×
ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

    ఇస్లాంలోని మానవహక్కులపై కొన్ని ప్రశ్నోత్తరాలు

    ] తెలుగు – Telugu –تلغو [

    islamhouse.com

    2012 - 1433

    أسئلة وشبهات عن حقوق الإنسان في الإسلام

    « باللغة تلغو »

    موقع دار الإسلام

    2012 - 1433

    ఇస్లాంలోని మానవహక్కులపై కొన్ని ప్రశ్నోత్తరాలు

    1. మానవహక్కులకు ఇస్లాం ధర్మం ఇచ్చే గ్యారంటీ ఏమిటి ?

    ఇస్లామీయ రాజ్యంలోని ప్రతి ఒక్కరి ధన, ప్రాణ, మానాలు పవిత్రంగా పరిగణించబడతాయి – అతడు ముస్లిం అయినా, ముస్లిం కాకపోయినా.

    ముస్లింల స్వభావంలో జాత్యహంకారానికి స్థానం లేదు. ఎందుకంటే మానవ సమానత్వం గురించి ఖుర్ఆన్ క్రింది మాటలలో ఇలా పలుకుతున్నది:

    ఓ మానవులారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము. మరియు మీరు ఒకరినొకరు గుర్తుంచుకోవటానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము. నిశ్చయంగా మీలో ఎక్కువ దైవభీతి గలవాడే అల్లాహ్ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞుడు, అన్నీ ఎరిగినవాడు. (దివ్యఖుర్ఆన్ 49:13).