ఇస్లాం పరిచయం
కూర్పులు
మూలాలు
Full Description
ఇస్లాం పరిచయం
అనువాదం:
ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విమర్శ:
షేఖ్ నజీర్ అహ్మద్
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో
ఇస్లాం పై ఒక ని ప్రవక్తత్వం
ఇస్లాంలోని ఆరాధనల పరిచయం
ఇస్లాంలోని దేవుడి పరిచయం
తట్టి లేపింది. "
[ముస్లిమేతరులు ‘ఇస్లాం అంటే ఏమిటి?’ అనే ముఖ్యాంశాన్ని తేలికగా అర్థం చేసుకునేలా ఈ చిరుపుస్తకం వివరిస్తున్నది. అలాగే ఇస్లాంకు సంబంధించిన ‘అల్లాహ్, ఖుర్ఆన్, ముహమ్మద్, జీసస్, మరణానంతర జీవితం, ఇస్లాంలోని సంస్కారాలు – ఆరాధనా పద్ధతి, ప్రవక్తత్వం, ఇస్లాంలోని మానవ హక్కులు, ఇస్లాంలో మహిళల స్థానం, నమాజు, ఉపవాసం, హజ్ యాత్ర ...’ మొదలైన మరికొన్ని ముఖ్యాంశాలను కూడా వివరిస్తున్నది.]
ఒకవేళ మీరు సున్నితమైన మరియు సుకుమారమైన సత్యాన్ని గ్రహించే మంచి మనస్సు కలిగి ఉంటే, ఇస్లాం గురించి తెలుసుకోవటానికి మనస్పూర్తిగా ప్రయత్నించండి. ఇస్లాం గురించిన ప్రాథమిక సమాచారం కోసం మమ్మల్ని సంప్రదించండి. వదంతులను గుడ్డిగా నమ్మవద్దు. ప్రామాణిక మూలాధారాల నుండి తెలుసుకోండి. మీకు సహాయం చేయటానికి మేమిక్కడ తయారుగా ఉన్నాము.
క్లుప్తంగా ఇస్లాం గురించి ...
ఇస్లాం ధర్మం మరియు ముస్లింలు
అరబీ భాషలోని ‘ఇస్లాం’ అనే పదానికి అర్థం శాంతి, సమర్పణ మరియు విధేయత. ఇస్లాం ధర్మం అంటే మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్, తన చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా అవతరింపజేసిన ఆదేశాలను మరియు మార్గదర్శకత్వాన్ని పూర్తిగా అంగీకరించటం, స్వీకరించటం, ఆమోదించటం మరియు సమ్మతించటం.
‘ముస్లిం’ అంటే మనస్పూర్తిగా అల్లాహ్ ను విశ్వసించేవాడు, తన ఇష్టాన్ని అల్లాహ్ యొక్క అభీష్టానికి సమర్పించుకున్నవాడు. ఆయన అవతరింజేసిన దివ్యఖుర్ఆన్ మార్గదర్శకత్వం మరియు ఆయన అంతిమ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ధర్మోపదేశాలకు అనుగుణంగా తన జీవిత విధానాన్ని పూర్తిగా సరిదిద్దుకోవటానికి శాయశక్తులా ప్రయత్నించేవాడు. వీటి ఆధారం పై మానవ సమాజ నిర్మాణం కొరకు పనిచేసేవాడు. కొందరు అజ్ఞానులు ‘ముహమ్మదీయ మతం’ అనే తప్పుడు పేరుతో ఇస్లాం ధర్మాన్ని పిలుస్తారు. ఈ పేరు ఇస్లాం ధర్మం యొక్క అసలు మూలాంశాలకు పూర్తిగా విరుద్ధమైంది.
'అల్లాహ్' అంటే అరబీ భాషలో దేవుడి అసలు పేరును సూచించే దివ్యమైన పదం. ఇది ఒక అపూర్వమైన, అసమానమైన, అద్వితీయమైన ఏకైక పదం. ఎందుకంటే ఈ పదానికి బహువచన రూపం లేదా స్త్రీలింగ రూపం లేదు. (దేవుడు – దీని బహువచన రూపం దేవుళ్ళు; స్త్రీలింగ రూపం – దేవతలు. గాడ్ – దీని బహువచన రూపం గాడ్స్; స్త్రీలింగ రూపం - గాడెస్)
దివ్యసందేశాల పరంపర
ఇస్లాం ఒక నూతన ధర్మ కాదు. అల్లాహ్ తన ప్రవక్తలందరికీ పంపిన అదే దివ్యసందేశం మరియు మార్గదర్శకత్వమిది. అయితే చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన ఈ ఇస్లాం సందేశ ప్రత్యేకత ఏమిటంటే అది తన యొక్క సమగ్రమైన, సంపూర్ణమైన మరియు అంతిమ రూపంలో ఆయనపై అవతరించింది.
దివ్యఖుర్ఆన్ వచనం యొక్క తెలుగు భావార్థం:
వారితో ఇలా అనండి: "మేము అల్లాహ్ ను విశ్వసించాము మరియు మాపై అవతరింపజేయబడిన దానిని కూడా; అలాగే ఇబ్రాహీము పై, ఇస్మాయీలు పై, ఇస్ హాఖు పై, యాఖూబు పై మరియు అతని సంతతిపై అవతరింపజేయబడిన దానినీ, ఇంకా మూసా-ఈసాలకూ మరియు ఇతర ప్రవక్తలకూ వారి ప్రభువు తరపు నుండి ప్రసాదించబడిన దానినీ విశ్వసించాము. వారిలో ఏ ఒక్కరి మధ్యనా మేము వ్యత్యాసం చూపము మరియు మేము కేవలం ఆయనకే తల ఒగ్గి విధేయులైన వారం" (ఖుర్ఆన్ 3:84).
ఇస్లాం ధర్మం యొక్క ఐదు ప్రధాన మూలాంశాలు:
1. సాక్ష్యప్రకటన : “ఆరాధింపబడే అర్హత గలవారెవ్వరూ లేరు - ఒక్క అల్లాహ్ తప్ప మరియు ముహమ్మద్ - అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు దాసుడు” అని సాక్ష్యమివ్వడం. దీనిని అరబీ భాషలో అష్షహాదహ్ అంటారు.
మొత్తం మానవజాతి కొరకు పంపబడిన చిట్టచివరి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం). తన యొక్క ఆదర్శవంతమైన జీవన విధానాన్నే అనుసరించమని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్తత్వం ప్రతి ముస్లింను నిర్బంధిస్తున్నది.
2. ఆరాధనలు (సలాహ్, నమాజు): అల్లాహ్ కొరకు మన బాధ్యతగా భావిస్తూ ప్రతి రోజూ ఐదు పూటలా నమాజు చేయడం. అవి అల్లాహ్ పై విశ్వాసాన్ని మరియు సామీప్యాన్ని దృఢపరుస్తాయి. అంతేగాక మనిషిని ఉత్తమ సంస్కారాల వైపు ప్రోత్సహిస్తాయి. హృదయాన్ని పరిశుద్ధపరుస్తాయి. చెడు నుండి ఆపుతాయి.
3. రమదాన్ నెలలో ఉపవాసాలు పాటించడం: రమదాన్ నెలలో తెల్లవారు ఝాము నుండి సూర్యాస్తమయం వరకు ముస్లింలు అన్నపానీయాల నుండి మరియు దాంపత్య సుఖం నుండి దూరంగా ఉండటమే కాకుండా, చెడు ఆలోచనల నుండి మరియు చెడు కోరికల నుండి కూడా దూరంగా ఉంటారు. అది ప్రేమ, చిత్తశుద్ధి మరియు భక్తిని నేర్పుతుంది. అంతేగాక సామాజిక విచక్షణ, సహనం, నిస్వార్థం మరియు సంకల్ప బలాన్ని పెంపొందిస్తుంది.
4. జకాతు : సంవత్సరం పాటు నిల్వ ఉన్న తమ ధనంలో నుండి 2.5% ధనాన్ని ధార్మిక కర్తవ్యంగా మరియు పాప ప్రక్షాళణ కోసం తమ సమాజంలోని బీదవారికి దానమివ్వడం.
5. హజ్ యాత్ర: మంచి ఆరోగ్యంతో, ఆర్థికంగా భరించగలిగే స్థితిలో ఉన్నపుడు జీవితంలో ఒక్కసారి మక్కా వెళ్ళి హజ్ యాత్ర చేయాలి.
ఈ ఐదు మూలాంశాలు మాత్రమే కాకుండా, అల్లాహ్ మెప్పు కోసం చిత్తశుద్ధితో చేసే ప్రతి మంచి పనీ ఆరాధనయే.
అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని, అద్వితీయత్వాన్ని మరియు సార్వభౌమత్వాన్ని విశ్వసించమని ఇస్లాం ఆదేశిస్తున్నది. తద్వారా మనిషి విశ్వాన్ని మరియు విశ్వంలోని తన స్థానాన్ని అర్థం చేసుకో గలుగుతాడు. ఈ నమ్మకం అల్లాహ్ యొక్క ఉనికిని మరియు ఆయన హక్కును అతడికి గుర్తు చేస్తూ, అన్ని రకాల పిచ్చి భయాల మరియు భ్రమల నుండి, గుడ్డినమ్మకాల నుండి, మూఢవిశ్వాసాల నుండి విముక్తి చేస్తుంది. కేవలం విశ్వసిస్తే సరిపోదు. అది మాటలలో మరియు చేతలలో కూడా కనబడాలి మరియు ఋజువు కావాలి. కాబట్టి, మన ఏకదైవత్వ విశ్వాసం ఇస్లాం యొక్క ఐదు మూలాంశాల ద్వారా బహిర్గతమవుతుంది. మనందరి సృష్టికర్త మరియు పోషణకర్త అయిన విశ్వప్రభువును ఆరాధించే ఒక కుటుంబంగా మొత్తం మానవజాతిని చూడమని ఏక దైవత్వ విశ్వాసం నిర్దేశిస్తుంది. అవతార పురుషుల మరియు దైవాంస సంభూతుల సిద్ధాంతాన్ని ఇస్లాం తిరస్కరిస్తుంది. కేవలం స్వచ్ఛమైన ఏకదైవత్వ విశ్వాసం మరియు మంచి పనుల వలన మాత్రమే స్వర్గ ప్రవేశం లభించగలదని చెబుతున్నది. తద్వారా ఎలాంటి మధ్యవర్తులు, పూజారులు, సిఫారసు చేసేవాళ్ళు లేకుండా సృష్టికర్తను తిన్నగా ఆరాధించవచ్చు మరియు వేడుకోవచ్చు.
మానవుడు – ఒక స్వేచ్ఛాజీవి :
మానవజాతి అనేది సృష్టికర్త యొక్క అత్యుత్తమ సృష్టి. అతడు మహోన్నత అంతర్గత శక్తులతో (potentialities) సృష్టించబడినాడు. ఇతర సృష్టితాలకు భిన్నంగా అతడికి స్వయంగా ఆలోచించే, ఆచరించే మరియు ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వబడింది. అల్లాహ్ అతడికి సన్మార్గాన్ని చూపాడు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవనం ఒక పరిపూర్ణ ఉపమానంగా అతడికి అందించబడింది. ఈ రెండింటిని అనుసరించడంలోనే అతడి మోక్షం ఉంది. మానవ వ్యక్తిత్వ పవిత్రత మరియు పరిశుద్ధతను ఇస్లాం బోధిస్తున్నది. జాతి, కుల, మత, లింగ, వర్ణ భేదం లేకుండా మానవులందరూ సమానులేననే నగ్నసత్యాన్ని నొక్కి వక్కాణిస్తున్నది.
ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులలో బోధించబడిన అల్లాహ్ యొక్క ధర్మశాసనం మాత్రమే అన్నింటి కంటే ఉత్తమమైంది. అది సమాజంలోని ఉన్నత వంశస్థులపై మరియు అథమ స్థానంలోని ప్రజలపై, ధనికులపై మరియు బీదవారిపై సమానంగా వర్తిస్తుంది. అలాగే పాలకులపై మరియు పామరులపై కూడా.
ఖుర్ఆన్ మరియు హదీథ్:
ఖుర్ఆన్ – ఇది అల్లాహ్ యొక్క అంతిమ దివ్యవాణి. ఇస్లామీయ బోధనల మరియు ధర్మశాసనాల యొక్క ప్రాథమిక మూలాధారం. దైవ విశ్వాసం, సంస్కారం, మానవ జాతి చరిత్ర, ఆరాధన, జ్ఞానం, వివేకం, సమస్త విషయాలలో సృష్టికర్త మరియు సృష్టి మధ్య, పరస్పరం మానవుల మధ్య ఉండవలసిన సంబంధాల గురించి స్పష్టంగా చర్చిస్తున్నది. సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ, చట్ట, న్యాయ, శాస్త్ర, అంతర్జాతీయ అంశాల గురించిన సమగ్ర ముఖ్యాంశాలు దీనిలో ఉన్నాయి. స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక నిరక్షరాశి, ఆయనకు చదవటం – వ్రాయడం రాదు. అయినా, ఆయన జీవిత కాలంలోనే మరియు ఆయన పర్యవేక్షణలోనే సహచరులు దివ్యఖుర్ఆన్ వచనాలను లిఖించారు మరియు కంఠస్థం చేసారు. అది అవతరించబడిన అరబీ భాషలో, దాని అసలు మరియు సంపూర్ణ రూపంలో నేటికీ అందరి అందుబాటులో ఉన్నది. అనేక భాషలలో దాని భావానువాదాలు విస్తారంగా వాడుకలో ఉన్నాయి. ఇక హదీథులు అంటే తన సహచరులచే చాలా జాగ్రత్తగా నమోదు చేయబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలు, పలుకులు మరియు ఆచరణలు. ఖుర్ఆన్ వచనాలను మరింత స్పష్టంగా వివరిస్తాయి మరియు విశదీకరిస్తాయి.
ఇస్లాంలోని ఆరాధనలు:
ఇస్లాం కేవలం ఆచార కర్మలను గుడ్డిగా చేయమని బోధించదు మరియు సమ్మతించదు. అది వాటి సంకల్పం మరియు ఆచరణల ఆవశ్యకతను గట్టిగా నొక్కి చెబుతున్నది. దైవాన్ని ఆరాధించడమంటే ఆయనను గ్రహించడం మరియు ప్రేమించడం, తన జీవితపు ప్రతి అడుగూ ఆయన ఆదేశాలకు అనుగుణంగా వేయడం, మంచి పనులు చేయమని ఆదేశించడం మరియు చెడు పనులు చేయవద్దని, దౌర్జన్యం చేయవద్దని నిరోధించడం, దానధర్మాలు చేయడం, న్యాయంగా జీవించడం మరియు తోటి మానవులకు సేవ చేయడం ద్వారా ఆయనకు సేవ చేయడం. దీనిని ఖుర్ఆన్ క్రింది వచనాలలో ఇలా తెలుపుతున్నది.
“అల్ బిర్ర్ (సదాచరణ, దైవభక్తి, ధర్మనిష్ఠాపరత్వం మరియు అల్లాహ్ పట్ల విధేయత చూపే ప్రతి పని) అంటే కేవలం మీ ముఖాలను తూర్పు దిశకో లేదా పడమర దిశకో త్రిప్పుకొనుట కాదు. కానీ, అల్ బిర్ర్ అంటే (వారి లక్షణం) – అల్లాహ్ ను, అంతిమదినాన్ని, మలాయికలను, దివ్యగ్రంథాల్ని మరియు అల్లాహ్ యొక్క సందేశహరులను విశ్వసించడం, మరియు సంపదపై ప్రేమ ఉన్నప్పటికీ - దగ్గరి బంధువులకు, అనాధలకు, అక్కర గలవారికి, బాటసారులకు, అర్థించేవారికి మరియు బానిసల విముక్తి కొరకు ఖర్చు చేయడం, మరియు నమాజులు స్థాపించడం మరియు జకాతు (విధిదానం) చెల్లించడం మరియు వాగ్దానం చేసినప్పుడు దానిని పూర్తి చేయడం, అలాగే కష్టాలలో, పేదరికంలో మరియు యుద్ధసమయాలలో సహనం వహించడం – ఎవరైతే వీటిని ఆచరిస్తారో, అలాంటి వారే సత్యవంతులు మరియు అలాంటి వారే అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగియున్న వారు. (2:177).
ఇస్లామీయ జీవన విధానం :
జీవితంలోని ప్రతి అడుగూ ఎలా వేయాలనే విషయం గురించి నిర్దిష్టమైన మార్గదర్శకత్వాన్ని ఇస్లాం మానవులందరికీ అందజేస్తున్నది. అది అందించే మార్గదర్శకత్వం సమగ్రహమైనది. అందులో మానవ జీవితానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, సంస్కార మరియు ఆధ్యాత్మిక అంశాలన్నీ ఉన్నాయి. భూమిపై తన జీవిత పరమార్థం మరియు స్వయంగా తనపై, భార్యాబిడ్డలు, సమాజం, తోటి మానవులు మరియు సృష్టికర్తపై ఉన్న తన బాధ్యతలు మరియు విధులు ఏవిటో మానవుడికి జ్ఞాపకం చేస్తుంది. తన జీవిత ఉద్దేశం గురించి మానవుడికి అవసరమైన మార్గదర్శకత్వం మరియు దానిని ఆచరణలో పెట్టే అవకాశాలు ఇవ్వబడి, తన ఎదురుగా సవాలు చేస్తున్న మానవ ఉనికితో అతను స్వేచ్ఛగా వదిలి వేయబడినాడు. ఇస్లాంలో మానవ జీవితం ఒక సంపూర్ణమైన ఏకీకృత విభాగం. అంతేగాని, పరస్పరం పోటీ పడుతున్న విభిన్న ముక్కల సంకలనం కాదు. ఆధ్యాత్మికత మరియు లౌకికత అనేవి మానవుడి రెండు వేర్వేరు భాగాలు కావు: మానవుడి సహజసిద్ధ ఉనికిలో అవి రెండూ జత అయి ఉన్నాయి.
చారిత్రక పరంగా
క్రీ.శ. 570లో అరేబియాలోని మక్కా నగరంలో ఒక ఉన్నత వంశంలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మించారు. తన 40వ సంవత్సరం ఆయనపై తొలిసారి దివ్యవాణి (వహీ) అవతరించింది. ఇస్లాం గురించి బోధించడం మొదలు పెట్టగానే, ఆయనపై మరియు ఆయన సహచరులపై అత్యాచారం, దాడులు మొదలైనవి. తీవ్రమైన కష్టాలు ఎదుర్కొనవలసి వచ్చింది. పర్యవసానంగా ఆయనను అరేబీయాలోని మరొక పట్టణమైన మదీనాకు వలస వెళ్ళమని అల్లాహ్ ఆజ్ఞాపించినాడు: 23 సంవత్సరాల అల్పకాలంలో ఆయన తన ప్రవక్తత్వ లక్ష్యాల్ని సాధించారు మరియు తన 63వ ఏట చనిపోయారు. ఆయన సంపూర్ణమైన జీవితాన్ని జీవించారు. మొత్తం మానవజాతి కొరకు ఖుర్ఆన్ బోధనలను స్వయంగా ఆచరణలో పెట్టి, తన మహోన్నత జీవితాన్ని ఒక గొప్ప ఉపమానంగా వదిలి వెళ్ళారు.
ఇస్లాం యొక్క వివేకవంతమైన అప్పీలు
సత్యాన్వేషణలో చిత్తశుద్ధితో పరిశోధిస్తున్న వారి కొరకు ఇస్లాం ధర్మం స్పష్టంగా మరియు సూటీగా సత్యాన్ని ముందుంచడ మనేది ఏ ధర్మంలోనూ కనబడని ఒక బ్రహ్మాండమైన విషయం. మానవ జీవితపు సమస్యలన్నింటికీ ఇది ఒక పరిష్కారం. ప్రతి దశలో మనందరి సృష్టికర్త, ప్రభువు అయిన అల్లాహ్ ను ప్రశంసిస్తూ, ఉన్నతమైన మరియు సంపూర్ణమైన జీవితం వైపు దారి చూపే ఒక అద్భుత మార్గదర్శకత్వం.
ప్రపంచంలోని ముస్లింల సంఖ్య (2011 అంచనా).
ఆఫ్రికా 554.32 మిలియన్లు
ఆసియా 1,356.28 మిలియన్లు
యూరోప్ 56.04 మిలియన్లు
అమెరికా & ఆస్ట్రేలియా 10.6 మిలియన్లు
మొత్తం ముస్లింల జనాభా 1,977.24 మిలియన్లు
50% కంటే ఎక్కువ ముస్లింల జనాభా ఉన్న దేశాల సంఖ్య 53
ప్రపంచవ్యాప్తంగా ముస్లింల జనాభా – 2012
ఖండం
మొత్తం జనాభా
2011 లో (మిలియన్లలో)
ముస్లింల జనాభా శాతం
ముస్లిం జనాభా
2011లో
(మిలియన్లలో)
ఆఫ్రికా
1051.4
52.39 %
554.32
ఆసియా
4239.1
32 %
1356.28
యూరోప్
740.01
7.6 %
56.04
ఓషానియా
37.14
1.5 %
0.54
ఉత్తర అమెరికా
346.2
2.2 %
7.61
దక్షిణ అమెరికా
595.9
0.41 %
2.45
మొత్తం
7,009.75
28.73 %
1,977.24
ముస్లిం జవాభా వృద్ధి రేటు 1.84%.
2012లో ముస్లిం జనాభా 2.1 Billion. Source: http://www.muslimpopulation .com/world/
ఇస్లాం – ఆధునిక సమస్యల పరిష్కారం:
సౌభ్రాతృత్వం - సోదరత్వం: ఆధునిక దేశాలు చంద్రుడిపై, అంగారక గ్రహంపై మానవుడినైతే పంపించగలిగాయి గానీ తోటి మానవుడిని అసహ్యించుకోకుండా & పోట్లాడకుండా ఆపలేక పోతున్నాయి. అయితే ఇస్లాం 1400 సంవత్సరాల క్రితమే జాత్యహంకారాన్ని ఎలా రూపుమాపాలో ఆచరణాత్మకంగా చూపింది. హజ్ యాత్రలో ప్రతి సంవత్సరం, అన్ని జాతుల మరియు దేశస్థుల మధ్య ఆచరణాత్మకంగా నెలకొన్న సోదరత్వపు అసలు ఇస్లామీయ మహిమను ప్రతి ఒక్కరూ చూడవచ్చు.
కుటుంబం: పాశ్చాత్య దేశాలన్నింటిలోనూ నాగరికత యొక్క అసలు మూలభాగమైన కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమై పోవడాన్ని మనం తేలిగ్గా గుర్తించగలం. అయితే ఇస్లామీయ కుటుంబ వ్యవస్థ భార్య, భర్త మరియు పిల్లల హక్కుల మధ్య సమతుల్యాన్ని ఎంత చక్కగా, న్యాయంగా స్థాపించిందో చూడండి. మానవ నిస్వార్థత్వాన్ని, కరుణను మరియు ప్రేమాభిమానాలను చక్కగా క్రమపద్ధతిలో నెలకొల్పబడిన కుటుంబ వ్యవస్థలో ఇస్లాం స్థాపించింది.
ముక్కలు ముక్కలు కాని అఖండమైన జీవిత దర్శనం : మానవులు తమకు ఇష్టమైన విధంగా లౌకిక జీవితమంటూ జీవిస్తున్నారు. అయితే లౌకిక సమాజాలలోని ఒక లోపమేమిటంటే అవి సమాజం లోని వివిధ కులాలను, వర్గాలను, తెగలను దగ్గరకు తీసి, ఒక్కటి చేయటంలో సాఫల్యం పొందలేక పోయాయి. ఇక్కడ లౌకిక మరియు ధార్మిక; వైజ్ఞానిక మరియు ఆధ్యాత్మిక సమాజాలు పరస్పరం విభేదిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. అయితే, ఇస్లాం ఈ విభేదాలు సమాప్తం అయ్యేలా జీవన దృక్పథంలో సరైన మార్పు వచ్చేలా మానవుడికి దారి చూపుతున్నది.
ఖుర్ఆన్
గురించి వారేమన్నారు ?
మానవజాతి వద్దకు రెండు పద్ధతులలో దివ్యవాణి వచ్చింది : మొదటిది దివ్యగ్రంథాల రూపంలో సూటీగా అవతరించిన అల్లాహ్ పలుకులు; రెండోది తను ఎంచుకున్న ప్రవక్తల బోధనలు. ఇవి రెండూ ఏకకాలంలో జరిగేవి. కాబట్టి వీటిలో ఏదో ఒక దానిని పట్టుకుని, రెండో దానిని వదిలి పెట్టి, అల్లాహ్ యొక్క సందేశాన్ని గ్రహించేందుకు ప్రయత్నించడమనేది నిస్సందేహంగా మార్గభ్రష్టత్వం వైపుకు దారితీస్తుంది.
హిందువులు తమ వైపుకు పంపబడిన ప్రవక్తలను నిర్లక్ష్యం చేసి, కేవలం వారి గ్రంథాలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించారు. మార్పులు చేర్పులకు గురై, అవి పజిల్స్ గా మారి పోయాయి. కాలక్రమంలో చివరికి వాటిని కూడా పోగొట్టుకున్నారు.
అలాగే, క్రైస్తవులు తమ వైపు పంబడిన అల్లాహ్ యొక్క గ్రంథాన్ని పూర్తిగా ఉపేక్షించి, మొత్తం ప్రాధాన్యతను కేవలం జీసస్ కే ఇచ్చారు. ఆయనకు దైవత్వాన్ని ఆపాదించడమే కాకుండా, బైబిలు లోని అసలు ఏకదైవత్వ భావాన్నే (తౌహీదునే) పోగొట్టుకున్నారు. వాస్తవానికి, ఖుర్ఆన్ కంటే ముందు అవతరించిన దివ్యగ్రంథాలు అంటే తౌరాతు, బైబిలు .... వాటి ప్రవక్తలు చనిపోయిన చాలా కాలం తర్వాత గ్రంథ రూపంలో సంకలనం చేయబడినాయి మరియు అనువదించబడినాయి. ఇలా జరగటానికి ఒక కారణం, ప్రవక్త మూసా మరియు ప్రవక్త జీసస్ అలైహిస్సలాంల సహచరులు తమ ప్రవక్తలపై అవతరించిన దివ్యసందేశాలను భద్రపరచడంలో తగిన శ్రద్ధ వహించలేదు. వారి ప్రవక్తల కాలం గడిచిపోయిన చాలా కాలం తర్వాత అవి వ్రాయబడినాయి. అందువలన నేడు ఏవైతే బైబిలు రూపంలో మన ముందు ఉన్నవో, అవి ఆ ప్రవక్తల అనుచరులు తమకు తోచిన విధంగా మార్పులు – చేర్పులు చేస్తూ, తయారు చేసిన అనువాదాలు మాత్రమే.
దీనికి భిన్నంగా, చిట్టచివరి దివ్యావతరణ అయిన ఖుర్ఆన్ అవతరించిన దాని అసలు రూపంలోనే నేటికీ భద్రపరచబడి ఉంది. అల్లాహ్ స్వయంగా దీనిని భద్రపరుస్తానని ప్రకటించి ఉన్నాడు. అందువలన మొత్తం ఖుర్ఆన్ గ్రంథం యొక్క వచనాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోనే తాళ పత్రాలు, చర్మం, ఎముకలు మొదలైన వాటిపై వ్రాయబడినాయి. అంతేగాక, వేల మంది సహచరులు మొత్తం ఖుర్ఆన్ గ్రంథాన్ని ఆయన నుండి ప్రత్యక్షంగా కంఠస్థం చేసినారు. స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సంవత్సరం దానిని జిబ్రయీల్ అలైహిస్సలాంకు వినిపించేవారు. తన చివరి సంవత్సరంలో ఆయన దానిని రెండు సార్లు జిబ్రయీల్ అలైహిస్సలాంకు వినిపించారు. ఆయన తర్వాత ముస్లింల పరిపాలకుడిగా ఎంచుకోబడిన మొదటి ఖలీఫా అబూ బకర్ సిద్ధీఖ్ రదియల్లాహు అన్హు మొత్తం ఖుర్ఆన్ సందేశాన్ని ఒక గ్రంథ రూపంలో సంకలనం చేసే మహత్తర కార్యాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క లేఖకుడైన జైద్ ఇబ్నె థాబిత్ రదియల్లాహు అన్హుకు అప్పజెప్పారు. తను చనిపోయే వరకు ఆ ప్రతి అబూ బకర్ సిద్ధీఖ్ రదియల్లాహు అన్హు వద్దనే ఉండేది. తర్వాత అది రెండో ఖలీఫాగా నియమితులైన ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వద్ద ఉండేది. ఆ తర్వాత అది ఆయన కుమార్తె మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్య అయిన హఫ్సా రదియల్లాహు అన్హుమా వద్ద ఉండేది. దీని నుండే మూడో ఖలీఫాగా ఎంచుకోబడిన ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు అనేక కాపీలు తయారు చేయించి, అప్పటి ఇస్లామీయ సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాలకు పంపించారు.
ఖుర్ఆన్ గ్రంథం ఎంతో శ్రద్ధగా భద్రపరచబడింది. ఎందుకంటే రాబోయే అన్ని కాలాలలో మొత్తం మానవజాతికి మార్గదర్శకత్వం వహించే ఏకైక స్వచ్ఛమైన అంతిమ దివ్యగ్రంథం. అందుకే అది అవతరించిన ప్రాంతంలోని అరబ్బులను మాత్రమే కాకుండా, మొత్తం మానవజాతిని సంభోదిస్తున్నది. ఉదాహరణకు - "ఓ మానవుడా! నీ ప్రభువు నుండి నిన్ను దూరం చేస్తున్నది ఏమిటి?" ఖుర్ఆన్ బోధనలను ఎలా ఆచరించాలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఆచరించి చూపారు. అంతేగాక ఎందరో ఉత్తమ పురుషులు కూడా వాటిని ఆచరించి, మన కోసం మంచి ఉపమానాలు వదిలి పెట్టారు. ఖుర్ఆన్ యొక్క ఒక ప్రత్యేకత ఏమిటంటే, దాని ఆదేశాలు మామూలు మానవుడి సంక్షేమాన్ని తమ లక్ష్యంగా తెలుపుతూ, దానిని అతడు తనకు వీలయిన పద్ధతిలో సాధించేలా దారి చూపుతున్నాయి. అతడి మొత్తం జ్ఞానంలో, ఖుర్ఆన్ వివేకమే అంతిమ మైంది. అది భౌతిక శరీరాన్ని నిందించడం లేదు, దానిని నిర్లక్ష్యమూ చేయడం లేదు, అలాగే ఆత్మనూ ఉపేక్షించడం లేదు. అది దేవుడిని మానవుడిగా చేయట్లేదు, అలాగే మానవుడికి దైవత్వాన్నీ కట్టబెట్టడమూ లేదు. సృష్టిలోని ప్రతి దానికీ సముచిత స్థానాన్ని ఇస్తున్నది. వాస్తవానికి ఎవరైతే ఖుర్ఆన్ గ్రంథం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క రచన అని వాదిస్తున్నారో, అలాంటి వారు మొత్తం మానవజాతికి అసాధ్యమైన దానిని ఆయన చేసినట్లుగా దావా చేస్తున్నారు.
