×
ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

    ఇస్లాం యొక్క మూలస్థంభాలపై కొన్ని ప్రశ్నోత్తరాలు

    ] తెలుగు – Telugu –تلغو [

    islamhouse.com

    2012 - 1433

    أسئلة وشبهات حول أركان الإسلام

    « باللغة تلغو »

    موقع دار الإسلام

    2012 - 1433

    ఇస్లాం యొక్క మూలస్థంభాలపై కొన్ని ప్రశ్నోత్తరాలు

    1. ముస్లింలు ప్రతిరోజూ ఐదు సార్లు నమాజు చేస్తారు. ప్రత్యేకంగా ఈ ఆధునిక, వైజ్ఞానిక, సాంకేతిక మరియు భారీ వ్యాపార లావాదేవీల సమకాలిక ప్రపంచంలో ఇది మరీ ఎక్కువగా ఉందని మీరు భావించటం లేదా ?

    ప్రతిరోజు ముస్లింలు నిశ్చయంగా ఐదుసార్లు నమాజు చేయాలి; ఇది అల్లాహ్ ఆజ్ఞ మరియు ఆ ఆజ్ఞకు అనుగుణంగానే వారు ఈ ఆరాధన చేస్తున్నారు.

    కానీ, కళ్ళు బైర్లు కమ్మే వేగంతో పరుగులు తీస్తున్న నేటి ఈ బిజీ జీవితం నుండి వాస్తవానికి ప్రజలు కొంచెం సేపైనా బ్రేక్ తీసుకోవాలని, అధ్యాత్మికంగా రిలాక్స్ కావాలని తహతహలాడుతూ ఉంటారు. (అనేక చోట్ల అధికారిక విరామ సమయాలు ప్రకటించి, ప్రజలు కొంచెం సేపు తమ దైనందిన పనిలో నుండి బయటికి వచ్చి రిలాక్స్ అయ్యాలా పెద్ద పెద్ద కంపెనీలు రకరకాలుగా ప్రోత్సహిస్తున్నాయి. చాలా మంది ప్రజలు ఆఫీసులోని తమ సీటు వదిలి, బయట సిగరెట్లు త్రాగుతూ తచ్చాడటం మనం తరుచుగా చూస్తుంటాము). ఎవరైతే త్రికరణ శుద్ధిగా, కరక్టుగా నమాజు చేస్తూ, ఆ నమాజులోని మాధుర్యాన్ని చవిచూస్తారో, అలాంటి వారు నమాజుల వలన ఎంతో రిలాక్సయి, ఐదు సార్లతో ఆగక ఇంకా ఎక్కువగా నమాజులు చేయాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. తద్వారా వారు ప్రశాంతతను, ఆనందాన్ని, శాంతిని పొంది, అలసట నుండి బయటపడి, క్రొత్త శక్తి పుంజుకుని, మరింతగా చైతన్యవంతులవుతారు.

    2. ఇస్లాం యొక్క ఐదు మూలస్థంభాలేవి?

    ఈ ఐదు మూలస్థంభాలు ముస్లింల జీవితపు ముఖ్యాధారాలు: 1) సాక్ష్య ప్రకటన, 2) నమాజు, 3) జకాతు విధిదానం, 4) ఉపవాసం, మరియు, ఎవరికైతే తగిన స్తోమత, ఆరోగ్యం ఉందో వారు, 5) తగిన స్తోమత ఉంటే జీవితంలో ఒక్కసారి మక్కా వెళ్ళి హజ్ యాత్ర చేయడం.

    1) సాక్ష్య ప్రకటన

    ఆరాధింపబడే అర్హత గలవాడెవ్వడూ లేడు ఒక్క అల్లాహ్ తప్ప మరియు ముహమ్మద్ ఆయన యొక్క ప్రవక్త అని సాక్ష్యమివ్వటం. ఈ సాక్ష్యప్రకటనను షహాదహ్ అంటారు. ఈ సులభమైన సాక్ష్యప్రకటనను ప్రతి దైవవిశ్వాసి మనస్పూర్తిగా నమ్ముతూ ఉచ్ఛరించ వలసి ఉంటుంది.

