×
హిందూ ధర్మం నుండి ఇస్లాం లోనికి: ఒక స్వామీజీ శిష్యుడిని ఒక హిందూ యువతి వివాహం చేసున్నది. కాని ఆ తర్వాత సత్యమార్గం కోసం ఇతర ధర్మాలలో వెతకటం మొదలు పెట్టినది. చివరికి సత్యాన్ని తెలుసుకొని, తన భర్తతో సహా ఇస్లాం స్వీకరించనది.

 ఇంద్రాణి & చంద్ర - సింగపూరులోని ఒక మాజీ హిందూ కుటుంబం

ఒక స్వామీజీ శిష్యుడిని ఒక హిందూ యువతి వివాహం చేసున్నది. కాని ఆ తర్వాత సత్యమార్గం కోసం ఇతర ధర్మాలలో వెతకటం మొదలు పెట్టినది.

హిందూ ధర్మంలో ఉన్నప్పుడు సోదరి నిషాని పేరు ఇంద్రాణీ మరియు ఆవిడ భర్త పేరు చంద్రా. వారివురు ఇస్లాం వైపు సాగించిన తమ అధ్యాత్మిక ప్రయాణాన్ని సోదరి మునీరహ్ అల్ ఇద్రోస్ కు ఇలా వివరించినారు.

ఆరు సంవతర్సరాల పిన్నవయస్సులో ఇంద్రాణి తండ్రి చనిపోయినాడు. 5గురు చిన్నపిల్లలున్న తనను విధవరాలిని చేసి, దేవుడు తనకు అన్యాయం చేసాడని భావిస్తూ, ఆవిడ తల్లి దేవుడిని పూజించటమే మానివేసినది. ఇంద్రాణి, తోబుట్టువులతో పాటు సాధారణ హిందూ పిల్లల మాదిరిగానే పెంచబడినది. అనేక హిందువుల ఇళ్ళ మాదిరిగా, వారి ఇంట్లోనూ దేవుడి విగ్రహాలు గాని లేదా చిత్రపటాలు గాని ఉండేవి కావు.

అయితే 10 సంవత్సరాల వయస్సుకు చేరుకున్నప్పుడు, ఇంద్రాణీ దేవుడిపై భక్తి చూపటం ప్రారంభించినది. పూజల కోసం దేవుళ్ళ మరియు దేవతల పటాలు ఇంట్లో జమ చేసింది. దైవారాధనలు చేయాలనే ఆసక్తి ఆవిడలో పెరిగినది. ఇతర హిందువులు వివిధ రకాల పూజలు చేస్తుండగా, తమ కుటుంబం పూజలు-ప్రార్థనలు లేకుండా జీవించటంలో ఏదో కొరత ఉన్నట్లు ఆవిడ భావించేది. ఇంద్రాణీ తన యుక్త వయస్సులో వారినికి మూడు సార్లు దేవాలయాన్ని దర్శించేది. హిందూధర్మంలో ఆసక్తి ఇంకా అధికమై, తన స్నేహితులను కూడా తనతో పాటు గుడికి రమ్మని ప్రోత్సహించసాగినది. భక్తిగీతాలలో, భజనలలో విరివిగా పాల్గొనేది. త్వరలోనే పెరుమాళ్ దేవాలయపు అయ్యప్పన్ సంఘ సభ్యురాలిగా చేరి, వారి వివిధ కార్యక్రమాలలో సంవత్సరాల తరబడి పాలు పంచుకున్నది.

