కవిత – నూర్ ఫాతిమహ్
కూర్పులు
మూలాలు
Full Description
కవిత
﴿ كـَـفِــتَ ﴾
] తెలుగు – Telugu – تلغو [
www.islamway.com
అనువాదం : సయ్యద్ యూసుఫ్ పాషా
పునర్విమర్శ : ముహమ్మద్ కరీముల్లాహ్
2010 - 1431
﴿ كـَـفِــتَ ﴾
« باللغة التلغو »
www.islamway.com
ترجمة: سيد يوسف باشا
مراجعة: محمد كريم الله
2010 - 1431
కవిత
కవిత ఎలా నూర్ ఫాతిమాగా మారిపోయినది?
(ఇంటర్వ్యూ: బింత్ అర్షద్ సాహీ)
ఒక ఉగ్రవాద శివసేన హిందూ కుటుంబానికి చెందిన, ఒక అమ్మాయి కథ ఇది. ‘కవిత’ అనే ఆ అమ్మాయి స్వయంగా ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది. ఇస్లాం స్వీకరణ తరువాత ఆమె పేరు ‘నూర్ ఫాతిమా’ గా మార్చుకున్నది.
ప్రశ్న: ఇస్లాం స్వీకరణకు ముందు మీ పేరేమిటి?
జవాబు: ఇస్లాం స్వీకరణకు పూర్వం నా పేరు ‘కవిత’, నన్ను అందరూ ముద్దుగా పేరు ‘పూనమ్’ అని పిలిచేవారు.
ప్రశ్న: మరి ఇస్లాం స్వీకరించిన తరువాత ఇప్పుడు మీ పేరేమిటి?
జవాబు: ఇస్లాం స్వీకరించిన తరువాత నాకు ‘నూర్ ఫాతిమా’ అని పేరు పెట్టడం జరిగింది.
ప్రశ్న: మీరెక్కడ జన్మించారు, ఇప్పుడు మీ వయసెంత?
జవాబు: నేను ముంబాయి లో జన్మించాను. ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలు. కానీ, నావరకు నేను, నావయసు ఐదు సంవత్సరాలే అనుకుంటాను. ఎందుకంటే, ఇస్లాంకు సంబంధించి నా ఙ్ఞానమూ, అవగాహనా, ఒక ఐదు సంవత్సరాల ముస్లిం పిల్లవాడి కంటే మించదు.
ప్రశ్న: మీ విద్యాభ్యాసాన్ని గురించి చెబుతారా?
జవాబు: ఇండియాలో స్కూలు విద్య పూర్తి చేసిన తరువాత, పై చదువుల కోసం నేను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్ళాను. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత, అక్కడే ఎన్నో కంప్యూటర్ కోర్సులు చేసాను. నిజంగా నేను విచారిస్తున్నాను, ప్రాపంచిక జీవితం కోసం చాలా డిగ్రీలు సంపాదించాను. కానీ పరలోక జీవితం కోసం ఏమీ చేయలేక పోయాను. ఈ ఆశయం సాధించడం కొరకు ఇప్పుడు సాధ్యమైనంత చేయాలని కోరుకుంటున్నాను.
ప్రశ్న: మీ జీవితానికి సంబంధించి ఇంకా వివరాలు చెప్పండి?
జవాబు: నా చదువులు పూర్తయిన తరువాత, ముంబాయిలో నేను ఒక స్కూల్లో టీచరుగా చేరాను. అది చాలా పెద్ద స్కూల్. కోటీశ్వరుల పిల్లలే అక్కడ చదవడానికి వస్తారు.
ప్రశ్న: మీ వివాహం ఎక్కడ జరిగింది, మీకెంత మంది పిల్లలు?
జవాబు: నా వివాహం ముంబాయిలో జరిగింది. కానీ తరువాత నేను నా భర్త వెంట బహ్రెయిన్ వచ్చాను. నాకు ఇద్దరు మగపిల్లలు.
ప్రశ్న: మీరు ఇస్లాం స్వీకరించటం ఏ విధంగా జరిగింది?