    2) సలాహ్ (నమాజు)

    సలాహ్ అనేది ప్రతిరోజూ ఐదు సార్లు చేసే ఫర్ధ్ నమాజులకు పెట్టబడిన పేరు. ఈ నమాజులు మనిషికి మరియు వారి సృష్టికర్తకు ఒక డైరక్ట్ లింకు.

    3) జకాతు విధిదానం

    ఇస్లాం యొక్క ఒక ముఖ్యమైన మూలసిద్ధాంతం ఏమిటంటే, ప్రతిదీ అల్లాహ్ కే చెందుతుంది, కాబట్టి సంపద అనేది ఒక అమానతుగా మానవుడికి ప్రసాదించబడుతుంది.

    ప్రతి ముస్లిం తను చెల్లించవలసిన జకాతు విధిదానాన్ని అతను లేక ఆమె స్వయంగా లెక్కిస్తారు. జకాతు విధిదానంలో నిర్ణీత మోతాదుకు మించి ఒక పూర్తి సంవత్సర కాలం తమ వద్ద నిలువ ఉన్న సంపదలో నుండి ప్రతి సంవత్సరం రెండున్నర శాతం తీసి, బీద ప్రజలలో పంచి పెట్టడం జరుగుతుంది.

    4) ఉపవాసం

    ప్రతి సంవత్సరం రమదాన్ నెలలో, ముస్లింలందరూ ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలకు మరియు దాంపత్య సుఖానికి దూరంగా ఉంటూ అల్లాహ్ కోసం ఉపవాసం పాటిస్తారు.

    5) హజ్ యాత్ర

    మక్కా నగరంలో చేసే వార్షిక మహాయాత్రనే హజ్ యాత్ర అంటారు. ఎవరైతే మంచి ఆరోగ్యం మరియు తగిన స్తోమత కలిగి ఉంటారో, అలాంటి వారు తమ జీవితంలో కనీసం ఒక్కసారి హజ్ యాత్ర చేయడం తప్పనిసరి.

    3. ముస్లింలు ప్రతిరోజూ ఐదుసార్లు ఎందుకు నమాజు చేస్తారు ? రోజుకు ఒకసారి నమాజు చేస్తే సరిపోదా ?

    1. సలాహ్ కేవలం ఒక ఆరాధన మాత్రమే కాదు:

    సలాహ్ (నమాజు) అంటే అర్థం కేవలం ఆరాధన మాత్రమనే కాదు. ఆక్స్ ఫర్డ్ నిఘంటువు ప్రకారం, ఆరాధన (pray) అంటే వేడుకోవడం లేదా అర్థించడం. ఉదాహరణకు "తనను విడుదల చేయమని అతడు న్యాయస్థానంలో వేడుకున్నాడు/ అర్థించాడు." దీని మరో అర్థమేమిటంటే విన్నవించుకోవడం, మనవి చేసుకోవడం, ప్రార్థించడం. ఇతర ధర్మాలలో ఆరాధన అంటే వేడుకోవడం లేదా ప్రార్థించడం అని మాత్రమే తీసుకుంటారు. ఉదారహణకు ‘ఓ మా ప్రభూ! ఈరోజు మాకు మా రొట్టె ప్రసాదించు.’ అయితే ఫర్ద్ నమాజు కొరకు నిరీక్షిస్తూ ఫర్ద్ నమాజులకు ముందు మరియు తర్వాత ముస్లింలు చేసే దుఆలే అసలు ప్రార్థనలు.

    1. సలాహ్ అనేది ఒక నిర్దేశకం :

    సలాహ్ అనేది ప్రార్థన కంటే అనేక రెట్లు ఎక్కువ. సలాహ్ లో మనం అల్లాహ్ నుండి అర్థించడమే కాకుండా అల్లాహ్ కు కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటాము, అల్లాహ్ ను ప్రశంసిస్తాము మరియు అదే సమయంలో అల్లాహ్ నుండి మార్గదర్శకత్వాన్ని కూడా కోరుకుంటాము. సలాహ్ అనేది నిజానికి ఒక నిర్దేశకం, నిబంధన, నియమం, సరిదిద్దు.

