. మరణం సమీపిస్తున్న ముస్లింకు సలహా పూర్వకంగా ఏమని చెప్పవచ్చును?

    36.a. అందరినీ చివరిసారిగా చూసుకోమని b. అందరికొరకు దుఆ చేయమని c. 'లా ఇలాహా ఇల్లల్లాహ్' ఉచ్చరిస్తూ ఉండమని పడమటినుంచి ఉదయిస్తాడు d. 'అల్లాహు అక్బర్' ఉచ్చరించమని

    37. మానవాళిపై అల్లహ్ యొక్క హక్కు ఏమిటి?

    a. ఎమీ లేదు b. మానవుడు కేవలం అల్లాహ్ నే ఆరాధించడం, ఆరాధనలో ఎవరినీ భాగస్వామిగా చేయకపోవడం c. ఏ ప్రవక్తను అయినా అల్లాహ్ కరుణకొరకు ప్రార్థించడం d. ఇవేవీ కావు.

    38. ప్రవక్తలకు జన్మించిన వారందరూ నిస్సందేహంగా స్వర్గంలోకి ప్రవేశిస్తారు.

    38. a. అవును b. కాదు

    39. అల్లాహ్ పంపిన ప్రవక్తలందరూ ప్రముఖంగాఒకే విషయాన్ని బోధించారు – అది ఏమిటి?

    a. తల్లిదండ్రుల పట్ల భయభక్తులు కలిగి ఉండాలని b. ప్రవక్తల పట్ల భయభక్తులు కలిగి ఉండాలని

    c. అల్లాహ్ ఒక్కడేనని ఆయనకు సమానులుగానీ, సాటిగానీ ఎవరూ లేరని d. అల్లాహ్ యే ఈ ప్రపంచాన్ని సృష్టించాడని.

    40. స్వర్గంలో ప్రవేశించడానికి తాళం చెవి లాంటిది ఏమిటి?

    a. షహాదా b. సలాహ్ ఆచరించడం c. ఉపవాసాలు ఆచరించడం d. హజ్ చేయడం

    41. దివ్య ఖుర్'ఆన్ తరువాత ప్రపంచంలో అత్యంత ప్రామాణిక మైన గ్రంథం ఎది?

    a. బైబిల్ b. గురు గ్రంథ సాహిబ్ c. సహీ అల్-బుఖారీ d. అర్రహీఖ్ అల్-మఖ్తూం

    42. ఇస్లాం మూల స్థంభాలలో ఇది కూడా ఒకటి.

    a. ఖురాన్ ను విశ్వసించడం b. ప్రవక్త స.అ.సం. ను విశ్వసించడం c. జకాత్ చెల్లించడం d. ఇవేవీ కావు.

    43. ముహర్రం నెల 9 మరియు 10వ తారీఖులలో ఆచరించే ఉపవాసాలు సున్నత్ ఉపవాసాలు.

    a. అవును b. కాదు

    44. ఈమాన్ మూల స్థంభాలలో ఇది కూడా ఒకటి

    a. హజ్ చేయడం b. రమదాన్ నెల ఉపవాసాలు పాటించడం c. 5 పూటల సలా ఆచరించడం d. అల్లాహ్ ప్రవక్తలందరినీ విశ్వసించడం.

    45. ఇది ఒక ఆరాధనలో ఒక భాగం. ఇందులో శరీరంలోని ఏడు భాగాల ఎముకలు భూమిని తాకుతాయి. దీనిని ఏమని అంటారు – ఇది ఏ ఆరాధనలోని భాగము.

    a. భూమి పై వెల్లకిలా పడుకుని దుఆ చేయడం b. నీళ్ళు దొరకని స్థితిలో భూమిపై దొర్లి శుభ్రపర్చు కోవడం c. సజ్దా అంటారు, ఇది సలాహ్ (నమాజు) ఆరాధనలోని భాగము d. ఇవేవీ కావు

    46. ఈద్ నమాజులలో ఎన్ని రకాత్ ల సలాహ్ ఆచరించబడుతుంది – ఎక్కువగా ఎన్ని తక్బీర్లు ఉచ్చరించ బడతాయి

    46.a.2 రకాతులు–12తక్బీర్లు b.4 రకాతులు–13తక్బీర్లు c.4 రకాతులు–10తక్బీర్లు d.2 రకాతులు–6తక్బీర్లు

    47. ధర్మానికి (ఇస్లాం యొక్క అవగాహనకు) సంబంధించిన విషయంలో ఏమైనా అభిప్రాయ భేదాలు / అవగాహనా భేదాలు ఏర్పడితే ఒక ముస్లిమ్ ఏమి చేయాలి?

    a. తన మత గురువును సంప్రదించాలి, b. తాను అనుసరించే ఇమాం ఏమి చెప్పినారో దానినే ఆచరించాలి c. ఖురాన్ మరియు సున్నత్ ల వైపునకు మరలాలి d. ఎవరినీ సంప్రదించనవసరం లేదు.

    48. టాయిలెట్ (బహిర్భూమి) లోనికి వెళ్ళునపుడు

    48.a. ఎడమ కాలు ముందుగా లోనికి వేస్తూ వెళ్ళాలి b. కుడికాలిని ముందుగా లోనికి వేస్తూ వెళ్ళాలి c. ఏ కాలితో ప్రవేశించినా ఫరవాలేదు

    49. ముస్లిం స్త్రీ తాను తన భర్తతో ఇక జీవించలేను అని నిర్ధారించుకున్నపుడు – న్యాయస్థానానికి వెళ్ళి విడాకుల కొరకు అర్థించవచ్చును.

    a. అవును b. కాదు

    50. ఎవరైనా ముస్లిం చనిపోయినాడని తెలిస్తే - అతను మనకు బంధువు కాకపోయినా మనం దు:ఖించ వచ్చునా?

    a. నిశ్శబ్దంగా దు:ఖించవచ్చు b. దు:ఖించ రాదు c. మరణవార్త అందరికీ తెలిసేలా దు:ఖించాలి d. ఇవేవీ కావు

    జవాబులు

    01 - b

    02 - c

    03 – a

    04 - d

    05 - b

    06 - b

    07 - a

    08 - a

    09 - d

    10 - a

    11 - d

    12 - c

    13 - c

    14 - d

    15 - b

    16 - a

    17 - c

    18 - c

    19 - a

    20 - c

    21 - d

    22 - c

    23 - c

    24 - c

    25 - a

    26 - d

    27 - c

    28 - c

    29 - d

    30 - c

    31 - c

    32 - b

    33 - b

    34 - a

    35 - c

    36 - c

    37 - b

    38 - b

    39 - c

    40 - a

    41 - c

    42 - c

    43 - a

    44 - d

    45 - c

    46 - a

    47 - c

    48 - a

    49 - a

    50 - a