జవాబు: అన్నింటికన్నా ముందుగా నాపై కురిపించిన అనుగ్రహాలకు గాను నేను అల్లాహ్ కు కృతఙ్ఞతలు అర్పించుకుంటున్నాను. ఆయన ప్రవక్త, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నట్లు “ఎవరికైతే అల్లాహ్ మంచి చేయాలని తలపోస్తాడో, వారికి ధర్మానికి సంబంధించిన అవగాహనను కలుగజేస్తాడు” అని, నాపై అల్లాహ్ ఎంతగానో తన కారుణ్యాన్నీ, అనుగ్రహాన్నీ కురిపించాడని అనుకుంటున్నాను. ముస్లిములు అంటేనే విపరీతంగా అసహ్యించుకునే, ఉగ్రవాద హిందూ వాతావరణంలో పెరిగాను నేను. నేను ఇస్లాం స్వీకరించటం నా వివాహం అయిన తరువాత జరిగింది. కానీ, చిన్నప్పటినుంచే విగ్రహాలకు పూజ చేయటం అంటే ఇష్టం ఉండేది కాదు నాకు. ఇప్పటికీ బాగా గుర్తు నాకు – ఒక సారి, మా ఇంట్లో ఉన్న ఒక విగ్రహాన్ని తీసుకెళ్ళి స్నానాలగదిలో పడేసాను. దాంతో మా అమ్మ నన్ను బాగా తిట్టిపోసింది. దానికి నేను మా అమ్మతో “తనను తాను కూడా రక్షించుకోలేని ఆ విగ్రహానికి ఎందుకమ్మా మీరు తలలు వంచి దండాలు పెడతారు. అది మీకేం ఇస్తుందనీ?” అన్నాను. మా కుటుంబంలో ఒక సాంప్రదాయం ఉంది. ఆడపిల్లకు పెళ్ళైనపుడు, ఆ అమ్మాయి తన భర్త కాళ్ళు కడిగి, ఆ నీళ్ళను తాగాలి. కానీ ఆ మొట్టమొదటి రోజే, నేను అలా చేయడానికి నిరాకరించాను. దానికి అందరూ నన్ను విపరీతంగా తిట్టారు. నేను మీకు ముందే చెప్పాను కదూ, నేను ఒక స్కూల్లో టీచరుగా చేరానని – స్కూలుకు నేను ఒక్కదాన్నే వెళ్ళి వస్తూ ఉండటం, కారును నేను స్వయంగా డ్రైవ్ చేయటం వల్ల, దార్లోనే ఉన్న, ఒక ఇస్లామిక్ సెంటర్ కు వెళ్ళడం ప్రారంభించాను. నేను వారి సంభాషణ విన్నాను. వారు విగ్రహాలను పూజించరన్న విషయం నాకు అర్థమైంది. వారు, అనుగ్రహాలను, ఆశీర్వాదాలను కోరుకునేది వేరే ఇంకెవరి నుంచో. వారి దేవుడు విగ్రహాలు కాదు – వేరే ఇంకెవరో. వారి అభిప్రాయాలు నచ్చాయి నాకు. తరువాత నాకు అర్థమైంది ఆ ‘వేరే ఇంకెవరో’ - ‘అల్లాహ్’ అనీ, సమస్త కార్యాలనూ పరిపూర్తి చేసేది ఆయనే అనీ.
ప్రశ్న: ఇస్లాం వైపునకు మీరు ఎలా ఆకర్షించబడ్డారు?
జవాబు: వారి ఆరాధనా విధానం, అదే ‘నమాజు’ నన్ను బాగా ప్రభావితం చేసింది. అది ‘ఆరాధన’ అన్న విషయం అంతకు ముందు తెలియదు నాకు. అయితే ముస్లిములందరూ అలా చేస్తారని మాత్రం తెలుసు. అదేదో ఒకరకం వ్యాయామం కాబోలు అనుకునే దాన్ని. ఇస్లామిక్ సెంటర్ కి వెళ్ళి రావడం మొదలు పెట్టిన తరువాత, అది ఒక ‘ఆరాధన’ అనీ, దానిని ‘నమాజు’ అంటారనీ తెలిసింది నాకు. నేనెప్పుడూ కలలో ఒక రకమైన ఆకారాన్ని చూస్తూ ఉండే దాన్ని. అది నలుచదరపు గదిలా ఉండేది. ప్రతి రోజూ కలలో చూస్తూ ఉండే దానిని. కలత చెంది నిద్ర నుంచి లేచి పోయేదానిని. చెమటలు పట్టేవి. పడుకుంటే మళ్ళీ కలలోకి వచ్చేది. నా కలలో కనిపించిన ఆ గదిని గురించి, తరువాత చాలా తెలుసుకున్నాను నేను.