    1. కంప్యూటర్ల వలే కాకుండా మానవులు స్వతంత్ర బుద్ధి, ఇచ్ఛ కలిగి ఉన్నారు :

    కంప్యూటర్లకు ప్రోగ్రామింగ్ చేయవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాటికి స్వతంత్రంగా ఆలోచించే బుద్దీ, ఇచ్ఛ లేదు. కానీ, మానవులు స్వతంత్ర బుద్దీ, ఇచ్ఛ కలిగి ఉన్నారు. ఈనాడు సమాజంలో ఉన్న మహిళలను వేధించడం, వారిపై అత్యాచారాలు – మానభంగాలు చేయడం, మోసం చేయడం, లంచాలు ఇచ్చిపుచ్చుకోవడం, దోపిడీ దొంగతనాలు, మద్యం మరియు మాదక ద్రవ్యాలు సేవించడం, అశ్లీల కార్యాలు ... మొదలైన అనేక చెడు అలవాట్ల ప్రభావంలో పడి ప్రజలు తమ నైతికతను కోల్పోయే ప్రమాదం చాలా పెరిగి పోయింది. మరి దీని నుండి కాపాడుకోవాలంటే, సన్మార్గంపై నిలకడగా ఉండాలంటే మనకు క్రమబద్ధంగా, రెగ్యులర్ గా అధ్యాత్మిక ప్రోగ్రామింగ్ చేయబడవలసిన అవసరం చాలా ఉంది.

    1. ఆరోగ్యవంతమైన శరీరానికి ప్రతిరోజూ మూడు సార్లు భోజనం అవసరం :

    ఒక మామూలు మానవుడికి ఎలాగైతే ప్రతిరోజూ మూడు సార్ల భోజనం అవసరమో, అలాగే అతడి అధ్యాత్మిక ఆత్మకు కూడా ప్రతిరోజూ ఐదుసార్ల సలాహ్ ద్వారా లభించే ప్రేరణ అవసరం ఎంతో ఉంది.

    4. రమదాన్ మాసంలో పగటిపూట ముస్లింలు నెలంతా ఆకలిదప్పులను కూడా లెక్కచేయక ఎందుకు ఉపవాస ముంటారు?

    1. ఉపవాసం కోరికలను అదుపులోనికి తీసుకు వస్తుంది:

    ఖుర్ఆన్ లోని 2వ అధ్యాయమైన సూరతుల్ బఖరహ్, 183వ వచనంలో ఇలా పేర్కొనబడింది.

    "ఓ విశ్వాసులారా ! మీ కోసం కూడా ఉపవాసం నిర్దేశింపబడింది ఎలాగైతే మీకు పూర్వం వచ్చిన ప్రజలపై నిర్దేశించబడిందో. తద్వారా మీరు (దైవం పట్ల) భయభక్తులు కలవారుగా మారవచ్చు". [దివ్యఖుర్ఆన్ 2:183]

    ఒకవేళ మీరు మీ ఆకలిని ఓర్చుకుని అదుపు చేసుకోగలిగితే, దాదాపు మీ మొత్తం కోరికలను, ఇచ్ఛలను అదుపు చేసుకోగలరని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. కాబట్టి స్వయం నియంత్రణను ప్రాక్టీసు చేయటంలో ఉపవాసం మీకు సహాయపడుతుందని ఖుర్ఆన్ కరక్టుగానే పలికింది.

    1. మంచి అలవాట్లు అలవర్చుకోవటంలో సహాయపడుతుంది:

    రమదాన్ నెలలో ఉపవాసం పాటించడంతో పాటు అనేకమంది ముస్లింలు దానధర్మాలు, బీదసాదలకు సహాయం చేయడం మొదలైన అనేక మంచి పనులు చేస్తారు. అక్కడితో ఆగక రమదాన్ తర్వాత రాబోయే నెలలలో కూడా వారు అదే అలవాటు కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

    1. చెడు అలవాట్లు వదిలి వేయటంలో సహాయపడుతుంది :

