×
మంచిని ఆదేశించటం మరియు చెడును నివారించటం గురించిన ఆదేశాలు, విశిష్ఠతలు, వాస్తవాలు, ప్రాముఖ్యతలు, షరతులు, మానవ హక్కుల గుర్తుంచుకోవటం – మొదలైన విషయాలు మదీనా మస్జిదు ఇమాం గారు ఈ శుక్రవారపు ఉపన్యాసంలో ప్రజల ఎదుట ప్రసంగించినారు.

    మంచిని ఆదేశించండి & చెడును నివారించండి

    ﴿ الأمر بالمعروف والنهي عن المنكر ﴾

    ] తెలుగు – Telugu – تلغو [

    ٍఖతీబ్ : షేఖ్ అలీ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్ హుదైఫీ

    అనువాదం : షేఖ్ అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్

    పునర్విమర్శ : ముహమ్మద్ కరీముల్లాహ్

    2010 - 1431

    ﴿ الأمر بالمعروف والنهي عن المنكر ﴾

    « باللغة التلغو »

    الشيخ علي بن عبد الرحمن الحذيفي : الخطيب

    ترجمة: أبو أنس محمد نسير الدين

    مراجعة: محمد كريم الله

    2010 - 1431

    మంచిని ఆదేశించండి మరియు చెడును నివారించండి

    28 సఫర్ 1431హి (12 ఫిబ్రవరీ 2010) శుక్రవారం మస్జిదె నబవీ, మదీనాలో ఖతీబ్ ఇమాం షేఖ్ అలీ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్ హుదైఫీ అరబీబాషలో చేసిన జుమా ఖుత్బా ప్రసంగం యొక్క తెలుగు అనువాదం

    ‘మంచిని ఆదేశించండి మరియు చెడును నివారించండి’ అనే ఇస్లామీయ ఆదేశం యొక్క ప్రాధాన్యత మరియు ఆవశ్యకత

    ملخص الخطبة

    1 فريضة الأمر بالمعروف والنهي عن المنكر. 2 فضل الآمرين بالمعروف والناهين عن المنكر. 3 بيان حقيقة المعروف والمنكر 4 أهمية الأمر بالمعروف والنهي عن المنكر. 5 من شروط الأمر بالمعروف والنهي عن المنكر وآدابه .6 التذكير بحقوق الأخوة

    ఖుత్బా ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

    1. ‘మంచిని ఆదేశించండి మరియు చెడును నివారించండి’ గురించి మనపై ఉన్న బాధ్యత, కర్తవ్యం, ధర్మం మరియు విధి.

    2. ‘మంచిని ఆదేశించండి మరియు చెడును నివారించండి’ యొక్క శుభాలు.

    3. ‘మంచి - చెడు’ గురించిన వాస్తవ విషయాలు.

    4. ‘మంచిని ఆదేశించండి మరియు చెడును నివారించండి’ యొక్క ప్రాముఖ్యత

    5. ‘మంచిని ఆదేశించండి మరియు చెడును నివారించండి’ యొక్క షరతులు.

    6. మానవ సోదరులపై ఉన్న పరస్పర హక్కుల ప్రస్తావన

    మొదటి ఖుత్బ: (అల్లాహ్ స్తోత్రములు, ప్రవక్తపై దయా, కరుణల దుఆ తర్వాత).

    అల్లాహ్ తో భయపడవలసిన విధంగా భయపడండి. ఆయన స్వర్గం మరియు సంతృప్తి పొందడానికి పరుగెత్తండి.

    يَا أَيُّهَا النَّاسُ اتَّقُواْ رَبَّكُمُ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاء وَاتَّقُواْ اللّهَ الَّذِي تَسَاءلُونَ بِهِ وَالأَرْحَامَ إِنَّ اللّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا[النساء: 1]

    ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి, దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతోమంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయ పడండి. ఎవరి పేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్ కు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మీపై నిఘా వేసి ఉన్నాడు”. (అన్నిసా 4:1)

    يَا أَيُّهَا الَّذِينَ آمَنُواْ اتَّقُواْ اللّهَ حَقَّ تُقَاتِهِ وَلاَ تَمُوتُنَّ إِلاَّ وَأَنتُم مُّسْلِمُونَ [آل عمران: 102].

    ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “విశ్వాసులారా! అల్లాహ్ కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి, ముస్లింలుగా తప్ప మరణించకండి” (ఆలె ఇమ్రాన్ 3:102).

    ఓ ముస్లిములారా! మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించి ఉన్నారు:

    ((إن اللهَ فرَض فرائضَ فلا تضيِّعوها، وحدَّ حُدودًا فلا تعتَدوها، وحرَّم أشياءَ فلا تنتَهِكوها، وسكَت عن أشياء رحمةً لكم غيرَ نسيانٍ فلا تبحَثوا عنها))

    అనువాదం: ““నిశ్చయంగా అల్లాహ్ కొన్ని విధులను విధించినాడు, మీరు వాటిని వృధా చేయకండి. (తప్పక పాటించండి). కొన్ని హద్దులు నిర్ణయించాడు, మీరు వాటిని అతిక్రమించకండి. కొన్నింటిని నిషిద్ధపరిచాడు, మీరు వాటిని ఉల్లఘించకండి. (పాల్పడకండి). మరికొన్ని విషయాల పట్ల మౌనం వహించినాడు - మరచిపోయి కాదు, మీపై దయతలచి మాత్రమే. కాబట్టి మీరు వాటిని వెతక్కండి”[1].”