ప్రశ్న: మీరు ఇస్లాం స్వీకరించడం గురించి మీ కుటుంబానికి ఎలా తెలిసింది?
జవాబు: పెళ్ళయింతర్వాత, నా భర్తతో పాటు బహ్రెయిన్ కు వెళ్ళటం, ఇస్లాం పట్ల అవగాహన పెంచుకోవాటానికి బాగా ఉపకరించింది. అదొక ముస్లిం దేశం కావటం వల్ల, మా ఇంటి చుట్టుపక్కల అందరూ ముస్లిములే ఉండేవారు. అలా ఒక ముస్లిమం అమ్మాయితో నాకు స్నేహం అయ్యింది. ఆ అమ్మాయి ఎపుడో కానీ మాయింటికి వచ్చేది కాదు. చాలాసార్లు నేనే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళుతూ ఉండే దానిని. ఒకసారి, అది రమదాన్ నెల కావటంతో, ఒకరోజు నాతో వాళ్ళ ఇంటికి ఇక రావద్దని కరాఖండిగా చెప్పేసింది. నేను ఆశ్చర్యపోయాను. “నువ్వు మా ఇంటికి రావడం వల్ల, నా ఆరాధనలకు అతరాయం కలుగుతున్నది” అంది తను. నాకు, ఇస్లాం యొక్క ఆరాధనలు, ఆచరణలు, సాంప్రదాయాలు తెలుసుకోవాలని బాగా కోరికగా ఉండటంతో, ఆ అమ్మాయి మాటలు నాలో మరింత ఉత్సుకతను రేపాయి. నేను ఆ అమ్మాయిని బతిమాలాను “ప్లీజ్! అలా అనకు. నువ్వు ఏ ఆరాధన చేయాలనుకుంటావో, చెయ్యి. ఎలా ఆచరిస్తావో అలా ఆచరించు. నేను ఒక్క మాట కూడా మాట్లాడను. కేవలం చూస్తూ ఉంటానంతే. నువ్వు ఏం చదువుతావో, జస్ట్ వింటూ ఉంటానంతే. నావల్ల నీకు ఎలాంటి అంతరాయం, ఆటంకం కలుగకుండా మసలుకుంటాను.” అన్నాను. ఆ అమ్మాయి సరేనంది. నేను ఎప్పుడైనా ఆ అమ్మాయిని ఏదో ఒక ఆరాధనలో మునిగి ఉండగా చూస్తే, దానికి బాగా ఆకర్షితమై పోయే దానిని – నేను కూడా అలా చేయాలనీ, అలా ఆచరించాలనీ బలంగా అనిపించేది నాకు. ఒకసారి ఆ అమ్మాయిని అడిగాను ఆ ‘యోగా వంటి వ్యాయామాన్ని’ గురించి. తను చెప్పింది దానిని ‘నమాజు’ అంటారనీ, తను పఠించే ఆ గ్రంథాన్ని ‘దివ్య ఖుర్’ఆన్’ అంటారనీ. నేను కూడా అవన్నీ చేయాలనీ ఆశపడేదానిని. ఇంటికి తిరిగి వెళ్ళినపుడు, ఒక గదిలోకి దూరి, లోనుంచి గడియ పెట్టుకుని, నాకు అంతగా ఏమీ తెలియక పోయినా, ఆ ఏకాంతంలో నా స్నేహితురాలు ఆచరించినట్లుగా అన్ని పనులూ ఆచరిస్తూ ఉండే దానిని. ఒకరోజు, గది తలుపులు లోపలి నుంచి గడియ పెట్టడం మరిచిపోయి, నమాజు ఆచరించటం ప్రారంభించాను. నా భర్త గదిలోనికి ప్రవేశించటప్పటికి నేను నమాజులో ఉన్నాను.