    రమదాన్ నెలలో ఉపవాసం పాటించడంతో పాటు సాధ్యమైనంత ఎక్కువగా ధర్మపరాయణత కలిగి ఉంటారు. కాబట్టి తమ చెడు అలవాట్లన్నింటినీ వదులు కోవటానికి ఇదొక చక్కటి అవకాశం. సిగరెట్ల అలవాటున్న ఒక ముస్లిం రమదాన్ నెలలో ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు సిగరెట్లు త్రాగకుండా ఉండగలుగుతున్నప్పుడు, జననం నుండి మరణం వరకు కూడా అతడు సిగరెట్లు ముట్టుకోకుండా ఉండగలడు. ఈ ఆత్మవిశ్వాసాన్ని రమదాన్ నెలలో అతడు ప్రాక్టికల్ గా, స్వయంగా తనలో చూసుకోగలుగుతాడు. ఇస్లాం ధర్మంలో పొగత్రాగటం నిషేధించబడింది (హరాం). అలాగే ఒక ముస్లిం రమదాన్ నెలలో పగలంతా మద్యపానం సేవించకుండా, మత్తుపదార్థాల జోలికి పోకుండా ఉండటం ద్వారా ఇక జీవితాంతం కూడా వాటికి దూరంగా ఉండగలిగే ఆత్మవిశ్వాసం అతడిలో కలుగుతుంది. ప్రజల ఆరోగ్యం కొరకు, సమాజ ప్రయోజనాల కొరకు అన్ని రకాల మత్తుపదార్థాలను, మద్యపానాన్ని ఇస్లాం ధర్మం నిషేధించింది (హరాం చేసింది).

    1. ప్రతి యంత్రానికి సర్వీసింగ్ అవసరం:

    ప్రతి యంత్రానికి నిర్ణీత కాలంలో రెగ్యులర్ గా సర్వీసింగ్ చేయవలసి ఉంటుందనే విషయం మనకు తెలుసు. ప్రతి మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి మన కారు లేదా మోటారు బైకుకు రెగ్యులర్ గా సర్వీసింగ్ చేయిస్తూ ఉంటాము. యంత్రం ఎంత ఎక్కువ క్లిష్టమైనదైతే, అంత ఎక్కువ సార్లు రెగ్యులర్ గా సర్వీసింగ్ చేయవలసి ఉంటుంది.

    1. ఉపవాసమనేది మానవుడి కొరకు ఒక సర్వీసింగ్ వంటిది:

    ఒకవేళ మానవుడు కూడా ఒక యంత్రం అనుకుంటే, అది భూమండలంపై ఉన్న అత్యంత క్లిష్టమైన యంత్రం అని గ్రహించాలి. మరి, దానికీ రెగ్యులర్ గా సర్వీసింగ్ చేయవలసి ఉంటుందని మీరు భావించడం లేదా? రమదాన్ నెల ఉపవాసం మానవ శరీరానికి మరియు ఆత్మకు ఒక వార్షిక సర్వీసింగ్ వంటిది అంటే ప్రతి సంవత్సరం ఒక పూర్తి నెలంతా మానవ శరీర అవయవాలన్నీ ఉపవాసం ద్వారా విశ్రాంతి ఇవ్వబడి, పూర్తిగా సర్వీసింగ్ చేయబడి, క్రొత్త శక్తిని పుంజుకుంటాయి.

    1. మానవ శరీరానికి ఉపవాసం విరామాన్ని ఇస్తుంది:

    ఉపవాస సమయంలో ముస్లింలు పగలంతా అన్నపానీయాలకు దూరంగా ఉండటం వలన శరీరంలోని అనేక అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. మంచి ఆరోగ్యం కోసం ఇది చాలా అవసరం.

    1. ఉపవాసాల వలన కలిగే కొన్ని మెడికల్ ప్రయోజనాలు :

    a. పేగుల సామర్ధ్యం పెరుగుతుంది: ఉపవాసం పేగుల సామర్ధ్యాన్ని పెంచుతుంది.

    b. కొలస్ట్రాల్ తగ్గింపు: ఉపవాసం కొలస్ట్రాల్ ను తగ్గించి, అనేక హృద్రోగాల నుండి కాపాడుతుంది.