    అల్లాహ్ తన దాసులపై విధించిన వాటిలోని ఒక విధి – ‘మంచిని గురించి ఆదేశించటం మరియు చెడు నుండి వారించటం’. అందులో ఇహలోక సంబంధమైన మరియు పరలోక సంబంధమైన, సామాన్యమైన మరియు విశేషమైన శుభాలన్నీ ఉన్నాయి. దీని వలన అన్నిరకాల చెడులు, సంక్షోభాలు, శిక్షలు మరియు విపత్తులు దూరమవుతాయి. అల్లాహ్ యొక్క ఈ ఆదేశాన్ని చదవండి.

    وَلْتَكُن مِّنكُمْ أُمَّةٌ يَدْعُونَ إِلَى الْخَيْرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَأُوْلَـئِكَ هُمُ الْمُفْلِحُونَ [آل عمران: 104]

    “ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “శుభం వైపుకు పిలిచే, మంచిని చెయ్యమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పనిని చేసే వారే సాఫల్యాన్ని పొందుతారు”. (ఆలె ఇమ్రాన్ 3:104).

    كُنتُمْ خَيْرَ أُمَّةٍ أُخْرِجَتْ لِلنَّاسِ تَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَتَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَتُؤْمِنُونَ بِاللّهِ [آل عمران: 110]

    ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “మానవుల (శ్రేయస్సు) కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన శ్రేష్ఠసమాజం మీరు. మీరు మంచి విషయాలకై ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి ఆపుతారు, ఇంకా మీరు అల్లాహ్ ను విశ్వసిస్తారు”. (ఆలె ఇమ్రాన్ 3:110).

    ఉమర్ రదియల్లాహు అన్హు ఇలా పలికినారు: ‘ప్రవక్త ముహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాజంలో ఒక వ్యక్తిగా కావాలని కోరే మనిషి ఇందులో తెలుపబడిన షరతును పూర్తి చెయ్యాలి’. అదే – ‘‘మంచిని ఆజ్ఞాపించడం, చెడును వారించడం’.’

    అల్లాహ్ విశ్వాసుల సుగుణాల్ని తెలుపుతూ ఇలా పలికినాడుః

    وَالْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بَعْضُهُمْ أَوْلِيَاء بَعْضٍ يَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَيُقِيمُونَ الصَّلاَةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَيُطِيعُونَ اللّهَ وَرَسُولَهُ أُوْلَـئِكَ سَيَرْحَمُهُمُ اللّهُ إِنَّ اللّهَ عَزِيزٌ حَكِيمٌ [التوبة: 71].

    “ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు, జకాత్ ను చెల్లిస్తారు. అల్లాహ్ కు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్ అతి త్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహంగా అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేచనాశీలి”. (తౌబా 9: 71).

    పూర్వం గ్రంథం ఇవ్వబడినవారిలో, ఎవరైతే ఏమాత్రం మార్పులు చేర్పులకు గురి కాని తమ (నిజ) ధర్మాన్ని అవలంభిస్తూ, ఎలా మంచిని ఆజ్ఞాపిస్తూ, చెడును నివారిస్తూ ఉండేవారో, వారిని గురించి సైతం అల్లాహ్ తన దివ్య గ్రంథంలో ఇలా ప్రశంసించాడుః

    لَيْسُواْ سَوَاء مِّنْ أَهْلِ الْكِتَابِ أُمَّةٌ قَآئِمَةٌ يَتْلُونَ آيَاتِ اللّهِ آنَاء اللَّيْلِ وَهُمْ يَسْجُدُونَ يُؤْمِنُونَ بِاللّهِ وَالْيَوْمِ الآخِرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَيُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَأُوْلَـئِكَ مِنَ الصَّالِحِينَ [آل عمران: 113، 114].

    “ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “వారంతా ఒకలాంటి వారు కారు. ఈ గ్రంథవహులలోని ఒక వర్గం వారు (సత్యంపై) నిలకడగా ఉన్నారు. వారు రాత్రి సమయాల్లో కూడా దైవవాక్యాలను పారాయణం చేస్తారు, సాష్టాంగపడతారు. అల్లాహ్ ను, అంతిమ దినాన్ని కూడా వారు విశ్వసిస్తారు. మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. సత్కార్యాల కోసం పరస్పరం పోటీపడతారు. వీరు సజ్జనుల కోవకు చెందినవారు”.(ఆలే ఇమ్రాన్ 3:113-114)

    ‘మంచి’’ అంటే ఇస్లాం ఆదేశించిన ప్రతి కార్యమూ; అది తప్పనిసరైన విధి కార్యమైనా లేదా అభిలషణీయమైన కార్యమైనా సరే. ఇహపరాలలో ఖచ్చితంగా మేలు కలిగించేవి తప్ప మరే ఆదేశాల్నీ ఖుర్ఆన్ మరియు హదీథులు ఇవ్వవు. ఇంకా అనుగ్రహాలతో నిండిన స్వర్గవనాలలో ప్రవేశం కొరకు అల్లాహ్ వేటిని అర్హతలుగా చేశాడో, వాటిని గురించి తప్ప మరే ఆదేశమూ ఇవ్వవు.