మొదటిది - అసలు క్రీ.శ. 6వ శతాబ్దానికి చెందిన ఏ వ్యక్తి అయినా ఖుర్ఆన్ లో పేర్కొనబడినటువంటి వైజ్ఞానిక మరియు సాంకేతిక సత్యాలను పలుకగలడా ? ఆ కాలపు ఏ వ్యక్తి అయినా గర్భాశయంలోని పిండోత్పత్తి దశలను ఆధునిక వైద్యశాస్త్రంలో ఉన్నత స్పష్టంగా వివరించగలడా?
రెండోది – తన నలభై ఏళ్ళ వరకు నీతినిజాయితీలకు మారుపేరుగా ప్రసిద్ధి కెక్కిన నిరక్ష్యరాస్యుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, హఠాత్తుగా ఆనాటి అత్యుత్తమ కవుల మరియు ఉపన్యాసకుల బృందం కూడా రచించలేని ఒక అపూర్వమైన గ్రంథాన్ని రచించారని అనడం ఎంత వరకు సముచితం?
చివరగా, తన సమాజంలో అల్ అమీన్ (నమ్మకస్తుడు) అని ప్రఖ్యాతి చెందిన మరియు సాటిలేని నీతినిజాయితీలు గలవాడని ముస్లిమేతరులచే కూడా ప్రశంసించబడిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక అసత్య దావా చేసారననడం ఎంత వరకు న్యాయం? అంతేగాక ఆ అసత్య గ్రంథం ద్వారా ఆయన ఎన్నో వేల మంది గుణగణాలను తీర్చిదిద్ది, మంచి మానవులుగా మారేలా తర్ఫీదు నివ్వడం ఎలా సాధ్యం? భూమిపై నీతినిజాయితీలతో కూడిన అత్యుత్తమ మానవ సమాజాన్ని ఎలా స్థాపించారు? నిస్సందేహంగా, చిత్తశుద్ధి మరియు నిస్పక్షపాతంతో ప్రయత్నించే ఏ సత్యాన్వేషణ పరిశోధకుడైనా అల్లాహ్ అవతరింపజేయబడిన దివ్యగ్రంథం ఖుర్ఆన్ అనే సత్యాన్ని నమ్మకుండా ఉండలేడు.
వారి మాటలన్నింటినీ సమ్మతించవలసిన అవసరం లేకుండా, ఇక్కడ ఖుర్ఆన్ గురించి కొందరు ప్రధానమైన ముస్లిమేతరుల అభిప్రాయాలను పేర్కొంటున్నాము. ఆధునిక కాలం ఎలా ఖుర్ఆన్ లోని వాస్తవాలకు దగ్గరగా వస్తున్నదో పాఠకులు సులభంగా గుర్తించగలరు. పైన తెలుపబడిన దృష్టికోణంతో, ఓపెన్ మైండేడ్ పండితులందరూ ఖుర్ఆన్ చదవాలని మా విజ్ఞప్తి. ఇలాంటి ఏ ప్రయత్నమైనా సరే, అది తప్పకుండా ఖుర్ఆన్ గ్రంథం మానవ రచన కాదనే విషయాన్ని పాఠకుడు గ్రహించేలా చేస్తుందని మేము నిశ్శంకోచంగా చెబుతున్నాము.
ఏదేమైనా, మనం దాని వైపు (ఖుర్ఆన్ వైపు) మరలిన కొద్దీ – మొట్టమొదట చీదరించుకుంటూ ఖుర్ఆన్ తెరుస్తారు. త్వరలోనే అది వారిని ఆకర్షిస్తుంది, అత్యశ్చర్యచకితులను చేస్తుంది. చివరికి దానిని గౌరవించేలా కట్టడి చేస్తుంది. … దాని అంశాల ప్రకారం దాని శైలి మరియు దాని లక్ష్యం – నిశ్చలమైంది, ఘనమైంది మరియు తీవ్రమైంది – కనీవినీ ఎరుగనిది మరియు తక్షణమైంది, నిజంగా శుద్ధి చేయునది. అందువలన ఈ ప్రత్యేక గ్రంథం శతాబ్దాలకు తరబడి అన్ని కాలాలలో అత్యంత శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతూ పోతున్నది –గోథె (Goethe, quoted in T. P. Hughes, Dictionary of Islam' p.526)
ప్రపంచ ప్రసిద్ధ ధార్మిక గ్రంథాలలో ఖుర్ఆన్ నిశ్చయంగా ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇలాంటి సాహిత్య తరగతి గ్రంథాలలో తక్కువ వయస్సుదై ఉండి కూడా, ఇది పెద్దపెద్ద జనసముద్రాలపై మహత్తర ప్రభావం చూపిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అది మానవ దృక్పథంలో ఒక కొత్త దశను మరియు ఒక సరికొత్త స్వభావాన్ని సృష్టించింది. మొదట అది అరేబియా ద్వీపకల్పానికి చెందిన అనేక విభిన్న ఎడారి తెగలను పరాక్రమవంతులతో కూడిన ఒక దేశంగా మార్చివేసింది. తర్వాత రాజకీయ – ధార్మిక శక్తితో కూడిన అనేక బృందాలను తయారుచేస్తూ ఇస్లామీయ సామ్రాజ్యాన్ని సృష్టించే దిశలో ముందుకు సాగింది. ఆ పటాలాలు, యూరోపు మరియు తూర్పుదేశాలను చిత్తుగా ఓడించిన అజేయ సైనిక శక్తిగా ఇప్పటికీ ప్రజల హృదయాలలో నిలిచి పోయాయి. – జి. మార్గొలియోథ్ (G. Margoliouth, Introduction to J M. Rodwell's, The Koran, New York: Everyman's Library, 1977, p. VII.)
ఆ బృహత్తర రచన దూరపు పాఠకుడిని కూడా బలంగా మరియు బయటికి పొసగని భావాలతో పిలిచింది – కాలమంత దూరంగా ఉన్న సరే. అంతేగాక మానసిక వికాసంతో కూడా - ఆ బృహత్తర రచన విరోధులను కూడా గెలుచుకుంది – వారు దానిని వ్యతిరేకిస్తూ చదవటం ప్రారంభించి, ఆశ్చర్యచకితులై, చివరికి దాని ఆకర్షణలో పడిపోయి, దానిని గౌరవించడం నుండి తప్పించుకోలేని వారిలా మారిపోయేవారు. అలాంటి బృహత్తర సాహిత్యం – తప్పకుండా మానవ మెదడు యొక్క ఒక అత్యాశ్చర్యకరమైన పని. మరియు మానవుడి ముగింపు గురించి పరిశోధించే ప్రతి ఒక్క వివేకవంతుడైన పరిశోధకుడి అత్యంత ఆసక్తితో నిండిన సమస్య. Dr. Steingass, quoted in T. P. Huges', Dictionary of Islam,pp.526-7
‘ఖుర్ఆన్ ను ముహమ్మద్ రచించారని’ ఊహించే కొందరు ప్రజల వాదనలను పై పరిశోధనలు అంగీకారయోగ్యం కానివిగా చేస్తున్నాయి. సాహిత్యపరంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఈ దివ్యగ్రంథాన్ని రచించి, ఎలా ఒక నిరక్ష్యరాశి, ప్రముఖ రచయితగా మారిపోగలడు? ఆ కాలంలో ఏ మానవుడూ అభివృద్ధి చేయని, కనుగొనని వైజ్ఞానిక వాస్తవాంశాలను ఆయనెలా పలికి ఉంటాడు మరియు సంబంధిత అంశాలలో ఎలాంటి చిన్న తప్పూ లేకుండా ఇదంతా ఎలా రచించి ఉంటాడు? - Maurice Bucaille, The Bible, the Quran and Science, 1978, p.125
ముందుగా ఊహించుకున్న అంశాల మరియు రసజ్ఞాన దృష్టితో దీని సాహిత్య ప్రమాణాలను కొలవలేరు, కానీ ముహమ్మద్ యొక్క సమకాలీనులలో అది చూపిన ప్రభావాల్ని బట్టి దీని సాహిత్య ప్రమాణాలను కొలవ వచ్చు. చిన్నాభిన్నంగా, పరస్పర వైరాలలో మునిగి ఉన్న తెగలను ఇప్పటికీ క్రమశిక్షణతో నిండిన ఒక సంఘటిత భాగంగా కలిసిపోయేలా చేసిన ఆయన పలుకులు వివేకంతో నిండినవి, చాలా శక్తివంతమైనవి మరియు శ్రోతల హృదయాలకు హత్తుకు పోయినవి, నేటికీ అరేబియా ప్రజల మనస్సులను ఏలు తున్నాయనే వాస్తవాన్ని గమనించి నట్లయితే. నిజంగా వాటి వాగ్ధాటి మరియు వకృత్వం పరిపూర్ణమైందని అర్థం అవుతున్నది. ఎందుకంటే, అనాగరిక తెగలలో నుండి ఆధునిక మరియు నాగరిక సమాజాన్ని అది సృష్టించింది. చరిత్ర పుటలలో ఒక సరికొత్త అధ్యాయాన్ని సువర్ణాక్షరాలతో లిఖించింది. - Dr. Streingass, quoted in Hughes', Dictionary of Islam, p.528
అరబీ ఖుర్ఆన్ యొక్క వాగ్ధాటికి, వక్తృత్వానికి జవాబిచ్చే విధంగా తక్కువ స్థాయిలో అయినా సరే, ఏదైనా తయారు చేయాలనే నా పూర్వీకుల కృషిని మరింత ముందుకు తీసుకు వెళ్ళే ప్రయత్నంలో నిమగ్నమయ్యాను. అందులో భాగంగా, క్లిష్టమైన మరియు శ్రేష్ఠమైన చందములోని ఖుర్ఆన్ సూక్తులను చదవడంలో కష్టపడుతూ, వాటిలో కేవలం సందేశం మాత్రమే కాకుండా, ఖుర్ఆన్ మొత్తం మానవ చరిత్రలో ఒక అసాధారణమైన సాహిత్య గ్రంథం అనడాన్ని ఎవ్వరూ తిరస్కరించని విధంగా అవి రచించబడినాయని గ్రహించాను. . . దీని విశేషమైన ‘అసమాన స్వరమేళన’ స్వభావాన్ని దైవవిశ్వాసి పిక్తాల్ తన పవిత్ర గ్రంథంలో ఇలా తెలిపినారు – 'ఆ పఠనం ప్రజలను కన్నీరు కార్చుకునేలా మరియు పారవశ్యంలో తేలియాడేలా చేస్తుంది' – పూర్వ అనువాదాలలో ఈ విషయం పూర్తిగా విస్మరించబడింది; కాబట్టి, అరబీలోని అసలు అమోఘమైన పలుకులతో పోల్చితే, అవి జీవం లేని మరియు నిస్సత్తువతో కూడిన పలుకుల వలే ఉన్నాయి అనడంలో ఆశ్చర్యం లేదు.. - Arthur J. Arberry, The koran interpreted, London : Oxford University Press, 1964, P.X.
ఆధునిక విజ్ఞాన దృష్టి కోణంలో, దాని (ఖుర్ఆన్ యొక్క) క్షుణ్ణమైన పూర్తి పరిశోధన మనల్ని ఆ రెంటి మధ్య ఏకీభావం ఉందనే సత్యాన్ని అంగీకరించేలా చేస్తుంది. ఈ నగ్నసత్యం మాటిమాటికీ పలు సందర్భాలలో స్పష్టంగా గమనించబడింది. ఆనాటి విజ్ఞాన స్థాయిని పరిశీలిస్తే, ఆ అమూల్య వచనాలు ముహమ్మద్ కాలం నాటి ఏ వ్యక్తి ఊహలలోనికైనా వచ్చే అవకాశాన్ని మనం ఆలోచించను కూడా ఆలోచించలేము.
ఈ వాస్తవాలు ఖుర్ఆన్ దివ్యవాణికి అలాంటి విశేష స్థానాన్ని ఇవ్వటాన్ని సమర్ధిస్తున్నాయి. అంతేగాక కేవలం భౌతిక వాద తర్కంపైనే ఆధారపడి ఉన్న వాటిని సరిగ్గా వివరించలేక పోతున్న తన అసమర్ధతను అంగీకరించేలా అవి నిస్పక్షపాత శాస్త్రవేత్తను నిర్బంధిస్తున్నాయి.. - Maurice bucaille, The Ouran and Modern Science, 1981, P.18.
ఇస్లాం ధర్మం
గురించి వారేమన్నారు ?
దివ్యవాణి అవతరించిన పూర్వ ధర్మాలన్నింటి ఉత్తర భాగం మరియు ఉచ్ఛస్థానమే ఇస్లాం ధర్మం. కాబట్టి ఇది అన్ని కాలాలకు మరియు ప్రజలందరికీ వర్తిస్తుంది. ఒక్కసారి క్రింది వాస్తవాలపై దృష్టి సారిస్తే, ఇస్లాం ధర్మం యొక్క ఈ ప్రత్యేక స్థితి స్పష్టం చేసుకోవచ్చు.
మొట్టమొదట – ఒక్క ఖుర్ఆన్ తప్ప, అవతరించిన తన అసలు రూపంలో మరియు మార్పులు – చేర్పులకు గురి కాకుండా ఏ దివ్యగ్రంథమూ ఈనాడు అందుబాటులో లేదు.
రెండవది – మానవ జీవితపు ప్రతి అడుగులో అన్ని కాలాలలో మరియు మొత్తం మానవాళికి మార్గదర్శకత్వం వహించే నిశ్చయమైన దావా ఏ ధర్మంలోనూ కనబడదు. కానీ, ఇస్లాం ధర్మం మొత్తం మానవజాతిని బహిరంగంగా సంభోదిస్తున్నది. మానవజాతి సమస్యలన్నింటికీ ప్రాథమిక మార్గదర్శకత్వాన్ని చూపుతున్నది. అంతేగాక, అది పధ్నాలుగు శతాబ్దాల పరీక్షా కాలంలో అజేయంగా నిలబడింది. అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాయకత్వంలో నిర్మించబడిన ఆదర్శ సమాజాన్ని మరలా నిర్మించేందుకు అవసరమయ్యే సామర్ధ్యాలన్నీ కలిగి ఉంది.
తగిన వనరులు లేకపోయినా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కఠినాతికఠినమైన విరోధులను కూడా ఇస్లాం ధర్మంలో వచ్చేలా చేయడమనేది ఒక మహాద్భుతం. విగ్రహారాధకులుగా, తమ పూర్వీకులను గుడ్డిగా అనుసరించే అంధ విశ్వాసులుగా, జాత్యహంకారంలో విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి మానవజాతి ఔన్నత్యాన్ని మరియు మానవ రక్తాన్ని గౌరవించని వారుగా జీవిస్తున్న అనాగరిక ప్రజలు ఇస్లాం మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గదర్శకత్వంలో అత్యంత క్రమశిక్షణతో కూడిన నాగరిక సమాజ సభ్యులుగా మారిపోయారు. కేవలం సత్ ప్రవర్తనే సాంఘిక అంతస్తు మరియు హోదా యొక్క ఏకైక గీటురాయి అని ప్రకటించింది. తద్వారా ఇస్లాం ధర్మం వారి కొరకు ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలకు మరియు మానవులలో గౌరవ స్థానానికి చేరుకునే మార్గాన్ని తెరిచింది. మానవ ప్రకృతి సహజత్వానికి అనుగుణ్యంగా ఉండటం వలన కాలానుగుణంగా మారని మానవ నైజానికి అన్ని కాలాలలో వర్తించే ప్రాథమిక ధర్మాదేశాలు మరియు నియమనిబంధనల ద్వారా వారి సామాజిక, సాంస్కృతిక, నైతిక మరియు ఆర్థిక జీవితాల్ని తీర్చిదిద్దింది.
క్రైస్తవ పాశ్చాత్య దేశాలు ఆరంభంలోని ఇస్లాం ధర్మం యొక్క అసాధారణ, విలక్షణ సాఫల్యాన్ని చిత్తశుద్ధితో అర్థం చేసుకునే బదులు, తమ దురదృష్టం కొద్దీ దానిని తమ శత్రు ధర్మంగా పరిగణించాయి. క్రూసేడుల శతాబ్దాలలో ఈ ధోరణి బలాన్ని పుంజుకుంది మరియు ప్రేరేపించబడింది. ఇస్లాం ధర్మం యొక్క స్వచ్ఛమైన రూపాన్ని నాశనం చేసే సాహిత్య రచనలు చాలా ఎక్కువ మోతాదులో తయారు చేయబడినాయి. అయితే, ఇస్లాం ధర్మం తనలోని స్వచ్ఛతను ఆధునిక పండితులు ఇస్లాం ధర్మంపై చేస్తున్న ధైర్యవంతమైన మరియు నిస్పక్షపాతమైన పరిశోధనల కొరకు పొరలు పొరలుగా తెరవసాగింది. అందువలన ఆ బూటక సాహిత్యం తన కుటిల లక్ష్యాన్ని చేధించలేకపోయింది.
కాబట్టి, ఆధునిక కాలంలోని అనేక గొప్ప ముస్లిమేతర పండితులు ఇస్లాం గురించి వ్యక్తం చేసిన తమ అభిప్రాయాలను ఇక్కడ పొందు పరుస్తున్నాము. తన పక్షం వైపు వాదించేందుకు సత్యానికి ప్లీడరు యొక్క ఆవశ్యకత ఉండదు. అయితే చాలా కాలం పాటు సాగిన ఆ ఇస్లాం వ్యతిరేక బూటకపు ప్రచారం, స్వచ్ఛంగా మరియు నిస్పక్షపాతంగా ఆలోచించే వ్యక్తుల మనస్సులలో కూడా అయోమయాన్ని సృష్టించింది.
నిస్పక్షపాతంగా ఇస్లామీయ ధర్మం యొక్క ఉన్నత ప్రమాణాలు మరియు విలువలను కనుగొనటంలో క్రింది పరిశీలనలు సహాయపడతాయని ఆశిస్తున్నాము.
Ø అది (ఇస్లాం) సన్యాసి సంబంధమైన ప్రవర్తన చోట సహజ మానవ ప్రవర్తనను నెలకొల్పింది. బానిసలలో ఆశలు చిగురింప జేసింది. మానవజాతికి సహోదరత్వాన్ని ఇచ్చింది. మానవ స్వభావపు ప్రాథమిక వాస్తవాలను గుర్తింపజేసింది. కానన్ టైలర్. Canon Taylor, Paper read before the Church Congress at Walverhamton, Oct.7,1887 Quoted by Arnold in The Preaching of Islam , pp. 71-72.
Ø ఇస్లాం యొక్క అత్యద్భుత ఆదర్శాలలో ఒకటి ‘న్యాయ బుద్ధి’ ఎందుకంటే నేను ఖుర్ఆన్ చదివికొద్దీ, అందులో రోజువారీ జీవితపు చైతన్యవంతమైన నియమనిబంధనలు కనుగొంటూ పోయాను - అవి విశ్వవ్యాప్తంగా వర్తించే ప్రతిదిన ఆదర్శవంత జీవితంలోని ఆచరణాత్మక నైతిక విలువలే గానీ భావగర్భిత అనుభూతివాదం ఏమాత్రం కాదు. సరోజినీ నాయుడు Sarojini Naidu, Lectures on "The Ideals of Islam" see Speeches and Writings of Sarojini Naidu, Madras, 1918 p.167.
Ø ప్రపంచ చరిత్ర స్పష్టంగా వివరించింది. అయినా, కథలలో తీవ్రవాద ముస్లిం యోద్ధులు ప్రపంచ దేశాల్ని జయిస్తూ, గెలిచిన ప్రాంతాలలోని జాతులపై కత్తి మొన గురిపెట్టి, వారు ఇస్లాం స్వీకరించేలా చేసిందనటనం ఎల్లప్పుడూ కొందరు చరిత్రకారులు అత్యంత మూఢావేశంతో చేర్చుతూ వచ్చిన కల్పితాలలో ఒకటి. De Lacy O'Leary, Islam at the Crossroads, London, 1923 p.8.
Ø ఇస్లాం మానవజాతికి తిరిగి సేవ చేసే స్థితిలో ఉంది. తుదకు యూరోపు కంటే దగ్గరగా అది తూర్పుకు చేరువలో నిలబడి ఉంది. అంతేగాక అది వాటితో సహాయసహకారాలు మరియు అవగాహనలో అద్భుతమైన అంతర్జాతీయ సంబంధాలు కలిగి ఉంది. చరిత్రలో మానవజాతి యొక్క అనేక విభిన్న జాతులను ఒక్కటి చేసి వారిలో సమానత్వం, సమాన అవకాశాలు, సమాన ప్రయత్నాలు నెలకొల్పటంలో ఏ సమాజమూ అంతటి విజయం సాధించిన రికార్డు మనకు కనబడదు. పరిష్కారం అసాధ్యమనిపించేలా కనబడే వివిధ జాతుల మరియు సంస్కృతుల మధ్య బయటపడే పరస్పర వ్యతిరేక అంశాల మధ్య సంధి కుదిర్చే శక్తి నేటికీ ఇస్లాం ధర్మం కలిగి ఉంది. ఒకవేళ ఏనాడైనా తూర్పు మరియు పడమరలలోని గొప్ప దేశాల మధ్య ఉన్న వైరుధ్యం చోట సహాయసహకారాలు నెలకొల్పాలంటే, ఇస్లాం మధ్యవర్తిత్వం తప్పనిసరి షరతై ఉంది. తూర్పుతో యూరోపుకు గల సమస్యకు మహోన్నత పరిష్కారం దాని (ఇస్లాం) చేతులలో ఉంది. ఒకవేళ అవి కలిసిపోతే, శాంతి స్థాపించబడే అవకాశాలు పెరిగిపోతాయి. కానీ, ఒకవేళ యూరోపు ఇస్లాం యొక్క తోడ్పాటును తిరస్కరిస్తే, అది శత్రువుల మధ్య తనను తాను విసిరి వేసుకున్నట్లవుతుంది. ఉభయుల కొరకు దాని పరిమాణాలు చాలా తీవ్రంగా ఉండ వచ్చు. H. A. R. Gibb, Whither Islam, London, 1932, p.379.
Ø నేనెప్పుడూ ముహమ్మద్ యొక్క ధర్మాన్ని దాని యొక్క సజీవత్వం వలన ఉన్నతంగా చూసాను. నా దృష్టిలో కేవలం ఈ ధర్మం మాత్రమే, కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులను తనలో కలుపుకునే శక్తిసామర్థ్యం కలిగి ఉండి. ప్రతి కాలంలోనూ స్వయంగా ఇతరులను ఆకర్షిస్తుంది. నేను ఆయన గురించి చదివాను – ఆశ్చర్యకరమైన వ్యక్తి. నా అభిప్రాయంలో ఆయన క్రైస్తు విరోధి పోలికలకు బహుదూరం మరియు ఆయనను మానవజాతి సంరక్షకుడనే పేరుతో తప్పకుండా పిలవాలి. ఒకవేళ అలాంటి వ్యక్తి ఆధునిక ప్రపంచ నాయకత్వం వహిస్తే, అతడు సర్వతా శాంతి మరియు ఆనందం వ్యాపించేలా దాని సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తాడని నేను నమ్ముతున్నాను. నేటి యూరోపు ముహమ్మద్ యొక్క ధర్మాన్ని స్వీకరించడం మొదలు పెట్టినట్లుగా, రేపటి రోజున మొత్తం యూరోపు దానిని స్వీకరిస్తుందని నేను భవిష్యవాణి పలుకుతున్నాను. జార్జి బెర్నార్డ్ షా G.B. Shaw, The Genuine Islam, Vol.1, No.81936.
Ø ముస్లింలలో జాత్యంహంకారం తుడిచి వేయడమనేది ఇస్లాం యొక్క అద్వితీయ విజయాలలో ఒకటి. నేటి సమకాలీన ప్రపంచంలో విస్తృతంగా ఇస్లాం యొక్క ఈ గొప్ప శుభలక్షణం గురించి ప్రచారం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది... A.J.Toynbee, Civilization on Trial, New York, 1984, p.205.
Ø ఇస్లాం ధర్మం అభివృద్ధి మానవ చరిత్రలోనే ఒక అత్యద్భుత సంఘటన. పూర్వం ఉపేక్షించబడిన ప్రాంతం మరియు ప్రజల మధ్య నుండి ఉద్భవించి, ఒక్క శతాబ్దం లోపలే భూమండలం యొక్క సగం కంటే ఎక్కువ భాగంపై విస్తరించి, ఆనాటి మహాసామ్రాజ్యాలను ఓడించి, ప్రజలలో చాలా కాలం నుండి పాదుకుని ఉన్న మతాలను తొలగించి, జాతుల మనస్తత్వాలను సరిదిద్ది, సరికొత్త ప్రపంచాన్ని నిర్మించింది – అదే ఇస్లామీయ ప్రపంచం. ఈ అభివృద్ధిని ఎంత దగ్గరగా పరిశీలిస్తే, అంత అద్భుతంగా అది మనకు కనబడుతుంది. ఇతర గొప్ప మతాలు తమ మార్గాన్ని చాలా నెమ్మదిగా, అడుగడుగునా కష్టాలతో కూడిన ప్రయాసతో ముందుకు సాగుతూ, చివరికి ఆ కొత్త ధర్మం స్వీకరించిన శక్తివంతులైన చక్రవర్తుల సహకారంతో నిలదొక్కుకున్నాయి. ఉదాహరణకు క్రైస్తవ మతానికి చక్రవర్తి కాన్షాంటిన్ (Constantine), బౌద్ధ మతానికి చక్రవర్తి అశోక మరియు జొరాష్ట్రియన్ మతానికి సైరస్ (Cyrus) – ప్రతి ఒక్క చక్రవర్తీ తను ఎంచుకున్న మతం కొరకు తన అధీనంలోని ప్రాపంచిక బలాన్నంతటినీ కేంద్రీకరించారు. ఇస్లాం ధర్మం విషయంలో అలా జరగలేదు. అక్కడక్కడా చెల్లాచెదురుగా నివాసమేర్పరుచుకున్న దేశదిమ్మరి తెగల ఎడారి భూమిలో ఉద్భవించింది. ఇస్లాంకు పూర్వం ఆ తెగలకు మానవ చరిత్రలో ఎలాంటి గుర్తింపు లేకపోయింది. అత్యంత బలహీనంగా ఉన్న ఆ మానవుల మద్దతుతో, రకరకాల అస్త్రశస్త్రాలతో చాలా శక్తివంతంగా ఉండిన శత్రుసైన్యాలపై ఇస్లాం తన ఆకస్మిక దాడిని సాహసోపేతంగా మొదలు పెట్టింది. అయినా వారిపై సునాయాసంగా అద్భతమైన ఘనవిజయం సాధించింది. యూరోపులోని నైరుతి దిక్కులోని పైరెనీస్ అనే పర్వతశ్రేణుల నుండి హిమాలయాల వరకు, మధ్యేసియాలోని ఎడారి ప్రాంతం నుండి మధ్యాఫ్రికాలోని ఎడారి ప్రాంతం వరకు తీక్షణమైన ఆ అర్థచంద్రుడు తిరుగులేని జైత్రయాత్ర చేయడం తర్వాతి రెండు – మూడు తరాల ప్రజలు చూడగలిగారు. A. M. L. Stoddard, quoted in "Islam: The Religion of All Prophets" Begum Bawani Waqf Karachi Pakistan, p.56.
Ø విశాల దృక్పథంతో శబ్దవ్యుత్పత్తి మరియు చారిత్రకపరంగా చూసినప్పుడు ఇస్లాం ధర్మం తప్పకుండా ఒక హేతువాద ధర్మం అని గ్రహించగలరు. నిర్వచనం ప్రకారం హేతవాదం అంటే ఇస్లామీయ పవిత్ర గ్రంథాలలోని అంటే ఖుర్ఆన్ మరియు హదీథులలో ప్రతిపాదించబడిన నియమనిబంధనల ఆధారంగా తయారైన ధార్మిక విశ్వాసాల వ్యవస్థ. ఇక్కడ హదీథులు అంటే పవిత్ర ఖుర్ఆన్ లోని నియమనిబంధనలను ఆచరణాత్మకంగా వివరించే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు.
ఖుర్ఆన్ బోధనలు వాటి స్థానంలో స్థిరంగా ప్రాథమిక ఆరంభ బిందువుగా ఉంచబడినాయి. మరియు దానిలో అన్ని చోట్లా దేవుడి యొక్క ఏకదైవత్వ సిద్ధాంతం గొప్ప మహిమతో, ఘనతతో, నిశ్చలమైన పవిత్రత మరియు ఎలాంటి సందేహాలకు తావులేని దృఢత్వంతో మాటిమాటికీ పేర్కొనబడింది. ఇస్లాంను బోధనలలో వలే కాకుండా ఇంత స్పష్టంగా దేవుడి అద్వితీయ లక్షణం పేర్కొనబడటం అసాధ్యం. ఇస్లాం ధర్మం యొక్క ఈ ప్రాథమిక విశ్వాసపు ప్రామాణికత్వం మరియు ప్రాతివ్రత్యం, అది ఉద్భవించిన నియమం యొక్క సాధారణత్వం, దానిని ప్రచారం చేసే బృందాల మనస్పూర్తి దృఢవిశ్వాసం – మొదలైనవి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మప్రచార కృషి సాఫల్యానికి కొన్ని కారణాలుగా పేర్కొనవచ్చు. క్లిష్టమైన ఇతర మతాల సిద్ధాంతాలన్నింటినీ నిలువునా తునాతునకలు చేసేదే సూటీ అయిన ఏకదైవత్వ సిద్ధాంతం. ఈ స్పష్టమైన ఏకదైవత్వ సిద్ధాంత పర్యవసానంగా ఇస్లాం ధర్మం సులభమైన పదాలను మాత్రమే అర్థం చేసుకునే సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండి, మానవుల అంతరాత్మలను జయించే అత్యద్భుత శక్తి ఉంది కలిగి ఉందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. Edward Montet, "La Propagande Chretienn et ses Adversaries Musulmans", Paris, 1890, quoted by T.W. Arnold in The Preaching of Islam, London, 1913, pp 413-414.
Ø మామూలు భావంలో నేను ముస్లింను కాదు. కానీ ‘దేవుడికి సమర్పించుకున్నవాడు’ అనే భావంలో నేను ‘ముస్లిం’ అనే భావిస్తున్నాను. ఇంకా నేను ఖుర్ఆన్ లో అవతరించబడిన వాటిని నేను నమ్ముతాను. ఇతర ఇస్లామీయ దృక్పథాలలోని సత్యమైన దివ్యజ్ఞాన ఖజానా నుండి నేనూ మరియు ఇతర పాశ్చాత్యులు ఎంతో నేర్చుకోవలసి ఉంది. మరియు "భవిష్యత్తులో ఏక ధర్మ సిద్ధాంత రూపాన్ని అందజేసే వాటిలో ఇస్లాం తప్పకుండా సాటిలేని బలమైన ధర్మం కాగలదు. W.MontgomeryWatt, Islam and Christianity Today, London, 1983, p. IX.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
గురించి వారేమన్నారు ?
క్రూసేడు శతాబ్దాల కాలంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు విరుద్ధంగా అన్నిరకాల అభాండాలు, అపనిందలు కనుగొనబడినాయి. కానీ అన్యమత సహనం మరియు భావస్వేచ్ఛ ల ముద్రతో ఆధునిక కాలం మొదలైన తర్వాత, ఆయన యొక్క జీవితం మరియు గుణగణాలను వర్ణించడంలో పాశ్చాత్య రచయితల వ్రాతలలో గొప్ప మార్పు వచ్చింది. దీనికి నిదర్శనంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి కొందరు ముస్లిమేతర పండితులు వెలుబుచ్చిన అభిప్రాయాలు ముందు ముందు రాబోతున్నాయి.
అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అతి గొప్ప సత్యాన్ని కనుగొనేందుకు పాశ్చాత్యులు మరో అడుగు ముందుకు వేయవలసి ఉన్నది. అదే ఆయన సమస్త మానవాళి కొరకు పంపబడిన చిట్టచివరి నిజమైన దైవప్రవక్త అనే అసలు మహాసత్యం. యథార్థత మరియు సత్యజ్ఞానం స్పష్టంగా బహిర్గత మవుతున్నప్పటికీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అర్థం చేసుకోవడంలో పాశ్చాత్యులు చిత్తశుద్ధి మరియు యథార్థంతో కూడిన నిజప్రయత్నం చేయడం లేదు. ఆయన యొక్క న్యాయవర్తన, నైతిక నిష్ఠత, సజ్జనత, చిత్తశుద్ధి, సరళత మరియు సాధించిన కార్యములపై స్పష్టమైన ప్రశంసలు కురిపిస్తున్నప్పటికీ, తను దైవం ఎంచుకున్న చిట్టచివరి ప్రవక్త అనే ఆయన వాదనను వారు బహిరంగంగా మరియు అంతర్గతంగా తిరస్కరించడం చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ మనస్సులలో అన్వేషించవలసిన మరియు యథార్థత అనబడే దాని గురించి మరోసారి పునర్విమర్శ చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. ఆయన ప్రవక్తత్వం గురించి నిస్పక్షపాత, తార్కిక, హేతువాద మరియు యథార్థ నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితపు కొన్ని ముఖ్యమైన ఘటనలు పేర్కొనబడినాయి.
నలుభై ఏళ్ళ వయస్సు వరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రాజనీతిజ్ఞుడు, ప్రముఖుడు, బోధకుడు లేదా ఒక ఉపన్యాసకుడిగా పేరు సంపాదించలేదు. ఆయన మెటా ఫిజిక్స్, నైతికత, చట్టం, రాజకీయాలు, ఆర్థికశాస్త్రం లేక సాంఘిక శాస్త్రం గురించి ఏనాడూ చర్చిస్తూ కనబడలేదు. మహోన్నత గుణగణాలు, ఉన్నత స్వభావం, మంచి లక్షణాలు, నైతికత మరియు మంచి సంస్కారం కలిగి ఉన్నారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇంకా భవిష్యత్తులో ఆయన గొప్ప విషయం చేయబోతున్నారని లేదా ఏదో విప్లవం తీసుకు రాబోతున్నారని ప్రజలు భావించేలా చేసే ప్రత్యేకత, అద్భుత స్వభావం ఏమీ ఆయనలో బహిర్గతమవలేదు. అయితే, నూతన సందేశంతో (హీరా) గుహ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయనలో పూర్తిగా మార్పు వచ్చింది. "అలాంటి ఉత్తమ గుణగణాలు కలిగిన వ్యక్తి హఠాత్తుగా ఒక వంచకుడిగా మారిపోవటం' మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తగా దావా చేయడం మరియు తన ప్రజల కోపాన్నంతటినీ ఆహ్వానించడం సాధ్యమేనా?" ఎవరైనా ఇలా అడగవచ్చు:"ఏ కారణం వలన ఆయన ఆ మొత్తం కష్టాలను, హింసలను అనుభవించారు?" తన ధర్మప్రచారాన్ని ఆయన వదిలి వేస్తే, ఆయన ప్రజలు ఆయనను తమ రాజుగా పట్టాభిషేకం చేస్తామని, తమ సంపదనంతటినీ ఆయన పాదాల చెంత సమర్పిస్తామని ప్రతిపాదించారు. కానీ మనస్సును ఆకర్షించే, ఆశలు పుట్టించే వారి ఆకర్షణీయమైన ప్రతిపాదనలను ఆయన సున్నితంగా తిరస్కరించారు. అన్ని రకాల అవమానాలు, సాంఘిక బహిష్కరణలు, తమ ప్రజలు పెడుతున్న శారీరక హింసలనూ భరిస్తూ, ఒంటరిగానే తన ధర్మప్రచారాన్ని కొనసాగించారు. "కేవలం అల్లాహ్ యొక్క సహాయం, అల్లాహ్ యొక్క సందేశాన్ని ప్రజలకు అందజేయాలనే ఆయన యొక్క దృఢనిశ్చయం మరియు లోతుగా పాతుకుపోయిన ఆయనలోని దైవవిశ్వాసం మొదలైన కారణాలు కాకుండా మరి దేని వలన ఇస్లాం చివరికి మానవజాతి ఉద్ధరణకు, ఉన్నతికి నిష్కపటంగా పాటుపడే ఏకైక మార్గంగా బహిర్గతమైంది మరియు తన ప్రాణాలు తీయాలని దృఢనిశ్చయంతో ఉన్న ప్రత్యర్థుల మొత్తం విరోధం మరియు కుతంత్రాల ఎదుట ఆయన నిశ్చలమైన ఒక పర్వతం వలే నిలబడగలిగారు?" "అంతేగాక, ఒకవేళ ఆయన క్రైస్తవుల మరియు యూదులతో పోటీ పడే ప్లానుతో వచ్చి ఉండినట్లయితే, జీసస్, మోసెస్ మరియు ఇతర దైవప్రక్తలను ఆయన ఎందుకు విశ్వసించారు మరియు అలా విశ్వసించడం ఇస్లామీయ ధర్మ విశ్వాసం యొక్క ఒక మూలస్థంభమని, అలా విశ్వసించని వారు ముస్లిం కారు అని ఎందుకు బోధించారు? "
"ఆయన ప్రవక్తత్వాన్ని ఋజువు చేసే ఒక స్పష్టమైన నిదర్శనం – నిరక్ష్యరాసి అయి ఉండి, నలుభై ఏళ్ళ పాటు అతి సామాన్య మరియు ప్రశాంత జీవితం గడిపుతూ ఉండినా, ఆయన ధర్మ సందేశం ప్రచారం చేయడం మొదలు పెట్టినపుడు, ఆయన ఎదురుగా మొత్తం అరేబియా ప్రాంత ప్రజలు భయభక్తులతో, విస్మయంతో, ఆశ్చర్యంతో నిలబడిపోయారు. అంతేగాక తన అద్భుతమైన వక్తృత్వం, వాగ్ధాటి, వాక్పటిమ మరియు వాక్ఛక్తికి ఆకర్షితులై పోయారు." అదెంత అద్వితీయమైన దంటే, అరేబియా ప్రాంతంలోని సుప్రసిద్ధ కవులు, ధర్మప్రచారకులు మరియు ఉపన్యాసకులు అందరూ కలిసి ఆ దివ్యపలుకులను పోలిన వాటిని తయారు చేయలేక ఓడిపోయారు. "అంతేగాక, ఆ కాలంలోని ఏ మానవుడూ గ్రహించలేని, ఖుర్ఆన్ లో పేర్కొనబడిన వైజ్ఞానిక వాస్తవాల నిదర్శనాలను ఆయనెలా ఉచ్ఛరించగలిగారు?"
చివరి మాటగా, బలం పుంజుకున్న మరియు ఆధిపత్యం లభించిన తర్వాత కూడా ఆయన ఎందుకు కఠిన జీవితం గడిపారు? ఆయన చనిపోతున్నపుడు పలికిన ఈ పదాల గురించి లోతుగా ఆలోచించండి:" మేము అంటే ప్రవక్తల సమాజం వారసత్వాన్ని మిగల్చం. మేమేది మిగిల్చినా అది దానం కొరకే." వాస్తవానికి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, భూమండలంపై మానవ జీవితం ఆరంభం నుండి వివిధ ప్రాంతాలలో మరియు వివిధ కాలాలలో పంపబడిన ప్రవక్తలందరి యొక్క చిట్టచివరి లింకు.
ఘనమైన లక్ష్యం, అతి కొద్ది వనరులు మరియు ఆశ్చర్యచకితులు చేసే ఫలితాలు – ఒకవేళ ఇవి మూడూ మానవ ప్రతిభ, బుద్ధికుశలత, కౌశల్యము, నైపుణ్యము మొదలైన వాటికి కొలమానాలైతే, ఆధునిక చరిత్రలోని ఏ మహాపురుషుడినైనా ముహమ్మద్ తో సరిపోల్చే సాహసం ఎవరు చేయగలరు? అత్యంత ప్రసిద్ధ మానవులు కేవలం అధునాతన ఆయుధాలు, చట్టాలు మరియు సామ్రజ్యాలు మాత్రమే కనిపెట్టారు.. ఒకవేళ వారేదైనా కనిపెట్టారు అంటే, అవి భౌతిక శక్తులను మించి మరేమీ కనిపెట్టలేదు. అవి కూడా తరుచుగా వారి కళ్ళముందే నశించి పోయాయి. అయితే ఆయన కేవలం ప్రజలు మరియు రాజవంశాలను, సైనిక బృందాలను, చట్టాలను, సామ్రాజ్యాలను కూకటి వ్రేళ్ళతో సహా కుదిపివేయటమే గాకుండా భూమండలంపై నివసిస్తున్న ఆనాటి మూడో వంతు జనాభాలోని మిలియన్ల కొద్దీ వ్యక్తులను కూడా ప్రభావితం చేసారు; దాని కంటే ఎక్కువగా బలిపీఠాలను, కల్పిత దేవుళ్ళను, సిద్ధాంతాలను, నమ్మకాలను మరియు ఆత్మలను ... కూడా కుదిపి వేసారు. ... విజయ పరంపరలలో ఆయన చూపే సంయమనం మరియు సహనం, ఆయన యొక్క అభ్యుదయేచ్ఛ .... మొత్తం అన్నీ ఒకే విషయం వైపు కేంద్రీకరణ మరియు రాజ్యాధికారంపై నిరాసక్తత; ఆయన యొక్క నిరంతర ఆరాధనలు, ఆయనపై అవతరించే అత్యాద్భుత దివ్యవాణి, ఆయన మరణం మరియు ఆయన మరణం తర్వాత సాధించిన తిరుగులేని విజయాలు; ఇవన్నీ ఒక వంచకుడిని బలపరచడం లేదు. అయితే అవి ఒక దివ్యమైన సిద్ధాంతాన్ని పునఃస్థాపించేందుకు వీలుగా ఇవ్వబడిన మహాశక్తి ఆయనకు ప్రసాదించిన స్థిరమైన దృఢవిశ్వాసాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ సిద్ధాంతం రెండు దశలలో ఉంది – ఏకదైవత్వం మరియు ఏ సృష్టితాలతోనూ పోల్చలేని ఆయన యొక్క ప్రత్యేక ఆకారం; మొదటిది ఎవరు దేవుడనే మరియు రెండోది ఎవరు దేవుడు కాదనే వాస్తవాన్ని తెలుపుతున్నది. ఒకటి అసత్య దైవాలను ఖడ్గంతో తునాతునకలు చేస్తుంటే మరొకటి పదాలతో దివ్యాలోచనలు రేకెత్తిస్తున్నది.
తత్వవేత్త, ఉపన్యాసకుడు, దూత, ప్రవక్త, ధర్మశాస్త్రకర్త, యోద్ధుడు, గొప్ప ఆచోచనల అధిపతి, జాతీయ సిద్ధాంతాలను పునఃస్థాపించినవాడు, రూపం గీయబడని ప్రఖ్యాత బోధకుడు; ఒకే ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో తేలియాడే దాదాపు ఇరవై సామ్రజ్యాల స్థాపకుడు .... ముహమ్మద్. మానవ గొప్పదానాన్ని కొలవగలిగే ప్రమాణాలన్నింటి ద్వారా కొలవబడితే, ఆయనకు సాటిగా ఎవరైనా నిలబడగలరా అని మేము ప్రశ్నిస్తున్నాము? Lamartine, Histoire de IA Turquie, Paris 1854 Vol.11, pp.276-77.
మనల్ని ఆశ్చర్యపరచ వలసింది ఆయన ధర్మప్రచారం కాదు గానీ ఆయన ధర్మం సంపాదించిన స్థిరత్వం మరియు శాశ్వతత్వం; మక్కా మరియు మదీనాలలో ఆయన చెక్కిన అదే స్వచ్ఛమైన మరియు పరిపూర్ణమైన ప్రభావ ముద్ర, ఖుర్ఆన్ ను వదిలిపెట్టి తమ మతం లేదా సిద్ధాంతం అవలంబించమని 14 శతాబ్దాలలో భారత్, ఆఫ్రికా మరియు టర్కీ దేశాలలో ప్రేరేపించిన అనేక ఉద్యమాలను తట్టుకుని నేటికీ సురక్షితంగా ఉండటం; వారి ధర్మం యొక్క అసలు ఉద్ధేశ్యాన్ని బలహీనపర్చాలని మరియు మానవుడి ఇంద్రియాలకు మరియు ఊహలకు అందని విధంగా భక్తి, శ్రద్ధలను తగ్గించాలని ప్రయత్నించిన అలాంటి దురాకర్షణలకు లోను కాకుండా ముహమ్మదీయులు స్థిరంగా (ఇస్లాంపై) నిలబడటం. (గురించి మనం ఆశ్చర్యపడాలి) అల్లాహ్ యే దేవుడని మరియు ముహమ్మద్ ఆయన ప్రవక్త అని విశ్వసించడమనేది ఇస్లాం యొక్క సాక్ష్యప్రకటన సరళమైంది మరియు ఎలాంటి మార్పు చెందనిది. కళ్ళకు కనబడే విగ్రహ రూపం లేదా చిత్రపటం దైవానికి ఇచ్చి, ఆయన యొక్క వివేకవంతమైన, మహోన్నతమైన రూపాన్ని ఇస్లాం ఎన్నడూ దిగజార్చలేదు. ప్రవక్తను గౌరవించడంలో మానవ ఔన్నత్య కొలమానాలను ఎన్నడూ హద్దుమీరలేదు; మరియు ఆయన యొక్క సజీవ ఉపదేశాలు, ఆయన సహచరుల కృతజ్ఞతాభావాన్ని విచక్షణ, హేతువు మరియు ధర్మాజ్ఞల హద్దులలో ఉండేలా చేసాయి. ఎడ్వర్డ్ గిబ్బన్ మరియు సిమన్ ఓక్లే Edward Gibbon & Simon Ocklay, History of the Saracen Empire, London 1870, p.54.
ఆయన సీజర్ మరియు పోప్ ల ఏకరూపం; అయితే, ఆయన - పోప్ ఆడంబరాలు లేని పోప్ మరియు సీజర్ సైన్యం లేని సీజర్: అయన ఆజ్ఞల కోసం తయారుగా వేచి ఉన్న సైన్యం లేదు, అంగరక్షకుడు లేడు, రాజప్రాసాదం లేదు, నిర్ణీత ఆదాయం లేదు; ఒకవేళ ఎవరైనా వ్యక్తి దివ్యాజ్ఞలను అనుసరించి పరిపాలించాడని చెప్పాలంటే, ఆ వ్యక్తి ముహమ్మద్ మాత్రమే కాగలడు, ఎందుకంటే పరికరాలు, ఆయుధాలు మరియు వాటి సహాయం లేకుండానే ఆయన వద్ద అంతటి శక్తి ఉండింది. బోస్వర్థ్ స్మిత్ Bosworth Smith, Mohammad and Mohammadanism, London 1874, p.92.
అరేబియా యొక్క గొప్ప ప్రవక్త యొక్క జీవిత చరిత్ర మరియు గుణగణాల గురించి అధ్యయనం చేసి ‘ఆయనెలా బోధించారు మరియు ఆయనెలా జీవించారు’ అనేది తెలుసుకున్న వారెవరైనా, సర్వశ్రేష్ఠుడి యొక్క ఆ మహాప్రవక్తను గౌరవించకుండా ఉండటం అసాధ్యం. నేను మీముందు ఉంచుతున్న వాటిలోని అనేక విషయాలు చాలా మందికి తెలిసి ఉండవచ్చు. అయినా నేను వాటిని చదవిన ప్రతిసారీ, ఆ మహా అరబీ బోధకుడి వైపు ఒక సరికొత్త ప్రశంసామార్గం మరియు సరికొత్త గౌరవభావం నాలో కలుగుతాయి. అనిబీసెంటు Annie Besant, The lift and Teachings of Muhammad, Madras 1932, p.4
తను నమ్మన విశ్వాసాలకు బదులుగా హింసలకు, పీడనలకు గురి కావడానికి ఆయన తయారు కావడం, ఉన్నత సంస్కారాలు మరియు గుణగణాలు కలిగిన సజ్జనులు ఆయనను విశ్వసించడం మరియు తమ నాయకుడిగా ఎంచుకోవటం, ఆయన సాధించిన అంతిమ విజయం – ఇవన్నీ ఆయన యొక్క ప్రాథమిక సజ్జనత్వం, నైతిక నిష్ఠత, చిత్తశుద్ధి, న్యాయవర్తన, సరళతను సూచిస్తున్నాయి. ముహమ్మద్ ఒక వంచకుడు అనే భావన లేపే సమస్యలు అది పరిష్కరించే వాటి కంటే అనేక రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనా, పాశ్చాత్య దేశాలలో ముహమ్మద్ కంటే తక్కువ స్థాయిలో, చరిత్రలోని ఏ గొప్ప వ్యక్తీ ప్రశంసించబడలేదు. W.Montgomery, Mobrumad at Mecca Oxford, 1953, p.52
ముహమ్మద్, దేవునిచే ప్రేరేపితమైన మరియు ఇస్లాం స్థాపించిన వక్తి, ఆయన దాదాపు క్రీ.శ. 570లో విగ్రహారాధనలలో మునిగి ఉన్న ఒక అరేబియా వంశంలో జన్మించారు. అనాథగా జన్మించారు. ఆయన ఎల్లప్పుడూ ప్రత్యేకంగా నిరుపేదలు మరియు అక్కర గలవారు, వితంతువులు మరియు అనాథలు, బానిసలు మరియు తక్కువ జాతి వారి గురించి చింతించేవారు. 20 ఏళ్ళ వయస్సులో ఆయన ఒక ఉత్తమ వ్యాపారవేత్తగా పేరు సంపాదించారు మరియు ఒక ఐశ్వర్యరాలైన మహిళ యొక్క వ్యాపార బృందానికి నాయకత్వం వహించారు. వయస్సులో 15 ఏళ్ళు చిన్నవారైనప్పటికీ, ఆయనను ఆమె పెళ్ళి చేసుకుంది. ఆమె బ్రతికి ఉన్నంత కాలం ఆయన ఆమెను శ్రద్ధగా చూసుకునే భర్తగా జీవించారు. ఆయనకు పూర్వం వచ్చిన ప్రతి మహా ప్రవక్త వలే, ఆయన కూడా దేవుడి పలుకు అందజేసే బాధ్యతలో కొరతగా ఉండిన తన సహజ బడియంతో పోరాడారు. కానీ దైవదూత 'పఠించు' అని ఆజ్ఞాపించాడు. ఇప్పటి వరకు ఆయన చదవడం, వ్రాయడం రాని నిరక్ష్యరాసిగా మనకు తెలుసు. కానీ, భూమండలంపై ఎక్కువ శాతం ప్రజలలో విప్లవం తీసుకు వచ్చిన “దేవుడు ఒక్కడే” అనే దివ్యవాణి పలుకులను ఆయన పలకడం ప్రారంభించారు ".
అన్నింటిలోనూ ముహమ్మద్ మిక్కిలి ఆచరాణ్మకంగా ఉండేవారు. తన కుమారుడు ఇబ్రాహీమ్ చనిపోయిన రోజునే, గ్రహణం పట్టింది. దేవుడు స్వయంగా సంతాపం చెందాడనే పుకార్లు వ్యాపించసాగాయి. అపుడు ముహమ్మద్ ఇలా ప్రకటించారు, 'గ్రహణం పట్టడం అనేది ఒక ప్రకృతి సహజమైన ప్రక్రియ. ఒక మానవుడి పుట్టుకతో లేదా చావుతో దానిని చేర్చడమనేది ఒక మూర్ఖత్వం క్రిందికి వస్తుంది. ముహమ్మద్ మరణించగానే ఆయనకు దైవత్వాని ఆపాదించే ప్రయత్నం జరిగింది. కానీ, ఆయన తర్వాత ప్రభుత్వ అధికారం చేపట్టిన పరిపాలక వారస్తుడు ధార్మిక ప్రపంచంలో ఒక మహోన్నతమైన ఉపన్యాసంగా ప్రసిద్ధి చెందిన ఉపన్యాసం ఇచ్చి, ఆ ఉద్వేగాన్ని ఆదిలోనే త్రుంచివేసారు: 'ఒకవేళ మీలో ఎవరైనా ముహమ్మద్ ను ఆరాధించేవారుంటే, ఆయన చనిపోయారని తెలుసుకోండి. కానీ, ఒకవేళ మీరు దేవుడిని ఆరాధిస్తున్నట్లయితే, ఆయన ఎల్లప్పుడూ సజీవుడిగా ఉంటాడని తెలుసుకోండి. James A. Michener, "Islam The Misunderstood Religion", In the Reader's Digest (American Edition) for may, 1955, pp.68-70
ముహమ్మద్ పేరును ప్రపంచంలోని అత్యంత ప్రబలమైన వ్యక్తుల జాబితాలో మొట్టమొదటి పేరుగా నేను ఎంచుకోవటం కొందరిని ఆశ్చర్య పరిచి ఉండవచ్చు మరియు ఇతరులు దానిని ప్రశ్నించవచ్చు. అయితే, చరిత్రలో ధార్మికంగా మరియు లౌకికంగా రెండింటిలోనూ మహోన్నత సాఫల్యం సాధించిన వ్యక్తి కేవలం ఆయన ఒక్కరే. మైకెల్ హార్ట్. Michael H. Hart, "The 100: A Ranking of the Most Influential Persons in History", New York: Hart Publishing Company, Inc. 1987, p.33
ఇస్లాం ధర్మం యొక్క నైతిక వ్యవస్థ
మొత్తం మానవజాతి అన్ని పరిస్థితులలో పాటించే మరియు గౌరవించే సర్వసామాన్య ప్రాథమిక హక్కులను ఇస్లాం ప్రకటించింది. ఈ హక్కులు పొందేందుకు ఇస్లాం ధర్మం చట్టపరమైన రక్షణ కల్పించడమే కాకుండా ఒక ప్రభావశీలమైన నైతిక వ్యవస్థను కూడా నెలకొల్పింది. కాబట్టి, వ్యక్తిగత లేక సామాజిక ప్రయోజనానికి దారి తీసేదేదైనా సరే ఇస్లాం ధర్మం నైతికంగా దానిని మంచి విషయంగా పరిగణిస్తుంది.. అలాగే హాని కలిగించేదేదైనా సరే ఇస్లాం ధర్మం నైతికంగా దానిని చెడు విషయంగా పరిగణిస్తుంది. దేవుడిని ప్రేమించడం మరియు తోటి మానవుడిని ప్రేమించడం గురించి ఇస్లాం ధర్మం ఎంతో ప్రోత్సహిస్తుంది మరియు హద్దుమీరిన సాంప్రదాయిక వాదం గురించి హెచ్చరిస్తుంది.
ఖుర్ఆన్ లో ఇలా ప్రకటించబడింది; “అల్ బిర్ర్ (సదాచరణ, దైవభక్తి, ధర్మనిష్ఠాపరత్వం మరియు అల్లాహ్ పట్ల విధేయత చూపే ప్రతి పని) అంటే కేవలం మీ ముఖాలను తూర్పు దిశకో లేదా పడమర దిశకో త్రిప్పుకొనుట కాదు. కానీ, అల్ బిర్ర్ అంటే (వారి లక్షణం) – అల్లాహ్ ను, అంతిమదినాన్ని, మలాయికలను, దివ్యగ్రంథాల్ని మరియు సందేశహరులను విశ్వసించడం, మరియు సంపదపై ప్రేమ ఉన్నప్పటికీ - దగ్గరి బంధువులకు, అనాధలకు, అక్కర గలవారికి, బాటసారులకు, అర్థించేవారికి మరియు బానిసల విముక్తి కొరకు ఖర్చు చేయడం, మరియు నమాజులు స్థాపించడం మరియు జకాతు (విధిదానం) చెల్లించడం మరియు వాగ్దానం చేసినప్పుడు దానిని పూర్తి చేయడం, అలాగే కష్టాలలో, పేదరికంలో మరియు యుద్ధసమయాలలో సహనం వహించడం – ఎవరైతే వీటిని ఆచరిస్తారో, అలాంటి వారే సత్యవంతులు మరియు అలాంటి వారే అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగియున్న వారు. (2:177).
ఈ దివ్యవచనాలలో సజ్జనత్వం, నైతికత మరియు దైవభీతి గురించి చక్కని వివరణ ఇవ్వబడింది. శ్రేయస్కరమైన నిబంధనలకు అతడు విధేయత చూపాలి కానీ, అతడు తన దృష్టిని దైవభీతిపై మరియు తోటి మానవుడిని ప్రేమించడంపై కేంద్రీకరించాలి. మనకు క్రింది విధంగా నాలుగు శిరస్సులు ఇవ్వబడినాయి:
అ. మన విశ్వాసం నిజమైనది మరియు నిష్కపటమైనదై ఉండాలి;
ఆ. తోటి మానవులకు దానధర్మాలు చేయడం, తోడ్పడటం ద్వారా అది ఇతరులకు కనబడేలా మనం ప్రయత్నించాలి. (అయితే అది కీర్తిప్రతిష్ఠల కొరకు అవకూడదు.)
ఇ. తప్పకుండా మనం మంచి పౌరులుగా మారాలి మరియు సామాజిక సంస్థలకు సహాయపడాలి.
ఈ. అన్ని పరిస్థితులలోనూ మన స్వంత మనస్సు దృఢంగా, నిశ్చలంగా ఉండటం తప్పనిసరి.
ఏ పనైనా మంచిదా లేక చెడ్డదా అనే విషయంపై తీర్పునిచ్చే మరియు వర్గీకరించే కొలమానం ఇదే. ఇది ఒక కేంద్రబిందువును ఏర్పరచగా, మొత్తం నైతిక వ్యవస్థంతా దాని చుట్టూ పరిభ్రమిస్తుంది. ఇస్లాం ధర్మం నైతిక ప్రవర్తన గురించి ఏదైనా ఆదేశం వెలువడక ముందు, అది మానవుడి హృదయంలో స్థిరంగా నాటుకు పోవాలని కోరుకుంటుంది. తద్వారా అతని లావాదేవీలు, ఆచారవ్యవహారాలు అన్ని వేళలా, అన్ని చోట్లా అతడిని చూస్తూ ఉండే ఆ దేవుడి వద్ద ఉంటాయి; అతడు ప్రపంచం మొత్తం నుండి దాక్కోవచ్చేమో గానీ ఆ దేవుడి నుండి అతడు ఏమాత్రం దాక్కోలేడు; ఎవరినైనా అతడువంచించగలడేమో గానీ ఆ దేవడిని మాత్రం వంచించలేడు; అతడు ఎవరి పట్టు నుండైనా తప్పించుకోవచ్చేమో గానీ ఆ దేవుడి పట్టు నుండి ఏమాత్రం తప్పించుకోలేడు.
కాబట్టి, దేవుడి మెప్పును మానవజీవిత లక్ష్యంగా చేయటం ద్వారా ఇస్లాం ధర్మం మహోన్నతమైన నైతిక విలువల స్థాయిని ఏర్పాటు చేసింది. ఇది మానవజాతి నైతిక పరివర్తన కొరకు అమితమైన మార్గాలు తప్పకుండా తెరిచెలా చేస్తున్నది. దివ్యావతరణలను జ్ఞానం యొక్క ప్రాథమిక మూలాలుగా చేయడం ద్వారా, అది సముచితమైన రీతిలో శుద్ధమైన సరిదిద్దులను మాత్రమే అనుమతిస్తూ, నైతిక ప్రమాణాలకు శాశ్వతత్వం మరియు స్థిరత్వం ఇస్తున్నది; అయితే మార్గభ్రష్టత్వం, హద్దులు మీరటం, అణుమాత్ర సాంస్కృతిక సాపేక్షతావాదం లేక నైతిక వినాశనం మొదలైన వాటి వైపు దారి తీసే మార్పులు చేర్పులు మరియు నూతన కల్పితాలకు దానిలో ఏమాత్రం అవకాశం లేదు. అది దైవ భయభక్తులతో కూడిన నైతికతను విధిస్తుంది. అందువలన అది మానవుడిని బయటి ఒత్తిడి లేకపోయినా నైతిక చట్టానికి విధేయత చూపుతూ స్వయంగా తలవంచేలా నిర్భిందిస్తుంది. ఏకైక దేవుడిని మరియు తీర్పుదినాన్ని విశ్వసించడం ద్వారా అది మానవుడిని ఆసక్తితో మరియు చిత్తశుద్ధితో మనస్పూర్తిగా నైతిక పరివర్తనను అవలంబించేలా చేస్తుంది.
అబద్ధపు మౌలికత మరియు నూతన కల్పితాల ద్వారా అది ఎలాంటి ఉత్తమ నైతిక విలువలను ఇవ్వదు, ఇంకా అది ప్రసిద్ధమైన నైతిక విలువల ప్రాధాన్యతను తగ్గించదు. అంతేగాక అది తగిన కారణం లేకుండా కొన్నింటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, మరికొన్నింటిని నిర్లక్ష్యం చేయదు. ప్రసిద్ధమైన మామూలు నైతిక విలువలన్నింటికీ అది సమతుల్యం పాటిస్తూ, సరైన నిష్పత్తికి అనుగుణంగా మొత్తం జీవన వ్యవస్థలోని ప్రతి ఒక్కదానికీ సముచిత స్థానం మరియు పాత్ర కేటాయిస్తుంది. మానవుడి వ్యక్తిగత మరియు సామూహిక జీవిత ఆశయాలను, అతడి ప్రాంతీయ సంబంధాలను, అతడి నాగరిక ప్రవర్తనను మరియు అతడి రాజకీయ, ఆర్థిక, ధర్మబద్ధ, విద్యాదాయక మరియు సామాజిక సంబంధాలను అది విస్తరింప జేస్తుంది. ఇంటి నుండి సంఘం వరకు, డైనింగ్ టేబుల్ నుండి యుద్ధరంగం మరియు శాంతి ఒడంబడికల కాన్ఫరెన్సుల వరకు, ఒక్క మాటలో చెప్పాలంటే మొదటి శ్వాస నుండి చివరి శ్వాస వరకు అది అతడి మొత్తం జీవితాన్ని ఆవరించి ఉంది. క్లుప్తంగా, ఇస్లాం ధర్మం యొక్క నైతిక విలువలతో కూడిన సార్వజనిక, సర్వసామాన్య మరియు ఘనమైన ప్రయోజనాలను మానవ జీవితంలోని ఏ భాగమూ వదులుకోలేదు. అది నైతిక పరిపాలనకు మహోన్నత స్థానాన్ని ఇస్తున్నది. అంతేగాక జీవన వ్యవహారాలను నైతిక విలువల నియంత్రణలో ఉంచి, వాటిని స్వార్థపూరిత కోరికలు మరియు స్వప్రయోజనాలు కట్టడి చేయకుండా కాపాడుతుంది.