సుఖసంతోషాలతో జీవన ప్రయాణం అలా సాగుతుండగా ఒకరోజు, ఇంద్రాణి అనారోగ్యానికి గురైనది. ట్రీట్మెంటు కోసం ఆవిడ అనేక మంది వైద్యులను సంప్రదించినది. కాని అందరూ ఆవిడ మామూలుగానే ఉందని, ఆవిడలో ఏ రోగమూ లేదని తెలిపినారు. కాని, తను ఇంకా అనారోగ్యంతోనే ఉందని ఆవిడ భావించేది. తనపై ఏవైనా దుష్టశక్తులు, పిశాచాలు ఆవహించాయేమోనన్న అనుమానంతో ఒక స్వామీజీని సంప్రదించినది. ఆ స్వామీజీ మరియు ఆయన శిష్యుడు ఆవిడను చూడటానికి తరచుగా వచ్చేవారు. ఆ శిష్యుడి పేరే చంద్ర. దేవాలయంలో ఆవిడ చేసే పూజలలో అతడు సహాయం పడేవాడు. అంతేకాక ఇంద్రాణి మరియు ఆవిడ స్నేహితుల కొరకు మలేషియా తీర్థయాత్రలను కూడా ఏర్పాటు చేసేవాడు. స్వామీజీకి సహాయపడుతూ, ఆ యువకుడు ప్రదర్శించే అద్భుత ధార్మిక జ్ఞానానికి ఇంద్రాణీ చాలా ప్రభావితం అయినది.

ఆవిడ ఇంటికి వెళ్ళటం మొదలెట్టిన కొన్నాళ్ళకు, ఆరాధ్య దేవతయిన కాళీమాత ‘ఇంద్రాణీని నీవు పెళ్ళి చేసుకో’ అని తనను ఆదేశిస్తున్నట్లుగా చంద్రకు కల వచ్చినది. అనేక సంప్రదింపుల తర్వాత అతని కుటుంబం ఇంద్రాణీ ఇంటికి రాయబారం పంపినది. ఇంద్రాణీ మరియు ఆవిడ కుటుంబ సభ్యులు ఆ శుభవార్త విని ఒకింత ఆశ్చర్యపోయారు. ఒక నిష్టాపరుడైన హిందువుతో తన వివాహం జరగాలనే కోరిక అలా నిజం కాబోతున్నదనే విషయాన్ని ఇంద్రాణీ నమ్మలేకపోయినది.

ఇంద్రాణీ కుటుంబం వలే కాకుండా, చంద్ర ఒక ఉన్నతమైన హిందూ సంప్రదాయ కుటుంబంలో పెరిగినాడు. అంతేకాక, అతడు తన మొత్తం కుటుంబంలోనే అత్యంత దైవభక్తి పరుడు. అతడు దేవీదేవతల స్తోత్రంలో దివ్యశ్లోకాలూ, మంత్రాలూ పఠిస్తు, తరచుగా ధ్యానంలో మునిగిపోయి, పారవశ్యంలో మైమరచి పోతూ ఉండేవాడు. అంతేకాక, ఆ దేవీదేవతలు అతడిని ఆవరించి, అతడి ద్వారా ప్రజలతో మాట్లాడుతూ ఉండేవారని ప్రసిద్ధి. హిందూ ధర్మంలో దేవతలు ఆవరించటమనేది ఒక గౌరవచిహ్నంగా పరిగణింపబడుతుంది. చంద్ర మరియు ఇతరులు స్వామీజీ బోధనలు వినటానికి తరచుగా సమావేశ మయ్యేవారు. ఇంకా ప్రజలపై నుండి మరియు వారి ఇళ్ళలోనుండి దుష్టశక్తులను పారద్రోలటానికి వారు ప్రజల ఇళ్ళకు వెళుతుండేవారు. ఈ విధంగా చంద్ర స్వామీజీకి ముఖ్యశిష్యుడిగా నియుక్తుడయ్యాడు.

ఇంద్రాణీ పై దేవీదేవతలు ఏనాడూ ఆవరించలేదు. కాని ఏనుగు దేవుడైన వినయాగర్ అప్పుడప్పుడు చంద్ర పై ఆవరించటం ఆవిడ చూసేది. అలా జరిగినప్పుడు, చంద్ర ఖచ్చితంగా ఏనుగు వలే ప్రవర్తించేవాడు, ఏనుగులు తినే పళ్ళూఫలాలనే తినేవాడు.

అలా చంద్రపై దేవీదేవతలు ఆవరించినప్పుడు ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం అడగటం కోసం అతడి వద్దకు చేరుకునేవారు. ముందుగా వారు ‘అతడే దేవుడు’అని అనిపించే విధంగా అతడికి సాష్టాంగపడేవారు. నుదుటిపై పూసుకునే విభూదీని దీవించమని అతడి ముందు పెట్టేవారు.