    ‘చెడు’’ అంటే ఇస్లాం నిషేధించిన ప్రతి కార్యమూ, అది నిషిద్ధమైన కార్యమైనా లేదా అవాంఛనీయమైన కార్యమైనా సరే. ఇహపరాల్లో ఖచ్చితంగా చెడుకు గురి చేసే కార్యాన్నే ఇస్లాం నిషేధిస్తుంది. అలాగే నరకానికి చేర్చే కారణాలనే నిషేధిస్తుంది.

    రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారని హుజైఫా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

    ((وَالَّذِي نَفْسِي بِيَدِهِ لَتَأْمُرُنَّ بِالْمَعْرُوفِ وَلَتَنْهَوُنَّ عَنْ الْمُنْكَرِ أَوْ لَيُوشِكَنَّ اللَّهُ أَنْ يَبْعَثَ عَلَيْكُمْ عِقَابًا مِنْهُ ثُمَّ تَدْعُونَهُ فَلَا يُسْتَجَابُ لَكُمْ))

    అనువాదం: ““నా ప్రాణం ఎవరి చేతులో ఉందో ఆయన సాక్షి! మీరు తప్పకుండా మంచిని గురించి ఆదేశించండి మరియు తప్పకుండా చెడు నుండి నివారించండి, లేదా అల్లాహ్ తన వైపు నుండి ఓ విపత్తును మీ కురిపింపజేస్తాడు, అప్పుడు మీరు ఆయనను అర్థించినా (దుఆ చేసినా) మీ అర్థింపు అంగీకరించబడదు”[2].”

    విశ్వాసుల సుగుణాల్ని తెలుపుతూ అల్లాహ్ ఇలా తెలిపాడుః

    وَالْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بَعْضُهُمْ أَوْلِيَاء بَعْضٍ يَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ [التوبة: 71].

    ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు”. (తౌబా 9:71).

    కొందరు ధర్మవేత్తలు ఇలా తెలిపారుః మంచిని గురించి ఆజ్ఞాపించడం, చెడు నుండి నివారించడం అనేది ఇస్లాం మూల స్తంభాలలో ఒకటి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా బోధించారని హజ్రత్ అబూ సఈద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

    ((مَنْ رأَى منكم منكرًا فليِّغيره بيده، فإن لم يستطع فبلِسانه، فإن لم يستطع فبقَلبه، وذلك أضعفُ الإيمان))

    అనువాదం: “““మీలో ఎవరైనా ఏదైనా చెడును చూస్తే తన చేతితో దానిని ఆపాలి ఆ శక్తి లేకుంటే తన నాలుకతో, ఆ శక్తి కూడా లేకుంటే (కనీసం) మనస్సులో (దానిని చెడుగా భావించి దానికి దూరంగా ఉండాలి, ఈ చివరిది) విశ్వాసం యొక్క అతిబలహీనమైన స్థితి”[3].”

    మరో ఉల్లేఖనలో ఇలా ఉందిః ప్రళయదినాన ఒక వ్యక్తి మరో వ్యక్తిని పట్టుకుంటాడు. కానీ, అతను విడిపించుకుంటూ ‘దూరంగా వెళ్ళిపో! నీ మీదా, నీ భార్యాపిల్లల మీదా, నీ ధనసంపదల-మానమర్యాదల మీదా నేను ఏ అన్యాయమూ చేయలేదు.’’ అని అంటాడు. అతడిని పట్టుకున్న వ్యక్తి అప్పుడు ‘‘నీవు నన్ను పాపంలో, తప్పులో పడి ఉండటం చూసి కూడా నన్ను నివారించలేదు’ అని అతడ్ని దుయ్యబెడతాడు.

    మంచిని ఆదేశించే వ్యక్తి తాను ఆదేశిస్తున్న మంచి విషయం ‘ఇస్లాం ధర్మం ఆదేశించినదేనా – కాదా’ అనేది ముందుగా నిర్థారణ చేసుకోవాలి. అలాగే ఏ చెడు నుండి నివారిస్తున్నాడో దానిని ‘ఇస్లాం నివారించిందా - లేదా’ అనేది నిర్థారణ చేసుకోవాలి. అందుకై అతను పూర్తి అవగాహనతో ప్రామాణిక నిదర్శనాలను మరియు ఆధారాలను అనుసరించాలి. అంతేకాక మంచిని ఆదేశించే మరియు చెడు నుండి నివారించే వ్యక్తి వివేకవంతుడై ఉండాలి. ఆ వివేకం స్వభావికంగా అతనికి అబ్బినదైతే అల్ హందులిల్లాహ్, లేనిచో అతను దానిని ఇతరుల నుండైనా నేర్చుకోవాలి. దేని గురించి ఆదేశిస్తున్నాడో, నివారిస్తున్నాడో ముందుగా దానిని స్వయంగా అర్థం చేసుకొని ఉండాలి. ఎందుకనగా దేనిని ఆధారంగా చూపుబోతున్నాడో అది దానికి తగినదై ఉండాలి, ప్రామాణికమైనదై ఉండాలి. సర్వ వ్యవహారాల్లో, స్థితిగతుల మార్పులో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాల నుండి సరియైన విధానాన్ని కనుగొన గలగాలి. ఈ ఆదేశమే అల్లాహ్ మనకు ఇచ్చాడుః

    ادْعُ إِلِى سَبِيلِ رَبِّكَ بِالْحِكْمَةِ وَالْمَوْعِظَةِ الْحَسَنَةِ وَجَادِلْهُم بِالَّتِي هِيَ أَحْسَنُ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ [النحل: 125].

    ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “నీ ప్రభువు మార్గం వైపు జనులను వివేకంతోనూ, చక్కని ఉపదేశంతోనూ పిలువు, అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు, నిశ్చయంగా తన మార్గం నుండి తప్పినవాడెవడో నీ ప్రభువుకు బాగా తెలుసు, సన్మార్గాన ఉన్నవాడెవడో కూడా ఆయనకు బాగా తెలుసు”. (అన్నహ్ల్ 16:125).

    మంచిని గురించి ఆజ్ఞాపించడం, చెడు నుండి నివారించడం అనేది విధులను, మర్యాదలను కాపాడుతుంది. చెడును, దుశ్చేష్టలను అడ్డుకొంటుంది. అంటే అది ఎప్పుడు ప్రక్కకు జరిగిపోతుందో, లేదా దానిని ప్రక్కన పెట్టేయడం తరుచుగా జరుగుతుందో, అప్పడు సమాజంలో అన్నిరకాల చెడులు, అసత్యాలు వ్యాపించుతూ పోతాయి.

    చేతి శక్తితో చెడును అడ్డుకొనడం అనేది అధికార పీఠంలో ఉన్నవారి పని లేదా వారికి కుడి భుజంగా ఉన్నవారి పని.

    నాలుకతో అడ్డుకొనడం అనేది వివేకంతో కూడిన పని. చెడును మానుకోవడంలోని లాభాలను, విడనాడకుంటే ఎదురయ్యే నష్టాలను, విపత్తులను వివరిస్తూ, మంచిగా నచ్చచెప్పడం ద్వారా అడ్డుకొనడం, ఆపడం ఆ చెడు గురించి గల అల్లాహ్ ఆదేశాలు తెలిసిన వ్యక్తి పని.

    ఇక మనస్సులోనైనా చెడుగా భావించి చెడు విషయాలకు దూరం ఉండడమనేది ప్రతి ఒక్కరి పని.

    ‘మంచిని గురించి ఆజ్ఞాపించడం, చెడు నుండి నివారించడం’ అనే రెండు పనులు ఎల్లప్పుడూ కలిసే ఉండును, అవి రెండూ వేర్వేరు కావు, వాటిని అస్సలు వేర్వేరు చేయకూడదు. ఎవరైనా మంచిని ప్రేమించి చెడును అసహ్యించుకోకుంటే అతను ఓ విధిలో వెనుక బడిపోయాడు. అలాగే ఎవరైనా మంచిని గురించి ఆదేశించి, చెడు నుండి నివారించకపోతే అతను మరో విధిని విడనాడినట్లే. ఎవరైనా చెడు నుండి నివారించి మంచిని ప్రేమించకుంటే అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతికి విరుద్ధంగా చేసినట్లే. అందుకు మంచిని గురించి ఆదేశించడంతో పాటు దాని పట్ల ప్రేమ కలిగి ఉండడం, చెడు నుండి నివారించడంతో పాటు దాని పట్ల అసహ్యం కలిగి ఉండడం తప్పనిసరి. కొందరు పుణ్యపురుషులు తెలిపారుః ‘ఎవరైతే మంచిని గురించి ఆజ్ఞాపిస్తాడో మరియు చెడు నుండి నివారిస్తాడో అతను అల్లాహ్ యొక్క ఈ ఆయతులను గుర్తుకు తెచ్చుకోవాలి’:

    أَتَأْمُرُونَ النَّاسَ بِالْبِرِّ وَتَنسَوْنَ أَنفُسَكُمْ وَأَنتُمْ تَتْلُونَ الْكِتَابَ أَفَلاَ تَعْقِلُونَ [البقرة: 44]

    ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “మీరు ప్రజలకైతే మంచిని గురించి ఆదేశిస్తారు, కాని స్వయంగా మీరే (అవలంబించడం) మరచి పోతారెందుకు?”. (అల్ బఖర 2:44).

    అలాగే షుఐబ్ అలైహిస్సలాం గురించి తెలిపిన ఈ ఆయతుః

    وَمَا أُرِيدُ أَنْ أُخَالِفَكُمْ إِلَى مَا أَنْهَاكُمْ عَنْهُ [هود: 88]

    ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “ఏ విషయాలను మానుకోమని మిమ్మల్ని గట్టిగా చెబుతున్నానో వాటి వైపుకు నేను స్వయంగా మొగ్గిపోయే ఉద్దేశం నాకు లేనేలేదు”. (హూద్ 11:88).

    అలాగే ఖుర్ఆన్ లో మరోచోట తెలిపిన అల్లాహ్ యొక్క ఈ ఆదేశం కూడాః

    يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا لِمَ تَقُولُونَ مَا لَا تَفْعَلُونَ كَبُرَ مَقْتًا عِندَ اللَّهِ أَن تَقُولُوا مَا لَا تَفْعَلُونَ [الصف: 2-3]

    “ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “ఓ విశ్వాసులారా! మీరు చేయని దానిని గురించి ఎందుకు చెబుతున్నారు? మీరు చేయని దానిని గురించి చెప్పటం అల్లాహ్ సమక్షంలో ఎంతో సహించరానిది”. (సఫ్ 61:2,3).