మంచిని ప్రోత్సహించే మరియు చెడు నుండి దూరంగా ఉంచే ఉత్తమ జీవన విధానాన్ని మానవుడి కొరకు నిర్దేశిస్తుంది. ప్రజలను మంచి పనులు చేయమని పిలుపు ఇవ్వటంతో ఆగకుండా అది మంచిని స్థాపిస్తుంది మరియు చెడును నిర్మూలిస్తుంది కూడా. శుభాన్ని వ్యాపింపజేస్తుంది మరియు అశుభాన్ని నిషేధిస్తుంది. అంతరాత్మ యొక్క న్యాయమైన తీర్పు నెగ్గాలని మరియు చెడు వెనుక మంచి రెండో స్థానంలో ఉండకూడదని కోరుకుంటుంది. ఈ పిలుపుకు స్పందించిన వారు దగ్గరై, ఒక సమాజంగా ఏర్పడగా, ఆ దానిని ముస్లిం సమాజమనే పేరు ఇవ్వబడింది. ఈ సమాజ ఏర్పాటు వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం – క్రమంగా మంచిని స్థాపించటం & అమలు జరపటం మరియు చెడును అణగద్రొక్కటం మరియు తుడిచి పెట్టడం.
ఒక ముస్లిం యొక్క వ్యక్తిగత ప్రవర్తన మరియు అతడి సామాజిక బాధ్యతలను విపులంగా వివరించడం కోసం మేమిక్కడ ఒక ముస్లిం జీవితంలోని వివిధ దశలలో పనికి వచ్చే ఇస్లాం ధర్మం యొక్క కొన్ని ప్రాథమిక నైతిక బోధనలు ఇస్తున్నాము.
దేవుడి గురించిన జ్ఞానం
ఒక ముస్లిం యొక్క అత్యున్నత లక్షణం గురించి ఖుర్ఆన్ ఇలా పేర్కొన్నది : "యదార్థానికి మీలో అందరి కంటే ఎక్కువ భయభక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు" (49:13)
అణుకువ, నమ్రత, వినయం, నిరాడంబరత, సజ్జీలత, కోరికలను మరియు ఉద్వేగాన్ని అదుపులో ఉంచే నియంత్రణ, సత్యత, నైతిక నిష్ఠత, సహనం, నిలకడ మరియు తమ వాగ్దానాన్ని పూర్తి చేసే లక్షణం ... మొదలైనవి ఖుర్ఆన్ లో తెలుపబడిన నైతిక విలువలు. ఖుర్ఆన్ లో ఇలా ఉంది: "అల్లాహ్ సహనం వహించేవారిని ప్రేమిస్తాడు" (3:146)
"మరియు మీ ప్రభువు యొక్క క్షమాభిక్ష వైపునకు పరుగెత్తండి. మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు గలవారి కొరకు, భూమ్యాకాశాలంత విశాలంగా సిద్ధం చేయబడిన ఆ స్వర్గం వైపునకూ పరుగెత్తండి. ఎవరైతే సంపన్నస్థితిలోనూ మరియు పేదరికంలోనూ (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తారో, మరియు తమ కోపాన్ని దిగమ్రింగుతారో, మరియు ప్రజలను క్షమిస్తారో – అలాంటి ఉపకార గుణ సంపన్నులను (ముహ్సిన్ లను) అల్లాహ్ ప్రేమిస్తాడు:" (3:133-134)
"ఓ ప్రియమైన కుమారుడా! నమాజు స్థాపించు. సత్కార్యాలు ఆజ్ఞాపించు. చెడు పనుల నుండి వారించు. ఏ ఆపద వచ్చిపడినా ఓర్చుకో. నిశ్చయంగా ఇవి ఎంతో గంభీరంగా ఆజ్ఞాపించబడిన పనులు. జనుల ముందు (అహంభావం వలన) ముఖం త్రిప్పుకుని మాట్లాడకు. భూమిపై గర్వంతో నడవకు. డాబులు చెప్పుకునే గర్విష్టిని అల్లాహ్ ఎట్టి పరిస్థితులలోనూ ఇష్టపడడు. నీ నడకలో మధ్యేమార్గాన్ని అవంబించు. నీ కంఠస్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా స్వరాలన్నింటిలో అత్యంత హేయమైంది గాడిదల స్వరం." (31:17-19)
ఒక ముస్లిం యొక్క నైతిక గుణగణాలన్నింటినీ మనం ఒకచేట చేరిస్తే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లుగా ఇలా ఉంటుంది : "నా పోషకుడు నా కొరకు తొమ్మిది ఆజ్ఞలు జారీ చేసాడు, అవి: దేవుడి జ్ఞానాన్ని కలిగి ఉండటం, బహిరంగంగా మరియు రహస్యంగా కోపంలో ఉన్నా లేక శాంతంగా ఉన్నా, కేవలం న్యాయంగా మాత్రమే మాట్లాడటం; పేదరికంలో ఉన్నపుడు, ఐశ్వర్యం వచ్చినపుడూ, మధ్యేమార్గంపై నడవటం; నాతో తెగతెంపులు చేసున్నవారిని ప్రేమగా మరలా దగ్గరకు తీయడం; నిశ్చబ్దాన్ని ఆలోచనతో నింపడం; ప్రేమగా చూడటం; మరియు ఏదైతే సరైనదో, దానినే ఆజ్ఞాపించడం."
సామాజిక బాధ్యతలు: సామాజిక బాధ్యతల గురించిన ఇస్లామీయ బోధనలు ఇతరులపై దయ చూపాలి మరియు వారి సుఖదుఃఖాలను కూడా పట్టించుకోవాలనే ఆదేశిస్తున్నాయి. ఇతరులపై దయ చూపాలనే గొప్ప ఆదేశం కొన్ని సందర్భాలలో నిర్లక్ష్యానికి గురయ్యే అవకాశం ఉంది; దీనిని సరిదిద్దటానికి ఇతరులపై దయ చూపే నిర్ణీత ఆచరణల గురించి ఇస్లాం నొక్కి చెబుతున్నది. అంతేగాక వివిధ బాంధవ్యాల బాధ్యతలు మరియు హక్కులను స్పష్టంగా నిర్వచిస్తున్నది. బాంధవ్యాల విస్తృత పరిధిలో మనం మొట్టమొదట బాధ్యత వహించవలసింది మన తల్లిదండ్రులు, భార్య లేక భర్త మరియు పిల్లలు, తర్వాత ఇతర బంధువులు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, పరిచయం ఉన్నవారు, అనాథలు మరియు వితంతువులు, సమాజంలోని అక్కరగలవారు, మన తోటి ముస్లింలు, మొత్తం తోటి మానవులు మరియు పశుపక్ష్యాదులు.
తల్లిదండ్రులు: తప్పనిసరిగా తల్లిదండ్రులను గౌరవించమని మరియు వారికి రాత్రింబవళ్ళు సేవ చేయాలని ఇస్లామీయ బోధనలు ఆజ్ఞాపిస్తున్నాయి. ఇది ముస్లింలు తమ దైవవిశ్వాసాన్ని తెలిపే ఒక ముఖ్యమైన పద్ధతి. "నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు – మీరు ఆయనను తప్ప మరెవ్వరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా ప్రవర్తించాలి. వారిలో ఒకరు గానీ లేక ఇద్దరూ గానీ ముసలివారై పోతే, వారి ముందు (విసుగ్గా) ఊహ్ అని కూడా అనకు. వారిని కసురుకుంటూ మాట్లాడకు. పైగా వారితో మర్యాదగా మాట్లాడు. అణుకవ, దయాభావం ఉట్టిపడేలా నీ భుజాలను వారి ముందు వంచు మరియు ఇలా ప్రార్థించు: ఓ ప్రభూ! బాల్యంలో వీరు నన్ను (ప్రేమానురాగాలతో) పోషించినట్లుగా నీవు కూడా వీరిపై దయజూపుము" (17:23-24)
ఇతర బంధువులు: "బంధువుల, నిరుపేదల, ప్రయాణీకుల హక్కును వారికిస్తూ ఉండు. దుబారా ఖర్చులు చేయకు" (17:26)
ఇరుగు పొరుగు వారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: "తన పొరుగింటివాడు ఆకలితో అలమటిస్తుండగా, తను సుష్టుగా భుజించేవాడు దైవవిశ్వాసి కాడు; మరియు: ఎవరి చెడు నడత నుండి అతడి ఇరుగు పొరుగు వారు సురక్షితంగా ఉండరో అతడు విశ్వాసి కాడు.
నిజానికి ఖుర్ఆన్ మరియు సున్నతు ప్రకారం, ఒక ముస్లిం తన తల్లిదండ్రులు, బంధువులు మరియు ఇరుగు పొరుగు వారిపై మాత్రమే కాక మొత్తం మానవజాతిపై, పశుపక్ష్యాదులపై మరియు ప్రయోజనకరమైన చెట్లు, మొక్కలపై కూడా తన నైతిక బాధ్యతను పూర్తి చేయవలసి ఉంది.
ఉదాహరణకు, ఇస్లాంలో వినోదం కొరకు పక్షులు మరియు జంతువులను వేటాడటం నిషేధం. అలాగే, మరీ తప్పనిసరైతే తప్ప పళ్ళుఫలాలను ఇచ్చే చెట్లను, మొక్కలను నరకటం నిషేధం.
కాబట్టి, ఇస్లాం ధర్మం ప్రాథమిక నైతిక గుణగణాలపై, మరింత శుభమైన ఉన్నత స్థాయి నైతిక వ్యవస్థను ఇస్లాం నిర్మిస్తున్నది. దీని ద్వారా మానవజాతి దాని అమోఘమైన శక్తిని గ్రహించగలదు. ఇస్లాం మానవాత్మను దాని అహంకారం, క్రూరత్వం, దౌర్జన్యం, పోకిరితనం, విలాసం, క్రమశిక్షణారాహిత్యం మరియు అమర్యాద వంటి పాపాల నుండి ప్రక్షాళనం చేసి పరిశుద్ధం చేస్తుంది. అది ఏకైక ప్రభువుకు భయభక్తులు చూపే, ధర్మనిష్ఠాపరతతో మరియు సంయమనంతో కూడిన దాని ఆదర్శాలకు మనస్పూర్తిగా సమర్పించుకునే, క్రమశిక్షణతో ప్రవర్తించే మరియు అసత్యంతో రాజీ పడని వ్యక్తులను సృష్టిస్తుంది. అది నైతిక బాధ్యతా భావాలు కలుగజేస్తుంది. మనోనిగ్రహ శక్తిని వృద్ధి చేస్తుంది. అంతేగాక మనలో దయ, కనికరం, వాత్సల్యం, ఔదార్యం, దాతృత్వం, సానుభూతి, శాంతి, స్వార్థాపేక్షలేని ప్రతిష్ఠ, అన్ని సందర్భాలలోనూ మొత్తం మానవజాతి వైపు చూపే నిష్కల్మషమైన మంచితనం మరియు సత్యతలను, మంచి మరియు శుభం మాత్రమే కలుగజేసే ఉత్తమ గుణాలను అది వృద్ధిజేస్తుంది.
మరణానంతర జీవితం
మరణానంతర జీవితం ఉందా లేదా అనేది విజ్ఞాన శాస్త్ర పరిధి లోనికి రాదు. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రం కేవలం జ్ఞానేంద్రియాలు సేకరించగలిగే సమాచారం యొక్క విభజన మరియు విశ్లేషణలను మాత్రమే ఉద్దేశిస్తుంది. అంతేగాక మానవుడు కొన్ని శతాబ్దాల క్రితమే వెలుగులోనికి వచ్చిన ఈ ఆధునిక కాలపు సైంటిఫిక్ పరిశీలనలు మరియు పరిశోధనల ఒత్తిడిలో పడిపోయాడు. అయితే ఊహకందని కాలం నుండి మరణానంతర జీవిత విషయాల జ్ఞానం అతడికి తెలుపబడింది. అల్లాహ్ యొక్క ప్రవక్తలందరూ ప్రజలను అల్లాహ్ నే ఆరాధించమని మరియు మరణానంతర జీవితాన్ని విశ్వసించమని ఆహ్వానించారు. వారు మరణానంతర జీవితాన్ని విశ్వసించడంపై ఎంత గట్టిగా నొక్కి చెప్పారంటే, దానిని విశ్వాసించడంలో ఏమాత్రం సందేహించినా అతడు ఏకైక దేవుడిని తిరస్కరించినట్లే మరియు ఇతర దైవవిశ్వాసాలన్నింటినీ అర్థరహితం చేసినట్లే. అసలు యథార్థం ఏమిటంటే అల్లాహ్ యొక్క మొత్తం ప్రవక్తలు మరణానంతర జీవితపు ఈ ఆధ్యాత్మిక ప్రశ్న గురించి ఎంతో ఆత్మవిశ్వాసంతో మరియు కొంచెం కూడా మార్పు లేకుండా ఒకే రీతిలో చర్చించారు – వారి మధ్య వేల సంవత్సరాల దూరం ఉన్నప్పటికీ. వారందరి మరణానంతర జీవిత జ్ఞానం యొక్క మూలం ఒక్కటే అనేది దాని గురించి వారి ఒకే విధమైన ప్రకటనల అంటే దివ్యవాణుల నుండి ఋజువు అవుతున్నది. అంతేగాక ప్రజలు తమ ప్రవక్తలను తీవ్రంగా వ్యతిరేకించారు ముఖ్యంగా మరణానంతర జీవిత విషయంలో అనేది కూడా మనకు తెలుసు. ఎందుకంటే చనిపోయిన తర్వాత తిరిగి లేపబడటం అసాధ్యమని వారు భావించేవారు. కానీ, అలాంటి తీవ్రవ్యతిరేకతలో కూడా ఎందరో విశ్వాసపాత్రులైన సహచరులను ప్రవక్తలు పొందగలిగారు. తమ సమాజం తమను పూర్తిగా వెలివేసే ఘోరప్రమాదం పొంచి ఉన్నా, తమ తాతముత్తాతల కాలం నుండీ ప్రజలలో పాదుకుని ఉన్న నమ్మకాలు, సంప్రదాయాలను పూర్తిగా త్యజించేలా చేసిందేమిటి? దీని సీదాసాదా జవాబు ఏమిటంటే: వారు తమ బుద్ధీ మరియు మనశ్శక్తి విభాగాలను సరిగ్గా వినియోగించుకున్నారు మరియు సత్యాన్ని గ్రహించారు. ఇంద్రియగోచర వివేకం వలన వారు ఆ సత్యాన్ని గ్రహించగలిగారా? కానే కాదు. ఎందుకంటే మరణానంతర జీవితపు ఇంద్రియగోచర అనుభవం పొందటమనేది అసంభవం. నిజానికి, సృష్టికర్త మానవుడికి ఇంద్రియగోచర తెలివితో పాటు హేతుబద్ధ రసజ్ఞానం మరియు నైతిక చైతన్యాన్ని కూడా ఇచ్చాడు. ఈ చైతన్యమే మానవుడిని జ్ఞానేంద్రియాల సమాచారం ద్వారా సరిచూడలేని అంటే ప్రమాణీకరించలేని వాస్తవాల విషయంలో మార్గదర్శకత్వం వహిస్తుంది. అందుకనే మానవుడి రసజ్ఞాన, నైతిక మరియు హేతుబద్ద చైతన్యం వైపు దైవప్రవక్తలందరి బోధనలు మరియు మరణానంతర జీవిత జ్ఞానం అప్పీలు చేస్తుంది. ఉదాహరణకు, తమ పవర్ ఫుల్ లాజిక్ మరియు హేతుబద్ధ దావాల సమర్థనతో వాదిస్తూ, మక్కా నగర విగ్రహారాధకులు నిరాకరించి నపుడు, ఖుర్ఆన్ ఆయతులు వారినిలా సవాలు చేస్తున్నాయి:
"వాడు మమ్మల్ని (ఇతరులతో) పోల్చాడు. కానీ, అసలు అతడి పుట్టుకనే మరిచిపోయాడు: కుళ్ళి కృశించి పోయిన ఎముకలను ఎవడు తిరిగి బ్రతికిస్తాడు?" అని సవాలు విసురుతున్నాడు. (వాడికిలా) జవాబివ్వు, "వాటిని తొలిసారి సృష్టించిన వాడే (మరలా) బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియలను గురించి క్షుణ్ణంగా ఎరిగిన వాడు. ఆయనే మీకోసం పచ్చని చెట్టు నుండి అగ్నిని సృష్టించాడు. మరి మీరిప్పుడు దాంతో నిప్పును రాజేస్తున్నారు. భూమ్యాకాశాలనే సృష్టించగలిగిన వాడు వీరిని (తిరిగి) సృష్టించలేడా? ఎందుకు సృష్టించలేడు! ఆయన అన్నీ ఎరిగిన సృష్టికర్త! (36:78-81)
మరో చోట ఖుర్ఆన్, అవిశ్వాసుల వద్ద మరణానంతర జీవితాన్ని నిరాకరించే సరైన ఆధారమేదీ లేదని మరియు వారి భావన కేవలం ఊహలపై మాత్రమే ఆధారపడి ఉందని చాలా స్పష్టంగా చెబుతున్నది: "మా జీవితం మటుకు ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే. మేము చనిపోతున్నాము, బ్రతుకు తున్నాము. కాలం తప్ప మరేదీ మమ్మల్ని చంపటం లేదు." అని వారంటారు. వారికి దీని గురించి బొత్తిగా తెలియదు. వారు కేవలం ఊహాగానాలు చేస్తూ పోతున్నారు. మరి వారి ముందు మా స్పష్టమైన వచనాలు చదివి వినిపించబడినపుడు, "ఒకవేళ మీరు సత్యవంతులే అయితే, మా తాతముత్తాతలను తీసుకు రండి!" అని చెప్పడం మినహా వారి వద్ద మరో సాకు ఏమీ మిగిలి ఉండదు (45:24-25)
నిశ్చయంగా సర్వలోకాల సృష్టికర్త మరణించిన వారందరినీ తిరిగి లేపుతాడు. అయితే ప్రభువు వద్ద తను తయారు చేసిన ప్రణాళికలోని అంశాలు ఉన్నాయి. మొత్తం విశ్వం అంతా నాశనం చేయబడే ప్రళయదినం రాబోతుంది మరియు తమ ప్రభువు ఎదురుగా నిలబడేందుకు మృతులు మరలా లేపబడతారు. అపుడు ఎన్నటికీ అంతం కాని జీవితం ఆరంభమవుతుంది. ఆ రోజున మన ప్రభువు ప్రతి ఒక్కరి పాపపుణ్యాలను లెక్కిస్తాడు.
మానవుడి నైతిక చైతన్యం కొరకు ఆవశ్యకమైన మరణానంతర జీవిత వివరాలు ఖుర్ఆన్ లో స్పష్టంగా ఉన్నాయి. వాస్తవానికి, ఒకవేళ మరణానంతర జీవితం లేనట్లయితే, అసలు దైవభావనయే అర్థం పర్థం లేకుండా పోతుంది. అయినా సరే ఒకవేళ ఎవరైనా తనను మొదటిసారిగా దేవుడే సృష్టించాడని విశ్వసించినా, ఈ ప్రాపంచిక జీవిత పర్యవసనాన్ని పట్టించుకోడు. నిస్సందేహంగా, మన ప్రభువు అత్యంత న్యాయవంతుడు. వందల, వేల మంది అమాయకులను చంపటం, సమాజంలో అరాచకం మరియు హింస వ్యాపింపజేయటం, తమ స్వార్థప్రయోజనాల కొరకు అనేక మందిని బానిసలుగా చేసుకోవటం ... వంటి మితిమీరిన నేరస్థులను, దౌర్జన్యపరులను ఆయన కఠినంగా శిక్షిస్తాడు: ఈ ప్రపంచంలో మానవుడు అతి తక్కువ జీవిత కాలం కలిగి ఉన్నాడు, ఇంకా అతడి భౌతిక ప్రపంచం కూడా శాశ్వతమైనది కాదు, వ్యక్తుల పాపపుణ్యాలకు అనుగుణంగా ఇక్కడ శిక్షించడం లేక బహుమానం ప్రసాదించడం సాధ్యం కాదు. తీర్పుదినం తప్పకుండా రావాలని మరియు సృష్టికర్త ప్రతి ఆత్మ భవిష్యత్తును అతడి / ఆమె యొక్క కర్మల పత్రాలను అనుసరించి నిర్ణయించాలని ఖుర్ఆన్ నొక్కి మరీ చెబుతున్నది: "మాపై ప్రళయం వచ్చి పడదు" అని అవిశ్వాసులు అంటున్నారు: వారికి ఇలా జవాబివ్వు, "ఎందుకు రాదు! అగోచరాల జ్ఞాని అయిన నా ప్రభువు సాక్షిగా, అది మీపై తప్పకుండా వస్తుంది" (34:3)
అల్లాహ్ యొక్క న్యాయవంతుడు మరియు దయామయుడు అనే దివ్యలక్షణాలు స్పష్టంగా ప్రదర్శితమయ్యే గొప్ప దినమే ఆ తీర్పుదినం. శాశ్వత ప్రతిఫలం తమ కోసం వేచి ఉందని నమ్ముతూ, ఈ ప్రాపంచిక జీవితంలో ఆయన కోసం కష్టాలు, బాధలు భరించిన వారిపై తన అనంతమైన దయను ఆయన కురిపిస్తాడు. అయితే, రాబోయే శాశ్వత జీవితాన్ని పట్టించుకోకుండా, ఆయన ప్రసాదించిన శుభాలను దుర్వినియోగం చేసిన వారు ఆ రోజున అత్యంత అధమ స్థితిలో ఉంటారు. వారి మధ్య పోలికను వివరిస్తూ ఖుర్ఆన్ ఇలా తెలుపుతున్నది: "మేము తనకు చేసిన మంచి వాగ్దానాన్ని పొందిన వ్యక్తీను, మేము ప్రాపంచిక జీవితపు కొన్ని లాభాలు ప్రసాదించిన తర్వాత (మాకు చూపిన అవిధేయత కారణంగా) ప్రళయ దినాన బంధించి తేబడే వ్యక్తీను ఇద్దరూ ఒక్కటవుతారా?" (28:61)
మరణించిన తర్వాత రాబోయే శాశ్వత జీవితం కోసం తయారయ్యే మంచి అవకాశాన్ని ఈ ప్రాపంచిక జీవితం ఇస్తున్నదని ఖుర్ఆన్ తెలుపు తున్నది. అయితే, ఎవరైతే దీనిని తిరస్కున్నారో, వారు తమ మనోభావాలు మరియు కోరికలకు బానిసలుగా మారి పోయి, సజ్జనులు మరియు దైవభక్తులను ఎగతాళి చేస్తున్నారు. అలాంటి వారు తాము చనిపోయే సమయంలో తమ అవివేకాన్ని గ్రహిస్తారు మరియు తమ తప్పును సరిదిద్దుకునేందుకు ఈ ప్రపంచంలో తమకు మరో ఛాన్సు లభించాలని కోరుకుంటారు. కానీ, వారికి ఆ అవకాశం లభించదు. చనిపోయటప్పటి దయనీయ స్థితి, తీర్పుదిన నాటి భయంకర పరిస్థితి మరియు చిత్తశుద్ధితో జీవించిన దైవవిశ్వాసులకు లభించబోయే శాశ్వత బహమానం గురించి ఖుర్ఆన్ లో చాలా చక్కగా పేర్కొనబడింది:
"చివరికి వారిలో ఎవరికైనా చావు వచ్చినపుడు, వారిలా అంటారు: "ఓ నా ప్రభూ! నన్ను తిరిగి వెనక్కి పంపు. నేను వదిలి వచ్చిన లోకంలోనికే వెళ్ళి సత్కార్యాలు చేస్తాను." ముమ్మాటికీ అలా జరగదు. అది అతను పలుకున్న ఒక పలుకు మాత్రమే. వారు మళ్ళీ సజీవులై లేచే రోజు వరకూ వారి వెనుక ఒక అడ్డు తెర ఉంటుంది. మరి శంఖం పూరించబడిన దినమున, వారి మధ్యన బంధుత్వాలు గానీ, ఒండొకరిని అడిగి చూడటం గానీ ఉండదు. ఎవరి త్రాసు పళ్ళెం బరువుగా తూగుతుందో, వారు సాఫల్యం పొందిన వారవుతారు. మరెవరి త్రాసు పళ్ళెం తేలికగా ఉంటుందో, వారే తమకు తాము నష్టం చేకూర్చుకున్న వారు. సదా నరకంలో వారుంటారు. వారి ముఖాలను అగ్ని మాడ్చి వేస్తూ ఉంటుంది. అందువలన వారు అందవిహీనులుగా మారిపోతారు." (23:99-104)
మరణానంతర జీవితాన్ని విశ్వసించడమనేది తప్పకుండా పరలోకంలో సాఫల్యం చేకూర్చటమే కాకుండా, వ్యక్తులను తమ పనులలో అత్యంత బాధ్యతాపరులు మరియు కర్తవ్యపరాయణులు గా చేసి ఇహలోకాన్ని కూడా పూర్తిగా శాంతి మరియు సంతోషంతో నింపివేస్తుంది.
మరణానంతర జీవితాన్ని విశ్వసించని వారి అజ్ఞానకాలంలో మక్కా ప్రజలు జూదం, మద్యపానం, జాతుల మరియు తెగల మధ్య అంతఃకలహాలు, దోపిడీలు మరియు హత్యలు తమ ప్రత్యేకతగా గడిపిన రోజుల గురించి ఆలోచించండి. కానీ, ఏకైక దేవుడిపై విశ్వాసం మరియు మరణానంతర జీవితంపై విశ్వాసాన్ని స్వీకరించ గానే వారు ప్రపంచంలోని అత్యంత క్రమశిక్షణ గల సమాజంగా మారిపోయారు. వారు తమ దుర్గుణాలు, దుర్మార్గాలు, దోషాలను వదిలి పెట్టి, అవసరమైనప్పుడల్లా పరస్పరం తోడ్పాటు నందించు కున్నారు. తమ మధ్య ఉండిన వివాదాలన్నింటినీ న్యాయం మరియు సమానత్వాల ఆధారంతో పరిష్కరించుకున్నారు. అలాగే, మరణానంతర జీవితాన్ని తిరస్కరించడం యొక్క పర్యవసానం పరలోకంలోనే కాదు ఇహలోకంలో కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఎపుడైతే ఒక సమాజం మొత్తం దానిని తిరస్కరిస్తుందో, ఆ సంఘంలో అన్నిరకాల చెడు మరియు అరాచకత్వం హద్దులు మీరి, తుదకు అది పతనమై పోతుంది. ఆద్, థమూద్ మరియు ఫిరోనుల భయంకర ముగింపును కొంతవరకు ఖుర్ఆన్ తెలిపింది:
"తట్టేటటువంటి విపత్తును సమూదు మరియు ఆదు జనులు ధిక్కరించారు. అందుకుగాను, సమూదు జాతి ప్రజలు అత్యంత భయంకరమైన కేక ద్వారా అంతమొందించబడినారు. ఆదు జాతి వారు ప్రచంఢమైన పెనుగాలుల ద్వారా నాశనం చేయబడినారు. దానిని అల్లాహ్ వారిపై ఎడతెరిపి లేకుండా ఏడు రాత్రులు, ఏడు పగళ్ళు విధించాడు. (అపుడు వారి వద్ద నీవు ఉంటే) వారక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దుల వలే నేల కొరిగి పడి ఉండటం చూసేవాడివి. మరి వారిలో ఎవడైనా మిగిలి ఉన్నట్లు నీకు కనిపిస్తున్నాడా? ఫిరౌను మరియు అతనికి పూర్వం గతించిన వారు, తల్లక్రిందులుగా చేయబడిన పట్టణ ప్రజలు కూడా పాపాలకు ఒడిగట్టారు. వారు తమ ప్రభువు పంపిన ప్రవక్తలను ఎదురించారు. అందువల్ల అల్లాహ్ వారిని భయంకరంగా పట్టుకున్నాడు. నీళ్ళ ఉధృతి పెరిగి పోయినవుడు, మేము మిమ్ములన్ని నావలోనికి ఎక్కించాము. దీనిని మీకొక హితబోధగా, జ్ఞాపికగా చేయడానికి, విని జ్ఞాపకముంచుకునే చెవులు దీనిని (ఎల్లకాలం) జ్ఞాపక ముంచుకునేందుకు. మరి శంఖం ఒకసారి పూరించబడినపుడు, భూమిని పర్వతాలను ఎత్తి, ఒకే ఒక దెబ్బు తుత్తునియలుగా చేసి వేయబడినపుడు, ఆరోజు జరగవలసిన సంఘటన జరిగి తీరుతుంది. అపుడు ఆకాశం బ్రద్దలై పోతుంది. మరి ఆరోజు అది పట్టు సడలిస్తుంది. దైవదూతలు దాని అంచులపై ఉంటారు, ఆరోజు నీ ప్రభువు సింహాసనాన్ని ఎనమండుగురు (దైవదూతలు) తమపై ఎత్తుకుని ఉంటారు. ఆనాడు మీరందరూ హాజరు పరచబడతారు. మీ రహస్యమేదీ దాగి ఉండదు. మరి ఎవరి కర్మల పత్రం అతడి కుడిచేతిలో ఇవ్వబడుతుందో అతనిలా అంటాడు, “ఇదిగో నా కర్మల పత్రాన్ని చదవండి. నాకు నా లెక్క లభించనున్నదన్న గట్టి నమ్మకం నాకుండేది.” మరి మనసు మెచ్చే భోగజీవితం అతడు గడుపుతాడు, ఉన్నతమైన స్వర్గవనాలలో. దాని పండ్లు తక్కువ ఎత్తులో వ్రేలాడుతూ ఉంటాయి. “గతకాలంలో మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తినండి, త్రాగండి” (అని వారితో అనబడుతుంది). ఇక ఎవరి కర్మల చిట్టా అతని ఎడమ చేతికి ఇవ్వబడుతుందో అతనిలా అంటాడు, “అయ్యో! నాకర్మల పత్రం నాకివ్వబడకుండా ఉంటే, నా లెక్కేమిటో నాకసలు తెలియకుండా ఉంటే ఎంత బావుండేది. అయ్యే, ఆ చావే తేల్చేసి ఉంటే ఎంత బావుండేది. నా ధనం నాకేమాత్రం అక్కరలేదు. నా అధికారం కూడా నా నుండి చేజారిపోయిందే.” (అని బాధపడతాడు). (అపుడిలా ఆదేశించబడుతుంది) “పట్టుకోండి వాణ్ణి, వాడికి గుదిబండ వేయండి. నరకంలోనికి త్రోసివేయండి. డెబ్బయి మూరల పొడవైన సంకెళ్ళలో బంధించండి. వాడు మహోన్నతుడైన అల్లాహ్ ను విశ్వసించేవాడు కాదు. నిరుపేదలకు అన్నం పెట్టమని ప్రోత్సహించేవాడూ కాదు. కాబట్టి ఈరోజు ఇక్కడ వీడి స్నేహితుడు ఎవ్వడూ లేడు. గాయాల కడుగు నీరు తప్ప వీడికి ఆహారంగా మరేమీ దొరకదు. దానిని పాపాత్ములు తప్ప మరెవ్వరూ తినరు. మరి మీరు చూచేవాటిపై నేను ప్రమాణం చేస్తున్నాను. ఇంకా మీరు చూడలేని వాటిపై కూడా. నిశ్చయంగా ఇది గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన దివ్యవాక్కు.” (The Quran 69:4-39)
కాబట్టి, మరణానంతర జీవితాన్ని తప్పకుండా విశ్వసించి తీరలి అనడానికి బలమైన మరియు హేతుబద్ధమైన కారణాలు ఉన్నాయి.
మొదటిది, అల్లాహ్ యొక్క ప్రవక్తలందరూ తమ తమ ప్రజలను మరణానంతర జీవితాన్ని విశ్వసించమని పిలిచారు.