‘ఏం చేస్తున్నావ్?’ అని అడిగాడు నన్ను.
‘నమాజు చేస్తున్నాను’ అన్నాన్నేను.
‘నీకేమన్నా మతి పోయిందా? తెలివుండే మాట్లాడ్తున్నావా నువ్వూ? ఏమంటున్నావో అర్థమవుతున్నదా నీకసలు?’ కోపంతో ఊగిపోతూ అడిగాడు.
ముందు నేను కొద్దిగా వణికాను, భయంతో నాకళ్ళు మూసుకుపోతున్నాయి. కానీ అంతలోనే, నాలో అంతరంగా ఉన్న శక్తి, ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాకు ధైర్యాన్నిచ్చింది. అంతే, నేను గట్టిగా అరిచి మరీ చెప్పాను ‘అవును, నేను ఇస్లాం స్వీకరించాను. అందుకే నమాజు చేస్తున్నాను’.
‘ఏంటీ? ఏమన్నావ్? ఏదీ మళ్ళొకసారి అను?’ కోపంతో ఊగిపోతూ, రెట్టించి అడిగాడు అతను.
‘అవును, నేను ఇస్లాం స్వీకరించాను’ అన్నాన్నేను.
అంతే, నన్ను పశువును కొట్టినట్లు, కొట్టడం మొదలు పెట్టాడు. మా అరుపులు, ఆ దెబ్బల చప్పుళ్ళు విని, మా అక్క పరుగెత్తుకు వచ్చింది. ఆవిడ నన్ను విడిపించటానికి ప్రయత్నించింది. కానీ, నా భర్త చిప్పిందంతా విని, తాను కూడా నాపై చేయి చేసుకోవడం ప్రారంభించింది. నేను తనని ఆపి అన్నాను “అక్కా! దయచేసి, నాదారికి అడ్డు రావద్దు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. నా కొరకు ఏది మంచో, ఏది చెడో నాకు తెలుసు. నేను ఎంచుకున్న మార్గం పై నేను నడిచి తీరుతాను.’ ఇది విని, నా భర్త ఉగ్ర రూపం దాల్చాడు. నన్ను ఎంతగా హింసించాడంటే – నేను స్పృహ తప్పి పడిపోయాను.
ప్రశ్న: మరి అప్పుడు మీ పిల్లలు ఎక్కడున్నారు? ఎంత వయసు ఉండి ఉంటుంది వాళ్ళకపుడు? అక్కడినుంచి ఎలా తప్పించుకో గలిగారు మీరు?
జవాబు: ఈ భయానకమైన డ్రామా అంతా జరుగుతున్నపుడు నా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. నా పెద్ద కొడుకు 9 వ సంవత్సరంలోనూ, నా చిన్న కొడుకు 8 వ సంవత్సరంలోనూ ఉన్నారు. కానీ ఈ సంఘటన జరిగిన తరువాత నేను ఎవరినీ కలువకుండా కట్టడి చేసారు, చివరికి నా పిల్లలను కూడా. నన్ను ఒక గదిలో వేసి తాళం వేసారు. సాంప్రదాయబధ్ధంగా నేను ఇస్లాం స్వీకరించక పోయినప్పటికీ, నేను ఆవిధంగా అనేసాను ‘నేను ఇస్లాం స్వీకరించాను’ అని. ఒక రోజు రాత్రి, నేను ఆ గదిలో పడిఉండగా, నా పెద్దకొడుకు నావద్దకు వచ్చాడు. అంతే, నన్ను చూస్తూనే, నా చేతుల్లో వాలిపోయి, గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టాడు. లోనుంచి తన్నుకు వస్తున్న ఏడుపును దిగమింగుకుని, ‘వాళ్ళందరూ లేరా?’ అని అడిగాను. ఎవరూ ఇంట్లో లేరనీ, వాళ్ళందరూ ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళారనీ చెప్పాడు (ఏదో హిందూ పండుగ సందర్భంగా జరుగుతున్న ఫంక్షన్ అది). నా పెద్దకొడుకు ‘అమ్మా! వాళ్ళంతా నిన్ను చంపాలనుకుంటున్నారు. నువ్విక్కడినుంచి పారిపోమ్మా’ అన్నాడు. నేను వాడిని సముదాయించాను ‘కన్నా! నాకేమీ జరుగదు. వాళ్ళు నన్నేమీ చేయలేరు. నువ్వు జాగ్రత్త, నీ తమ్ముడ్ని కూడా జాగ్రత్తగా చూసుకో.’ అన్నాను. కానీ వాడు నన్ను పోరుతున్నట్లుగా, సముదాయిస్తూ మళ్ళీ అడగటం మొదలుపెట్టాడు ‘అమ్మా! నువ్విక్కడి నుంచి పారిపోమ్మా!’ అని. నేను వాడిని మళ్ళీ సముదాయించాను ‘నాకేమీ జరుగదని, తనను జాగ్రత్తగా ఉండమనీ, తమ్ముడ్ని జాగ్రత్తగా చూసుకోమనీ’. కానీ వాడు ఏడుస్తూ ఎక్కిళ్ళమధ్య మళ్ళీ నన్ను పోరడం మొదలుపెట్టాడు. నేను వాడికి అర్థమయ్యేలా చెప్పాను ‘నేను వెళ్ళలేననీ, వెళ్ళితే తననీ, తమ్ముడ్నీ చూసే అవకాశం కోల్పోతాననీ’. వాడన్నాడు ‘నువ్వు బ్రతికి ఉంటే కదమ్మా మమ్మల్ని చూసేదీ! వెళ్ళిపోమ్మా ఇక్కడినుంచి, వాళ్ళు నిన్ను హత్య చేస్తారు, చంపేస్తారమ్మా నిన్నూ, – ప్లీజ్, ఇక్కడినుంచి వెళ్ళిపో ……..’ వాడు ఏడుస్తూ అంటూనే ఉన్నాడు. నా కన్నీళ్ళను నేను కళ్ళలోనే ఇంకించుకుంటున్నాను. చివరికి నేను నిర్ణయించుకున్నాను ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని. ఆ నిర్ణయం తీసుకున్న కఠినమైన క్షణాలను నేను ఎన్నటికీ మరిచిపోలేను. నా పెద్దకొడుకు, నిద్రపోతున్న నా చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళి ‘నానీ ! లేవరా ! అమ్మ వెళ్ళిపోతున్నది. మళ్ళీ మనల్ని కలుస్తుందో లేదో, లేవరా!’ అని లేపుతున్నాడు. వాడు కళ్ళు నులుముకుంటూ లేచాడు. నన్ను చాలా రోజుల తరువాత చూస్తున్నాడు వాడు. ఒకడుగు ముందుకు వేసి ఏడుస్తూ నన్ను అల్లుకు పోయాడు. నేను మనసులోనే రోదిస్తున్నాను. బహుశా, పిల్లలకు అన్ని విషయాలూ ముందుగానే తెలుసులా ఉంది. వాడు నన్ను ఒక్కటే మాట అడిగాడు ‘అమ్మా! వెళ్ళిపోతున్నావా నువ్వూ?’ కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా ‘అవును’ అన్నట్లుగా తలాడించాను ‘మనం తప్పకుండా మళ్ళీ కలుస్తాంరా నానీ’ అంటూ. నేను మోకాళ్ళపై కూర్చుని, పిల్లలిద్దర్నీ హత్తుకుని తనివితీరా ఏడుస్తున్నాను. ఒకవైపు పిల్లలపై ప్రేమ, వారిని విడిచి వెళ్ళిపోతున్నాని బాధ, మరోవైపు దానిని అధిగమిస్తూ ఇస్లాం పట్ల ప్రేమ. ఆ చలిచీకటి రాత్రిలో, నేను వెళ్ళిపోతూఉంటే, నా ఇద్దరు కొడుకులూ వీడ్కోలు చెబుతున్నట్లుగా నన్నే చూస్తూ నిలబడ్డారు. వాళ్ళపై, లోనుంచి పెల్లుబికి వస్తున్న మమతానురాగాలనూ, ప్రేమనూ అతి కష్టంగా అదుపు చేసుకుంటూ వెళ్తున్నాన్నేను. నా వంటిపై గాయాలు పచ్చిగా ఉన్నాయి. నడవడం కూడా రావడం లేదు. గేటు దగ్గర నిలబడి పిల్లలిద్దరూ కన్నీళ్ళతో చేతులూపుతున్నారు. ఆ దృశ్యాన్నీ, ఆ క్షణాలనూ నేను ఎన్నటికీ మరిచిపోలేను. ఆ క్షణాలు నాకెప్పుడు గుర్తుకు వచ్చినా, ముస్లిములు ఇస్లాం కొరకు, తమ కుటుంబాలనూ, భార్యాపిల్లలనూ, తమ సొంత ఊళ్ళనూ వదిలి వలస వెళ్ళిన సంఘటనలను గుర్తు చేసుకునేదానిని.