ఇంత జరుగుతున్నా చంద్ర ఏదో వెలితిగా, అసంపూర్ణంగా భావించేవాడు. ఏదో కోల్పోయినట్లు అసంతృప్తిగా ఉండేవాడు. తన జీవితంలో ఏదో లోపం ఉన్నట్లు అతడు గ్రహించసాగాడు. అతడు దివ్యకాంతిని చూడలేకపోయాడు. ఆ మార్గంలో ఏదో అంధకారపు ఆటంకం ఉన్నట్లు అతడికి అనిపించేది. దానిని తొలగించి, ఆ కాంతి వద్దకు చేరుకోవాలని తాపత్రయపడేవాడు. హిందూధర్మంలో 3360 దేవుళ్ళు ఉన్నారని అతడికి తెలుసు. వారిలో అనేక మందిని అతడు పూజించేవాడు.

అశాంతి అనిపించునప్పుడల్లా అతను హిందూధర్మం గురించి మరింతగా తెలుసు కోవటానికి దగ్గరి గ్రంథాలయానికి వెళ్ళేవాడు. పెద్దల వద్ద అనేక విషయాలు నేర్చుకున్నా, ఇంకా నేర్చుకోవలసినవి అనేకం ఉన్నాయని అతను భావించేవాడు. అనేక మంది హిందూ ధర్మ పండితులూ, గురువులు తమకు తెలిసిన ధర్మజ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవటం లేదని, ఆ ధర్మజ్ఞానమే వారి జీవోపాధిగా మారటం వలన వారు దానిని ఇతరులకు బోధిస్తే, తమ జీవనాధారాన్ని కోల్పోతామేమోనని భయపడుతున్నారని అతడు భావించేవాడు.

చంద్ర తన తపనను సంతుష్టపరచే హిందూ ధర్మపు ఏ దైవగ్రంథాన్నీ గుర్తించలేక పోయాడు. హిందూధర్మం యొక్క మూలగ్రంథాలు సంస్కృతంలో ఉండటం వలన, వాటిని స్వయంగా చదివి అర్థం చేసుకోవటం ఒక కష్టమైన పని. వాటిని వేర్వేరు రచయితలు రచించారు. హిందూ ధర్మం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది అనే విషయమై వారిలో భిన్నాభి అభిప్రాయాలున్నాయి. భగవద్గీత (విష్ణు అవతారాల గురించి ఎక్కువగా ఉద్ఘాటిస్తున్నది), రామాయణం మరియు మహాభారతములు కూడా అంత స్పష్టంగా లేవు. ఈ దివ్యగ్రంథాలు ఎక్కువగా సాహిత్యగ్రంథాల వలే మంచి పనులు చేస్తూ, దేవుళ్ళను పూజించమని మాత్రమే బోధిస్తున్నాయి. ‘అసలు మూలదైవం ఆది పరాశక్తి అనబడే ఒక స్త్రీ దేవత, ఆవిడే మొత్తం విశ్వాన్ని నియంత్రిస్తున్నది’ అనేది నమ్మశక్యంకాని ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఇంకా హిందూధర్మపు అసలు సారాంశం ‘కేవలం ఉత్తమ పునర్జన్మ పొందటానికి ప్రయత్నించటం మరియు పాక్షికమైన దేవాంశ సంభూతుల ద్వారా దేవుడిని పూజించటం మరియు వేడుకోవటం మాత్రమే.’

ఈ సత్యాన్వేషణా సమయంలో, తోవ పైయోహ్ (Toa Payoh) ప్రాంతం వద్ద ఒక క్రైస్తవ సంఘసేవకుడు చంద్రకు దగ్గరయ్యాడు. సత్యమార్గాన్ని కనిపెట్టాలనే ఉద్దేశ్యంతో, అతడు కొంతకాలం క్రైస్తవులలో కలిసి పోయినాడు. అయితే, అతనికి క్రైస్తవమంటే ఇష్టముండేది కాదు. చర్చీలలో ప్రజల వ్యవహారం, ముఖ్యంగా యువతీయువకులు అసభ్యకర ప్రవర్తన అతనికి అస్సలు నచ్చేది కాదు. అతను వెతుకుతున్నది అక్కడ లేదనే విషయాన్ని గ్రహించిన తర్వాత, క్రైస్తవం నుండి తనను తాను ఉపసంహరించుకున్నాడు.