    మంచిని గురించి ఆదేశించే, చెడు నుండి నివారించే వ్యక్తిపై తప్పని సరి విధి - ఓర్పు, సహనం వహించడం. ఎందుకనగా అలా చేయడంలో అతను కష్టాలకు లోనవుతాడు. ఇది అల్లాహ్ యొక్క పరీక్ష. (ఒక పుణ్యపురుషుడైన) లుఖ్మాన్ (తన తనయునికి చేసిన హితవును) అల్లాహ్ ఇలా తెలిపాడుః

    يَا بُنَيَّ أَقِمِ الصَّلَاةَ وَأْمُرْ بِالْمَعْرُوفِ وَانْهَ عَنِ الْمُنكَرِ وَاصْبِرْ عَلَى مَا أَصَابَكَ إِنَّ ذَلِكَ مِنْ عَزْمِ الْأُمُورِ وَلَا تُصَعِّرْ خَدَّكَ لِلنَّاسِ وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا [لقمان: 16]

    ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “ఓ నా (ప్రియమైన) కుమారా! నమాజును నెలకొల్పుతూ ఉండు, మంచిని గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు, చెడు నుండి వారిస్తూ ఉండు, ఏ ఆపద వచ్చిపడినా సహనం పాటించు, నిశ్చయంగా అది (సహనం) ధైర్యసాహసాలతో కూడిన విషయాల్లో ఒకటి”. (లుఖ్మాన్ 31:16).

    ఈ ఓర్పు ఎందుకంటే, అతను ప్రజల మనోవాంఛలను ఎదురుకో బోతున్నాడు. ఆ మనోవాంఛలు అనేకమంది ప్రజలను తమ అధీనంలో ఉంచు కుంటాయి. (అంటే వారు తమ మనోవాంఛలకు బానిసలై పోతారు అలాంటి వారితో పోరాడడమనేది ధైర్యసాహసాలతో కూడుకున్న పని.)

    మంచిని గురించి ఆజ్ఞాపించే, చెడు నుండి వారించేవారికి ఇహలోకంలో మరియు పరలోకంలో అనేక శుభవార్తలున్నాయి. చదవండి అల్లాహ్ ఆదేశాన్నిః

    يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ [الأحزاب: 70، 71].

    ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు భయపడండి, సత్యమైన మాటనే పలకండి. అల్లాహ్ మీ ఆచరణలను చక్కదిద్దుతాడు. మీ పాపాలను మన్నిస్తాడు”. (అహ్ జాబ్ 33:70,71).

    పాపాల వల్ల వచ్చి పడే ఏ విపత్తుల నుండి అల్లాహ్ అతనిని అంటే ‘మంచిని గురించి ఆదేశించే, చెడు నుండి వారించే’ వానిని కాపాడతాడు. అంతే కాక అతనికి గొప్ప ప్రతిఫలం కూడా ప్రసాదిస్తాడు. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః

    فَلَوْلاَ كَانَ مِنَ الْقُرُونِ مِن قَبْلِكُمْ أُوْلُواْ بَقِيَّةٍ يَنْهَوْنَ عَنِ الْفَسَادِ فِي الأَرْضِ إِلاَّ قَلِيلًا مِّمَّنْ أَنجَيْنَا مِنْهُمْ [هود: 116]

    ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “మీకు పూర్వం గతించిన కాలాలవారిలో భూమిలో కల్లోలం రేకెత్తించకుండా నిషేధించే సజ్జనులు ఎందుకు లేరు? కొద్ది మంది తప్ప, వారిని మేము కాపాడాము”. (హూద్ 11:116).

    فَلَمَّا نَسُواْ مَا ذُكِّرُواْ بِهِ أَنجَيْنَا الَّذِينَ يَنْهَوْنَ عَنِ السُّوءِ وَأَخَذْنَا الَّذِينَ ظَلَمُواْ بِعَذَابٍ بَئِيسٍ بِمَا كَانُواْ يَفْسُقُونَ [الأعراف: 165].

    ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “ఎప్పుడైతే వారు, వారికి చేస్తూ వచ్చిన హితబోధను మరచిపోయారో (విస్మరించారో), అప్పుడు మేము చెడు నుండి వారిస్తూ ఉన్నవారిని రక్షించాము, మరియు అన్యాయా(దుర్మార్గా)నికి గురి అయినవారిని వారి అవిధేయతల కారణంగా కఠినమైన శిక్షతో పట్టుకున్నాము”. (ఆరాఫ్ 7:165).

    ధనప్రాణాలపై, ఆలుబిడ్డలపై వచ్చిపడే ఉపద్రవాల వలన మనిషి ఏ పాపాలకు లోనవుతాడో, మంచిని గురించి ఆదేశిస్తూ, చెడు నుండి వారిస్తూ ఉండడమనేది అటువంటి పాపాలకు పరిహారంగా మారుతుంది. హజ్రత్ హుజైఫా రదియల్లాహు అన్హు ఉపద్రవాల గురించి ప్రశ్నించబడినప్పుడు ఇలా తెలిపారు: ‘‘నిశ్చయంగా నమాజ్, ఉపవాసం, మంచిని గురించి ఆదేశించడం, చెడు నుండి వారించడం, వీటిని సంపద-సంతానాల కారణంగా జరిగే పాపాలకు పరిహారంగా అల్లాహ్ చేస్తాడు.’