    5. ఇస్లాం ధర్మం విగ్రహారాధనలకు విరుద్ధమైనపుటు, ఎందుకు ముస్లింలు కాబాగృహాన్ని ఆరాధిస్తారు మరియు తమ నమాజులలో దాని వైపు సాష్టాంగపడతారు?

    పవిత్ర కాబాగృహం ముస్లింల కొరకు భిబ్లా అంటే నమాజు చేస్తున్నప్పుడు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ముస్లింలు కాబాగృహానికి అభిముఖంగా నిలబడి నమాజు చేస్తారు – అది సామూహికంగా మస్జిదులో చేసే నమాజు అయినా లేదా వ్యక్తిగతంగా ఇంట్లో చేసే నమాజు అయినా. తమ నమాజులలో దానికి అభిముఖంగా నిలబడినా, ముస్లింలు కాబాగృహాన్ని ఆరాధించరనేది ఇక్కడ గుర్తించవలసిన ఒక ముఖ్యవిషయం. ఒక్క అల్లాహ్ కు తప్ప, ముస్లింలు ఎవ్వరినీ ఆరాధించరు మరియు సాష్టాంగపడరు.

    సూరతుల్ బఖరహ్ లో ఇలా పేర్కొనబడింది:

    "నీ ముఖం మాటిమాటికీ ఆకాశం వైపు మరలటం మేము చూసాము. ఇప్పుడు మేము ఖిబ్లా దిశను నీకు ఇష్టమైన వైపుకు త్రిప్పుతున్నాము. కాబట్టి ఎక్కడున్నా (నమాజు చేస్తున్నపుడు) పవిత్ర మక్కా మస్జిద్ కు అభిముఖంగా నిలబడు. " [దివ్యఖుర్ఆన్ 2:144]

    1. ఐకమత్యాన్ని వృద్ధి చేయడం ఒక ప్రధాన ఇస్లామీయ సిద్ధాంతం :

    ఉదాహరణకు, ఒకవేళ ముస్లింలు నమాజు చేయాలనుకుంటే, కొందరు ఉత్తరం వైపు, కొందరు దక్షిణం వైపు తిరిగి నమాజు చేయాలని కోరుకోవచ్చు. అలాగే మరికొందరు తూర్పు – పడమరల వైపు. ఇలా తలో వైపు తిరిగి నమాజు చేయటానికి ప్రయత్నించడమనేది గందరగోళానికి దారి తీస్తుంది. ఏకైక నిజదైవం అయిన అల్లాహ్ యొక్క ఆరాధనలో అలాంటి అయోమయం నుండి కాపాడటానికి, ముస్లింలు ఎక్కడున్నా భుజానికి భుజం కలిపి ఏకం కావడానికి ఒకే దిశవైపు తిరిగి నమాజు చేయమని ఆదేశించబడింది. ప్రపంచంలో వారెక్కడున్నా ఒంటరిగా నమాజు చేస్తున్నా లేక సామూహికంగా నమాజు చేస్తున్నా వారు ఖిబ్లా వైపు (కాబాగృహం) వైపు తిరిగి నమాజు చేయాలి. కాబాగృహానికి పశ్చిమ దిశలో ఉండే ముస్లింలు వారికి తూర్పువైపున్న కాబాగృహం వైపు తిరిగి నమాజు చేయాలి. అలాగే కాబాగృహానికి తూర్పు దిశలో ఉండే ముస్లింలు వారికి పశ్చిమ దిక్కున ఉండే కాబాగృహం వైపు తిరిగి నమాజు చేయాలి.

    1. ప్రపంచ పటానికి కేంద్రస్థానంలో కాబాగృహం ఉంది :

    మొట్టమొదట ప్రపంచ మ్యాప్ తయారు చేసినవారు ముస్లింలే. వారు తయారు చేసిన ప్రపంచ పటంలో దక్షిణం పైభాగాన మరియు ఉత్తరం క్రిందిభాగాన ఉండేది. కాబాగృహం కేంద్రస్థానంలో ఉండేది. తర్వాత పాశ్చాత్య ప్రపంచ పటాల చిత్రకారులు (cartographers) ముస్లింల ప్రపంచ పటంలోని పైభాగాన్ని క్రిందికి, క్రింది భాగాన్ని పైకి మార్చి వేసారు. అయితే, కాబాగృహాన్ని మాత్రం ప్రపంచ పటం యొక్క కేంద్రస్థానం నుండి తొలగించ లేక పోయారు. అల్హందులిల్లాహ్ – సకల కృతజ్ఞతలు, స్తోత్రములు అల్లాహ్ కే.