అనేక దేవుళ్ళను పూజించటానికి తనను తాను రాజీ చేసుకోలేక, అధ్యాత్మికంగా, ఒకే ఒక దేవుడిని ఆరాధించటం మొదలు పెట్టినాడు మరియు మిగిలిన దేవుళ్ళను భౌతికంగా మాత్రమే పూజలు చేసేవాడు. కాని ‘ఆ ఒక్క దేవుడు ఎవరు?’ అనేది అతనికి తెలియలేదు. అప్పుడప్పుడు చంద్రకు పూనకం వస్తూనే ఉండేది.

హిందూ ధర్మపు ఆరాధనల గురించి కూతూహలంగా అడిగే మలయ్ స్నేహితులు చంద్ర చుట్టుప్రక్కల ఎక్కువగా ఉండేవారు. వారు అతనికి ఇస్లాం గురించి వివరించలేక పోయేవారు. కాని, అతని వలే అనేక దేవుళ్ళను కాకుండా వారు కేవలం ఒకే ఒక దేవుడిని మాత్రమే ఆరాధిస్తారని చంద్రకు తెలిపేవారు. ఇలా కలిసిమెలసి పనిచేస్తున్న స్నేహితులకు చంద్ర నాయకత్వం వహించేవాడు. మధ్యాహ్నపు దొహర్ నమాజు చేయటానికి మలయులు వెళ్తున్నప్పుడు, తను కూడా వారితో కలిసి వెళ్ళేవాడు. వారు నమాజు చేసే వరకు నిరీక్షిస్తూ, ఆ సమయంలో తనకు సన్మార్గం చూపమని నిశ్శబ్దంగా మనస్సులోనే దేవుణ్ణి ప్రార్థించేవాడు.

అదాన్ పలుకులు చంద్రాకు ఎంతో నచ్చేవి, అతనికి ఎంతో ఉపశాంతి కలిగించేవి మరియు అతని మనస్సును గాఢంగా హత్తకుపోయేవి. అంతేకాక అతని స్నేహితులు మరియు ఇతరులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయక పాల్గొనే అదాన్ తర్వాతి ప్రార్థన (నమాజు) అతనికి ఇంకా ఎక్కువగా నచ్చేది. నిజమైన దైవాన్ని గుర్తించటం చాలా సులభమని, “కేవలం ఆయన్ను మాత్రమే ఆరాధిస్తే సరిపోతుంది. ఇంతమంది దేవుళ్ళను మరియు మధ్యవర్తులను ఆరాధించనక్కరలేదు” అనే అభిప్రాయం అతనిలో బలంగా నాటుకో సాగింది. అతను వెతుకుతున్న దేవుడు అల్లాహ్ యేనని మరియు ఆ స్వచ్ఛమైన జీవనవిధానం ఇస్లాం ధర్మమే ననే విషయాన్ని తెలుసుకోవటానికి ఇక అతనికి ఎక్కువ కాలం పట్టలేదు.

వారి వివాహం తర్వాత కూడా ఇంద్రాణి దేవాలయపు కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూనే ఉండేది. తన కంటే ఎక్కువ భక్తిపరుడైన తన భర్త మాటిమాటికీ ఏకైక దేవుడి గురించి చర్చించటం, ఒకే దైవాన్ని ఆరాధించటం, ‘సత్యధర్మంలో అనేక దేవుళ్ళుండరు’ అని అంటూ ఉండటం ఆవిడకు చాలా ఆశ్చర్యం కలిగించేది. ఆవిడ అత్తగారు భక్తిపరుడైన తన కుమారుడు దేవుళ్ళపై ఆగ్రహంతో ఉన్నాడని భావించినది.