రెండవది, ఈ విశ్వాసం ఆధారంగా, మానవ సమాజం నిర్మించబడి నపుడల్లా, అది సామాజిక మరియు నైతిక దుష్టత్వాలకు చోటులేని అత్యంత ఆదర్శవంతమైన మరియు శాంతియుతమైన సమాజంగా గుర్తింపబడింది.
మూడోది, మాటిమాటికీ వారి ప్రవక్త హెచ్చరించినప్పటికీ, సంఘ ప్రజలందరూ కలిసి ఏకమొత్తంగా ఈ విశ్వాసాన్ని తిరస్కరించి నపుడు, ఇహలోకంలో కూడా ఆ సమాజం మొత్తం అల్లాహ్ యొక్క భయంకర శిక్షలకు గురైందని చరిత్ర సాక్ష్యమిస్తున్నది.
నాలుగవది, మానవుడి నైతిక, రసజ్ఞాన, సావయవ, బుద్దీ, వివేక మరియు హేతుబద్ద విభాగాలు మరణానంతర జీవితం నిజంగా ఉందనే దివ్యసందేశాన్ని సమర్థిస్తున్నాయి.
ఐదవది, ఒకవేళ మరణానంతర జీవితం లేకపోయినట్లయితే, అల్లాహ్ యొక్క న్యాయం మరియు దయ అనే దివ్యలక్షణాలకు అర్థం పర్థం లేదనిపిస్తుంది.
ఇస్లాంలోని ప్రవక్తత్వం
దివ్యావతరణ అందుకున్న యూద మరియు క్రైస్తవం వంటి ధర్మాలకు ప్రవక్తత్వం కొత్తేమీ కాదు. కానీ, ప్రవక్తత్వానికి ఇస్లాం ధర్మంలో ఒక ప్రత్యేకమైన మరియు విశేషమైన హోదా ఉంది.
ఇస్లాం ధర్మం ప్రకారం, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ మానవుడిని ఒక ఉత్తమ ఉద్దేశం కోసం సృష్టించాడు: కేవలం ఆయననే ఆరాధించడం మరియు ఆయన ఆదేశాలు మరియు మార్గదర్శకత్వాల ఆధారంగా ఒక ఉత్తమ, నైతిక జీవితం గడపడం. మానవుడు ఏమి చేయాలని అల్లాహ్ తలుస్తున్నాడో, దాని గురించి ఆయన నుండి స్పష్టమైన మరియు ఆచరాణ్మకమైన ఆదేశాలు అందుకోకుండా, మానవుడు తన పాత్ర గురించి మరియు తన సృష్టి యొక్క ఉద్దేశం గురించి ఎలా తెలుసుకోగలడు? ఇక్కడ ప్రవక్తత్వం యొక్క ఆవశ్యకత ఎదురవుతున్నది. కాబట్టి, అల్లాహ్ ప్రజలకు తన సందేశాన్ని అందజేయటం కొరకు ప్రతి సమాజంలో నుండి ఒక ప్రవక్తను లేక సందేశహరుడిని వారిలో నుండే ఎంచుకున్నాడు.
ఎవరి మనస్సులోనైనా ఈ ప్రశ్న రావచ్చు: ప్రవక్తలు ఎలా ఎంచుకోబడినారు మరియు ఆ ఉన్నత గౌరవ స్థానానికి యోగ్యులు ఎవరు? ప్రవక్తత్వమనేది తను తలిచిన వారికి అల్లాహ్ ప్రసాదించే ఒక మహోన్నత అనుగ్రహం మరియు ఆశార్వాదం. అయితే, మొత్తం చరిత్రలోని వివిధ సందేశహరుల గురించి సర్వే చేస్తే, ప్రవక్త యొక్క మూడు శుభలక్షణాలను ఎవరైనా తేలిగ్గా గుర్తించవచ్చు:
1. సజ్జనత్వం, నీతీనిజాయితీ, బుద్ధీవివేకం, తెలివితేటలు, ఆదర్శం మొదలైన సుగుణాలలో ప్రవక్త తన సమాజంలోని అత్యంత ఉత్తమ పురుషుడు. ఇలా జరగటం చాలా అవసరం. ఎందుకంటే ప్రవక్త జీవితం ఆయన సహచరులకు ఆదర్శప్రాయమవుతుంది, ఆయన వ్యక్తిత్వం ప్రజలు ఆయన సందేశాన్ని స్వీకరించేలా ఆకర్షించవలసి ఉంటుంది. అంతేగానీ, వారు వెనుదిరిగి పోయేలా ఆయన వ్యక్తిత్వం అసంపూర్ణంగా ఉండరాదు. దివ్యసందేశం అందుకోవడం మొదలైన తర్వాత ఆయన ద్వారా పాపాలు, తప్పులు జరగకుండా కాపాడ బడతాడు. అంటే ఆయన ఎలాంటి తప్పూ, పాపమూ చేయడు. పొరపాటున ఆయన ద్వారా ఏవైనా చిన్న చిన్న తప్పులు జరిగితే, వెంటనే దివ్యవాణి ఆయనను సరిదిద్దుతుంది.
2. వంచకుడు కాదని నిరూపించబడేలా ఆయన అద్భుతాలతో, మహిమలతో సమర్ధింపబడతాడు. ఆ అద్భుతాలు, మహిమలు చేసే శక్తిని మరియు అనుమతిని ఆయనకు అల్లాహ్ ప్రసాదిస్తాడు. ఆయన ప్రజలు ఔన్నత్యం సాధించి, సాటి లేని ప్రవీణులుగా ప్రఖ్యాతి చెందిన అంశంలోనే సాధారణంగా ఆ మహిమలు ఉంటాయి. దీనికి ఉపమానంగా మనం ప్రపంచ ప్రసిద్ధ మూడు ధర్మాలకు చెందిన ముగ్గురు మహాప్రవక్తల యొక్క మహాద్భుతాలను ఇక్కడ పేర్కొంటున్నాం: యూదధర్మం, క్రైస్తవధర్మం మరియు ఇస్లాం ధర్మం. మోసెస్ (మూసా అలైహిస్సలాం) సమకాలీనులు ఇంద్రజాలంలో చాలా ప్రఖ్యాతి చెందారు. కాబట్టి ఇంద్రజాలంలో ఉద్ధండులైన తన కాలపు ఆ మహామాంత్రికులను ఓడించడమే ఆయన యొక్క ప్రధాన మహిమ అయింది. జీసస్ (ఈసా అలైహిస్సలాం) సమకాలీనులు నైపుణ్యం గల వైద్యులుగా గుర్తింపు పొందారు. కాబట్టి, మృతులను తిరిగి లేపడం మరియు నయంకాని రోగాలను నయం చేయడం వంటి అద్భుత మహిమలు ఆయనకు ప్రసాదించ బడినాయి. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సమకాలీన అరబ్బులు అద్భుతమైన కవిత్వం మరియు వక్తృత్వంలో సాటి లేని వారుగా ప్రఖ్యాతి చెందారు. కాబట్టి, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కు ప్రసాదించబడిన మహాద్భుత మహిమ ఖుర్ఆన్ గ్రంథం. తనలోని ఒక అధ్యాయాన్ని పోలిన అధ్యాయాన్ని అది ఎంత చిన్నదైనా సరే తయారు చేసి తీసుకు రమ్మని మాటిమాటికీ ఖుర్ఆన్ చేసిన సవాలును మొత్తం అరబ్బు దేశంలోని కవులు మరియు వక్తలందరూ కలిసి కూడా ఎదుర్కోలేక పోయారు. అంటే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కు ప్రసాదించబడిన మహిమలో మరో ప్రత్యేకత కూడా ఉంది. అంతకు ముందు ప్రసాదించబడిన మహిమలన్నీ కాలం మరియు ప్రాంతం హద్దులలోనే ఉండిపోయాయి. అంటే అవి నిర్ణీత ప్రాంతంలో, నిర్ణీత ప్రజలకు, నిర్ణీత సమయంలో చూపబడినాయి. కానీ, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కు ప్రసాదించబడిన అద్భుత మహిమ ఖుర్ఆన్ విషయంలో అలా జరగలేదు. ఖుర్ఆన్ మహిమ ఎలాంటి కాల, ప్రాంత హద్దులలో కట్టడి చేయబడలేదు. అది విశ్వవ్యాప్తమైన మరియు కాలాతీతమైన మహిమగా నేటికీ ప్రజలను ఆశ్చర్య చకితులను చేస్తున్నది. భూత మరియు వర్తమాన తరాలు దీనికి సాక్ష్యమిస్తున్నాయి. ఇలాగే భవిష్యత్తులో రాబోయే తరాలు కూడా దీని శైలి, అంశాలు మరియు ఆధ్యాత్మిక ఉద్ధరణ మొదలైన అద్భుతాలకు సాక్ష్యమివ్వబోతున్నాయి. వీటిని ఈనాడు కూడా పరీక్షించవచ్చు మరియు భవిష్యత్తులో కూడా పరీక్షించవచ్చు. ఖుర్ఆన్ యొక్క దైవికమైన మూలాధారాన్ని ఇది నిరూపిస్తున్నది.
3. తనపై అవతరిస్తున్న దివ్యవాణి అల్లాహ్ నుండే వస్తున్నదని, అది తన స్వంతమైంది కాదనీ, అది మానవజాతి శ్రేయస్సు కోసమని ప్రతి ప్రవక్తా స్పష్టంగా ప్రకటించినాడు. అలాగే తనకంటే ముందు అవతరించిన దానినీ మరియు తన తర్వాత అవతరించ బోయే దానినీ ఆయన ధృవీకరించాడు. సర్వలోకాల, సకల కాలాల ఏకైక దేవుడు తనకు అప్పజెప్పిన దివ్యసందేశం అందజేసే వరకే తన బాధ్యత అని స్పష్టం చేసేందుకు ప్రవక్త ఇలా చేసేవారు. కాబట్టి స్వభావపరంగా మరియు సారాంశపరంగా వారి దివ్యసందేశం ఒక్కటే మరియు దాని ఉద్దేశం కూడా ఒక్కటే. అందువలన అది అతనికి పూర్వం పంపబడిన దానితో లేదా అతని తర్వాత భవిష్యత్తులో పంపబడే దానితో విభేదించకూడదు.
అల్లాహ్ యొక్క ఆజ్ఞలు మరియు మార్గదర్శకత్వం మానవజాతికి అందజేయటంలో ప్రవక్తల అవసరం ఎంతైనా ఉంది. మనం ఎందుకు సృష్టించబడినాము? మరణానంతరం మనకు ఏమి జరగబోతున్నది? చనిపోయిన తర్వాత ఏదైనా జీవితం ఉందా? మన కర్మలకు మనమెంత వరకు బాధ్యత వహిస్తాం? మరోమాటలో చెప్పాలంటే, ఈ ప్రపంచంలో మనం చేస్తున్న కర్మలకు శిక్ష లేదా బహుమానం వంటిది ఏమైనా ఉందా? ... మొదలైన ప్రశ్నలకు ఒకవేళ ప్రవక్తలు లేకపోతే, ఎవరు జవాబిస్తారు? ఈ ప్రశ్నలు మరియు సృష్టికర్త, దైవదూతలు, స్వర్గం, నరకం ... వంటి అనేక ఇతర ప్రశ్నలకు సర్వలోక సృష్టికర్త మరియు అగోచర విషయాలన్నీ ఎరిగిన అల్లాహ్ నుండి తిన్నగా ప్రవక్తలకు వచ్చిన దివ్యవాణి తప్ప మరేదీ సమాధానం ఇవ్వలేదు. ఆ సమాధానాలు తప్పనిసరిగా ప్రామాణికమైనవై ఉండాలి మరియు మనం నమ్మే మరియు గౌరవించే వ్యక్తులు తెచ్చినవై ఉండాలి. అందువలననే; ప్రవక్తలు లేక సందేశహరులు వారి సమాజంలోని వ్యక్తులలో నుండి నైతికత మరియు బుద్ధీవివేకం సామర్థ్యాల ఆధారంగా ఎంచుకోబడతారు.
అందువలన, కొందరు మహా ప్రవక్తలపై అభాండాలు వేసే బైబిలు కథలను ముస్లింలు ఒప్పుకోరు. ఉదాహరణకు, బైబిలులోని లూత్ అలైహిస్సలాం త్రాగిన మైకంలో తన స్వంత కుమార్తెలతో వ్యభిచారం చేసారనే అపవాదు, డేవిడ్ తన నాయకులలో ఒక నాయకుని భార్యను పెళ్ళి చేసుకోవాలనే ఉద్దేశంతో అతడిని భీకర యుద్ధంలో పంపారనే అపవాదు. ముస్లింల కొరకు ప్రవక్తల స్థానం బైబిలు కథలలో పేర్కొన్న స్థానం కంటే ఎన్నో రెట్లు గొప్పది. ఇస్లాం ధర్మం దృష్టిలో ఇలాంటి కథలు నిజమైనవి కాజాలవు. దైవసందేశ ప్రచారాన్ని నిరంతరం కొనసాగించమనే ఆదేశంతో పాటు ప్రవక్తలకు సృష్టికర్త యొక్క అపూర్వమైన సహాయం కూడా లభిస్తుంది.
మానవజాతికి ప్రవక్తల ద్వారా అందజేయబడిన దివ్యసందేశంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:
a. ఏకైక దేవుడి గురించి స్పష్టమైన భావన: ఆయన దివ్యలక్షణాలు, ఆయన సృష్టి, ఆయనకు ఏది ఆపాదించవచ్చు మరియు ఏది ఆపాదించకూడదు అనే సూచనలు.
b. అగోచర ప్రపంచం, దైవదూతలు, జిన్నాతులు, స్వర్గం మరియు నరకం గురించి స్పష్టమైన వివరణ.
c. సృష్టికర్త మనల్ని ఎందుకు సృష్టించాడు? మనల్నుండి ఆయన ఏమి ఆశిస్తున్నాడు మరియు ఆయనకు చూపే విధేయత లేక అవిధేయతకు ఏమి బహుమానం లేదా ఏమి శిక్ష ఉంటుంది?
d. ఆయన అభీష్టం ప్రకారం మన సమాజాలు ఎలా జీవించాలి? సంతోషకరమైన మరియు ఆదర్శవంతమైన సమాజ స్థాపన కొరకు సరిగ్గా, నిజాయితీగా విధించ వలసిన ఆజ్ఞలు మరియు చట్టాలు ఏవి?.
పైచర్చల ద్వారా స్పష్టమవుతున్నది ఏమిటంటే ప్రవక్తల ప్రత్యామ్నాయం లేనేలేదు. విజ్ఞాన శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందిన నేటి కాలంలో కూడా మానవాతీత బాహ్యప్రపంచం గురించి తెలిపే ఏకైక ప్రామాణిక మూలాధారం దివ్యవాణి మాత్రమే. విజ్ఞాన శాస్త్రం నుండి లేక రహస్యానుభూతుల నుండి మార్గదర్శకత్వం లభించదు. మొదటిది మరీ భౌతికమైంది మరియు మరీ పరిమితమైంది; రెండోది మరీ వ్యక్తిగతమైంది మరియు మరీ తరుచుగా దారితప్పిస్తూ ఉంటుంది.
ఇప్పుడు, ఎవరికైనా ఈ ప్రశ్న రావచ్చు:
మానవజాతి వైపు ఎందరు ప్రవక్తలను అల్లాహ్ పంపినాడు? ఖచ్చితమైన సంఖ్య మనకు తెలియదు. 240 వేల మంది ప్రవక్తలు పంపబడినారని కొందరు ముస్లిం పండితుల అభిప్రాయం. యథార్థానికి, ఖుర్ఆన్ లో స్పష్టంగా ‘ప్రతి జాతిలోనూ అల్లాహ్ ఒక సందేశహరుడిని పంపాడు’ అని పేర్కొనబడిన దానిని మాత్రమే మేము నమ్ముతాము. ఎందుకంటే అల్లాహ్ యొక్క ఒక నియమం ఏమిటంటే – ఏమి చేయాలి మరియు ఏమి చేయకూడదు అనేది స్పష్టం చేయకుండా ఆయన ప్రజల కర్మల లెక్కలు తీసుకోడు. 25 మంది ప్రవక్తల పేర్లు ఖుర్ఆన్ పేర్కొనబడినాయి. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలుపబడని అనేక మంది ప్రవక్తలు ఉన్నారని కూడా సూచించబడింది. ఈ 25 మందిలో పెద్దఓడ నిర్మించిన నూహ్, అబ్రహాం, మోసెస్, జీసస్ అలైహిస్సలాంలు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఉన్నారు. వీరైదుగురు అల్లాహ్ యొక్క మొత్తం సందేశహరులలో అతి గొప్పవారు. వీరిని 'స్థిరమైన' ప్రవక్తలు అని కూడా పిలుస్తారు.
ప్రవక్తత్వం గురించిన ఇస్లామీయ విశ్వాసం యొక్క అద్భుత దృష్టికోణం ఏమిటంటే సర్వలోక సృష్టికర్త యొక్క ప్రవక్తలందరినీ ముస్లింలు ఎలాంటి మినహాయింపులు లేకుండా నమ్ముతారు. ఎందుకంటే ప్రవక్తలందరినీ ఆ ఏకైక ప్రభువే ఎంచుకున్నాడు మరియు మానవజాతిని ఆయన వైపుకు పిలవడమే వారందరి ఉద్దేశం. కాబట్టి ప్రవక్తలందరినీ విశ్వసించడమనేది చాలా ఆవశ్యకమైంది మరియు హేతుబద్దమైందీను. కొందరిని అంగీకరించి, మరికొందరిని తిరస్కరించడమనేది తప్పకుండా ప్రవక్తల పాత్ర గురించి ముందుగానే అపార్థము చేసుకోవటం లేక జాతి పరంగా వేరు చేయడంతో సమానం. దైవప్రవక్తలందరినీ విశ్వసించుట అనే దానిని ప్రపంచంలో కేవలం ముస్లింలు మాత్రమే దైవవిశ్వాస మూలస్థంభాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఆ విధంగా యూదులు జీసస్ (ఈసా అలైహిస్సలాం) మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)లను తిరస్కరిస్తున్నారు; క్రైస్తవులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరిస్తున్నారు. తద్వారా వారు మోసెస్ (మూసా అలైహిస్సలాం) చట్టాలకు కట్టుబడి ఉండక, వాస్తవానికి ఆయననే తిరస్కరిస్తున్నారు. అయితే మానవజాతికి మార్గదర్శకత్వాన్ని అందించిన సృష్టికర్త యొక్క దైవప్రవక్తలుగా ముస్లింలు వారందరినీ స్వీకరిస్తారు. అయితే, ఆ ప్రవక్తలు సృష్టికర్త నుండి తెచ్చిన దివ్యసందేశం వివిధ మార్పులు చేర్పులకు గురైంది. ప్రవక్తలందరినీ విశ్వసించాలని ఖుర్ఆన్ ముస్లింలను ఇలా ఆజ్ఞాపిస్తున్నది: వారితో అను “మేము అల్లాహ్ ను విశ్వసించాము. అలాగే మా వైపునకు అవతరించిన దానినీ; ఇబ్రాహీము, ఇస్మాయీలు, ఇస్ హాఖు, యాఖూబు మరియు అతని సంతతి వారిపై అవతరించిన దానినీ; ఇంకా మూసా మరియు ఈసాలకు ప్రసాదించబడిన దానినీ మరియు ప్రవక్తలకు వారి ప్రభువు తరఫు నుండి ఏదైతే ప్రసాదించబడినదో దానినీ విశ్వసించాము. వారిలో ఏ ఒక్కరిపట్లా మేము ఎలాంటి భేదభావం చూపము. ఇంకా మేము ఆయనకే (అల్లాహ్ కే) మా అభీష్టాన్ని సమర్పించుకున్నాము.” (2:136)
ఇదే నిజమైన మరియు నిస్పక్షపాతమైన విశ్వాసమని ఖుర్ఆన్ దీని తర్వాతి వచనాలలో పేర్కొంటున్నది. ఒకవేళ ఇతర సమాజాలు కూడా దీనినే విశ్వసిస్తున్నట్లయితే, వారు కూడా సరైన మార్గంలో ఉన్నట్లే. ఒకవేళ వారలా విశ్వసించకపోతే, వారు తమ స్వంత చపలత్వ మరియు పక్షపాత ధోరణిని అనుసరిస్తున్నట్లే. తుదకు సర్వలోకాల సృష్టికర్త వారికి తగిన శిక్ష విధిస్తాడు. దీని గురించి ఖుర్ఆన్ లో ఇలా ఉంది: కనుక, మీరు విశ్వసించిన మాదిరిగానే వారూ విశ్వసించినట్లయితే, నిస్సందేహంగా వారు ఋజుమార్గం పొందిన వారవుతారు. ఒకవేళ వారు వెనుతిరిగిపోతే, వారు కేవలం వ్యతిరేకతలో ఉన్నట్లే. వారికి వ్యతిరేకంగా మీకు అల్లాహ్ యే చాలు. ఆయన అన్నీ వినేవాడు, సర్వజ్ఞుడూనూ. (మాది) అల్లాహ్ యొక్క వర్ణము (ధర్మం)! మరి, అల్లాహ్ వర్ణము కంటే ఉత్తమమైన వర్ణము ఎవరిది కాగలదు? మరియు మేము ఆయనను మాత్రమే ఆరాధించేవారము. (2:137-38)
ప్రవక్తత్వం గురించి స్పష్టంగా గ్రహించ వలసిన కనీస ముఖ్యాంశాలు రెండున్నాయి. ఈ అంశాలు అసాధారణ రీతిలో అపార్థం చేసుకోబడిన జీసస్ మరియు ముహమ్మద్ అలైహిస్సలాంల ప్రవక్త పాత్రల గురించినవి.
జీసస్ (ఈసా అలైహిస్సలాం) దేవుడు మరియు దేవుడి కుమారుడు అనే భావనలను ఖుర్ఆన్ తీవ్రంగా ఖండిస్తున్నది. అయితే ఆయన సృష్టికర్త యొక్క ఒక మహాప్రవక్త అని పేర్కొంటున్నది. తండ్రి కలయిక లేకుండా జీసస్ (అలైహిస్సలాం) పుట్టడమనేది ఆయనకు దైవత్వాన్ని ప్రసాదించదని ఖుర్ఆన్ స్పష్టపరుస్తున్నది. ఈ సందర్భంలో సృష్టికర్త ఆదం (అలైహిస్సలాం) ను తల్లీ, తండ్రీ ఇద్దరూ లేకుండా సృష్టించాడనే విషయాన్ని గుర్తు చేస్తున్నది: నిశ్చయంగా, అల్లాహ్ వద్ద ఈసా యొక్క ఉదాహరణ ఆదము వంటిదే. అతనిని (ఆదమ్ ను) అల్లాహ్ మట్టితో చేసాడు. తరువాత అతనితో "అయిపో!" అనగానే, అతను ఉనికిలోనికి వచ్చాడు. (3:59)
ఇతర ప్రవక్తల వలే జీసస్ (అలైహిస్సలాం) కూడా అల్లాహ్ ఆజ్ఞతో మరియు అనుమతితో అద్భుతాలు చేసి చూపారు. ఉదాహరణకు, మృతులను తిరిగి లేపారు, అంధులకు చూపును ప్రసాదించారు, కుష్టురోగులను నయం చేసారు. అయితే ఈ అద్భుతాలు చేసేటప్పుడు ఇదంతా అల్లాహ్ తరుఫు నుండేనని ఆయన ఎల్లప్పుడూ స్పష్టం చేసేవారు.
వాస్తవానికి, జీసస్ (అలైహిస్సలాం) యొక్క వ్యక్తిత్వం మరియు దౌత్యం గురించిన అపార్థాలు ఆయన అనుచరులలోనే కనబడతాయి. ఎందుకంటే, ఆయన బోధించిన దివ్యసందేశం ఈ ప్రపంచంలో ఆయన జీవించి ఉన్నపుడు, ఆయన సమక్షంలో రికార్డు చేయబడకుండా, వంద సంవత్సరాలు గడిచిన తర్వాత నమోదు చేయచబడింది. ఖుర్ఆన్ ప్రకారం ఆయన ఇస్రాయీల్ సంతతి వారి కొరకు పంపబడినారు. ఆయన మూసా అలైహిస్సలాం పై అవతరించిన తౌరాతు గ్రంథ ప్రామాణికతను ధృవీకరించారు. అంతేగాక తన తర్వాత ఒక అంతిమ ప్రవక్త రాబోతున్నాడనే శుభవార్తను కూడా ఆయనిచ్చారు. మర్యమ్ కుమారుడైన ఈసా, “ఓ ఇస్రాయీలు సంతతివారలారా! నేను మీ వైపు అల్లాహ్ తరుపున పంపబడిన ప్రవక్తను. నాకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. నా తరువాత రాబోయే ఒక ప్రవక్తను గురించి శుభవార్తను ఇస్తున్నాను. అతని పేరు అహ్మద్ అని చెప్పినప్పటి సంగతి (కూడా స్మరించదగినదే)”. తీరా అతను స్పష్టమైన నిదర్శనాలను తీసుకు వచ్చినపుడు ‘ఇది పచ్చి ఇంద్రజాలం’ అని వారన్నారు. (61:6)
గమనిక: అహమద్ లేక అహ్మద్ (ప్రశంసించదగినవాడు) అనేది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మారుపేరు.
ఏదేమైనా యూదులలో మెజారిటీ ప్రజలు జీసస్ (అలైహిస్సలాం) యొక్క దౌత్యాన్ని తిరస్కరించారు. ఆయన ప్రాణం తీయాలని కుట్రలు పన్నారు. వారి అభిప్రాయం ప్రకారం ఆయన శిలువ వేయబడి, ప్రాణాలు కోల్పోయారు. అయితే ఖుర్ఆన్ ఈ అభిప్రాయాన్ని తిరస్కరిస్తున్నది మరియు ఆయన శిలువ వేయబడలేదనీ, హత్య చేయబడలేదనీ, ఆయన సజీవంగా ఆకాశంలోనికి లేపుకోబడినాడని ఖుర్ఆన్ అంటున్నది. జీసస్ (అలైహిస్సలాం) మరలా తిరిగి వస్తారని, అపుడు మొత్తం క్రైస్తవులు మరియు యూదులు ఆయన మరణించక ముందే ఆయనను నమ్ముతారని ఖుర్ఆన్ లోని ఒక ఆయతులో పేర్కొనబడింది. ఇదే అభిప్రాయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రామాణిక హదీథుల ద్వారా కూడా బలపర్చబడింది.
అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అరేబియాలో క్రీ.శ. 6వ శతాబ్దంలో జన్మించారు. తన 40వ సంవత్సరం వరకు మక్కా ప్రజలు ఆయనను అత్యంత ఉత్తమ గుణాలు కలిగిన ఒక మామూలు వ్యక్తిగా మాత్రమే ఎరుగుదురు. వారు ఆయనను అల్ అమీన్ (నమ్మకస్తుడు) అనే మారుపేరుతో పిలిచేవారు. త్వరలోనే తను ఒక ప్రవక్తగా మారి, దివ్యవాణి అందుకోబోతున్నాననే విషయం ఆయనకు కూడా తెలియదు. ఏకైక ప్రభువును మాత్రమే ఆరాధించమని మరియు తనను ఆయన యొక్క ప్రవక్తగా స్వీకరించమని ఆయన మక్కా విగ్రహారాధకులను ఆహ్వానించారు. ఆయనపై అవతరించిన దివ్యసందేశం ఆయన జీవిత కాలంలో ఆయన సమక్షంలో కొందరు సహచరులు కంఠస్థం చేసారు. మరికొందరు చర్మం, ఎముకలు, కర్ర ముక్కలపై వ్రాసుకున్నారు. ఆ విధంగా, ఈనాడు మనం చూస్తున్న ఖుర్ఆన్ ఆయనపై అవతరించిన ఖుర్ఆన్ ఒక్కటే. అందులోని ఒక్క అక్షరం కూడా మార్పు చెందలేదు. ఎందుకంటే అల్లాహ్ స్వయంగా దీనిని రక్షిస్తానని ప్రకటించి ఉన్నాడు. ఎందరో శాస్త్రజ్ఞులు అనేక పరిశోధనలు చేసి దీని ప్రామాణికతను ఒప్పుకున్నారు. ఖుర్ఆన్ అన్ని కాలాలలో మొత్తం మానవజాతి కొరకు మార్గదర్శక గ్రంథంగా పంపబడింది మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ ప్రవక్తగా పేర్కొన్నది.
ఇస్లాంలోని దైవారాధన
ఇస్లాం ధర్మంలోని దైవారాధనను కొందరు ముస్లింలతో పాటు చాలా మంది ప్రజలు అపార్థం చేసుకున్నారు. దైవారాధన అంటే సామాన్యంగా నమాజు, ఉపవాసం, దానధర్మాలు మొదలైన పనులు చేయటమని భావిస్తారు. దైవారాధన యొక్క ఈ పరిమిత భావం ఇస్లాం ధర్మపు దైవారాధనలోని ఒక చిన్న భాగం మాత్రమే. కాబట్టి ఇస్లాం ధర్మపు దైవారాధన యొక్క సాంప్రదాయక నిర్వచనం ఏమిటంటే, ఎవరైనా వ్యక్తి యొక్క దాదాపు ప్రతి పనీ దైవారాధన క్రిందికే వస్తుంది. దీని నిర్వచనం ఇలా ఉంది: "దైవారాధన అనేది సృష్టికర్తకు నచ్చే ఒక వ్యక్తి బహిరంగ మరియు అంతర్గత పలుకులు మరియు ఆచరణలన్నీ కలిసి ఉన్న ఒక సమగ్ర పదం." మరోమాటలో, దైవారాధన అంటే సృష్టికర్త సంతృప్తి కొరకు పలికే ప్రతి పలుకూ మరియు చేసే ప్రతి పనీ. కాబట్టి దీనిలో ఆచారకర్మలు, దైవవిశ్వాసాలు, సామాజిక కార్యములు మరియు తోటి మానవుడి శ్రేయస్సు కొరకు వెచ్చించే వ్యక్తిగత తోడ్పాటు మొదలైన వన్నీ ఉన్నాయి.
వ్యక్తులను ఇస్లాం ధర్మం సమస్తంగా చూస్తుంది. ఖుర్ఆన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇలా ఆదేశించినట్లుగా, స్వయంగా ఒక వ్యక్తి అల్లాహ్ కు పూర్తిగా సమర్పించుకోవలసి ఉంది: ఇంకా (ఓ ముహమ్మద్) వారితో ఇలా అను: “నిశ్చయంగా, నా నమాజు (ప్రార్థనలు), నా సకల సమర్పణలు-త్యాగాలు (ఆరాధనారీతులు), నా ఈ జీవితం మరియు నా మరణం సర్వమూ – కేవలం సకల లోకాల ప్రభువైన ఆ అల్లాహ్ కొరకే; ఆయనకు సాటి ఎవరూ లేరు – నేను ఈవిధంగానే ఆదేశించబడినాను. తనను తాను స్వయంగా అల్లాహ్ అభీష్టానికి సమర్పించుకుని, ఆయనకు విధేయులైన వారిలో నేనే మొదటివాడిని.” (6:162-163) ఈ సమర్పణ యొక్క సహజ ఫలితం ఏమిటంటే ఒక వ్యక్తి యొక్క ప్రతి పనీ అతడు సమర్పించుకున్న వాని ఆజ్ఞలకు అనుగుణంగా ఉండి తీరాలి. ఇస్లాం ఒక పరిపూర్ణ జీవన విధానం కాబట్టి, ధార్మిక జీవితమైనా లేక వేరే ఇతర జీవితమైనా, తమ జీవితంలోని ప్రతి క్షణం ఇస్లామీయ బోధనలకు అనుగుణంగా ఉండాలనేది ఇస్లాం ధర్మాన్ని అవలంబించినవారి కొరకు తప్పనిసరై ఉంది: ధర్మానికి దాని ఆచారకర్మలలో తప్పించి ఒకరి జీవితంతో ఎలాంటి సంబంధమూ లేదని, అది ఒక వ్యక్తికి మరియు అతడి దేవుడికి మధ్య ఉండే వ్యక్తిగత సంబంధమని భావించే కొందరు ప్రజలకు ఇది ఆశ్చర్యంగా కనబడవచ్చు.
