×
మొత్తం షాబాన్ నెలంతా ఉపవాసం పాటించడం ఉత్తమమైనదా? మొత్తం షాబాన్ నెలంతా ఉపవాసం పాటించడం సున్నతా? అనే అంశాల్ని ఈ వ్యాసం చాలా చక్కగా చర్చించినది.

    షాబాన్ నెలంతా ఉపవాసం పాటించ వచ్చునా?

    ﴿ هل يستحب صيام شعبان كاملاً ﴾

    ] తెలుగు – Telugu –تلغو [

    Muhammad Salih Al-Munajjid

    అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్

    రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్

    2011 - 1432

    ﴿ هل يستحب صيام شعبان كاملاً ﴾

    « باللغة تلغو »

    الشيخ محمد صالح المنجد

    ترجمة: محمد كريم الله

    مراجعة: شيخ نذير أحمد

    2011 - 1432

    మొత్తం షాబాన్ నెలంతా ఉపవాసం పాటించడం ఉత్తమమైనదా?

    మొత్తం షాబాన్ నెలంతా ఉపవాసం పాటించడం సున్నతా?

    అల్హందులిల్లాహ్ – సకల స్తోత్రములు, కృతజ్ఞతలు అల్లాహ్ కొరకే.

    షాబాన్ నెలలో వీలయినంత ఎక్కువగా ఉపవాసం పాటించడం ఉత్తమం.

    ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షాబాన్ నెల మొత్తం ఉపవాసం ఉండేవారని ఉల్లేఖించబడింది.

    అహ్మద్ (26022), అబూ దావూద్ (2336), అన్నిసాయీ (2175) మరియు ఇబ్నె మాజాహ్ లలో నమోదు చేయబడిన ఉమ్మె సలామాహ్ రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “షాబాన్ మరియు రమదాన్ నెలు జతపరచే వాస్తవాన్ని వదిలి, ఏనాడూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రెండు నెలల పాటు నిరంతరంగా ఉపవాసం ఉండటం నేను చూడలేదు.”

    అబూ దావుద్ లో ఇలా నమోదు చేయబడినది: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షాబాన్ నెలను వదిలి, సంవత్సరంలోని ఏ ఇతర నెలా పూర్తిగా ఉపవాసం పాటించలేదు, ఆయన దానిని రమదాన్ తో కలిపేవారు.” తన సహీహ్ అబి దావుద్ 2048 లో దీనిని అల్ బానీ సహీహ్ గా వర్గీకరించినారు.

    ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షాబాన్ నెలంతా ఉపవాసం ఉండేవారని దీని ద్వారా తెలుస్తున్నది.

    అయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని రోజులను వదిలి, షాబాన్ నెలంతా ఉపవాసం పాటించేవారని కూడా ఉల్లేఖించబడినది.

    ముస్లిం (1156)లో నమోదు చేయబడిన ఒక హదీథులో అబూ సలామాహ్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించినారు: “అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసం గురించి నేను ఆయెషా (రదియల్లాహు అన్హా) ను అడిగాను, దానికి ఆవిడ ఇలా జవాబిచ్చినారు: ‘ఇక ఆయన ఎల్లప్పుడూ ఉపవాసం పాటిస్తూనే ఉంటారని మేము భావించేటంత వరకు ఆయన ఉపవాసం కొనసాగించేవారు. అలాగే ఆయన ఇక ఎప్పుడూ ఉపవాసం పాటించరు అని మేము భావించేటంత వరకు ఆయన ఉపవాసం వదిలిపెట్టేసేవారు. అయితే షాబాన్ నెలను వదిలి, ఏ ఇతర నెలలోనూ ఆయన అంత ఎక్కువగా ఉపవాసం పాటించడాన్ని నేనెప్పుడూ చూడలేదు. ఆయన షాబాన్ నెలంతా ఉపవాసం పాటించేవారు. మరియు కొన్ని రోజులను వదిలి, షాబాన్ నెలంతా ఉపవాసం పాటించేవారు.’”

    ఈ హదీథుల మధ్య సమన్వయం చేయటంలో పండితుల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడలేదు.

    వీటి మధ్య నున్న కాలవ్యత్యాసాన్ని చూడవలసి ఉంటుందని కొందరు పండితులు అభిప్రాయ పడినారు – కొన్ని సంవత్సరాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షాబాన్ నెలంతా ఉపవాసం పాటించినారు. మరియు ఇతర సంవత్సరాలలో కొన్ని రోజులను వదిలి, ఆయన షాబాన్ నెలంతా ఉపవాసం పాటించినారు. ఈ అభిప్రాయానికే షేఖ్ ఇబ్నె బాజ్ రహిమహుల్లాహ్ ప్రాధాన్యత నిచ్చినారు. మజ్మూఅ ఫతావా అల్ షేఖ్ ఇబ్నె బాజ్, 15/416.

    ఇతరులు ఇలా అభిప్రాయబడినారు - ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్ నెలలో తప్ప, ఇతర ఏ నెలలోనూ మొత్తం నెలంతా ఉపవాసం పాటించలేదు. ఆ తరువాత వారు ‘కొన్ని రోజులను వదిలి, ఆయన షాబాన్ నెలంతా ఉపవాసం పాటించినారనే’ ఉమ్మె సలామాహ్ రదియల్లాహు అన్హా యొక్క హదీథును ఉదహరించినారు. ఒక వ్యక్తి నెలలో అధికభాగం ఉపవాసం పాటించినట్లయితే, అతను నెలంతా ఉపవాసం పాటించాడని చెప్పటమనేది భాషాపరంగా మామూలు విషయమేనని వారు తెలిపినారు.