వివాహం తర్వాత కూడా చంద్ర తన సత్యాన్వేషణను కొనసాగించినాడు. అధ్యాత్మికంగా తను ఆరాధిస్తున్న ఆ ఏకైక దైవాన్ని హిందూ ధర్మంలో సీరియస్ గా వెతకటం మొదలెట్టినాడు. దేవాలయపు కార్యక్రమాలలో ఆసక్తి చూపటం మానివేశాడు. పూనకం రావటం కూడా ఆగిపోయినది. చంద్రాపై దుష్టశక్తులు ఆవరించటం వలన అతని ప్రవర్తనలో మార్పు వచ్చినదని పూనకం స్థితిలో అతని తల్లి చెప్పినది.

ఇస్లాం ధర్మంలో దేవుడు ఒక్కడే అనే విషయం తప్పించి, చంద్రాకు ఇస్లాం గురించి మరేమీ తెలియదు. జపమాలతో అతడు ప్రతిరోజు ధ్యానం చేసేవాడు. సాధారణంగా అతడు దేవుడి వివిధ పేర్లను జపించేవాడు. కాని, ఇప్పుడు అతడు ఆ పేర్లను జపించినప్పుడు, ఏదో తప్పు చేస్తున్నట్లు భావించసాగాడు. కాబట్టి ఇంగ్లీషులో “Almighty God, Almighty God...” అని జపించటం మొదలు పెట్టినాడు. అలా ధ్యానం చేస్తున్నప్పుడు, సత్యమైన దేవుడినే ముస్లింలు ఆరాధిస్తున్నారనే భావనలు అతనిలో కలిగేవి.

ఇస్లాం ధర్మాన్ని అనుసరించటానికి తను చేస్తున్న ప్రయత్నాలకు ఇంద్రాణీ ఒక పెద్ద ఆటంకంగా మారినది. ఆవిడకు ముస్లింలు అంటే అయిష్టం. ఇంకా దేవాలయపు పనులలో ఆవిడ క్రియాత్మకంగా పాలుపంచుకునేది. “పెడోమన్” వంటి మలేషియన్ ఇస్లామీయ టి.వీ. కార్యక్రమాల ద్వారా అతడు తన భార్యను ఇస్లాం బోధనలతో ప్రభావితం చేయటానికి ప్రయత్నించేవాడు. అయితే “మీరు ఇస్లాం ధర్మం పై మరీ అంత శ్రద్ధ చూపవలసిన అవసరం లేదని” ఆవిడ తన భర్తకు తెగేసి చెప్పేది. దీనినే అవకాశంగా తీసుకుని అతను “హిందూ ధర్మంలో నాకు ఇక విశ్వాసం కలగటం లేదు. దీనికి కారణం – హిందూ ధర్మానికి ఒక పవిత్ర గ్రంథమంటూ ఏదీ లేదు మరియు హిందూ ధర్మ సిద్ధాంతాలకు మూలాధారం లేనే లేదు.” అని ఆవిడతో అన్నాడు. ‘హిందూ ధర్మం అనేది పూర్తిగా మన పూర్వీకుల సంప్రదాయాల, ఆచారవ్యవహారాల నుండి రూపొందిన ఒక సంక్లిష్ట సామాజిక వ్యవస్థ మాత్రమే’ అనే జవాబు తప్ప ‘హిందూ ధర్మం ఎలా ఆరంభమైంది?’ అనే పరిశోధనకు వేరే సమాధానమేమీ లభించదు.

ఇక ఆలస్యం చేయక, అతను యూసుఫ్ అలీ అనువదించిన ఖుర్ఆన్ భావం యొక్క అనువాదాన్ని తెచ్చుకున్నాడు. అందులోని ప్రవక్తల గురించిన, మానవజాతి ఆరంభం గురించిన మరియు స్వర్గనరకాల గురించిన విషయాలు అతని మనస్సుపై చెరగని ముద్ర వేసాయి. ప్రతి మానవుడూ తప్పక తెలుసుకోవలసిన అనేక విషయాలను అతను కనుగొన్నాడు. ఇంద్రాణీని కూడా ఖుర్ఆన్ భావం చదవమని ప్రోత్సహించసాగాడు. విగ్రహారాధకులు నరకాగ్నిలో విసిరివేయబడతారనే విషయాన్ని చదివిన తరువాత, తమ ఇంటిలోని దేవుడి విగ్రహాలన్నింటినీ మరియు చిత్రపటాలన్నింటినీ తొలగించివేసినాడు.