    1. కాబాగృహం చుట్టూ జరిగే తవాఫ్ ప్రదక్షిణ దైవం యొక్క ఏకత్వాన్ని సూచిస్తుంది:

    ప్రజలు మక్కాలోని మస్జిదె హరమ్ ను సందర్శించినప్పుడు, పవిత్ర కాబాగృహం చుట్టూ తవాఫ్ ప్రదక్షిణ చేస్తారు. ఆ ఆచరణ ఏకైక దైవమైన అల్లాహ్ పై వారి విశ్వాసాన్ని మరియు ఆరాధనను సూచిస్తున్నది. ఎలాగైతే ఒక వృత్తానికి ఒక కేంద్రబిందువు మాత్రమే ఉంటుందో, నిజవిశ్వాసాల మరియు ఆరాధనల వృత్తానికి కూడా కేంద్రబిందువు అయ్యే అర్హత ఏకైక దైవమైన అల్లాహ్ కు మాత్రమే ఉంది.

    1. ఉమర్ రదియల్లాహు అన్హు హదీథు :

    కాబాగృహం యొక్క ఒక కార్నర్ లో ఉండే హజ్రె అస్వద్ అనబడే నల్లరాయి గురించి హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీథు ఇలా ఉంది. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఒక సుప్రసిద్ధ సహచరుడు.

    సహీహ్ బుఖారీలో నమోదు చేయబడిన హదీథులో ఉమర్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు, "నీవొక రాయి మాత్రమేనని, నాకేమీ లాభం కానీ నష్టం కానీ కలుగజేయలేవని నాకు తెలుసు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను స్పర్శించడం (ముద్దు పెట్టుకోవటం) నేను చూసి ఉండకపోతే, నేనెన్నడూ నిన్ను స్పర్శించేవాడిని కాదు (ముద్దు పెట్టుకునేవాడిని కాదు)".

    1. ప్రజలు కాబాగృహంపై నిలబడి అదాన్ పిలుపు ఇచ్చారు:

    ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో, ప్రజలు కాబాగృహం పైకెక్కి నిలబడ్డారు మరియు అదాన్ పిలుపు కూడా ఇచ్చారు. ముస్లింలు కాబాగృహాన్ని ఆరాధిస్తున్నారని ఎవరైతే అంటున్నారో వారిని ఏ విగ్రహారాధకుడైనా తను ఆరాధించే విగ్రహంపై నిలబడటం ఎప్పుడైనా కంటబడిందా అని ప్రశ్నించండి.

    6. మక్కా మరియు మదీనా పవిత్ర నగరాలలో ముస్లిమేతరులను ఎందుకు అనుమతించరు?

    పవిత్ర నగరాలైన మక్కా మరియు మదీనాలలో చట్టపరంగా ముస్లిమేతరులకు ప్రవేశం లేదనేది వాస్తవమైన విషయమే. ఆ నిషేధం వెనుక ఉన్న కొన్ని కారణాలు ఇక్కడ ఇవ్వబడినాయి.

    1. దేశపౌరులందరూ తమ తమ దేశపు సైనిక స్థావరాలలో అనుమతించబడరు.