    మంచిని గురించి ఆదేశించే, చెడు నుండి వారించే వారికి అల్లాహ్ సర్వసుఖాల స్వర్గం మరియు కఠిన శిక్షల నుండి రక్షణను వాగ్దానం చేశాడు.

    التَّائِبُونَ الْعَابِدُونَ الْحَامِدُونَ السَّائِحُونَ الرَّاكِعُونَ السَّاجِدونَ الآمِرُونَ بِالْمَعْرُوفِ وَالنَّاهُونَ عَنِ الْمُنكَرِ وَالْحَافِظُونَ لِحُدُودِ اللّهِ وَبَشِّرِ الْمُؤْمِنِينَ [التوبة: 112]

    ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: (వీరే అల్లాహ్ ముందు) పశ్చాత్తాప పడేవారు. ఆయనను ఆరాధించేవారు. స్తుతించేవారు. (అల్లాహ్ మార్గంలో) సంచరించేవారు. (ఉపవాసాలు ఉండేవారు). ఆయన సన్నిధిలో వంగేవారు (రుకూ చేసేవారు). సాష్టాంగం (సజ్దా) చేసేవారు. ధర్మమును ఆదేశించేవారు. మరియు అధర్మమును నిషేధించేవారు. మరియు అల్లాహ్ విధించిన హద్దులను పాటించేవారు కూడాను. మరియు విశ్వాసులకు శుభవార్తను తెలుపు” (అత్తౌబా 9:112)

    శుభవార్త ఇహపరాల మేలు కొరకే ఉంటుంది. అయితే ఈ శుభవార్త గురించి ఇప్పుడు ఒకసారి చదవండి

    يَوْمَ تَرَى الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ يَسْعَى نُورُهُم بَيْنَ أَيْدِيهِمْ وَبِأَيْمَانِهِم بُشْرَاكُمُ الْيَوْمَ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ذَلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ [الحديد: 12].

    ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “అల్లాహ్ నాకు మీకు దివ్య ఖుర్ఆన్ ద్వారా శుభం కలుగజేయుగాక! అందులో ఉన్న ఆయతుల మరియు వివేకవంతమైన హితోపదేశాల ద్వారా లాభం చేగూర్చుగాక! ఇంకా ప్రవక్తల నాయకుల సన్మార్గం మరియు ఆయన సద్వచనాల ద్వారా కూడా ప్రయోజనం కలుగజేయుగాక!” (అల్ హదీద్ 57:12)

    ఇక్కడికే నేను నా మాటను సమాప్తం చేస్తున్నాను. నా గురించీ, మీ గురించీ, ఇంకా ముస్లిములందరి గురించీ ప్రతి పాపం నుండి మహోన్నుతుడైన అల్లాహ్ తో క్షమాపణ కోరుతున్నాను, మీరు కూడా క్షమాపణ కోరండి!

    రెండవ ఖుత్బ: అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వలియ్యిల్ మూమినీన్, అహ్మదు రబ్బీ వ అష్కురుహూ, వ అతూబు ఇలైహి వఅస్తగ్ఫిరుహూ, వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ యుహిబ్బుల్ ముత్తఖీన్, వ అష్ హదు అన్న నబియ్యనా వ సయ్యిదనా ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ బఅసహుల్లాహు బిల్ హుదా వల్ యఖీన్, లియున్ జిర మన్ కాన హయ్యన్ వ యహిఖ్ఖల్ ఖౌలు అలల్ కాఫిరీన్, అల్లాహుమ్మ సల్లి వ సల్లిమ్ వ బారిక్ అలా అబ్దిక వ రసూలిక ముహమ్మదివ్ వ అలా ఆలిహీ వ సహబిహీ అజ్మఈన్. అమ్మాబఅద్:

    అల్లాహ్ తో భయపడవలసిన విధంగా భయపడండి, ఇస్లాం కడియాలను గట్టిగా పట్టకోండి.

    అల్లాహ్ దాసులారా! దాసునిపై అతి గొప్ప వరం ఏమిటంటేః అల్లాహ్ అతనికి నిర్మలమైన మనస్సు ప్రసాదించటం. ఆ మనస్సు మంచిని గుర్తించి - దానిని మరియు దానిని పాటించువారిని ప్రేమించి, మంచిని గురించే ఆదేశిస్తూ ఉంటుంది. అలాగే చెడును గుర్తించి - దానిని అసహ్యించుకొని, దానికి పాల్పడేవారితో ఏ నిషిద్ధ కార్యంలోనూ పాలుపంచుకోదు.