వివిధ మార్గాల ద్వారా ఇస్లాం ధర్మం గురించి నేర్చుకోవటంలో చంద్ర ఇప్పుడు తన దృష్టిని ఎక్కువగా కేంద్రీకరించసాగాడు. ఇప్పుడతను తన మలయా స్నేహితుల ద్వారా ఇస్లాం గురించి వీలయినంత ఎక్కువగా నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే, వారు అతని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక పోయేవారు. ఎవరైనా మంచి ఇస్లామీయ పండితుడిని సంప్రదించమని వారు అతనికి సలహా ఇచ్చేవారు.

ఇస్లాం, క్రైస్తవం, సిక్కుమతం మరియు హిందూత్వం గురించిన పుస్తకాలను చంద్ర తన ఇంటికి తీసుకురావటం మొదలు పెట్టినాడు. వాటిని చదివి, వివిధ ధర్మాలలోని మంచి చెడులను పోల్చమని అతడు తన భార్యకు చెప్పగా, ఇంద్రాణీ ఆసక్తి చూపలేదు. ఆవిడ తన విశ్వాసాలలో మరియు హిందూ ధర్మంలో పూర్తి సంతృప్తిని పొందేది. “ఏక దైవత్వం గురించిన అతని అభిప్రాయాలు తనను అస్సలు ప్రభావితం చేయజాలవు” అని ఆవిడ తనలో తాను దృఢంగా భావించేది. అతడిని తప్పకుండా తన దారిలోనికి మరల తీసుకురావటానికి గట్టిగా ప్రయత్నించాలని మనస్సులో శపథం చేసుకున్నది కూడా.

భర్త ఇంటికి తెచ్చే పుస్తకాలను చదవాలనే ఉద్ధేశ్యం ఆవిడలో కలిగేది కాదు. కానీ, రాత్రివేళల్లో ఒక్కోసారి నిద్రపట్టనప్పుడు, ఏదో శక్తి ఆవిడను ఖుర్ఆన్ చేతిలోనికి తీసుకుని, దానిని చదివేలా చేసేది. నిద్రపట్టని అనేక రాత్రులలో తరచుగా, ఆవిడ ఖుర్ఆన్ చేతిలోనికి తీసుకుని, చదువుతూ ఉండేది. ఇంటిలో నుండి తన భర్త దేవీదేవతలన్నింటినీ తొలగించటం వలన వాటికి పూజలు చేయలేక, ఏదో కోల్పోయినట్లుగా ఆవిడ భావించేది.

ఇలా రోజులు గడుస్తుండగా, ఇంద్రాణీకి కలలు రావటం మొదలైనవి. తన మొదటి గర్భంలో ఆవిడకు కాబాగృహపు కల వచ్చినది. ఆవిడ తన కలను ఒక ముస్లిం స్నేహితుడికి తెలుపినది. కాబాగృహపు కల రావటం శుభసూచకమని అతను ఆవిడకు తెలిపినాడు.

అప్పుడప్పుడు హిందూ ధర్మపు దేవుళ్ళు ఆవిడను హెచ్చరిస్తున్నట్లుగా, బెదిరిస్తున్నట్లుగా కూడా కలలు వచ్చేవి. అయితే, ఇస్లాం గురించిన కలలు మరియు ముస్లిం పుణ్యపురుషుల గురించిన కలలు అధికంగా వచ్చేవి. ఆవిడ విగ్రహ పూజలను కొనసాగిస్తున్నా, తన కలల గురించి ఆశ్చర్యపడుతుండేది. మూడో కాన్పు కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఆవిడకు మరొక వింతైన కల వచ్చినది. కలలో తెరచి ఉన్న పడకగది కిటికీ నుండి “నేను ముహమ్మద్, అల్లాహ్ యొక్క సందేశహరుడిని. నా మార్గాన్ని అనుసరించు మరియు అన్ని దుష్ట శక్తులూ నిన్ను విడిచిపెడతాయి. ఇంకా ఎక్కువగా తెలుసు కోవాలనుకుంటే, నీ భర్తను అడుగు.” అనే పలుకులను ఆవిడ విన్నది.