వాస్తవానికి, తన స్వంత జీవితంపై ఎలాంటి ప్రభావం చూపకుండా కేవలం యాంత్రికంగా ఆచరించే ఆచరణలకు ఇస్లాం ధర్మంలో ఎలాంటి ప్రాధాన్యతా లేదు. ఖుర్ఆన్ గ్రంథం ఈ క్రింది వచనంలో ఖిబ్లా దిశ (నమాజు చేసే దిశ) మార్పు గురించి వాదించు కుంటున్న విశ్వాసులను మరియు వారి ఇరుగు పొరుగు గ్రంథ ప్రజలను ఇలా సంభోదిస్తున్నది: అల్ బిర్ర్ (సదాచరణ, దైవభక్తి, ధర్మనిష్ఠాపరత్వం మరియు అల్లాహ్ పట్ల విధేయత చూపే ప్రతి పని) అంటే కేవలం మీ ముఖాలను తూర్పు దిశకో లేదా పడమర దిశకో త్రిప్పుకొనుట కాదు. కానీ, అల్ బిర్ర్ అంటే (వారి లక్షణం) ఎవరైతే –
అల్లాహ్ ను, అంతిమ దినమును, మలాయికలను, దివ్యగ్రంథాల్ని మరియు అల్లాహ్ యొక్క సందేశహరులను విశ్వసిస్తారో, మరియు సంపదపై ప్రేమ ఉన్నప్పటికీ - దగ్గరి బంధువులకు, అనాధలకు, అక్కర గలవారికి, బాటసారులకు, అర్థించేవారికి మరియు బానిసల విముక్తి కొరకు ఖర్చు చేస్తారో, మరియు నమాజులను స్థాపిస్తారో మరియు జకాతును (విధిదానాన్ని) చెల్లిస్తారో, మరియు వాగ్దానం చేసినప్పుడు దానిని పూర్తి చేస్తారో, అలాగే కష్టాలలో, పేదరికంలో మరియు యుద్ధసమయాలలో సహనం వహిస్తారో –
అలాంటి వారే సత్యవంతులు మరియు అలాంటి వారే అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగియున్న వారు. (2:177)
పైన పేర్కొనబడిన ఆయతులోని ఆచరణలు సదాచరణలు మరియు అవి ఆరాధనలోని ఒక భాగం మాత్రమే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఆరాధనకు మూలమైన దైవవిశ్వాసం గురించి ఇలా బోధించి ఉన్నారు. "అది 70 లేక అంతకంటే ఎక్కువ శాఖలతో తయారైంది: వాటన్నింటిలో మహోన్నతమైనది ఏదంటే అల్లాహ్ యొక్క ఏకత్వంపై విశ్వాసం, (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హతలు గల ఆరాధ్యుడెవ్వరూ లేడు) మరియు వాటన్నింటిలో కొలమానంలో తక్కువ స్థాయి ఆరాధన ఏదంటే ప్రజల దారిలో నుండి అడ్డంకుల్ని మరియు మలినాల్ని తొలగించుట"
ఇస్లాంలో ధర్మలో మంచి పని కూడా ఒక ఆరాధనగానే పరిగణించ బడుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: "ఎవరైతే రాత్రవగానే (పగలంతా న్యాయంగా సంపాదించేందుకు) తను పడిన శ్రమ వలన అలసి పోతారో, అల్లాహ్ అతడి పాపాలను క్షమిస్తాడు." జ్ఞానాన్ని సంపాదించడమనేది ఉత్తమ ఆరాధనలలో ఒకటి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులతో ఇలా పలికారు "జ్ఞానాన్ని సంపాదించడం ప్రతి ముస్లింపై తప్పని సరి చేయబడింది." కేవలం అల్లాహ్ మెప్పు కొరకు సమాజంలో మంచిగా ప్రవర్తించడం మరియు పరస్పరం సహాయ పడటమనేది ఆరాధనలలోని ఒక భాగం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: "మీ మిత్రుడిని చిరునవ్వుతో పలకరించడం కూడా ఒక రకమైన దానధర్మమే. అలాగే పొరుగింటివాని బక్కెటులో కొంత నీరు పోయడం కూడా ఒ రకమైన దానధర్మమే."
ఎవరైనా తమ బాధ్యతలను, కర్తవ్యాన్ని పూర్తి చేయడం కూడా ఒక రకమైన ఆరాధనగానే పరిగణించబడుతుంది. ఎవరైనా వ్యక్తి తన కుటుంబం కోసం ఖర్చు పెట్టేదంతే అతడి దానధర్మాలలో లెక్కించబడుతుంది; ఒకవేళ అతడు న్యాయమైన పద్ధతుల ద్వారా దానిని సంపాదించినట్లయితే, అతడికి మంచి ప్రతిఫలం లభిస్తుంది. ఎవరైనా తన కుటుంబ సభ్యులపై చూపే కనికరం, కారుణ్యం ఉదాహరణకు భార్య నోటిలో అన్నం ముద్దం పెట్టడం మొదలైనవి కూడా ఒక రకమైన ఆరాధనయేనని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలిపారు. అంతేకాదు, మనమెంతో ఎంజాయి చేసే పనులు కూడా ఒకవేళ అవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన విధంగా చేస్తున్నట్లయితే, అవి కూడా ఆరాధనగానే పరిగణించబడతాయి. తన భార్యతో దాంపత్య సుఖం అనుభవిస్తున్న వారికి పుణ్యం ప్రసాదించబడుతుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు బోధించారు. అది వినగానే సహచరులు ఆశ్చర్యచకితులై ఆయనను ఇలా అడిగారు: "మన ఎంజాయ్ కొరకు చేస్తున్న పనులకు పుణ్యం ఎలా ప్రసాదించబడుతుంది?" అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారినిలా ప్రశ్నించారు: "ఒకవేళ మీరు మీ కోరికలను అక్రమంగా తీర్చుకుంటే మీకు శిక్షపడుతుందా లేదా?" వారపుడు "పడుతుందని" బదులిచ్చారు, అపుడు ఆయనిలా పలికారు: "మరి, దానిని ధర్మబద్ధంగా మీ భార్యలతో తీర్చుకుంటే, మీకు పుణ్యం ప్రసాదించబడదా." కాబట్టి అవి ఆరాధనకు చెందిన ఆచరణలే అని అర్థమవుతున్నది. ఇంకా, దాంపత్య సుఖాన్ని అనుభవించడమనేది చేయకూడని ఒక పాపపు పనిగా ఇస్లాం పరిగణించదు. అయితే దాంపత్య బంధానికి బయట దానిని తీర్చుకోవడమనేది తప్పకుండా ఒక చెడుపని మరియు పాకార్యం.
ఇప్పటి వరకు జరిగిన చర్చ ప్రకారం, ఇస్లాం ధర్మంలో ఆరాధన అనేది వ్యక్తిగత మంచిపనులతో కూడిన ఒక సమగ్రమైన పదం. ఇస్లామీయ జీవన విధానమనేది ఒక సహజ జీవన విధానమనే వాస్తవంతో ఇది తప్పకుండా ఏకీభవిస్తున్నది. జీవితపు అన్ని విభాగాలలోనూ ఇస్లాం మానవ జీవితాన్ని క్రమశిక్షణలో పెడుతున్నది: వ్యక్తిగతంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మరియు అధ్యాత్మికంగా; అందవలననే ఇస్లాం జీవితంలోని అతి చిన్న విషయాల గురించి కూడా అన్ని దశలలోనూ దారి చూపుతున్నది. కాబట్టి ఆయా సందర్భాలలో వీటిని అనుసరించడం అనేది ఆయా సందర్భాలకు సంబంధించిన ఇస్లామీయ ఆజ్ఞలు. తను చేస్తున్న పనులన్నింటినీ తన ప్రభువు ఆరాధనగా పరిగణిస్తాడనే భావన ఎంతో ప్రోత్సాహకరమైన బహుమానంగా పనిచేస్తుంది. ఇది తన పనుల ద్వారా అల్లాహ్ యొక్క మెప్పు పొందాలని మరియు తనపై అధికారులు తనను గమనిస్తున్నా లేదా ఒంటరిగా చేస్తున్నా సరే, చేస్తున్న పనిలో ఎలాంటి లోపం లేకుండా చాలా మంచిగా పూర్తి చేయాలని ప్రయత్నించేట్టు ప్రోత్సహిస్తుంది. అనుక్షణం మనల్ని కనిపెట్టి ఉండే ఒక నిత్య పర్యవేక్షకుడు ఉన్నాడు – ప్రతిదీ ఆయన గ్రహిస్తాడు, వింటాడు, చూస్తాడు – ఆయనే అలాహ్.
సాంప్రదాయాలలో లేని ఆరాధనలను గురించి చర్చించడ మంటే ఆ సాంప్రదాయాల ప్రాధాన్యతను తగ్గిస్తున్నామని కాదు. నిజానికి సాంప్రదాయ ఆరాధనలను, వాటి అసలు అవగాహనతో ఒకవేళ ఆచరిస్తే, అవి మానమర్యాదలు మరియు అధ్యాత్మికతలలో మానవుడి స్థాయిని పెంచుతాయి. అంతేగాక జీవితపు ప్రతి పనినీ దైవాదేశాలకు అనుగుణంగా చేసేలా అతడికి దారి చూపుతాయి. సంప్రదాయ ఆరాధనలలో సలాహ్ (నమాజు) రెండు కారణాల వలన ఒక ముఖ్యస్థానాన్ని ఆక్రమిస్తున్నది. మొదటిది, ఒక మోమిన్ (విశ్వాసి) యొక్క విశిష్ట లక్షణం. రెండోది, ప్రతిరోజు ఐదు సార్లు తన సృష్టికర్తతో డైరక్టు కమ్యూనికేషన్ అవకాశాన్ని ఇవ్వడం వలన అది మనిషిని అన్ని రకాల దుష్టతనం, దుర్మార్గం మరియు చెడుల నుండి కాపాడుతుంది. అంతేగాక అది అతడిని తన ప్రభువుకు చేసిన వాగ్దానాన్ని మరలా మరలా జ్ఞాపకం చేసుకునేలా మరియు ఆయన యొక్క మార్గదర్శకత్వాన్ని మాటిమాటికీ అర్థించేలా చేస్తుంది: అనంత కరుణామయుడు మరియు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో, సకల స్తోత్రములు సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే; అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడూనూ; ప్రతిఫల దినానికి అధిపతి; మేము నిన్నే ఆరాధిస్తాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తాము. (1:4-5)
నిజానికి సలాహ్ (నమాజ్) అనేది ఈమాన్ (విశ్వాసం) యొక్క మొదటి ఆచరణాత్మక ప్రత్యక్ష లక్షణం మరియు విశ్వాసుల సాఫల్యానికి అవసరమైన తొలి ప్రాథమిక షరతులలోనిది: "నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు. వారు ఎలాంటి వారంటే తమ నమాజులలో వారు అణుకువ కలిగి ఉంటారు" (23:1-2) Tఇదే విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేరే మాటలలో నొక్కి చెప్పారు. ఆయన పలుకులలో:"ఎవరైతే నమాజును చాలా నిష్ఠగా మరియు ఖచ్చితమైన సమయాపాలనతో చేస్తారో, అలాంటి వారికి ఇది చాలా సులభమైందిగా అనిపిస్తుంది, ఇది వారి ఈమాన్ కు (విశ్వాసానికి) నిదర్శనం. తీర్పుదినాన వారి మోక్షానికి కారణం అవుతుంది."
ఇస్లాం ధర్మంలోని మరో ప్రధానమైన మూలస్థంభము జకాతు (విధిదానం). ఖుర్ఆన్ లో తరుచుగా సలాహ్ మరియు జకాతు కలిసి ఉంటాయి. సలాహ్ (నమాజు) వలే జకాతు కూడా కేవలం అల్లాహ్ మాత్రమే విశ్వంలోని ప్రతిదాని ఏకైక యజమాని అని ధృవీకరిస్తూ, దైవవిశ్వాసాన్ని (ఈమాన్ ను) ప్రదర్శిస్తుంది. అల్లాహ్ తమను యజమానులుగా చేసిన సంపదను ప్రజలు నిజాయితీగా తమకు అప్పజెప్పబడిన బాధ్యతను పూర్తిచేస్తూ, ఆయన ఆజ్ఞాపించిన విధంగా ఖర్చు చేయవలసి ఉంది: "మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మిమ్ముల్ని ఏ సంపదకైతే వారసుడిగా చేసాడో, అందులో నుంచి ఖర్చు చేయండి. మరి మీలో విశ్వసించి, దానధర్మాలు చేసే వారికి గొప్ప పుణ్యఫలం లభిస్తుంది." (57:7)
ఈ విధంగా, జకాతు కూడా దైవభీతి చూపే ఒక ఆచరణే అని స్పష్టమవుతున్నది. సలాహ్ (నమాజు) వలే జకాతు కూడా విశ్వాసిని తన ప్రభువు సమీపంలోనికి చేరుస్తుంది. అంతేగాక, ధనవంతులు తమ వద్ద నిల్వ ఉన్న అదనపు సంపదను జకాతు ఆదేశాల ప్రకారం బీదసాదలలో పంపిణీ చేయడం ద్వారా వివిధ అంతస్తులు మరియు వర్గాల మధ్య ఆర్థిక తారతమ్యాలు తగ్గి, సమాజంలో సోదరభావం వ్యాపిస్తుంది. అది సమాజ స్థిరత్వం కొరకు హెచ్చుతగ్గులు లేకుండా దానధర్మాలు జరిగేలా చేస్తుంది. ధనవంతుల మనస్సులోని లోభితనం మరియు సమాజంపై బీదల మనస్సు లోని కోపతాపాలను తొలగించి, మంచి దారి వైపు మళ్ళిస్తుంది. వివిధ వర్గాల మధ్య ఆర్ధిక హెచ్చుతగ్గుల కారణంగా కలిగే ఈర్ష్యాద్వేషాలను తొలిగించి, సహోదర భావాల్ని నాటుతుంది. పరస్పర సహకారాన్ని పెంపొందిస్తుంది. అలాంటి సమాజ స్థిరత్వం కేవలం ధనవంతుల వ్యక్తిగత భావాలపై ఆధారపడక, నిర్దేశిత హక్కులపై స్థాపించబడి ఉంది. ఒకవేళ ధనవంతులు నిరాకరిస్తే, బలవంతంగానైనా సరే వసూలు చేసి, అక్కరగలవారికి పంచే ధర్మాదేశాలు కలిగి ఉంది.
సియామ్ (రమదాన్ నెలలో పగటిపూట ఉపవాసం ఉండుట) ఇస్లాం ధర్మం యొక్క మరో ప్రధాన మూలస్థంభము. ఇతర ఇస్లామీయ ఆరాధనలు ముస్లింలను బహిరంగంగా పరిశుద్ధుల్ని చేస్తున్నట్లుగా, వారిని లోలోపలి నుండి కూడా పరిశుద్ధులను చేయడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. అలాంటి పరిశుద్ధత వలన అతడు సత్యమైన దానికి స్పందిస్తాడు. ఇంకా అసత్య మార్గాలను మరియు చెడు దారులను మూసివేస్తాడు. ఇదే విషయం ఖుర్ఆన్ ఆయతులలో ఇలా తెలుపబడింది: ఓ విశ్వాసులారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడినది - ఏ విధంగానైతే మీ పూర్వికులకు విధిగా నిర్ణయించబడి ఉండెనో – బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని! (2:183).
ఒక ప్రామాణిక హదీథులో అల్లాహ్ యొక్క దివ్యమైన పలుకులను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: ""అతడు నాకోసమే అన్నపానీయాలు సేవించడం మరియు తన శారీరక కోరికలను అనుభవించడం నుండి దూరంగా ఉన్నాడు." కాబట్టి అతడికి లభించే ప్రతిఫలం అల్లాహ్ యొక్క ఘనమైన ప్రతిఫల స్థాయిలో ఉంటుంది.
ఆవిధంగా, ఉపవాసం వ్యక్తుల అతరాత్మను మేలుకొలిపి, మొత్తం సమాజం ఏక సమయంలో కలిసి కట్టుగా, సామూహికంగా దీనిని పూర్తి చేసే అవకాశాన్ని కలిగించడం ద్వారా ప్రతి వ్యక్తికీ మరింత బలాన్ని చేకూర్చు తున్నది. అంతేగాక, ఈ రమదాన్ నెల ఉపవాసం మన శరీరంలోని జీర్ణ వ్యవస్థకు తప్పనిసరిగా ఒక పూర్తి నెల విరామాన్ని ఇస్తున్నది. అలాగే సంవత్సరమంతా లేక జీవితమంతా తమ అవసరాలకు సరిపడా ఆదాయం లేక బాధ పడుతున్న నిరుపేదల కష్టాల గురించి ఈ ఉపవాసం మనకు జ్ఞాపకం చేస్తుంది. బీదరికంలో మ్రగ్గతున్న ప్రజల కష్టాలు గ్రహించేలా చేసి, ఇతరులు వారిపై సానుభూతి, దయ చూపేలా చేస్తుంది.
చివరిగా, హజ్ యాత్ర వద్దకు వచ్చాము. హజ్ యాత్ర అంటే నిర్ణీత సమయంలో, నిర్ణీత పద్ధతిలో, మక్కాలోని అల్లాహ్ యొక్క గృహాన్ని సందర్శించడం. ఇది ఇస్లాం యొక్క మరో ప్రధానమైన మూలస్థంభము. ఇది మానవులలో జాతి, వర్గ, కుల, వర్ణ ... మొదలైన అన్ని రకాల భేదాలకు అతీతంగా, సమానత్వాన్ని ప్రదర్శిస్తుంది. ప్రపంచంలోని అన్ని మూలల నుండి, ముస్లిములందరూ ఒకే రకమైన తెల్లటి రెండు వస్త్రాలు ధరించి, ఏక కంఠంతో, ఒకే భాషలో హజ్ యొక్క పిలుపుకు ప్రతిస్పందిస్తూ హజ్ దినాలలో ఇలా పలుకుతారు: లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ (నేనిక్కడ హాజరయ్యాను, ఓ ప్రభూ! నేనిక్కడ హాజరయ్యాను). హజ్ యాత్రలో పటిష్టమైన స్వయం క్రమశిక్షణ మరియు నియంత్రణ కనబడుతుంది – అందువలన పవిత్ర స్థలాలు, విషయాలు గౌరవించబడటమే గాక, పశుపక్ష్యాదులకు మరియు చెట్లు, మొక్కలకు కూడా ఎవ్వరూ ఎలాంటి హానీ చేయకుండా నిషేధాజ్ఞలు జారీ చేయబడటం వలన ప్రతి జీవి సురక్షితంగా ఉంటుంది.: "ఎవరయితే అల్లాహ్ విధించిన కట్టుబాట్లను గౌరవిస్తాడో, అతని కోసం అతని ప్రభువు వద్ద మేలుంది....' (22:30),
"మరియు అల్లాహ్ చిహ్నాలను ఎవరైనా గౌరవిస్తాన్నారంటే, అది వారి హృదయాలలోని భక్తిభావన వల్లనే సుమా" (22:32)
ఒక మహా సభలో అన్ని వర్గాలకు, జాతులకు, తెగలకు, సంస్థలకు, ప్రభుత్వాలకు, దేశాలకు చెందిన ఇస్లామీయ ప్రపంచం లోని మొత్తం ముస్లిలందరూ ప్రతి సంవత్సరమూ ఒక మహాసభలో సమావేశమయ్యే అవకాశాన్ని ఈ హజ్ యాత్ర కల్పిస్తున్నది. ఆ మహాసభ యొక్క సమయం మరియు స్థలాన్ని వారి ప్రభువు నిర్ణయించినాడు. దీనిలో పాల్గొనే ఆహ్వానం ప్రతి ముస్లింకు అంద జేయబడింది. దీనిలో పాల్గొనకుండా ఎవరినైనా నిషేధించే అధికారం ఎవ్వరికీ లేదు. స్వయంగా ఉల్లంఘిస్తే తప్ప, దీనిలో పాల్గొనే ప్రతి ముస్లింకు పూర్తి సంరక్షణ మరియు స్వేచ్ఛ తప్పక కల్పించబడును.
కాబట్టి ఇస్లాంలోని ఆరాధన, అది సంప్రదాయపరమైనదైనా, కాకపోయినా ఒక వ్యకి తన ప్రభువును అతిగా ప్రేమించటం ద్వారా సమాజంలోని ప్రతి చెడును, దౌర్జన్యాన్ని తుడిచి పెట్టేలా మరియు మనందరి సృష్టికర్త దివ్యసందేశం ఆధిక్యత సాధించేలా శ్రమించే దృఢసంకల్పం మరియు ప్రశాంతమైన మనస్సు పొందేట్టు శిక్షణ ఇస్తుంది.
ఇస్లాంలోని దైవభావన
ప్రతి భాషలోనూ దేవుడిని మరియు కొన్ని సార్లు ఆయన కంటే తక్కువ స్థాయి దైవాలను సూచించే పదాలు ఒకటి లేక అంతకంటే ఎక్కువ ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. ‘అల్లాహ్’ అనే ఘనమైన దివ్యపదం విషయంలో ఇలా లేదు. అల్లాహ్ అనేది ఏకైక నిజదేవుడి స్వంత పేరు. ఆయనను కాకుండా మరెవ్వరికీ ఆ పేరు లేదు. ఆ పదానికి బహువచన పదం, స్త్రీ-పురుష లింగ పదం లేదు. దేవుడు అనే పదానికి బహువచనం దేవుళ్ళు, స్త్రీలింగ పదం దేవతలు మొదలైన రూపాలున్న దేవుడు అనే పదంతో అల్లాహ్ అనే పదాన్ని పోల్చినపుడు, అపూర్వమైన దాని యొక్క అద్వితీయత, ఏకైకత స్పష్టంగా కనబడుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ అనే పదం జీసస్ (ఈసా అలైహిస్సలాం) యొక్క భాష అయిన అరమిక్ లో కూడా దేవుడి యొక్క స్వంత పేరే. అరబీ మరియు అరమిక్ భాషలు ఒకదానికొకటి సోదరీమణులు.
ఏకైక నిజప్రభువు అనేది దేవుడితో ఇస్లాం కలిగి ఉన్న అపూర్వమైన భావం. ఒక ముస్లిం కొరకు అల్లాహ్ మహోన్నతుడు, సకల లోకాల సృష్టికర్త మరియు పోషకుడు, ఆయనకు సాటి లేదు, సృష్టిలో ఆయనను పోలినదేదీ లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన దగ్గరిలోని ప్రజలు అల్లాహ్ గురించి అడిగినపుడు, స్వయంగా అల్లాహ్ నుండే దాని జవాబు ఖుర్ఆన్ లోని ఒక చిన్న అధ్యాయం రూపంలో తిన్నగా వచ్చింది. అది ఏకదైవత్వ అసలు సారంగా, ఏకదైవత్వ ధర్మసూత్రంగా గుర్తించబడింది. ఇదే ఖుర్ఆన్ లోని 112వ ఆ అధ్యాయం:"అల్లాహ్ పేరుతో, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రకటించు: ఆయనే అల్లాహ్, ఆయన ఏకైకుడు; శాశ్వతమైన వాడు, పరిపూర్ణుడు; ఆయన ఎవ్వరికీ పుట్టలేదు, ఆయనకు ఎవ్వరూ పుట్టలేదు. ఆయనను పోలినదేదీ లేదు" (112:14)
ఇస్లాంలోని దేవుడు తనకు పూర్తి విధేయత చూపాలని ఆజ్ఞాపిస్తున్న క్రూరుడు మరియు కర్కశమైనవాడు, ప్రేమ మరియు దయ లేనివాడని కొందరు ముస్లిమేతరులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణ కంటే అసత్యమైనదేదీ లేదు. కేవలం ఒక్క అధ్యాయం తప్ప, ఖుర్ఆన్ లోని 114 అధ్యాయాలలోని ప్రతి అధ్యాయం ఈ వచనంతో ఆరంభమవుతున్నది: "అల్లాహ్ పేరుతో, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు.." ఒక ఉపదేశంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "ఒక తల్లి తన బిడ్డ మీద చూపే ప్రేమ మరియు వాత్సల్యం కంటే అల్లాహ్ అనేక రెట్లు అధికంగా మనమీద ప్రేమ మరియు వాత్సల్యం చూపుతాడు." కానీ, అల్లాహ్ న్యాయవంతుడు కూడా కావడం వలన దుష్టులు, పాపాత్ములు తమ వంతు శిక్షను అనుభవించాలి మరియు సజ్జనులు ఆయన యొక్క అనుగ్రహాలు పొందాలి కదా! వాస్తవానికి, అల్లాహ్ యొక్క అత్యంత దయామయుడు అనే దివ్యలక్షణం ఆయన యొక్క అత్యంత న్యాయవంతుడు అనే దివ్యలక్షణంలో చాలా స్పష్టంగా ప్రదర్శితమవు తున్నది. ఆయన కొరకు తమ జీవితాంతం శ్రమించేవారు మరియు తమ జీవితాంతం ఇతరులపై దౌర్జన్యాలు, అక్రమాలు చేసేవారు – ఇరువురూ తమ ప్రభువు నుండి ఒకే రకమైన ప్రతిఫలం పొందకూడదు. ఒకవేళ దుష్టులకు కూడా సజ్జనులకు లభించే ప్రతిఫలమే లభిస్తుందని ఆశిస్తే, తీర్పుదినాన చూడబోయే పాపపుణ్యాల లెక్కలను అసలు నమ్మవలసిన అవసరమే లేకుండా పోతుంది. అలాగే ఈ ప్రపంచంలో సత్ ప్రవర్తనకు మరియు పుణ్యకార్యాలకు ఎలాంటి ప్రతిఫలమూ అవసరం లేదు. ఇదే విషయాన్ని క్రింది ఖుర్ఆన్ ఆయతు చాలా స్పష్టంగా మరియు సూటీగా వివరిస్తున్నది. "నిశ్చయంగా దైవభీతిపరుల కొరకు వారి ప్రభువు వద్ద అనుగ్రహ భరితమైన స్వర్గవనాలున్నాయి. ఏమిటి? మేము దైవవిధేయులను అపరాధుల సరసన నిలబెడతామా? అసలు మీకేమైంది? ఈ విధంగా ఎలా నిర్ణయించుకుంటున్నారు? " (68:34-36)
మానవరూపంలో లేక ఏదైనా ఇతర సృష్టితాల రూపంలో దేవుడు అవతరించడాన్ని, సంపద, శక్తి లేక జాతి ఆధారంగా ఎవరైనా వ్యక్తులపై లేదా ఏవైనా జాతులపై ప్రత్యేక అనుగ్రహాలు కురిపిస్తాడనే మూఢనమ్మకాలను ఇస్లాం తిరస్కరిస్తున్నది. ఆయన మొత్తం మానవులను సమానులుగా సృష్టించాడు. సత్ ప్రవర్తన మరియు దైవభక్తి ఆధారంగానే వారు తమలోని భేదాన్ని గుర్తించగలరు.
దేవుడు సృష్టి కార్యాన్ని పూర్తి చేసి, ఏడవ రోజున సెలవు తీసుకున్నాడు, తన సైనికులలోని ఒకనితో ఆయన మల్లయుద్ధం చేసాడు, మానవులపై దేవుడు ఈర్ష్యతో ప్రణాళికలు రచిస్తాడు, దేవుడు మానవ రూపంలో అవతరిస్తాడనే భావనలు ఇస్లామీయ దృష్టిలో దైవదూషణలుగా పరగణించబడతాయి.
దేవుడి స్వంత పేరైన అల్లాహ్ అనే పదాన్ని బహువచనం, స్త్రీలింగం లేకుండా ప్రత్యేక పద్ధతిలో పేర్కొనడం ద్వారా ఇస్లాంలోని దైవవిశ్వాసం యొక్క స్వచ్ఛత ప్రదర్శితమవుతున్నది. వాస్తవానికి దైవప్రవక్తలందరి సందేశ సారాంశం ఇదే. దీని కారణంగా, ఏ ఇతర దైవాన్ని లేక శక్తిని తనకు సాటి కల్పించడాన్ని అల్లాహ్ అస్సలు క్షమించని ఘోరాతి ఘోరమైన పాపంగా ఇస్లాం పరిగణిస్తున్నది. అల్లాహ్ తలుచుకుంటే ఇతర పాపాలన్నింటినీ క్షమించవచ్చు.
స్వభావంలో సృష్టికర్త, తను సృష్టించిన వాటికి భిన్నంగా ఉండాలి కదా. ఒకవేళ అలా భిన్నంగా లేకపోతే, ఆయన కూడా తాత్కాలికమైన వాడవుతాడు మరియు ఆయన కొరకు ఒక సృష్టికర్త అవసరం. ఒకవేళ ఆయన తాత్కాలికమైన వాడు కానట్లయితే, ఆయనను పోలినదేదీ లేకపోవడం వలన ఆయన నిత్యజీవుడై ఉంటాడు. ఒకవేళ ఆయన శాశ్వతమైన వాడైతే, ఆయన కొరకు సృష్టికర్త అవసరం లేదు. ఒకవేళ ఆయనను ఉనికి లోనికి తీసుకు వచ్చిన సృష్టికర్తే లేకపోతే, ఆయనను శాశ్వతంగా ఉంచే వేరే శక్తి అవసరం కూడా ఉండదు అంటే ఆయన స్వయం సమృద్ధుడై ఉంటాడన్న మాట. అంతేగాక ఒకవేళ ఆయన తన స్వంత అస్థిత్వం కోసం వేరే దేనిపైనా ఆధారపడక పోతే, ఆయన అస్థిత్వానికి అంతం ఉండదు. కాబట్టి సృష్టికర్త శాశ్వతమైనవాడు మరియు అంతం లేనివాడు. అంటే అద్యంతరహితమైనవాడు: "ఆయన మొట్టమొదటి వాడు మరియు చిట్టచివరి వాడూను. "
ఆయన స్వయం సమృద్ధుడు లేక స్వయంగా అన్నీ కలిగి ఉన్నవాడు – ఖుర్ఆన్ భాషలో ఈ దివ్యలక్షణం ‘అల్ ఖయ్యూమ్’. సృష్టికర్త కేవలం శూన్యం నుండి సృష్టితాలను ఉనికి లోనికి తీసుకురావడమే కాకుండా, వాటిని కాపాడతాడు. అలాగే వాటిని ఉనికిలో లేకుండా చేస్తాడు. అంతిమంగా సృష్టిలో సంభవించే ప్రతిదానికీ కారణభూతుడవుతాడు.
ప్రతి దాని సృష్టికర్త అల్లాహ్ యే. ప్రతి దాని సంరక్షకుడు ఆయనే. భూమ్యాకాశాల తాళపు చెవులన్నీ ఆయన వద్దనే ఉంటాయి.
