×
ఈ వ్యాసంలో ఈదుల్ ఫిత్ర్ అంటే రమదాన్ పండుగ గురించి క్లుప్తమైన వివరణ ఉన్నది.

ఈదుల్ ఫిత్ర్

﴿ عيد الفطر ﴾

] తెలుగు – Telugu – تلغو [

http://ipcblogger.net/salimumri/

అనువాదం : -

పునర్విమర్శ : ముహమ్మద్ కరీముల్లాహ్

2009 - 1430

﴿ عيد الفطر ﴾

« باللغة التلغو »

http://ipcblogger.net/salimumri/

ترجمة : -

مراجعة : محمد كريم الله

2009 - 1430

ఈదుల్ ఫిత్ర్

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మక్కా నుండి మదీనా కు వలస వచ్చినపుడు, అక్కడి ప్రజలు ఏడాదిలో రెండు రోజులను ఆటల కోసం, సైరు షికార్ల కోసం పండుగ దినాలుగా ప్రత్యేకించుకోవటాన్ని గమనించారు. “ఏమిటీ ఆ రెండు దినాల విశేషం?" అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని ప్రశ్నించగా, వారు “అజ్ఞానం వల్ల మేము ఇందులో (ఈ రెండు రోజుల్లో) ఆడుకుంటాం, ఆనందాన్ని అనుభవిస్తాం" అని జవాబిచ్చారు. అపుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు “ఈ రెండు రోజులను అల్లాహ్ మీకోసం ఇంతకంటే మేలైన పర్వదినాలుగా మార్చివేశాడు. వాటిలో ఒకటి ఈదుల్ ఫిత్ర్, రెండవది ఈదుల్ అద్ హా."

పండుగ రోజున, షరీఅత్ పరిధులలో స్వాదిష్టమైన ఆహార పదార్థాలు భుజించటం, శుభాకాంక్షలు తెలుపుకోవటం సంప్రదాయం. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా ఉల్లేఖించినారు: “ఒక పర్వదినాన నీగ్రోలు (నల్లవారు) మహాప్రవక్త దగ్గరికి విన్యాసాలు చేస్తూ వచ్చారు. నేను మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) భుజంపై నుండి తొంగి చూడసాగాను. (ఇది గమనించి) ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) తన భుజాన్ని క్రిందికి దించినారు. నేను ఆయన భుజంపై నుండి తనివితీరా ఆ దృశ్యాన్ని తిలకించిన తరువాత అక్కడి నుండి ఇంటి లోపలికి వెళ్ళిపోయాను." (బుఖారి, ముస్లిం ,అహ్మద్ )

పండుగ రోజున స్నానం చేయటం, సుగంధ ద్రవ్యాలు పూసుకోవటం, ఉన్న వాటిలో నుండి మంచి దుస్తులు ధరించటం ఉత్తమం. ఇది మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆచరణ విధానం కూడా. ఈద్ నమాజ్ తమ బస్తి లేక గ్రామం బయట ఒక బహిరంగ ప్రదేశంలోని ఈద్ గాహ్ లో చేయటం సున్నత్. సౌకర్యం లేని పక్షంలో మస్జిద్ లో కూడా పండుగ నమాజ్ చేసుకోవచ్చు. తక్బీర్ ఈద్ నమాజ్ కోసం ఈద్ గాహ్ వైపుకు వెళ్ళేటప్పుడు బిగ్గరగా తక్బీర్ పలుకుతూ వెళ్ళాలి. ఈద్ గాహ్ కు వెళ్ళేటప్పుడు ఒక దారిన, వాపసు వచ్చేటప్పుడు మరొక దారిన రావటం ఉత్తమం. పురుషులతోపాటు స్త్రీలు, పిల్లలు కూడా ఈద్ గాహ్ వెళ్లి, ఈద్ నమాజ్ లో పాల్గొనటం కూడా ఒక సున్నతే.

ఈద్ నమాజ్ సమయం:

సూర్యుడు ఉదయించి, సుమారు రెండు బారెళ్ళు పైకి రాగానే పండుగ నమాజు వేళ ప్రారంభమౌతుంది. ఈదుల్ ఫితర్ నమాజును కాస్త ఆలస్యంగా, ఈదుల్ అద్ హా నమాజును కాస్త త్వరగా చేయాటం మంచిది. మిట్టమధ్యాహ్నం దాటడంతోనే పండుగ నమాజు వేళ ముగుస్తుంది. హజ్రత్ జన్దుబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: ఈదుల్ ఫిత్ర్ నమాజును మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చదివించేటప్పుడు రెండు బారెల్ల ప్రొద్దెక్కి ఉండేది. ఈదుల్ అద్ హా నమాజు చదివించేటప్పుడు ఒక బారెడు ప్రొద్దెక్కి ఉండేది. (అహ్మద్ నిన్ హసనుల్ బన్నా)

పండుగ నమాజు కొరకు అదాన్ మరియు ఇఖామత్ లేదు :

పండుగ నమాజు కోసం అదాన్ యివ్వకూడదు, అలాగే పండుగ నమాజుకు ముందు ఇఖామత్ కూడా లేదు. జుమా నమాజులో ఖుత్బా ప్రసంగం తర్వాత నమాజు జరుగును. అయితే పండుగ రోజున ముందు నమాజు, ఆ తర్వాత ఖుత్బా ప్రసంగం ఉంటుంది.