ఈ కల తర్వాత ఆవిడ నిద్రలో నుండి మేల్కొన్నది. కానీ, వెంటనే ఆవిడకు మరల నిద్ర పట్టి ఇంకో కల వచ్చినది. ఆ కలలో కనబడిన దృశ్యం ఇలా ఉన్నది - “ఆవిడ తన భర్తకు తన మొదటి కల గురించి వివరిస్తూ, ఆ మార్గం ఏది? అని ప్రశ్నించగా, అతను కిటికీ వైపు చూడమని చెప్పినాడు. అప్పుడు కిటికీలో నుండి బయటకు చూడగా, ఆవిడకు ‘అరబ్బుల దుస్తులు ధరించిన కొందరు యూసుఫ్ ఇస్లాం అనే వ్యక్తి చుట్టూ గుమిగూడి ఉండగా, యూసుఫ్ ఇస్లాం కూడా అరబ్బుల దుస్తుల వంటివే ధరించి, వారికి ఇస్లాం గురించి బోధిస్తుండటం.’” కనబడినది. అయితే యూసుఫ్ ఇస్లాం అనే వ్యక్తిని ఆవిడ ఏనాడూ చూసి ఉండలేదు, కానీ ఆయన గురించి మాత్రం విన్నది. అయితే ఎలాగోలా ఆవిడ కలలో అతనిని గుర్తించినది.

ఈ కలలు ఇంద్రాణీ యొక్క సిద్ధాంతాలపై తీవ్రమైన ప్రభావం చూపినాయి. ఆవిడ ఇస్లాం వైపు వేగంగా రావటం మొదలెట్టినది. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గాన్నే అనుసరించాలని ఆవిడ దృఢంగా నిర్ణయించుకున్నది. ఇస్లాం స్వీకరించాలనుకుని కూడా, తన మూడో కాన్పు గురించి భయపడటాన్ని ఆవిడ జ్ఞప్తికి తెచ్చుకున్నది. కలలో ఆ హిందూ దేవుళ్ళు బెదిరించినట్లు, తనకు కలగబోయే బిడ్డ పై ఏదైనా ఆపద వచ్చిపడుతుందేమోనని ఆవిడ భయపడసాగింది. అయితే కాన్పు అవగానే, ఇస్లాం స్వీకరించటానికి తను తయారుగా ఉన్నట్లు ఆవిడ తన భర్తకు తెలిపినది.

సింగపూరులోని క్రొత్తగా ఇస్లాం స్వీకరించిన వారి సంఘం ‘దారుల్ అర్ఖమ్’ గురించి వారికి తెలియజేయబడినది. అక్కడ ప్రజలు తాము ఇస్లాం ధర్మాన్ని పున: స్వీకరించినట్లు నమోదు చేసుకోవచ్చు. అది ఏదైనా అపరిచిత వర్గాలకు చెందినదేమోననే అభిప్రాయం వలన అక్కడ నమోదు చేసుకోవటాన్ని చంద్ర ఆరంభంలో తిరస్కరించినాడు. అప్పుడు వారు జామియా అనే (Islamic Theological Society of Singapore) సంస్థ వద్దకు చేరుకుని, అక్కడ ఇస్లాం స్వీకరించి, తమ పేర్లను ముహమ్మద్ రఫీఖ్ మరియు నిషానీ గా నమోదు చేసుకున్నారు.