ఆయన పోషణ లేకుండా భూమిపై ఏ ప్రాణీ చలించదు. దాని విడిది స్థలం ఆయనకు తెలుసు. అలాగే దాని అంతిమ స్థలం కూడా.
దేవుడి దివ్యలక్షణాలు: ఒకవేళ సృష్టికర్త శాశ్వతమైనవాడు మరియు అద్యంతం లేని వాడైతే, ఆయన దివ్యలక్షణాలు కూడా శాశ్వతమైనవి మరియు అద్యంతరహితమైనవై ఉండాలి. తన దివ్యలక్షణాలలో ఆయన దేనినీ కోల్పోకూడదు మరియు క్రొత్తవేవీ పొందకూడదు. ఒకవేళ ఇదే నిజమైతే ఆయన దివ్యలక్షణాలు పరిపూర్ణమైనవై ఉంటాయి. అలాంటి పరిపూర్ణ దివ్యలక్షణాలు కలిగి ఉండే సృష్టకర్తలు ఒకరి కంటే ఎక్కువ మంది ఉండగలరా? ఉదాహరణకు, ఇద్దరు పరిపూర్ణమైన మరియు సర్వశక్తిమంతులైన సృష్టికర్తలు ఉండగలరా? ఒక్క క్షణం ఆలోచించగానే అది అసాధ్యం అనిపిస్తుంది. క్రింది ఆయతులో ఖుర్ఆన్ దీనిని ఇలా తెలుపు తున్నది: "అల్లాహ్ ఎవరినీ కొడుకుగా చేసుకోలేదు. ఆయనతో పాటు మరో ఆరాధ్య దేవుడు కూడా లేడు. ఒకవేళ అలాంటి దేదైనా ఉంటే, ప్రతి దేవుడూ తాను సృష్టించిన సృష్టితాలను వెంట తీసుకుని వేరయిపోయేవాడు. ఒకడు ఇంకొకనిపై దండయాత్ర చేసేవాడు. వారు అల్లాహ్ కు ఏ లక్షణాలు ఆపాదిస్తున్నారో, వాటిని ఆయన అతీతుడు, పరమ పవిత్రుడు." (23:91)
దేవుడి ఏకత్వం: కల్పిత దైవాలలోని అసత్యం గురించి ఖుర్ఆన్ మనకు మాటిమాటికీ జ్ఞాపకం చేస్తున్నది. విగ్రహారాధకులను ఖుర్ఆన్ ఇలా ప్రశ్నిస్తున్నది: ఏమిటి, మీరు (స్వహస్తాలతో) చెక్కిన శిల్పాలను పూజిస్తున్నారా?(37:95) ఆయనకు సాటిగా వేరే వాటిని నిలబెడుతున్నారా? అవి తమను తామే కాపాడుకోగలవా?"
ప్రకృతి సహజమైన వాటిని ఆరాధించే వారి గురించి ఇబ్రాహీం గాథలో ఖుర్ఆన్ ఇలా పేర్కొన్నది: మరి, అతనిపై రాత్రి ఆవరించినపుడు, ఒక నక్షత్రాన్ని చూసి అతనిలా అన్నాడు ‘ఇది నా ప్రభువు’. అది మాయమైపోగానే, ‘మాయమై పోయేవాటిని నేనే మాత్రమూ ఇష్టపడను’ అన్నాడు. మరి, ప్రకాశిస్తున్న చంద్ర బింబాన్ని చూడగానే, అతను ‘ఇదీ నా ప్రభువు’ అన్నాడు. చంద్రుడు అస్తమించగానే ‘ఒకవేళ నా ప్రభువు నాకు సన్మార్గం చూపకపోతే, నిశ్చయంగా నేను మార్గభ్రష్టులలో చేరిపోదును’ అన్నాడు. మరి, ప్రకాశవంతంగా ఉదయిస్తున్న సూర్యగోళాన్ని చూసినపుడు, అతను ‘ఇదే నా ప్రభువు, ఇది అన్నింటికన్నా పెద్దది’ అన్నాడు. కానీ, అది అస్తమించినపుడు, అతను ఎలుగెత్తి ఇలా అన్నాడు ‘ఓ నా జాతి ప్రజలారా! నిశ్చయంగా నిజదైవానికి మీరు సాటి కల్పించే (వాటి నుండి విసిగెత్తి, నేను దూరమ వుతున్నాను) వాటికీ, నాకూ ఏ సంబంధమూ లేదు.’ నిశ్చయంగా, నేను ఏకోన్ముఖుడనై (ఏకదైవారాధకుడినై), నా ముఖాన్ని భూమ్యాకాశాల సృష్టికర్త వైపునకు త్రిప్పు కుంటున్నాను. మరియు నేను ఆయనకు సాటి కల్పించేవారిలోని వాడిని కాను. (6:76-79)
ఒక దైవవిశ్వాసి యొక్క ప్రవర్తన: ఒకవేళ ఎవరైనా ముస్లిం కావాలనుకుంటే (సృష్టికర్తకు సమర్పించుకోవాలనుకుంటే), అతడు దేవుడి ఏకత్వాన్ని విశ్వసించవలసి ఉంది. ఉదాహరణకు కేవలం ఆయన మాత్రమే సర్వలోకాల సృష్టికర్త, పోషకుడు, పాలకుడు ... ఇదే తౌహీద్ రుబూబియ్యహ్ అని మున్ముందు రాబోతున్నది. అయితే కేవలం ఈ విశ్వాసం కలిగి ఉండటంతో సరిపోదు. ఈ దివ్యకార్యాలను కేవలం సర్వలోక ప్రభువు మాత్రమే చేయగలడనే సత్యాన్ని అనేకమంది విగ్రహారాధకులు గ్రహించడమే కాకండా దీనిని నమ్ముతారు కూడా. అయితే ముస్లింగా మారడానికి ఇది మాత్రమే సరిపోదు. తౌహీద్ రుబూబియ్యహ్ తో పాటు వారు తప్పకుండా తౌహీద్ ఉలూహియ్యహ్ అంటే ఆరాధనలన్నీ కేవలం ఆయనకే చెందుతాయని మనస్పూర్తిగా నమ్మాలి మరియు ఇతరులను ఆరాధించకుండా ఉండాలి.
ఏకైక నిజ దైవం యొక్క ఈ జ్ఞానం పొందిన తర్వాత, మానవుడు ఆయనను నిరంతరంగా విశ్వసించాలి మరియు సత్యాన్ని నిరాకరించేలా ప్రేరేపించే వాటిని తన సమీపంలోనికి కూడా రానివ్వకూడదు.
ఒక వ్యక్తి మనస్సులో దైవవిశ్వాసం (ఈమాన్) ప్రవేశించినపుడు, అది అతడిలో కొన్ని మానసిక మార్పులు తీసుకు వస్తుంది. పర్యవసానంగా అతడి ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఈ రెండు మార్పులు అంటే మానసిక మరియు ఆచరణాత్మక మార్పులు అతడిలో నిజమైన విశ్వాసం ప్రవేశించందనడానికి ఒక నిదర్శనం. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు, "విశ్వాసం అంటే మనస్సులో పటిష్టంగా నాటుకు పోయేది మరియు చేతలచే నిరూపించబడేది."
మానసిక మార్పులన్నింటిలో మొట్టమొదటిది, అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలని అతడు భావించడం. ఇలా సృష్టికర్తకు కృతజ్ఞతలు తెలుపకోవడమనేది అతడి ఆరాధనల యొక్క అసలు సారం అని చెప్పవచ్చు.
ఈ కృతజ్ఞతాభావం ఎంత ముఖ్యమైనదంటే, సత్యాన్ని తిరస్కరించడం వలన ఒక అవిశ్వాసి ‘కాఫిర్’ అని పిలవబడతాడు. కాఫిర్ అంటే ‘సత్యతిరస్కారి’ మరియు ‘కృతఘ్నుడు’ అని అర్థం.
తనపై కురిపించే అనుగ్రహాలకు బదులుగా ఒక విశ్వాసి తన ప్రభువును మరింతగా ప్రేమిస్తాడు మరియు కృతజ్ఞతలు తెలుపు కుంటాడు. తను మానసికంగా లేక శారీరకంగా ఎన్ని మంచి పనులు చేసినా, దైవాజ్ఞల ఆచరణలో కొరత ఉంటుందనే వాస్తవాన్ని గ్రహించి, ఇహలోకంలో లేదా పరలోకంలో అల్లాహ్ తనను ఎక్కడ శిక్షిస్తాడోనని భయపడుతూ ఉంటాడు. అందువలన అతడు ఆయనకు భయపడతాడు, సమర్పించుకుంటాడు మరియు అణుకువ, వినమ్రత, నిగర్వంతో ఆయన తెలిపిన పద్ధతిలో ఆయనను ఆరాధిస్తాడు. అయితే ఎవరైనా ఎల్లప్పుడూ ఆ స్థితిలో ఉండటమనేది, నిత్యం ఆయనను గుర్తు చేసుకుంటూ ఉండకుండా సాధ్యం కాదు కదా. కాబట్టి దైవధ్యానమనేది విశ్వాసం (ఈమాన్) యొక్క జీవశక్తి, అది లేకుండా ఈమాన్ బలహీన పడి, క్రమంగా దూరమై పోతుంది.
సృష్టికర్త యొక్క దివ్యలక్షణాలను తరుచుగా పేర్కొనడం ద్వారా మనలో ఈ కృతజ్ఞతా భావాన్ని పెంపొందించేందుకు ఖుర్ఆన్ ప్రయత్నిస్తున్నది. ఎక్కువగా ఈ దివ్యలక్షణాలు ఒకదాని వెంట మరొకటి పేర్కొనబడటం మనం గుర్తించవచ్చు, ఉదాహరణకు: "ఆయనే అల్లాహ్. ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు – గోప్యంగా ఉన్నవాటినీ, బహిరంగంగా ఉన్నవాటినీ ఎరిగినవాడు. ఆయన కరుణామయుడు, కృపాశీలుడూను. ఆయనే అల్లాహ్, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయనే రాజాధిరాజు, లోపాలన్నింటికీ అతీతుడు, శాంతి ప్రదాత, పర్యవేక్షకుడు, సర్వశక్తుడు, బలపరాక్రమాలు గలవాడు, ఘనమైనవాడు, ప్రజలు ఆయనకు కల్పించే భాగస్వామ్యాల నుండి పవిత్రంగా ఉన్నాడు. ఆయనే అల్లాహ్, సృష్టికర్త, ఉనికిని ప్రసాదించేవాడు, రూపకల్పన చేసేవాడు, అత్యుత్తమమైన పేర్లు గలవాడు, భూమ్యాకాశాలలో ఉన్న ప్రతిదీ ఆయన పవిత్రతను కొనియాడుతూనే ఉంటుంది. ఆయనే సర్వాధికుడు, వివేకవంతుడూను."(59:22-24).
"అల్లాహ్ – కేవలం ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. ఆయన నిత్యసజీవుడు, సమస్తానికి ఆయనే ఆధారభూతుడు, ఆయనకు కునుకూ పట్టదు మరియు నిదుర కూడా రాదు. భూమ్యాకాశాలలో ఉన్నదంతా ఆయనదే. ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవారెవరు - ఆయన అనుమతిస్తే తప్ప? వారి ముందు రానున్నదేమిటో (ఎదుట ఉన్నదేమిటో) మరియు వారికి పూర్వం గడిచినదేమిటో (వెనుక, పరోక్షంలో ఉన్నదేమిటో) ఆయనకు తెలుసు. ఆయన జ్ఞానసంపదలోని ఏ విషయాన్నీ వారు గ్రహించలేరు – తాను కోరి తెలిపినది తప్ప. ఆయన ‘కుర్సీ’ ఆకాశాలనూ, భూమినీ ఆవరించి ఉన్నది. వాటి రక్షణ ఆయనకు ఏమాత్రమూ అలసట కలిగించదు.ఆయన సర్వోన్నత్తుడూ, మహా ఘనత గలవాడు. (2:255).
"ఓ గ్రంథప్రజలారా! మీ ధర్మం విషయంలో అతిగా ప్రవర్తించకండి. అల్లాహ్ పట్ల సత్యం తప్ప మరింకేమీ పలుకకండి. నిశ్చయంగా మసీహ్ (క్రీస్తు) అయిన మర్యం కుమారుడు ఈసా, అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఆయన యొక్క వాక్కు; ఆయన దానిని (వాక్కును) మర్యం వైపునకు పంపినాడు – మరియు ఆయన నుండి (పంపబడిన) ఆత్మ మాత్రమే. కనుక అల్లాహ్ ను ఆయన సందేశహరులను విశ్వసించండి. మరియు మీరు (అల్లాహ్ ను) ‘ముగ్గురు’ అనకండి. (అలా అనడం) మీరు మానుకోండి. అదే మీ కొరకు శుభప్రదమైనది. నిశ్చయంగా, ఏకైకుడైన అల్లాహ్ ఒక్కడే ఆరాధనలకు అర్హుడు. ఆయనకు కుమారుడు ఉన్నాడనే విషయాన్నుండి ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్నదంతా ఆయనకు చెందినదే. మరియు కార్యసాధకునిగా కేవలం అల్లాహ్ యే చాలును. "(4:171)
ఇస్లాంలోని మానవహక్కులు
సృష్టికర్త సంపూర్ణుడు మరియు నిరుపేక్షాపరుడు. ఆయన మొత్తం మానవుల ప్రభువు మరియు విశ్వ సార్వభౌముడు. పోషకుడు, పరిపాలకుడు, దయామయుడు. ఆయన కారుణ్యం ప్రాణులన్నింటిపై ప్రసరిస్తుంది. ఎందుకంటే ప్రతి మానవుడికి ఆయన మానవ గౌరవం మరియు హోదా ఇచ్చినాడు. మనిషిలో స్వయంగా ఊపిరి పోయటం నుండి మొదలు పెట్టి ఆ ఆత్మ మనిషి శరీరంలో జీవించటం, అతనిలో కలిసి పోవటం, ఇతర మానవులలో కూడా కనబడే సామాన్య లక్షణాలు కలిగి ఉండటం ద్వారా మానవులంతా సమానమే, వారిలో ఎలాంటి ప్రత్యక్ష భేదభావాలు లేవు - వర్ణం, కులం, జాతీయత మొదలైన యాధృచ్ఛిక తేడాల విషయంలో తప్ప - అనే వాస్తవం ఋజువు అవుతున్నది. తద్వారా ప్రతి మానవుడు ఇతర మానవులతో పోలి ఉన్నాడు. ఆ విధంగా సగౌరవమైన మరియు ఉల్లాసకరమైన విశ్వప్రభువు దాస్యంలో మానవులంతా ఒక సహోదర సమాజంగా మారినారు. అలాంటి దివ్యమైన వాతావరణంలో ఇస్లామీయ ఏక దైవత్వ భావనను ఒప్పకోవడమనేది ప్రబలమైన మరియు ప్రధానమైన శక్తిగా నిలబడుతున్నది. అంతేగాక మానవజాతిలో ఉండవలసిన ఐకమత్యం మరియు సౌభ్రాతృత్వాలను అనివార్యం చేస్తున్నది.
భూమండలంపై ఎక్కడైనా సరే ఇస్లామీయ సమాజం ఏర్పరచ వచ్చు. అయితే, ఇస్లాం ధర్మం మానవ హక్కులను లేక విశేషాధికారాలను తన భౌగోళిక హద్దులలోనే పరిమితం చేసి ఉంచ దలుచుకోవటం లేదు. ఇస్లాం ధర్మం మొత్తం మానవజాతి కొరకు కొన్ని సార్వజనిక ప్రాథమిక హక్కులను ప్రకటించింది. వాటిని ఎట్టి పరిస్థితులలోనూ మానవుడు గౌరవించ వలసి ఉంది – అతడు ఇస్లామీయ దేశంతో శాంతి ఒడంబడిక కలిగి ఉన్నా, లేకపోయినా మరియు ఇస్లామీయ దేశంతో యుద్ధం చేస్తున్నా, లేకపోయినా. దీని గురించి ఖుర్ఆన్ స్పష్టంగా ఇలా ప్రకటిస్తున్నది: "ఓ విశ్వాసులారా! అల్లాహ్ కొరకు న్యాయానికి సాక్ష్యంగా నిలిచి ఉండేవారై పోండి. (ఏదైనా) వర్గం పట్ల మీకున్న వైరం మీరు న్యాయం చేయకుండా ఉండేలా మిమ్మల్ని ప్రేరేపించనివ్వకండి. (అన్ని వేళలా) మీరు న్యాయం చేయండి. అది అల్లాహ్ పట్ల భయభక్తులకు అతి చేరువైనది. జాగ్రత్త! అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మీరేమి చేస్తున్నారో అంతా ఎరిగినవాడు...." (5:8)
ఎట్టి పరిస్థితులలోనూ మానవ రక్తం పవిత్రమైనదే. అన్యాయంగా దానిని చిందించకూడదు. తగిన కారణం లేకుండా అన్యాయంగా హత్య చేసి, ఒకవేళ ఎవరైనా మానవ రక్తం యొక్క ఈ పవిత్రతను ఉల్లంఘిస్తే, అతడు మొత్తం మానవజాతిని హత్య చేయటం సమానమని ఖుర్ఆన్ గ్రంథం ప్రకటిస్తున్నది:"..“ప్రాణానికి బదులుగా గాక, లేదా భూమిపై కల్లోలం రేపినందుకు గాక, ఎవరైనా మరొకరిని చంపితే, అతడు సమస్త మానవాళిని చంపినట్లే. అదేవిధంగా ఎవరైనా, ఒకరి ప్రాణాన్ని కాపాడితే అతడు సమస్త మానవాళిని కాపాడినట్లే...”" 5:32
మహిళలు, పిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, గాయపడిన వారిపై దౌర్జన్యం చేయడాన్ని ఇస్లాం నిషేధించింది. మహిళల మానమర్యాదలు మరియు పవిత్రత అన్ని పరిస్థితులలోనూ గౌరవింపబడాలి. ఆకలితో ఉన్నవానికి భోజనం పెట్టాలి. బట్టలు లేని వానికి బట్టలు తొడగాలి. గాయపడిన వారిని మరియు వ్యాధిగ్రస్తులను వారు ఇస్లామీయ సమాజానికి చెందిన వారా లేక వారి శత్రువర్గాలకు చెందిన వారా అనే తారతమ్యాలు లేకుండా సరైన వైద్యం అందించాలి.
ఇస్లాంలోని మానవ హక్కుల ఆదేశాలు స్వయంగా అల్లాహ్ జారీ చేసాడనే సత్యాన్ని గ్రహించాలి. వాటిని ఎవరో ఒక రాజు లేదా ఏదో ఒక చట్ట సభ జారీ చేయలేదు. రాజులు లేదా చట్ట సభలు ప్రకటించిన యుద్ధాలు, వారు ప్రకటించిన విధంగానే రద్దు చేయబడతాయి కూడా. పరిపాలకులు అంగీకరించిన మరియు గుర్తించిన మానవ హక్కుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. తమకు ఇష్టమైనపుడు ఆ పరిపాలకులు వాటిని అంగీకరించ వచ్చు మరియు తమకు ఇష్టం లేనపుడు వాటిని గుర్తించక పోవచ్చు. తమ ఇష్టం వచ్చినపుడు వారు బహిరంగంగా వాటిని ఉల్లఘించనూ వచ్చు. అయితే ఇస్లాంలోని మానవ హక్కుల విషయంలో మాత్రం అలా జరగటానికి అవకాశం లేదు. ఎందుకంటే వాటిని సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ ఆదేశించి ఉండడం వలన ఎట్టి పరిస్థితులలోనూ భూమిపై ఉన్న ఏ చట్ట సభకూ లేక ఏ ప్రభుత్వానికీ వాటిని ఉల్లఘించే హక్కు లేక అధికారం లేదు. వాటిని రద్దు చేసే, ఉపసంహరించే హక్కు ఎవ్వరికీ లేదు. అంతేగాక అవి కాగితాల పైన మాత్రమే అంగీరించబడి, వాస్తవ జీవితంలో ఏ విలువా లేకుండా నిరాకరించబడేవి కావు. ఇంకా అవి ఆంక్షలు జారీ చేయని మామూలు తత్వజ్ఞాన భావాలు కూడా కావు.
ఐక్యరాజ్యసమితి బహిరంగ ప్రకటనలు, తీర్మానాలకు మరియు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ జారీ చేసిన మానవ హక్కులకు అస్సలు పోలికే లేదు. ఎందుకంటే మొదటిది దేనిపైనంటే దానిపై వర్తించదు, కానీ రెండోది ప్రతి విశ్వాసిపైనా వర్తిస్తుంది. అవి ఇస్లామీయ మూలవిశ్వాస భాగాలు మరియు అంశాలు. తాము ముస్లింలని తెలిపే ప్రతి ముస్లిం, పరిపాలకుడు మరియు నిర్వాహకుడు వాటిని అంగీకరించ వలసిందే, గుర్తించ వలసిందే మరియు ఆచరించవలసిందే. ఒకవేళ అల్లాహ్ ఆదేశాలను ఆచరించకుండా, తిరస్కరిస్తూ, వాటిలో మార్పులు చేర్పులు చేయటం లేక ఆచరణలలో ఉల్లంఘిస్తూ, కేవలం నోటిపలుకులతో అంగీకరించడం మొదలైన అతిక్రమణలు చేసే పరిపాలకుల కొరకు ఖుర్ఆన్ ఆజ్ఞలు చాలా స్పష్టంగా ఉన్నాయి. "... ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన దాని ప్రకారం తీర్పు చేయరో, నిజానికి అలాంటి వారే దుర్మార్గులు.." (5:47)
ఇస్లామీయ రాజ్యంలోని మానవ హక్కులు
1. ప్రాణ మరియు ఆస్తిపాస్తుల సంరక్షణ:
తన అంతిమ హజ్ యాత్రలో చేసిన మహోన్నత ప్రసంగంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు: “పునరుత్థాన దినమున మీ ప్రభువును కలుసుకునే రోజు వరకు మీ యొక్క ఒకరి ప్రాణాలు మరియు ఆస్తిపాస్తులు మరొకరి కొరకు నిషేధించబడినాయి.” మరో సందర్భంలో దిమ్మిస్ (ముస్లిం రాజ్యంలో నివసించే ముస్లిమేతరులు) గురించి ఇలా ఆదేశించారు: “ఎవరైనా శాంతి ఒడంబడికలో నివసిస్తున్న వారిలో నుండి ఏ వ్యక్తినైనా హత్య చేస్తే, అతడు స్వర్గం యొక్క సువాసన కూడా పీల్చలేడు.”
2. మానమర్యాదల సంరక్షణ:
ఖుర్ఆన్ క్రింది నిబంధనలు విధించింది:
అ) ఓ విశ్వాసులారా! మీలోని ఒక వర్గం, మరో వర్గాన్ని ఎగతాళి చేయవద్దు.
ఆ) పరస్పరం నిందించుకోవద్దు.
ఇ) మారుపేర్లతో అవమానించవద్దు.
ఈ) ఇతరుల గురించి చాడీలు చెప్పవద్దు మరియు చెడుగా మాట్లాడవద్దు. 49:11-12
3. వ్యక్తిగత జీవితం యొక్క మాన్యత, పవిత్రత మరియు భద్రత:
ఖుర్ఆన్ క్రింది నిబంధనలు విధించింది:
అ) ఒకరిపై మరొకరు గూఢచర్యం చేయవద్దు. నిఘా వేయవద్దు.
ఆ) ఇంటి యజమాని అనుమతి లేకుండా ఎవరి ఇండ్లలోనూ ప్రవేశించవద్దు.
4. భద్రత లేక వ్యక్తిగత స్వేచ్ఛ:
బహిరంగ న్యాయస్థానంలో అతడి నేరం నిరూపించబడనంత వరకూ ఏ వ్యక్తినీ జైలులో పెట్టకూడదనే నియమాన్ని ఇస్లామీయ ధర్మశాసనం ప్రకటించింది. కేవలం అనుమానం మీద అరెష్టు చేయడం, సరైన న్యాయ విచారణ జరపకుండా మరియు నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండా అతడిని జైలులలోనికి విసిరి వేయడం ఇస్లాంలో అనుమతించబడలేదు.
5. దౌర్జన్యానికి అభ్యంతరం చెప్పే హక్కు:
పరిపాలకుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడే హక్కును ఇస్లాం ధర్మం మానవులకు ప్రసాదించింది. దీని గురించి ఖుర్ఆన్ ఇలా ప్రకటిస్తున్నది: "బహిరంగంగా (ఎవరైనా) చెడు మాటలాడుటను అల్లాహ్ ఇష్టపడడు – అయితే దౌర్జన్యానికి గురైన వ్యక్తి తప్ప. అల్లాహ్ అన్నీ వినేవాడు, అంతా ఎరిగినవాడు."(4:148)
అంతకు పూర్వం పేర్కొన్నట్లుగా, ఇస్లాం ధర్మంలో మొత్తం శక్తి మరియు అధికారం అల్లాహ్ దే. మానవుడికి ఇవ్వబడిన పరిమిత అధికారం కేవలం ఒక ‘అమానతు (పూచీ)’. ఎవరికైతే అలాంటి పరిమిత శక్తి, అధికారం ఇవ్వబడిందో, అలాంటి పరిపాలకులు తమ ప్రజల ఎదుట వారిని ఉత్తమంగా గౌరవిస్తూ నిలబడవలెను. ఎందుకంటే తీర్పుదినం రోజున ప్రజలపై వారికి ఇవ్వబడిన ఆధిక్యత, అధికారం గురించి ప్రశ్నించబడును. ఖలీఫాగా ఎంచుకోబడిన తర్వాత అబూ బకర్ రదియల్లాహు అన్హు ఇచ్చిన తన మొట్టమొదటి ప్రసంగంలో దీనిని ఇలా పేర్కొన్నారు: “నేను సరైన మార్గంలో నడుస్తున్నపుడు నాకు తోడ్పాటు అందించండి. నేను తప్పు చేసినపుడు నన్ను సరిదిద్దండి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క ఆదేశాలు పాటిస్తున్నంత కాలం నాకు విధేయత చూపండి. ఒకవేళ నేను అలా చేయకపోతే నన్ను పట్టించుకోవద్దు.”
6. భావప్రకటన స్వేచ్ఛ – వాక్ స్వాతంత్ర్యం:
ఒక షరతు మీద భావ ప్రకటన స్వేచ్ఛ మరియు వాక్ స్వాతంత్ర్య హక్కులను ఇస్లామీయ సామ్రజ్యంలోని ప్రజలందరికీ ఇస్లాం ధర్మం ప్రసాదిస్తున్నది. ఆ షరతు ఏమిటంటే ఆ హక్కులు మంచిని మరియు నిజాన్ని వ్యాపింపజేయటానికి మాత్రమే ఉపయోగించాలి గానీ చెడును మరియు అసత్యాన్ని వ్యాపింపజేయడానికి కాదు. పాశ్చాత్య దేశాలలోని భావ ప్రకటన హక్కు కంటే ఇస్లామీయ చట్టంలోని భావ ప్రకటన హక్కు అనేక విధాలుగా ఉన్నతమైనది. ఎట్టి పరిస్థితులలోనూ చెడు మరియు దుష్టత్వ ప్రచారం జరగ కూడదని ఇస్లాం నిషేధిస్తున్నది. విమర్శల పేరు మీద అసభ్యకర పదాలను మరియు అసహ్యకర భాషను వాడే హక్కు ఇస్లాం ఎవ్వరికీ ఇవ్వలేదు. ఏదైనా విషయం మీద ఏదైనా దైవాజ్ఞ వచ్చిందా లేదా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగి తెలుసుకోవడం ఆయన సహచరుల అలవాటు. ఒకవేళ ఆయన వారడిగిన విషయంపై ఏ దైవాజ్ఞా రాలేదంటే, వారు ఆ విషయంపై స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చేవారు.
7. వివిధ సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ:
ప్రజలు వివిధ సంఘాలు, పార్టీలు, సంస్థలు ఏర్పాటు చేసుకునే హక్కును ఇస్లాం ప్రజలకు ఇచ్చింది. అయితే ఈ హక్కు కొన్ని నిబంధనలకు లోబడి ఉంది.
8. మనస్సాక్షి, అంతరాత్మ స్వాతంత్ర్యం మరియు దోషనిర్ధారణ స్వాతంత్ర్యం:
ఇస్లాం ధర్మం ఇలా ఆజ్ఞాపిస్తున్నది: “ధర్మ విశ్వాస విషయంలో ఎలాంటి నిర్భందమూ లేదు.” అయితే దీనికి భిన్నంగా నియంతృత్వ సమాజాలు వ్యక్తుల స్వేచ్ఛను పూర్తిగా తుడిచి పెట్టి వేస్తున్నాయి. నిశ్చయంగా పరిపాలకుల ఈ అన్యాయమైన అణచివేత మానవుడిపై ఒక రకమైన బానిసత్వాన్ని, దీనత్వాన్ని శాసించేటంతటి మోతాదులో ఉంది. ఒకానొక కాలంలో ఒక వ్యక్తి మరో వ్యక్తిని పూర్తిగా అదుపులోనికి తీసుకోవడాన్ని దాస్యం, బానిసత్వం అనే వారు. నేటికాలంలో అలాంటి బానిసత్వం చట్టపరంగా నిషేధించబడింది. అయితే, నిరంకుశ పాలకులు మానవులపై అలాంటి బానిసత్వాన్నే వేరే పద్ధతులలో రుద్దుతున్నారు.
9. ధార్మిక సెంటిమెంట్ల భద్రత:
అంతరాత్మ సాక్షి స్వాతంత్ర్యం మరియు దోషనిర్ధారణ స్వాతంత్ర్యాలతో పాటు ఇస్లాం ధర్మం మానవుల ధార్మిక సెంటిమెంట్లకూ సముచిత గౌరవం ఇస్తున్నది మరియు దానికి విరుద్ధంగా ఎవ్వరూ ఏమీ పలకకూడదని మరియు ఏమీ చేయకూడదని నిర్దేశిస్తున్నది.
10. అకారణంగా జైళ్ళలో ఖైదు చేయకుండా కాపాడే రక్షణ:
ఇతరుల ఆరోపణల వలన ఏ వ్యక్తినీ అకారణంగా అరెష్టు చేయకూడదు మరియు ఖైదీ చేయకూడదు అనే వ్యక్తిగత హక్కును ఇస్లాం గుర్తిస్తున్నది. దీని గురించి ఖుర్ఆన్ లో స్పష్టమైన నియమం ఉంది: "(పాప)భారము మోసేవారు ఇతరుల భారము మోయకుండా తమ భారమే మోస్తారు." 35:18
11. జీవిత ప్రాథమిక అవరాల హక్కు:
అక్కరగలవారి మరియు బీద ప్రజల హక్కును ఇస్లాం గుర్తిస్తున్నది మరియు వారికి సహాయం అందించాలని ఆజ్ఞాపిస్తున్నది: "వారి సంపదలో అక్కరగలవారి మరియు బీదవారి స్పష్టమైన హక్కు కూడా ఉంది."(51:19)
12. న్యాయం ముందు అందరూ సమానమే:
ఇస్లాం దృష్టిలో న్యాయం ముందు ప్రజలందరూ సమానమే. ప్రజల ఈ హక్కును ఇస్లాం చాలా స్పష్టంగా మరియు సంపూర్ణంగా ప్రకటించింది.