    మహాశయ ముస్లిములారా! అజ్ఞానం పెరిగిపోయినది. పుణ్యకార్యాల మరియు పాపకార్యాల పరిజ్ఞానం తగ్గిపోయింది. ఇలాంటి సందర్భంలో ఒక ముస్లిం తన తోటిముస్లిం సోదరునికి ఏదైనా గొప్ప లాభం చేకూర్చ గలడంటే - అది అతనికి సన్మార్గం వైపునకు దారి చూపటం, ఏదైనా చెడు, నిషిద్ధ కార్యం నుండి హెచ్చరించడం. వాస్తవానికి విశ్వాసులు పరస్పరం శ్రేయోభిలాషులు, మంచిని కోరేవారు. అందుకే తమ ముస్లిం సోదరుల కొరకు మంచిని ఇష్టపడతారు. ఓ హదీథులో ఇలా ఉందిః

    (( لا يؤمن أحدُكم حتى يحبَّ لأخيه ما يحبّ لنفسه))

    అనువాదం: ““““మీలో ఒక వ్యక్తి తన కొరకు ఇష్టపడినదానిని తన సోదరుని కొరకు ఇష్టపడనంత వరకు (నిజమైన) విశ్వాసి కాజాలడు”. (బుఖారి మరియు ముస్లిం హదీథు గ్రంథాలు - అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన).

    జరీర్ రదియల్లాహు అన్హు ఇలా పలికారు: “నేను ప్రతి ముస్లిం పట్ల శ్రేయోభిలాషిగా ఉంటాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో శపథం చేశాను.”

    అయితే మునాఫిఖులు (కపటవిశ్వాసులు) వంచకులు, మోసగాళ్ళు. వారు మంచిని నిరోధిస్తుంటారు.

    الْمُنَافِقُونَ وَالْمُنَافِقَاتُ بَعْضُهُم مِّن بَعْضٍ يَأْمُرُونَ بِالْمُنكَرِ وَيَنْهَوْنَ عَنِ الْمَعْرُوفِ وَيَقْبِضُونَ أَيْدِيَهُمْ نَسُواْ اللّهَ فَنَسِيَهُمْ إِنَّ الْمُنَافِقِينَ هُمُ الْفَاسِقُونَ [التوبة: 67].

    “ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “కపటవిశ్వాసులైన పురుషులు, స్త్రీలు, వారంతా ఒకటే, వారు చెడు విషయాల గురించి ఆజ్ఞాపించి, మంచి విషయాల నుండి ఆపుతారు. తమ చేతులను (మేలు చేయకుండా) మూసి ఉంచుతారు. వారు అల్లాహ్ ను మరచిపోయారు, కావున ఆయన కూడా వారిని మరచిపోయాడు. వాస్తవానికి ఈ కపటవిశ్వాసులే అవిధేయులు”. (తౌబా 9: 67).

    ముస్లిం మహాశయులారా! పరస్పర ప్రేమను పెంపొందించండి, మృదువుగా, మెతకవైఖరితో, పుణ్యాన్ని ఆశిస్తూ శ్రేయోభిలాషిగా మెలగండి. అజ్ఞానికి ధర్మ విషయాలు నేర్పండి, అతనికి తౌహీద్ (దైవఏకత్వం) మరియు అల్లాహ్ కు భాగస్వామిని చేసే నిషిద్ధమార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసి, అప్రమత్తం చేయండి. అలాగే నమాజ్ ఆదేశాలు మరియు ఇస్లాంకు సంబంధించిన ఇతర మూలస్థంభాలు, మూలసిద్ధాంతాలు నేర్పండి.

    అలీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా బోధించారు:

    ((لَأَنْ يهديَ الله بك رجلًا واحدًا خيرٌ لك من حُمُر النِّعم)).

    అనువాదం: “““““నీ కారణంగా అల్లాహ్ ఒక వ్యక్తికి సన్మార్గం చూపిన ఇది నీ కొరకు అరబ్బులోని ఎర్ర ఒంటెలకంటే ఎంతో ఉత్తమం”.”

    అల్లాహ్ పట్ల ఏమరపాటుకు గురైన వ్యక్తిని మేల్కొలపండి, తన పరలోక ప్రయోజనానికి ఏదైనా సత్కార్యం చేసుకుంటాడు, ప్రపంచంతో మోసబోకుండా ఉంటాడు. అల్లాహ్ పై తిరుగుబడిదారి అవలంభించి, పాపాలకు ఒడిగట్టేటంతటి ధైర్యం చేసేవానికి అల్లాహ్ పట్టు చాలా పటిష్టమైనదని హెచ్చరించండి. పుణ్యకార్యాల్లో బద్ధకం వహించేవానికి, త్వరపడి సత్కార్యాలు చేసుకోమని హితబోధ చేయండి. ధైర్యహీనులను ఖుర్ఆన్ మరియు సున్నతుల ద్వారా ధైర్యపరచండి, ఇలాగైనా వారి విశ్వాసం పెరుగుతుంది.

    ముస్లిములారా! నిశ్చయంగా మీ సంతానానికి, ఇంటివారికి, బంధుమిత్రులకు, ఇరుగుపొరుగువారికి మంచిని గురించి ఆజ్ఞాపించే మరియు చెడు నుండి వారించే బాధ్యత మీపై ఎంతైనా ఉంది. ఓ ముస్లింలారా! వాస్తవంగా నీపై నీ భార్యాబిడ్డల యొక్క గొప్ప బాధ్యత ఉన్నది. అది ఒక పెద్ద అమానతు. అల్లాహ్ వారిపై విధిగావించిన విషయాలు వారు సరియైన విధంగా నిర్వర్తించేలా నీవు వారిని ఆదేశించు, అల్లాహ్ వారిపై నిషిద్ధపరచిన వాటి నుండి వారిని వారించు. దుష్ట మానవుల, జిన్నాతుల, షైతానుల నుండి వారిని కాపాడు, అలాంటి దుష్టులు వారిని అన్ని రకాల అశ్లీలానికి ప్రేరేపిస్తారు, అల్లాహ్ మార్గం మరియు భోగభాగ్యాల స్వర్గం నుండి వారిని దూరం చేస్తారు.

    يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قُوا أَنفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ عَلَيْهَا مَلَائِكَةٌ غِلَاظٌ شِدَادٌ لَا يَعْصُونَ اللَّهَ مَا أَمَرَهُمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ [التحريم: 6]

    ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “ “ఓ విశ్వాసులారా! మీరు మిమ్మల్ని మరియు మీ కుటుంబీకుల్ని, మానవులు మరియు రాళ్ళు ఇంధనం కాబోయే నరకాగ్ని నుండి కాపాడుకోండి. దానిపై ఎంతో కఠినులు, బలిష్ఠులూ అయిన దైవదూతలు ఉన్నారు. వారు అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞను ఉల్లఘించరు, మరియు వారికివ్వబడిన ఆజ్ఞలను వారు నెరవేరుస్తూ ఉంటారు”. (తహ్రీం 66:6)

    ఇహలోకంలోనైనా, పరలోకంలోనైనా సర్వ మానవుల్లో ఎక్కువ బాధకు గురి అయ్యేవారు ఈ అమానతును వృధా చేసినవారే.

    మస్లిములారా! మీ సంతానం మీతో శాంతినిలయం (స్వర్గం)లో ఉండాలని ఇష్టపడరా? అయితే చదవండి, అందరికంటే సత్యమాట పలికేవాడైన అల్లాహ్ ఇలా చెప్పాడు, ఆయన ఎన్నటికీ వాగ్దాన భంగం చేయడు.

    وَالَّذِينَ آمَنُوا وَاتَّبَعَتْهُمْ ذُرِّيَّتُهُم بِإِيمَانٍ أَلْحَقْنَا بِهِمْ ذُرِّيَّتَهُمْ وَمَا أَلَتْنَاهُم مِّنْ عَمَلِهِم مِّن شَيْءٍ كُلُّ امْرِئٍ بِمَا كَسَبَ رَهِينٌ [الطور: 21].

    ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “మరెవరయితే విశ్వసించారో, వారి సంతానం కూడా విశ్వసంతో వారిని అనుసరిస్తే, మేము వారి సంతానాన్ని వారితో కలుపుతాము. మరియు వారి కర్మలలో వారికి ఏ మాత్రం నష్టం కలిగించము. నిజానికి ప్రతి వ్యక్తీ తాను సంపాదించిన దానికి తాకట్టుగా ఉంటాడు”. (తూర్ 52:21).

    ఈ ఆయత్ వ్యాఖ్యానంలో వ్యాఖ్యానకర్తలు ఇలా చెప్పారుః నిశ్చయంగా అల్లాహు తఆలా సంతానాన్ని స్వర్గంలో వారి పితామహుల స్థాయికి చేరుస్తాడు, ఒకవేళ పిల్లల సత్కార్యాలు వారి తండ్రుల సత్కార్యాల కంటే తక్కువ ఉన్నా సరే, ఇది అల్లాహ్ యొక్క దయ, కరుణ, కృపాలతో, పితామహులు తమ సంతానాన్ని తమ వెంట చూసుకుంటూ వారి కళ్ళకు చల్లదనం కలగాలని. అల్లాహ్ తండ్రుల పుణ్యకార్యాల్లో ఏ తగ్గింపు, కొరత చేయడు. ఎందుకనగా ఆయన గొప్ప దయ,దాతృత్వ గుణం కలవాడు, ఆయన దాతృత్వానికి అంతు లేదు. ఆయన ఈ గొప్ప దయ, దాతృత్వాలను పొందుటకు అల్లాహ్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. మీరు అల్లాహ్ ఆదేశాలను అమలు పరచండి, ఆయన మీకు చేసిన వాగ్దానాలు పొందుటకు, ఆయన ఎన్నటికీ వాగ్దాన భంగం చేయడు.

    అల్లాహ్ దాసులారా! “నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై దరూద్ లు పంపుతూ ఉంటారు.

    ఖుర్ఆన్ వచన భావం యొక్క అనువాదం: “ఓ విశ్వాసులారా! మీకు కూడా అతనిపై దరూద్ లు మరియు మీ హృదయపూర్వక సలాంలు పంపుతూ ఉండండి”. (అహ్ జాబ్ 33: 56).

    [1] ఈ హదీసును ‘అబూ సఅలబా అల్ ఖషనియ్యి’ ఉల్లేఖించారు. ఈ హదీసు ప్రామాణికమైనదని, దీనిని ‘దారు ఖుత్నీ’ తదితరులు సేకరించారని ఇమాం నవవి రహిమహుల్లాహ్ తెలిపారు.

    [2] ఈ హదీసు తిర్మిజి రహిమహుల్లాహు ఉల్లేఖించి, ఇది హసన్ అని తెలిపారు.

    [3] ముస్లిం హదీథు గ్రంథం 49.