ప్రశ్న: అప్పుడు మరి ఎక్కడికి వెళ్ళారు మీరు? ఇస్లాం ఎక్కడ స్వీకరించారు?
జవాబు: ఇంటినుంచి తిన్నగా పోలిస్ స్టేషన్ కు వెళ్ళాను. పెద్ద చిక్కు ఏమిటంటే, అక్కడెవరికీ, నేను మాట్లాడే భాష ఏమిటో తెలియదు. అందులో కొద్దిగా ఇంగ్లీషు అర్థం చేసుకోగలిగే ఒకతను ఉన్నాడు. నేనున్న ఆందోళణకర స్థితిలో శ్వాస తీసుకోవటానికి కూడా కష్టంగా ఉంది నాకు. నన్ను కొద్ది సేపు విశ్రాంతి తీసుకోనివ్వమని అతడ్ని రిక్వెస్ట్ చేసి, ఆ ప్రక్కన కూర్చుండి పోయాను. కొద్దిగా కుదుటపడిన తరువాత, అతనికి చెప్పాను ‘నేను ఇల్లు విడిచి వచ్చేసాననీ, నేను ఇస్లాం స్వీకరించాలనీ’. నేను కంగారు-కంగారుగా అన్ని విషయాలూ అతనికి చెప్పేసాను. అతడు నన్ను ఓదార్చాడు. తను కూడా ముస్లిమేననీ, తనకు చేతనైనంత సహాయం తప్పనిసరిగా చేస్తాననీ అన్నాడు. అతడు నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళి, తన ఇంట్లో అందరికీ పరిచయం చేసాడు. ఆ రాత్రికి నాకు వాళ్ళ ఇంట్లోనే ఆసరా కల్పించాడు. ప్రొద్దున్నే నా భర్త పోలీస్ స్టేషన్ కు వచ్చి, తన భార్య కిడ్నాప్ కు గురైందనీ, పోలీసుల సహాయం కోసం వచ్చినట్లుగా చెప్పాడు. కానీ వాళ్ళు, నేను కిడ్నాప్ కు గురి కాలేదనీ, నా అంతట నేనే అక్కడికి వచ్చాననీ అతడికి తెలియజేసారు. నేను ఇస్లాం స్వీకరించలని కోరుకుంటున్నందున, అతడికి (ముస్లిం కానందున) నాపై ఎటువంటి అధికారం లేదనీ, నాతో ఎటువంటి సంబంధమూ లేదనీ కూడా తెలియజేసారు. కానీ అతడు మొండిగా నేను తనతో రావల్సిందేనని పట్టుబట్టి, బెదిరించడం ప్రారంభించాడు. నేను అతడితో వెళ్ళడానికి నిరాకరించాను. ‘కావాలంటే, నా నగలు, బాంకులో ఉన్న డబ్బూ, ఆస్తీ మొత్తం తీసుకో’ అని, అతడితో వెళ్ళనని తెగేసి చెప్పాను. అయినా మొదట్లో అతడు ఆశ వదులుకోలేదు. కానీ తరువాత, ఆశలు వదులుకుని, ఆస్తికి సంబంధించి, నాతో ఒక వ్రాత ఒప్పందం మీద సంతకాలు తీసుకుని వెళ్ళిపోయాడు.