    ఒక సామాన్య భారతీయుడికి ఆ దేశపు కంటోన్మెంటు ఏరియాల వంటి కొన్ని ముఖ్య ప్రాంతాలలో ప్రవేశించే అనుమతి లేదు. ప్రతి దేశంలో కొన్ని ముఖ్య ప్రాంతాలు ఉంటాయి. ఆ దేశపు పౌరుడే అయినప్పటికీ ఒక సామాన్య వ్యక్తికి ఆ ప్రాంతాలలో ప్రవేశించం ఉండదు. కేవలం సైన్యంలో పనిచేసే ఆ దేశ పౌరుడు లేదా ఆ దేశ రక్షణ విభాగాలతో సంబంధం ఉన్న వ్యక్తి మాత్రమే ఆ కంటోన్మెంటు ఏరియాలలో అనుమతించబడతారు. అలాగే, మొత్తం ప్రపంచం కొరకు మరియు మొత్తం మానవాళి కొరకు పంపబడిన అంతిమ మరియు సార్వత్రిక ధర్మమే ఇస్లాం ధర్మం. ఇస్లాం ధర్మం యొక్క కంటోన్మెటు ఏరియాలు పవిత్ర నగరాలైన మక్కా మరియు మదీనా పట్టణాలు. ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని విశ్వసిస్తారో మరియు ఇస్లాం ధర్మ రక్షణలో పాలుపంచుకుటారో, అలాంటి వారికి మాత్రమే అక్కడ ప్రవేశం ఉంది అంటే ముస్లింలకు మాత్రమే.

    ఒక దేశ కంటోన్మెంటు ఏరియాలో ఆ దేశపు సామాన్య పౌరుడికే ప్రవేశం ఉండదు. అక్కడ తనెందుకు ప్రవేశించకూడదనే అతడి అభ్యంతరానికి అర్థం పర్థం ఉండదు. అలాగే మక్కా మరియు మదీనాలలో ఇస్లాం ధర్మం అంటే విశ్వాసం లేని ప్రజల నిషేధాన్ని ముస్లిమేతరులు వ్యతిరేకించడం సబబు కాదు గదా!

    1. మక్కా మరియు మదీనా నగరాలలోనికి అనుమతించే వీసా :

    a. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఏదైనా పరదేశానికి ప్రయాణించదలిస్తే, అతడు ముందుగా ఆ దేశంలో ప్రవేశించేందుకు అనుమతి కోరుతూ వీసా కొరకు దరఖాస్తు చేసుకుంటాడు. ప్రతి దేశానికి దాని స్వంత నియమ నిబంధనలు మరియు షరతులు ఉంటాయి. వాటిని పూర్తి చేయనంత వరకు ఆ దరఖాస్తుదారునికి వీసా ఇవ్వబడదు.

    b. వీసా ఇవ్వడంలో కఠిన నియమ నిబంధనలు ఉన్న దేశాలలో, ప్రత్యేకంగా అభివృద్ధి చెందని దేశాల విషయంలో మరీ కఠినమైన షరతులు విధించే దేశాలలో అమెరికా కూడా ఒకటి. ఆ దేశంలో ప్రవేశించేందుకు వీలు కల్పించే వీసా కొరకు పూర్తి చేయవలసిన నియమనిబంధనలు మరియు షరతులు చాలా కఠినంగా ఉంటాయి.

    c. నేను ఒకసారి సింగపూరు సందర్శించినపుడు, వారి ఎమిగ్రేషన్ ఫారంలో మాదకద్రవ్యాలు సప్లయి చేసేవారికి మరణశిక్ష అని పేర్కొనబడి ఉండటం చూసాను. ఒకవేళ నేను సింగపూరు సందర్శించాలనుకుంటే నేను ఆ దేశ నియమనిబంధనలను పాటించాలి. మరణశిక్ష అక్రమమని, అనాగరికమని వ్యతిరేకించలేము. వారి నియమ నిబంధనలకు మరియు షరతులకు సమ్మతిస్తేనే ఆ దేశంలో ప్రవేశించే వీసా నాకు ఇవ్వబడుతుంది.

    d. అలాగే మక్కా మరియు మదీనాలలో ప్రవేశించాలనుకునే వారి కొరకు కూడా ఒకే ఒక వీసా షరతు ఉన్నది. అదేమిటంటే – మనస్పూర్తిగా నమ్ముతూ “అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్ హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే ‘ఆరాధింపబడే అర్హత గలవాడెవ్వడూ లేడు ఒక్క అల్లాహ్ తప్ప, ముహమ్మద్ ఆయన ప్రవక్త’ ” అని సాక్ష్యమివ్వడం.