    అల్ హాఫిజ్ ఇలా అన్నారు:

    ఏదైతే ఉమ్మె సలామాహ్ రదియల్లాహు అన్హా హదీథులో ఉల్లేఖించబడినదో, ఆ విషయాన్ని ఆయెషా రదియల్లాహు అన్హా హదీథు వివరిస్తున్నది. అంటే షాబాన్ నెలను వదిలి, ఆయన సంవత్సరంలోని ఏ ఇతర నెలా పూర్తిగా ఉపవాసం పాటించలేదు – ఆయన దానిని రమదాన్ నెలతో జతపరచేవారు; దీని అర్థం ఏమిటంటే ఆయన దానిలో అధికభాగం ఉపవాసం పాటించేవారు. ఇబ్నె అల్ ముబారక్ ఇలా పలికారని అత్తిర్మిథీలో నమోదు చేయబడినది: ఒక వ్యక్తి నెలలో అధికభాగం ఉపవాసం పాటిస్తే, అతను ఆ నెలంతా ఉపవాసం పాటించాడని అనటం అరబ్బుల భాషలో మామూలు విషయమే.

    అత్తీబి ఇలా అన్నారు: కొన్ని సార్లు ఆయన షాబాన్ నెలంతా ఉపవాసం పాటించేవారని, రమదాన్ నెల వలే ఈ నెల మొత్తం కూడా ఉపవాసం పాటించటం తప్పనిసరని ప్రజలు సందేహించకుండా ఉండటానికి గాను మరికొన్ని సార్లు ఆయన షాబాన్ లో అధిక భాగం మాత్రమే ఉపవాసం పాటించేవారని దీని భావం కావచ్చు.

    ఆ తరువాత అల్ హాఫిజ్ ఇలా అన్నారు: అయితే ముందటి అభిప్రాయమే సరైనది – అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షాబాన్ నెలంతా ఉపవాసం పాటించలేదు. దీనికి ఋజువుగా ఆయన ముస్లిం (746)లో నమోదు చేయబడిన ఆయెషా రదియల్లాహు అన్హా యొక్క ఈ ఉల్లేఖనను పేర్కొన్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకే రాత్రిలో ఖుర్ఆన్ మొత్తం పఠించటం గురించి లేదా ఉదయం అయ్యే వరకు మొత్తం రాత్రంతా నమాజు చేయటం గురించి లేదా రమదాన్ నెలలో కాకుండా ఇతర ఏ నెలలోనూ మొత్తం నెలంతా ఉపవాసం పాటించడం గురించి నాకు తెలియదు.”

    మరియు ఆయన సహీహ్ అల్ బుఖారీ (1971) మరియు ముస్లిం (1157) లలో నమోదు చేయబడిన ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు యొక్క ఈ ఉల్లేఖనను ప్రస్తావించినారు: “రమదాన్ నెలను వదిలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ నెలలోనూ మొత్తం నెల ఉపవాసం పాటించలేదు.”

    ఉమ్మె సలామాహ్ రదియల్లాహు అన్హా హదీథుపై వ్యాఖ్యానిస్తూ అల్ సిందీ ఇలా అన్నారు:

    “ఆయన షాబాన్ ను రమదాన్ తో జతపరచినారు” అంటే ఆయన ఆ రెండింటిలోనూ ఉపవాసం పాటించినారని అర్థం. అంటే ఆయన షాబాన్ నెలంతా ఉపవాసం పాటించారనేది దీని స్పష్టమైన అర్థం. కానీ, వేరే అర్థాన్ని సూచించే ఉల్లేఖనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన దానిలో అధికభాగం ఉపవాసం పాటించే వారన్నట్లుగా దీనిని అర్థం చేసుకోవాలి. అలా ఆయన షాబాన్ అంతా ఉపవాసం ఉంటూ, దానిని రమదాన్ నెలతో జతపరచినట్లవుతుంది.

    షాబాన్ నెలలో అధికభాగం ఉపవాసం పాటించడం వెనుక కారణమేమై ఉంటుంది?

    జవాబుగా అల్ హాఫిజ్ ఇలా అన్నారు:

    అన్నిసాయి మరియు అబూ దావుద్ లలో నమోదు చేయబడిన ఉల్లేఖనలలో దీని కారణం వివరించబడింది. ఇబ్నె ఖుజైమాహ్ సహీహ్ గా వర్గీకరించిన దీనిలో ఉసామాహ్ ఇబ్నె జైద్ రదియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖించినారు: “నేను అన్నాను, ‘ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా, షాబాన్ నెలలో పాటించినంత అధికంగా, మీరు ఏ ఇతర నెలలోనూ ఉపవాసం పాటించడాన్ని నేను చూడలేదు. దానికి ఆయన ఇలా పలికినారు, ‘చాలా మంది ప్రజలు అప్రమత్తంగా ఉండని నెల, రజబ్ మరియు రమదాన్ మధ్యలో ఉన్నది. ఈ నెలలో ప్రజల ఆచరణలు సర్వలోకాల ప్రభువు వద్దకు తీసుకుపోబడతాయి. మరియు నేను ఉపవాస స్థితిలో ఉండగా నా ఆచరణలు పైకి తీసుకపోబడటాన్ని నేను ఇష్టపడుతున్నాను.’” తన సహీహ్ అన్నిసాయి 2221లో అల్ బానీ దీనిని హసన్ గా వర్గీకరిచినారు. ... అసలు విషయం అల్లాహ్ కే తెలుసు.