×
ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

    1. ముస్లింల కొరకు కుటుంబం ఎందుకు అంత ముఖ్యమైంది?

    కుటుంబం ఇస్లామీయ సమాజం యొక్క పునాది. ఒక స్థిరమైన కుటుంబం ఇచ్చే ప్రశాంతత మరియు భద్రత ఎంతో విలువైనది మరియు దాని సభ్యుల ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు ఎంతో ఆవశ్యకమైనది. పెద్ద కుటుంబాల ఉనికి సమైక్య సామాజిక వరుసక్రమాన్ని సృష్టించింది; ఆడపిల్లల భద్రత పెరిగింది మరియు తమ పెళ్ళయ్యే సమయం వచ్చే వరకు వారు చాలా అరుదుగా ఇంటిని వదిలి పెడతారు.

    2. మానవహక్కులకు ఇస్లాం ధర్మం ఇచ్చే గ్యారంటీ ఏమిటి ?

    ఇస్లామీయ రాజ్యంలోని ప్రతి ఒక్కరి ధన, ప్రాణ, మానాలు పవిత్రంగా పరిగణించబడతాయి – అతడు ముస్లిం అయినా, ముస్లిం కాకపోయినా.

    ముస్లింల స్వభావంలో జాత్యహంకారానికి స్థానం లేదు. ఎందుకంటే మానవ సమానత్వం గురించి ఖుర్ఆన్ క్రింది ఇలా ప్రకటిస్తున్నది:

    ఓ మానవులారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము. మరియు మీరు ఒకరినొకరు గుర్తుంచుకోవటానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము. నిశ్చయంగా మీలో ఎక్కువ దైవభీతి గలవాడే అల్లాహ్ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞుడు, అన్నీ ఎరిగినవాడు. ( దివ్యఖుర్ఆన్ 49:13)