ఆ పోలీసు ‘ఇప్పుడు నీకు ఏ ప్రమదమూ లేదు, నీ వాళ్ళెవరూ నిన్నేమీ చేయలేరు. నీవు నిర్భయంగా ఇస్లాం స్వీకరించవచ్చు’ అని అన్నాడు. తరువాత చికిత్స కొరకు కొద్ది రోజుల పాటు నేను హాస్పిటల్ లోనే ఉండి పోవలసి వచ్చింది. ఒకసారి ఒక డాక్టర్ అడిగాడు ‘ఎక్కడి నుంచి వచ్చావమ్మా నువ్వు? ఇన్ని రోజులైంది, నిన్ను చూడ్డానికి ఒక్కరైనా రాలేదే’ అని. నేను మౌనంగా ఉండిపోయాను. ఒకేఒక్క విషయాన్ని అణ్వేశిస్తూ నేను ఇంటిని విదిలేసాను. ఇప్పుడు నాకు ఇల్లూ లేదూ, ఒక కుటుంబమూ లేదు. నాకు ఉన్న ఒకేఒక బంధం ‘ఇస్లాం’. ఇంటిని విడిచి బయటకు అడుగు వేసిన మొదటి దశలోనే నన్ను ఆదుకుంది, ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నది . ఆ ముస్లిమ్ పోలీసతను నన్ను ‘చెల్లీ’ అని పిలిచాడు. తన ఇంట్లో చోటిచ్చాడు. నాకున్న బంధుత్వాలన్నీ తెగిపోయిన, ఆ చలిచీకటి రాత్రి బంధువై నాకు ఆశ్రయం కల్పించాడు. ఆ సహాయాన్ని నేను ఎన్నటికీ మరిచిపోలేను.
హాస్పిటల్ లో ఉండగా, ‘తరువాత ఏమిటి’ అని ఆలోచిస్తూ ఆందోళనకు గురయ్యే దానిని. మనశ్శాంతీ, రక్షణ కోసం ఎక్కడికెళ్ళాలీ? హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ అయిన తరువాత నేరుగా ఇస్లామిక్ సెంటర్ కు వెళ్ళాను. అప్పుడక్కడ ఎవరూ లేరు, వయసు మీరిన ఒకాయన తప్ప, బహుశా అందులోనే అతని నివాసం కూడానేమో. నేను ఆయన దగ్గరికి వెళ్ళి, నా కథంతా చెప్పాను. ఆయన సలహా మేరకు ముస్లిం స్త్రీలు ధరించే సాంప్రదాయక దుస్తులు ధరించాను. నమాజు ఆచరించటానికి ముందు ముస్లిములు తమ ముఖమూ, చేతులూ, కాళ్ళూ, ఏవిధంగా శుభ్రపర్చుకుంటారో ఆ విధంగా నన్ను శుభ్రపరుచుకోమన్నాడు. (ఆ విధంగా శుభ్ర పరచుకోవటాన్ని ‘వుదూ’ అంటారు). ఆయన వుదూ చేసి చూపించాడు. తరువాత ఒక గదిలోకి తీసుకెళ్ళాడు నన్ను. అక్కడ గది గోడకు వేళ్ళాడ్తూ ఉన్న పటాన్ని చూసి అధాట్టుగా అరిచాన్నేను ‘అదే – అదే, ఆ నలుచదరపు గదినే నేను కలలో చూసింది’. ఆయన నా వైపు చిరునవ్వుతో చూసి అన్నాడు ‘అది అల్లాహ్ గృహం. ప్రపంచం నలుమూలల నుంచీ ముస్లిములు ఉమ్రా, హజ్జ్ ఆచరించటానికి అక్కడికి వస్తూ ఉంటారు. దానిని ‘బైతుల్లాహ్’ అంటారు.’ అది విని, ఆశ్చర్యంతో ‘అల్లాహ్ ఆ గదిలో ఉంటాడా?’ అని అడిగాను ఆయన నా అన్ని ప్రశ్నలకూ ఎంతో వాత్సల్యంగా, ఓర్పుగా సమాధానాలిస్తున్నాడు. బహుశా ఆయనకు ఇస్లాం గురించి చాలా తెలుసు. నేనూ ఆయనతో ఎటువంటి జంకూ లేకుండా మాట్లాడుతూ ఉన్నాను. ఆయన నా భాషలోనే ఎన్నో విశయాలను విశదీకరిస్తున్నాడు. ఏదో అర్థంకాని అనిర్వచనీయమైన సంతోషాన్ని అనుభవిస్తున్నాన్నేను. ఆయన నాతో ‘కలిమా’ చదివించాడు. ఇస్లాం గురించీ, ముస్లిముల గురించీ ఎన్నో విషయాలు చెప్పాడు. నాకిపుడు ఏ ఆందోళనా లేదు, నా హృదయం పై ఎటువంటి భారమూ లేదు. నాకిపుడు ఎంతో తేలికగా ఉంది. దుర్గంధపూరిత మురికి నీళ్ళల్లో నుంచి స్వచ్ఛమైన జలాలలోనికి ఈదుకు వచ్చినట్లుగా ఉంది నాకు. ఆ ఇస్లామిక్ సెంటర్ యజమాని, నన్ను తన కూతురిగా చేసుకున్నాడు. నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. తరువాత ఒక ముస్లిం కుటుంబంలో నా వివాహం జరిపించాడు. అవకాశం లభించగానే, మొట్టమొదట ‘బైతుల్లాహ్’ చూడాలనీ, ఉమ్రా చేయాలనీ నా కోరిక.
ప్రశ్న: ఇస్లాం స్వీకరించిన తరువాత మీరెపుడైనా ఇండియా వెళ్ళారా?
జవాబు: లేదు, నేను ఎప్పుడూ, ఇండియా వెళ్ళనూ లేదు, ఇకముందు వెళ్ళాలనే కోరిక కూడా లేదు. అక్కడ నా కుటుంబం వారికి రాజకీయాలలో, హిందూ ధార్మిక వర్గాలలో బాగా పలుకుబడి ఉంది. నన్ను చంపటానికి బహుమతిని కూడా ప్రకటించారు వాళ్ళు. ఇప్పుడు నేనొక ముస్లింను, ఒక ముస్లిమునకు కూతురిని, నాకింకేం కావాలి? నేను ముస్లింను అయినందుకు గర్వపడుతున్నాను. ఇస్లాం వెలుగులో నేను నా శేషజీవితాన్ని గడపాలనుకుంటున్నాను.
ప్రశ్న: ఇస్లాం స్వీకరించటానికి ముందు ‘ముజాహిదీన్’ల గురించి మీ ఆలోచనలు ఏవిధంగా ఉండేవి?
జవాబు: వాళ్ళు దౌర్జన్య పరులనీ, దౌర్జన్యపు అన్ని హద్దులనూ దాటిపోయిన వారనీ మాకు నూరిపోయడం జరిగేది. వాళ్ళ పేరు వింటేనే అసహ్యించుకునేలా తయారు చేసేవారు మమ్మల్ని. కానీ మీడియా తప్పుడు ప్రచారంలోని సత్యాసత్యాలు గ్రహించి తరువాత, నేను వారిని అభిమానిస్తున్నాను. ప్రపంచ శాంతియే లక్ష్యంగా పని చేస్తున్న వారి విజయం కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంకా నేను అల్లాహ్ ను వేడుకుంటున్నాను ‘ఒకవేళ ఆయన నాకు కుమారులను ప్రసాదిస్తే, ‘ముజాహిదీన్’ ల మొదటి వరుసలో వారిని నిలబెడతాను. వారిని ఇస్లాం యొక్క ఔన్నత్యం కొరకు అంకితం చేస్తాను. ఇన్షాఅల్లాహ్!