పండుగ నమాజ్ కు ముందు:

పండుగ నమాజుకు వెళ్ళక ముందు తమ తరపున మరియు తమ కుటుంబసభ్యులందరి తరఫున బీదలకు జకాతుల్ ఫిత్ర్ చెల్లించవలెను. పండుగ నమాజుకు ముందుగాని, నమాజు అనంతరంగాని ఎలాంటి సున్నత్ నమాజు చేయరాదు. అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గానీ, ఆయన ప్రియ సహచరులు గానీ అలా చేసినట్లు ఆధారమేదీ లేదు. ఈ విషయంపై ఇస్లామీయ ధర్మవేత్తలందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. అయితే, ఇక మిగిలినది నఫిల్ నమాజులు: వీటి గురించి (నఫిల్ చదవరాదని) ఏ హదీసులోనూ లేదు. గనక నఫిల్ నమాజులు పండుగకు ముందు మరియు తర్వాత కూడా చేసుకోవచ్చనేది కొందరు ధర్మవేత్తల దృక్పథం. కాని సాధారణంగా రోజు ఏ ఏ వేళల్లో నైతే నఫిల్ నమాజులు చేసేవారో, పండుగ రోజున కూడా ఆ వేళల్లోనే చేయాలన్నిది ఒక నిబంధన. అంతేకాక ఈ నఫిల్ నమాజు వలన పండుగ నమాజుకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూసుకోవలెను.

ఈద్ నమాజ్: రకాతులు, పఠించవలసిన సూరాలు:

ఈద్ నమాజు రెండు రకాతులు. ప్రతీ రకాతులోను సూరహ్ ఫాతిహా పఠించిన తరువాత దివ్యఖుర్ఆనులోని మరే భాగమైనా పఠించవచ్చు. అయితే మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పండుగ నమాజులో స్వయంగా ఆ వేళల్లో ఏ యే సూరాలనైతే పటించేవారో, ఆ సూరాలనే మనం కూడా పఠించటం ఉత్తమం. హజ్రత్ సమర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “పండుగ నమాజులలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మొదటి రకాతులో (ఫాతిహా సూరా అనంతరం) 'సబ్బిహిస్మ రబ్బికల్ ఆలా' మరియు రెండవ రకాతులో 'హల్ అతాక హదీసుల్ గాషిఅ' పఠించేవారు (అహ్మద్). మరో హదీథులో ఇలా ఉంది –“'ఈదుల్ ఫితర్, ఈదుల్ అద్ హా నమాజులలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏమి పఠించేవారు?'అని హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ అబూ వాఖిద్ లేసీ (రదియల్లాహు అన్హు)ను దర్యాప్తు చేయగా 'ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సూరహ్ ఖాఫ్ మరియు సూరహ్ ఖమర్ పఠించేవారని' ఆయన జవాబిచ్చినారు". ఈద్ నమాజు సామూహికంగా చేయాలి మరియు ఖుర్ఆన్ పఠనం బిగ్గరగా చేయాలి .

పండుగ నమాజ్ – తక్బీర్లు:

పండుగ నమాజులో - మొదటి రకాతులో తక్బీరే తహ్రీమాను మినహాయించి, ఖిరాత్ కంటే ముందు అంటే ఖుర్ఆన్ పఠనం ముందు ఏడుసార్లు తక్బీర్లు చెప్పటం, రెండవ రకాతులో కూడా ఖిరాత్ కు ముందు ఐదు సార్లు తక్బీర్లు పలకటం సున్నత్. ప్రవక్త సహచరులు మరియు సహచరులను కళ్ళారా చుసిన వారి విధానం కూడా ఇదే. అహలె హదీసు వారు కుడా ఈ విధానాన్నే అనుసరిస్తారు.

హనఫీ ఫికహ్ ప్రకారం:

హనఫీ ఫికహ్ ప్రకారం మొదటి రకాతులో తక్బీరే తహ్రీమా తర్వాత సనా పఠించాలి. ఖిరాత్ ప్రారంభించక ముందు అల్లాహు అక్బర్ అంటూ చేతులు ఎత్తి వదలివేయాలి. మూడవసారి చేతులు పైకెత్తి అల్లాహు అక్బర్ అని పలికి, అ తరువాత చేతులు కట్టుకోవాలి. తరువాత ఇమాం సూరహ్ పాతిహా, మరొక సూరహ్ పఠించి, మొదటి రకాతు పూర్తి చేయించాలి. రెండవ రకాతు కోసం నిలబడగానే, మామూలుగా ఖిరాత్ పఠించాలి. అయితే రుకూలో వెళ్లకముందు మూడు సార్లు అల్లాహు అక్బర్ అంటూ చేతులెత్తి వదిలి వేయాలి. 4వ సారి కేవలం అల్లాహు అక్బర్ అని (చేతులేత్తకుండానే ) పలికి, రుకూలోనికి వెళ్ళాలి. ఆ తరువాత యధాప్రకారం రెండవ రకాతును పూర్తి చేయించాలి. ఈ విధంగా మొదటి రకాతు, రెండవ రకాతులలో మూడేసి అదనపు తక్బీర్లతో ఈద్ నమాజు చేయాలి. నమాజు ముగిసిన తర్వాత సాముహిక దుఆ చేయాలని ఎక్కడా లేదు. కనుక ఎవరికీ వారు వ్యక్తిగతంగా దుఆ చేసుకోవచ్చు .

పండుగ ప్రసంగం :

పండుగ రోజున – పండుగ నమాజు అనంతరం ప్రసంగించటం సంప్రదాయం. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ సాయిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు - ఒక పర్వదినాన నేను మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఈద్ గాహ్ లో ఉన్నాను. నమాజు చదివించటం పూర్తయ్యాక, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లంఅసం) సెలవిచ్చారు, ఇప్పుడు మేము ప్రసంగించనున్నాము. కూర్చోదలచినవారు కూర్చుని ప్రసంగం వినవచ్చు, వెళ్ళదలచిన వారు వెళ్ళవచ్చు. (అబూదావూద్ ,నిసాయి ,ఇబ్నెమాజ)