తమ ఇస్లాం స్వీకరణను ప్రకటించగానే, వారు అనేక ఇబ్బందులకు గురైనారు. ముఖ్యంగా ఇంద్రాణీ బురఖా ధరించటం మొదలెట్టగానే ఈ కష్టాలు మరీ తీవ్రమైనవి. వారిని ఎంతగానో ప్రేమించే తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులు మరియు స్నేహితులు ముఖం చాటు చేసుకోసాగారు. ఇంద్రాణీ తమను ఇస్లాం వైపు మళ్ళించటంలోనూ సఫలమవు తుందేమోననే భయంతో, ఆవిడ హిందూ ధర్మం వైపు దారి చూపిన అనేక మంది స్నేహితులు ఏ విషయాన్నీ ఇప్పుడు ఆవిడతో పాలుపంచుకోవటానికి వెనుకాడసాగారు. ఇంద్రాణీ ఇస్లాం స్వీకరించటంలో వారి ఆశ్చర్యానికి ముఖ్యకారణం - వారందరికంటే అధికంగా ఆవిడే ముస్లింలపై అయిష్టం చూపేది. ఒకరి కంటే ఎక్కువ భార్యలను పెళ్ళి చేసుకోవాలనే రహస్యాలోచనలో చంద్రా ఉండి ఉండవచ్చునని ఆవిడ తల్లి హెచ్చరించినది కూడా.

ఇంద్రాణీ మరియు ఆవిడ భర్త వారి తల్లిదండ్రులచే బహిష్కరింపబడినారు. బాల్యం నుండి లభిస్తుండిన ప్రేమానురాగాలు వారికి దూరమయ్యాయి. ఏకైక దేవుడైన అల్లాహ్ తనపై చూపుతున్న ప్రేమతో పోల్చితే, కుటుంబానికి దూరమవటం ద్వారా తాను చేస్తున్న త్యాగం చాలా స్వల్పమైనదని ఇంద్రాణీ తరచుగా తనకు తానే సమాధానపరచుకునేది. భగవంతుడి కంటే అధికంగా తననెవ్వరూ ప్రేమించలేరని ఆవిడ నమ్మసాగినది.

హిందూధర్మంలోని పెద్దలు మరియు గురువులు చంద్రను తిరిగి హిందూత్వంలోనికి తీసుకురావటానికి చాలా కృషి చేసినారు, కానీ అతను వారిని సున్నితంగా తిరస్కరించగా, వారతనిని తీవ్రంగా ఇబ్బంది పెట్టినారు. ఆవిడ పిల్లలు నిషా, నఫీసా మరియు నటాషాలు పెద్దవారైన తరువాత, వారిని మరల హిందూత్వంలోనికే తెచ్చుకుంటామని ఇంద్రాణీ యొక్క కుటుంబం శపథం చేసినది కూడా. తమ మనుమల ముస్లిం పేర్లను వారు గుర్తించలేదు. ఏదేమైనా, ఇప్పుడు పిల్లలు మదరసాలో (ఇస్లామీయ పాఠశాలలో) చదువుకుంటూ, తమ ఇస్లాం ధర్మాన్ని అమితంగా ఇష్టపడుతున్నారు. వయస్సులో ఇంకా చిన్నవారైనప్పటికీ అలవాటు కావాలనే ఉద్దేశ్యంతో తమ పిల్లలు బురఖా ధరించేలా చంద్ర ప్రోత్సహిస్తున్నాడు. పిల్లలు బురఖాను అమితంగా ఇష్టపడటాన్ని మరియు దానిని తొలగించటాన్ని వారే స్వయంగా నిరాకరించటాన్ని ఆ దంపతులు గమనించి అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతోషపడినారు.

తమ తమ కుటుంబాలచే బహిష్కరింపబడినా, చంద్రా మరియు ఇంద్రాణీలు వారితో బాంధవ్యాన్ని మరల నెలకొల్పుకోవటానికి తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నేడు, చంద్రా మరియు ఇంద్రాణీల తల్లులు తమ తమ కూమారుడూ, కుమార్తే ఎటువంటి తప్పూ చేయలేదని, వారు బాధ్యత గల పిల్లల వలే ప్రవర్తిస్తున్నారని అంగీకరించినారు. అల్హందులిల్లాహ్.