13. పరిపాలకులకు, ఉన్నత స్థాయి వ్యక్తులకూ చట్టం వర్తిస్తుంది:
ఒకసారి ఉన్నత వంశానికి చెందిన ఒక మహిళ దొంగతనం చేస్తూ పట్టుబడింది. ఆమెను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీసుకు వచ్చారు మరియు ఆమెకు శిక్ష నుండి మినహాయింపు ఇవ్వబడాలని కొందరు ఒత్తిడి చేయసాగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు, “మీకు పూర్వం నివసించిన కొన్ని జాతులను అల్లాహ్ నాశనం చేసినాడు. ఎందుకంటే వారు సామాన్య మానవుడిని అతడు చేసిన నేరానికి శిక్ష విధించేవారు మరియు వారి ధనవంతులు, ఉన్నత వంశస్థులను వారి నేరాలకు శిక్ష విధించకుండా వదిలి పెట్టేసేవారు. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆ ప్రభువు సాక్షిగా, ఒకవేళ ముహమ్మద్ కుమార్తె అయిన ఫాతిమా (నా కుమార్తె) ఈ నేరం చేస్తే, నేను ఆమె చేతిని నరికి వేసే శిక్ష విధించి ఉండేవాడిని”.
14. రాజ్య వ్యవహారాలలో పాల్గొనే హక్కు:
"వారి విధానము పరస్పరం సంప్రదింపులు జరపడమే."(42:38). చట్ట సభ లేక శాసనసభ అంటే ఈ అర్థం తప్ప మరేమీ కాదు – ప్రభుత్వ అధిపతి మరియు శాసనసభ సభ్యులు స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికలలో ప్రజలచే ఎన్నుకోబడాలి.
చివరిగా, పైన పేర్కొనబడిన మానవ హక్కులను మరియు అనేక ఇతర హక్కులను స్థాపించడానికి కేవలం కొన్ని చట్టాలు నిర్దేశించడమే కాకుండా, తక్కువ స్థాయి పశుజీవిత బలహీనతల నుండి బయటపడమని మరియు బంధుత్వ పక్షపాతం, జాత్యహంకారం, భాషా దురహంకారం మరియు అక్రమ సంపాదన మొదలైన వాటికి దూరగా ఉంటూ, ఉన్నతంగా ప్రవర్తించమని మానవజాతిని ఇస్లాం ధర్మం ఆహ్వానిస్తున్నది. తన అంతరాత్మ హెచ్చరికల ద్వారా అసలు సహోదర భావాన్ని గుర్తించే ఉత్తమ సామాజిక వ్యవస్థ వైపుకు సాగాలని ఇస్లాం ధర్మం మానవుడిని పిలుస్తోంది.
ఇస్లాం యొక్క ఖడ్గం
ఆరంభంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతుల మీదుగా క్రొత్తగా ఇస్లాం ధర్మంలో ప్రవేశించిన వారిలో ఆయన భార్య ఖదీజా, ఆయన దాసుడు జైద్, 11 ఏళ్ళ ఆయన పినతండ్రి కుమారుడు అలీ రదియల్లాహు అన్హుమ్ ఉన్నారు.
తర్వాత మక్కాలో ఇస్లాం ధర్మంలో ప్రవేశించిన వారిలో నిజాయితీపరుడైన వ్యాపారవేత్త అబూ బకర్, అరేబియాలోని ఉక్కు మనిషిగా ప్రసిద్ధి చెందిన ఉమర్, బిడియంతో మెలిగే ఉత్తమ వ్యాపారవేత్త ఉథ్మాన్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పరాక్రమవంతుడైన పినతండ్రి హంజా మరియు మక్కా విగ్రహారాధకుల దాస్యంలో ఉన్న బిలాల్ కుటుంబం రదియల్లాహు అన్హుమ్. అణుకువతో మరియు ఒంటరిగా పోరాడుతున్న ప్రవక్త యొక్క అద్భుత ఖడ్గాన్ని వారు ఎదుర్కొన లేక పోయారు. త్వరలోనే ఈ క్రొత్త ధర్మాన్ని విశ్వసించిన ఆ కొద్ది మందీ మక్కా నగరం నుండి (వారి ఖడ్గంతో సహా) బయటికి వెళ్ళగొట్టబడినారు. వారి వలస నగరమైన మదీనాలో ప్రజలు వారిని ఆహ్వానించడమే కాకుండా వారి ఖడ్గాన్ని కూడా తమ హృదయానికి హత్తుకున్నారు. అక్కడితో ఆ అద్భుత ఖడ్గం తన పనిని ఆపలేదు. అరేబియా ద్వీపకల్పం మొత్తం తనలో ప్రవేశించే వరకూ అది తన జైత్రయాత్ర కొనసాగించింది. ఆనాటి మిగిలిన ప్రపంచంతో పోల్చితే, అరేబియా ప్రాంతం అతి తక్కువ జనసంఖ్య కలిగి ఉండింది. మరి ఆ తక్కవ సంఖ్యలోని అరబ్బులలో నుండి కొందరు ప్రజలు ఈ అద్భుత ఖడ్గాన్ని అరేబియా ఎడారి సరిహద్దులను దాటించి, ఆనాటి మహా సామ్రాజ్యాలైన రోమ్ మరియు పర్షియా ప్రాంతాలకు, మధ్యధరా సముద్ర తీరాలకు, మలబార్ మరియు బహుదూరపు తూర్పు ద్వీపాలకు తీసుకు వెళ్ళాలని నిర్ణయించారు. తండోప తండాలుగా ప్రజలు ఈ అద్బుత ఖడ్గానికి తన ఒగ్గుతూ, ఈ క్రొత్త ధర్మంలో ప్రవేశించసాగారు.
మరి అద్భుత ఖడ్గం యొక్క పదును అంత వాడి అయినది! అది సింపులుగా హృదయాలను జయిస్తూ పోయింది, ఆటోమేటిక్ గా శరీరాలు స్వేచ్ఛ పొందసాగాయి.
అదే సత్య ధర్మ ఖడ్గం. ఎలాగైతే వెలుగు చీకటిని పారద్రోలుతుందో, అలాగే దాని తళతళలు అసత్యాన్ని తునాతునకలు చేస్తాయి.
ఈ ఖడ్గం మొద్దుబారి పోయిందా, తన పదును పోగొట్టుకుందా ? లేదు, అసలే మాత్రం పోగొట్టుకోలేదు.
ఈనాటికీ అది అనేక మంది పురుషుల మరియు స్త్రీల హృదయాలలో దూసుకు పోతున్నది – చీకటి విజయం సాధించాలని, తద్వారా తాము ప్రజల మంచితనాన్ని నిరంతరంగా దోచుకోవాలనే ఆశతో అనేక మంది అహర్నిశలు కృషి చేస్తున్నా కూడా.
అదే ఖడ్గంచే జయించ బడిన కొందరి అభిప్రాయాలు మీ కొరకు ఇక్కడ పేర్కొనబడినాయి. వీటిని మీరు తప్పకుండా చదవండి. వారు వివిధ దేశాలకు చెందినవారు, వివిధ భాషలు మాట్లాడేవారు మరియు వేర్వేర సామాజిక వ్యవస్థలకు చెందినవారు. వారి ప్రస్తుత అడ్రసు కూడా ఇవ్వబడింది. తమపై జరిగిన సత్య ధర్మ ఖడ్గం యొక్క దాడి అనుభవం గురించి మీరు వారిని అడగ దలుచుకుంటే నిశ్శంకోచంగా వారిని సంప్రదించవచ్చు.
1. లియోపోల్డ్ వీస్ (LEOPOLD WEISS): ప్రస్తుత పేరు ముహమ్మద్ అసద్:
ఆస్ట్రియా దేశానికి చెందిన రాజనీతి నిపుణుడు, పాత్రికేయుడు మరియు రచయిత; Frankfuerter Zeitung యొక్క మాజీ పాశ్చాత్య విలేఖరి, 'Islam at Cross Roads' మరియు 'Road to Makkah' ల రచయిత, ఖుర్ఆన్ భావం యొక్క అనువాదకుడు. 1926లో ఇస్లాం ధర్మం స్వీకరించారు.
“భవన నిర్మాణ శాస్త్రం యొక్క ఒక సంపూర్ణ, అద్భుత పని వలే ఇస్లాం నాకు కనిపించింది. ఒకదాని నొకటి బలపర్చుకునేలా మరియు తోడ్పాటు నిచ్చుకునేలా దాని విభాగాలన్నీ చక్కగా, పొందికగా అమర్చబడి ఉన్నాయి. వాటిలో ఏదీ అక్కరలేనిది మరియు హద్దుమీరినదీ లేదు. అలాగే వాటిలో ఏ కొరతా, లోపమూ లేదు. పర్యవసానంగా అది పరిపూర్ణమైన సమతౌల్యం మరియు పటిష్టమైన అమరిక కలిగి ఉంది.”
ప్రస్తుత చిరునామా : Dar AI-Andalus, 3 Library Ramp, Gilbraltor, Morocco.
2. అహ్మద్ హోల్ట్ Ahmed Holt: బ్రిటీష్ సివిల్ కంట్రాక్టర్. సత్యాన్వేషణలో అనేక దేశాలు తిరిగాడు. యూద ధర్మం, క్రైస్తవ ధర్మం మరియు ఇస్లాం ధర్మాల అధ్యయనంలో మరియు పరిశోధనలలో కాలం గడిపారు. చివరికి 1975వ సంవత్సరం ఇస్లాం స్వీకరించారు.
“ఇస్లాం యొక్క ఖడ్గం అంటే మామూలు ఉక్కు ఖడ్గం కాదు. అనుభవ పూర్వకంగా నాకీవిషయం తెలిసింది. ఎందుకంటే ఇస్లాం యొక్క ఖడ్గం స్వయంగా నా హృదయంలో లోతుగా చొచ్చుకు పోయింది. అది నన్ను చంపలేదు, కానీ నాకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది. అది నాలో జాగృతిని తీసుకు వచ్చింది. నేనెవరిని మరియు నేనేమిటి మరియు నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అనే విషయాలలో నన్ను మేలుకొల్పింది.”
ప్రస్తుత చిరునామా : 23 Welland Garden, Perivale, Middlesex UB6 8SZ, ﷻ.K.
3. Boodan Kopanski (బూదన్ కొపాన్ స్కీ): ప్రస్తుత పేరు బుగ్దాన్ అతాఉల్లాహ్ కొపాన్ స్కీ. అసలు పోలెండ్ దేశస్థుడు, ప్రస్తుతం అమెరికా పౌరసత్వాన్ని పొందాడు. చరిత్ర మరియు రాజకీయ శాస్త్రాలలో పి.హెచ్. డి చేసారు. ఇస్లాం వైపు ఆయన సాగించిన ప్రయాణం చాలా ఆసక్తి కరమైంది మరియు అనేక కష్టాలతో నిండి ఉంది. పోలెండు కమ్యూనిష్టుల చేతిలో ఆయన రెండు సార్లు జైలులో ఖైదు చేయబడినారు (1968, 1981-82). 1974వ సంవత్సరం ఆయన ఇస్లాం ధర్మంలో ప్రవేశించారు.
“నేను 12 సంవత్సరాల వయస్సులో చర్చీ యొక్క తర్కవిరుద్ధమైన మరియు పరస్పర విరుద్ధమైన ధర్మవిశ్వాసాలన్ని నేను తిరస్కరించాను. రెండేళ్ళ తర్వాత 1962లో, నేను ఫ్రెంచి సైన్యాన్ని చిత్తుగా ఓడించిన అల్జీరియన్ ముస్లిం ముజాహిదుల వైపు ఆకర్షితుడినైనాను. నా వైపు దూసుకు వచ్చిన తొలి ఇస్లామీయ బాణం అది. హైస్కూలులో మరియు విశ్వవిద్యాలయపు తొలి కాలంలో నేను ఎరుపువాళ్ళ ‘తిరుగుబాటు తరం’ యొక్క ఒక విచిత్రమైన నిదర్శనం అయ్యాను ... ఖుర్ఆన్ యొక్క సత్యం వైపు నా ప్రయాణం నెమ్మదిగా మరియు కష్టంగా సాగింది ... 1974లో, నేను టర్కీ దేశాన్ని సందర్శించాను. నా యొక్క ఎమ్. ఎ పరిశోధన వ్యాఖ్యానాన్ని నేను పోలీష్ సామ్రాజ్యం గురించి సుల్తాన్ మరియు ఖలీఫా సులైమాన్ కమూనీ యొక్క పాలసీలపై వ్రాసాను. అక్కడ మానవజాతి యొక్క అత్యంత మధురమైన స్వరం ‘అదాన్’ పలుకుల రూపంలో నన్ను తాకింది. నా వెంట్రుకలు నిలబడి పోయాయి. ఏదో తెలియని బలమైన శక్తి నన్ను ఇస్తాంబుల్ లోని ఒక పాత మస్జిదు వైపుకు తీసుకుపోయింది. అక్కడ చిరునవ్వుతో, గెడ్డాలు కలిగి ఉన్న టర్కిష్ వృద్ధులు నాకు వుదూ నేర్పారు. కళ్ళ నీరు ధారాపాతంగా పారుతుండగా నేను షహాదహ్ పలికాను మరియు నా మొట్టమొదటి మగ్రిబ్ నమాజు చేసాను. అసత్య సిద్ధాంతాలను, భావనలను నా లోనుండి పారద్రోలాను. నా జీవితంలో మొట్టమొదటిసారి నా మనస్సు రిలాక్స్ అయింది మరియు నేను అల్లాహ్ యొక్క ప్రేమానుభూతులను నా మనస్సులో అనుభవించగలిగాను. నేను ఇప్పుడు ముస్లింను.”
ప్రస్తుత చిరునామా : 3013 Harrel Drive 203 Grand Prairie TX 75051 ﷻ.S.A.
4. Venga Tachalam Adiyar (వెంకటాచలం అడియార్): ప్రస్తుతం అబ్దుల్లాహ్ అడియార్. భారత దేశస్థుడు. ప్రసిద్ధ తమిళ విలేఖరి. డాక్టర్ మ. కరుణానిధి యొక్క మురసోలీ దిన పత్రికలో 17 ఏళ్ళ పాటు న్యూస్ ఎడిటర్ గా పనిచేసారు. తమిళనాడు యొక్క ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులతో పనిచేసారు. 1982లో తమిళనాడు ప్రభుత్వం నుండి అలైమమానీ (కళా రత్న) అవార్డు పొందారు. 1987లో ఇస్లాం స్వీకరించారు.
“సృష్టి సిద్ధాంతం, మహిళల స్థానం, విశ్వసృష్టి మొదలైన వాటి గురించి నా మనస్సులో మెదిలిన మరియు నన్ను తీవ్రంగా వేధించిన అనేక సందేహాలకు ఇస్లాం ధర్మం నాకు సరైన సమాధానం ఇచ్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఇతర ప్రపంచ నాయకులతో మరియు వారి సిద్ధాంతాలతో పోల్చటాన్ని తేలిక చేసింది.”
ప్రస్తుత చిరునామా: I Ashok Avenue, Rangarajapuram, Kodambakkam, Madras, India.
5. Herbert Hobohm (హెర్బర్ట్ హోబోహమ్): ప్రస్తుత పేరు అమన్ హోబోహమ్. జర్మనీ దౌత్యవేత్త, క్రైస్తవ బోధకుడు మరియు సామాజిక కార్యకర్త. ప్రపంచంలోని వివిధ దేశాలలో జర్మనీ రాయబార కార్యాలయాలలో పని చేసిన ఒక మంచి వివేకవంతుడు. ప్రస్తుతం రియాద్ లోని జర్మనీ దేశ రాయబార కార్యాలయంలో సాంస్కృతిక అటాచీ గా పనిచేస్తున్నారు. 1941లో ఇస్లాం స్వీకరించారు.
“నేను వివిధ సంస్కృతుల మధ్య జీవించాను. వివిధ సిద్ధాంతాలను అధ్యయనం చేసే అవకాశం నాకు లభించింది. చివరిగా ఇస్లాం అంత పరిపూర్ణమైన జీవన వ్యవస్థ మరేదీ లేదనే అభిప్రాయానికి వచ్చాను. పవిత్ర జీవితం యొక్క పూర్తి నియమావళి ఏ వ్యవస్థలోనూ లేదు – కేవలం ఇస్లాంలో మాత్రమే అది ఉంది. అందువలననే మంచి వ్యక్తులు ఇస్లాం స్వీకరిస్తున్నారు. ఇస్లాం కేవలం సైద్ధాంతిక పరమైనది మాత్రమే కాదు, ఆచరణాత్మకమైంది కూడా. ఇస్లాం అంటే సర్వలోక సృష్టికర్తకు పూర్తిగా సమర్పించు కోవడం.”
ప్రస్తుత చిరునామా : Cultural Attache, German Embassy, P.O.Box 8974, Riyadh-l 1492, Saudi Arabia.
6. Cat Stevens (క్యాట్ స్టీవెన్స్) : ప్రస్తుత పేరు యూసుఫ్ ఇస్లాం. బ్రిటీష్ దేశస్థుడు. పూర్వం క్రైస్తవుడు. ప్రపంచ ప్రసిద్ధ పాప్ సింగర్. 1973లో ఇస్లాం స్వీకరించాడు.
“మీడియాలో తరుచుగా చూపబడుతున్న కొందరు చెడు ముస్లింల ప్రవర్తనను దృష్టిలో పెట్టుకుని ఇస్లాం గురించి ఒక అభిప్రాయానికి రావడం చాలా తప్పు. ఉదాహరణకు – ఒకవేళ ఎవరైనా డ్రైవరు తప్పత్రాగి, కారు నడుపుతూ గోడకు గ్రుద్దితే, ఆ కారు మంచిది కాదని అభిప్రాయపడటం ఎంత తప్పో మీరు ఊహించగలరు. తమ రోజువారీ జీవితంలో ఇస్లాం ధర్మం మానవులందరికీ – అధ్యాత్మికంగా, మానసికంగా మరియు భౌతికంగా – చక్కని సన్మార్గం చూపుతున్నది. అయితే ఈ మార్గదర్శకత్వ నియమాల మూలాలను మనం ‘ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలలో’ మాత్రమే అన్వేషిస్తే, తప్పకుండా మనకు ఇస్లాం యొక్క అసలు ఆదర్శవంతమైన జీవిత విధానం కనబడుతుంది.”
ప్రస్తుత చిరునామా: Chairman, Muslim Aid, 3 Furlong Road, London, N7, ﷻ.K.
7. Ms Margaret Marcus (మార్గరెట్ మార్కస్): ప్రస్తుత పేరు మర్యం జమీలహ్. అమెరికా దేశస్థురాలు. పూర్వం యూద మతస్థురాలు. వ్యాస రచయిత, విలేఖరి. అనేక పుస్తకాల రచయిత. 1962లో ఇస్లాం స్వీకరించారు.
“ఇస్లామీయ సంస్కారాలు మరియు ధర్మశాసనాల ప్రమాణం మహోన్నతుడైన అల్లాహ్ నుండి అవతరించింది. మోక్షం పొందే మార్గంలో అల్లాహ్ ప్రసన్నత కొరకు ఎవరైనా మనస్సాక్షిగా ఆచరించే కర్తవ్యాలు, బాధ్యతల ద్వారా అనుభవించే భావావేశ సంతుష్టితో పాటు సహజంగా ఉత్పత్తి అయ్యే ఉప ఫలాలే ఇస్లాం ధర్మంలోని సంతృప్తి మరియు సంతోషం. ఇస్లాం ధర్మంలో ఎల్లప్పుడూ హక్కుల కంటే ఎక్కువగా బాధ్యతల గురించి నొక్కి చెప్పబడటం గుర్తిస్తారు. నిజమైనవీ, మంచివీ, అందమైనవీ, మానవజీవితం మరియు చావుకు మార్గదర్శకత్వం వహించేవీ మొదలైనవన్నీ నాకు కేవలం ఇస్లాం ధర్మంలో మాత్రమే కనబడినాయి. ”
ప్రస్తుత చిరునామా : C/o. Mr. Muhammad Yusuf Khan, Sant Nagar, Lahore, Pakistan.
8. Wilfried Hofman (విల్ ఫ్రైడ్ హోఫ్ మాన్): ప్రస్తుత పేరు మురాద్ హోఫ్ మాన్. పి హెచ్ డి. హార్వార్డ్, జర్మనీ దేశస్థుడు. సామాజిక శాస్త్రజ్ఞుడు మరియు దౌత్యవేత్త. ప్రస్తుతం అల్జీరియాలోని జర్మనీ దేశ రాయబారి.
“కొంతకాలం క్రితం నుండి నేను నా దృష్టిలోని తత్వజ్ఞాన భావాలన్నింటిలో నుండి ఎలాంటి సందేహాలకూ తావులేని అత్యంత ఖచ్చితమైన మరియు సంక్షిప్తమైన దాని కోసం కృషి చేస్తూ, దానిని క్రమపద్ధతిలో ఒక పేపరుపై వ్రాయడానికి ప్రయత్నించాను. ఈ ప్రయాసలో నేను అజ్ఞతావాది (దేవుఁడు మనుష్యులకు తెలియఁబడనేరఁడని వాదించేువాఁడు) యొక్క విచిత్ర స్వభావం వివేకమైనది కాదని గ్రహించాను. మన చుట్టూ ఉన్నవన్నీ సృష్టించబడినవేనని నమ్మవలసిన నిర్ణయం నుండి మనిషి అలా తేలిగ్గా తప్పించుకోలేడు. ఇస్లాం ధర్మం అసలు వాస్తవానికి స్వయంగా అత్యంత సామరస్యంగా కనబడుతున్నదనటంలో ఎలాంటి సందేహమూ లేదు. కాబట్టి, అడుగడుగునా నేను స్వయంగా, నా భావాలలో మరియు ఆలోచనలలో దాదాపు నాకు తెలియకుండానే నేను ఒక ముస్లింగా పెరిగాననే విషయాన్ని ఆశ్చర్యంతో గ్రహించాను. ఈరోజు నేను ఒక ముస్లింను. చివరికి గమ్యం చేరుకున్నాను.”
ప్రస్తుత చిరునామా : Embassy of the Federal Republic of Germany, BP 664, Alger-gare, Algeria.
9. Cassius Clay (కాసియస్ క్లే): ప్రస్తుత పేరు ముహమ్మద్ అలీ క్లే. అమెరికా దేశస్థుడు. మల్లయోద్ధుడు. మూడు సార్లు ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్ గెలిచినాడు. పూర్వం క్రైస్తవుడు. 1965లో ఇస్లాం ధర్మం స్వీకరించాడు.
“అనేక మధురమైన అనుభూతులు నా జీవితంలో ఉన్నాయి. కానీ, హజ్ యాత్రలో అరఫాతు కొండపై నిలబడినపుడు నాలో కలిగి ఉద్వేగం చాలా విశేషమైంది. దాదాపు పదిన్నర లక్షల మంది ప్రజలు తమ పాపాలను క్షమించమని, తమపై ప్రత్యేక అనుగ్రహం చూపమని సర్వలోక సృష్టికర్తను వేడుకుంటున్న అక్కడి వర్ణించనలవి కాని అధ్యాత్మిక వాతావరణం నా స్థాయిని పెంచిందని, నేను ధన్యుడిని అయ్యానని భావించాను. విభిన్న వర్ణాల, జాతుల మరియు దేశాలకు చెందిన రాజులు, ప్రభుత్వాధిపతులు, అతి బీద దేశాల సామాన్య ప్రజలు – అందరూ కేవలం దుప్పట్ల వంటి రెండు తెల్లటి వస్త్రాలలో చుట్టుకుని తమలో ఎలాంటి అహంభావం మరియు నీచత్వం లేకుండా సర్వలోక సృష్టికర్త అయిన తమ ప్రభువును వేడుకోవడమనేది ఒక ఉల్లాసకరమైన అనుభవాన్ని నాకు ఇచ్చింది. ఇది సమత్వం యొక్క సాటిలేని ఆచరణాత్మక నిదర్శనాన్ని ఇస్లాం ధర్మం ఇలా ప్రదర్శిస్తున్నది.” (అల్ మదీనహ్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ, జెద్దా 15 జులై 1989)
ప్రస్తుత చిరునామా : 1200E, 49 St., Chicago, ILL 60615.
ఇవి ఇస్లాం సత్య ఖడ్గానికి స్వయంగా గాయపడిన కొందరు ప్రముఖుల పలుకులు.
ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం ధర్మం వ్యాపించడంలో ఉక్కు ఖడ్గం ప్రధాన పాత్ర వహించిందనే నిరాధారమైన అసత్య ప్రచారాన్ని సమూలంగా త్రిప్పి కొట్టే కొందరు ప్రముఖ ముస్లిమేతరుల పలుకులను మేము ఇక్కడ పేర్కొంటున్నాము:
1. మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ (M. K. GANDHI): “ఆనాటి జీవన సరళిలో ఇస్లాం కొరకు ఒక ప్రత్యేక స్థానాన్ని గెలిచి పెట్టింది ఉక్కు ఖడ్గం కాదనేది నన్ను మునుపటి కంటే ఎక్కువగా ఒప్పించింది. అది కేవలం దాని నిరాడంబరత్వము, దాని ప్రవక్త యొక్క స్వంత దిద్దుబాటు, ఆయన వాగ్దానాల పట్ల సచ్ఛీలత, తన సహచరుల మరియు స్నేహితుల కొరకు ప్రగాఢమైన ఆత్మీయత, ఆయన యొక్క నిర్భయత్వం, వీరత్వము, అల్లాహ్ పై మరియు ఆయన లక్ష్యసాధనపై ఆయన యొక్క అచంచల విశ్వాసం. ఇవే తమ ముందున్న వాటన్నింటినీ సాధించాయి మరియు ప్రతి సమస్యనూ పరిష్కరించాయి. అంతే గానీ ఖడ్గం కాదు.” Young India, 1924.
2. ఎడ్వర్డ్ గిబ్బన్ (EDWARD GIBBON): "ముహమ్మద్ జీవితం యొక్క గొప్ప విజయం కత్తి వేటుల అవసరం లేని ఉన్నత నైతిక బలం చే ప్రభావితమై ఉంది." History of the Saracen Empire, London. 1870.
3. ఎ. యస్. ట్రినిటన్ (A.S.TRITON):"ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో ఖుర్ఆన్ పట్టుకుని ముస్లిం సైనికుడు ముందుకు దూసుకు వెళ్ళే చిత్రపటం పూర్తిగా అసత్యమైంది." Islam, London, 1951 - page 21.
4. డి లాసి ఒలియరీ (DE LACY O'LEARY): "చరిత్రలో స్పష్టంగా ఉన్నప్పటికీ, తీవ్రవాద ముస్లింలు ప్రపంచ దేశాలపై జైత్రయాత్ర చేస్తూ, గెలిచిన దేశపు ప్రజల మెడపై కత్తిమొన ఆన్చి మరీ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించేలా బలవంతం చేసారనేది అత్యంత ఉన్మాదంతో కూడిన అన్య మత చరిత్రకారులు మాటిమాటికీ రిపీట్ చేసిన కట్టుకథలు మాత్రమే." Islam at Crossroads, London, 1923-page 8
5. కె. ఎస్. రామకృష్టారావు: "ఈ ఏకవిషయంపై వ్యాసం వ్రాయడం నా కొరకు చాలా సులభమై పోయింది. ఎందుకంటే ఈనాడు మనపై మామూలుగా నిరాధారమైన అసత్యాలతో కూడిన చారిత్రక రచనలు రుద్దబడటం లేదు మరియు ఇస్లాం గురించి వక్రీకరించి ప్రచారం చేయడంలో మనం సమయం గడపడం లేదు. ఇస్లాం మరియు ఖడ్గం అనే ఆరోపణలు ఈనాడు మనకు ఎక్కడా వినబడటం లేవు. ఇస్లాం యొక్క నియమం ఏమిటంటే, 'ధర్మం విషయంలో ఎలాంటి నిర్భందం లేదు' అనే ముఖ్య విషయం అందరికీ తెలిసిందే" Muhammad the Prophet of Islam, Riyadh 1989 - page 4.
6. జేమ్స్ ఎ. మికెనర్ (JAMES A. MICHENER): "ఇస్లాం వ్యాపించినంత శీఘ్రంగా ఏ మతమూ వ్యాపించలేదు ... ఇస్లాం ధర్మం యొక్క ఈ ప్రవాహవేగం ఖడ్గం వలన సంభవించిందని అనేక మంది పాశ్చాత్యులు నమ్మేవారు. కానీ ఏ ఆధునిక పండితుడూ ఈ అభిప్రాయంతో అంగీకరించలేదు. మరియు అంతరాత్మ స్వేచ్ఛను ఖుర్ఆన్ చాలా స్పష్టంగా సమర్ధిస్తుంది." Islam - The Misunderstood Religion, Readers Digest (American Edition) May 1955.
7. లారెన్స్ ఇ. బ్రౌన్ (LAWRENCE E. BROWNE): "ముస్లింలు ఎక్కడికి వెళ్ళినా అక్కడి ప్రజల మెడపై కత్తిమొన ఆన్చి మరీ బలవంతంగా ఇస్లాం స్వీకరించేట్టు చేసారని క్రైస్తవులు తమ రచనలలో విస్తృతంగా ప్రచారం చేసిన అసత్య ఆరోపణలను ఇస్లాం యొక్క పటిష్టమైన వాస్తవాలు చాలా స్పష్టంగా ఖండిస్తున్నాయి. యాధృచ్ఛికంగా పారద్రోలుతున్నాయి." The Prospects of Islam, London 1944.
ఇస్లాం యొక్క ప్రవక్త ఎవరు ?
ఎన్సైక్లోపేడియా బ్రిటానికా ఇలా ధృవీకరిస్తున్నది:
"ప్రాచీన ప్రాథమిక చారిత్రక రికార్డులు చూపుతున్న దేమిటంటే ఆయన ఇతర ఉత్తమ వ్యక్తుల గౌరవం మరియు నమ్మకం సంపాదించిన ఒక నిజాయితీపరుడు మరియు ఉత్తమ వ్యక్తి." (Vol.12)
ఆయన గురించి బెర్నార్డ్ షా ఇలా పలికారు:
"ఆయన తప్పకుండా మానవాళి రక్షకుడని పిలవబడాలి. ఒకవేళ ఆయన లాంటి వ్యక్తి నేటి ఆధునిక ప్రపంచ నాయకత్వాన్ని తన చేతులలోనికి తీసుకుంటే, చాలా ఆవశ్యకతమైన శాంతి మరియు సంతోషం నింపే విధంగా దాని సమస్యలను పరిష్కరించడంలో ఆయన విజయం సాధిస్తాడని నేను నమ్ముతున్నాను." (The Genuine Islam, Singapore. Vol.1, No. 8, 1936)
ఈ భూమండలంపై అడుగు పెట్టిన వారందరిలో ఎవ్వరూ ఆయనకు సాటి లేరు. ఆయన ఒక ధర్మాన్ని బోధించారు, ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు, ఒక సమాజాన్ని నిర్మించారు, ఒక నైతిక వ్యవస్థను నిర్దేశించారు, అనేక సామాజిక మరియు రాజకీయ సంస్కరణలు మొదలు పెట్టారు. తన బోధనలను ఆచరించడానికి మరియు ప్రాతినిధ్యం వహించడానికి, రాబోయే అన్ని యుగాలలో మానవజాతి ఆలోచనలు మరియు ప్రవర్తనలలో పూర్తి విప్లవం తీసుకు రాగలిగే శక్తివంతమైన మరియు చైతన్యవంతమైన ఒక సమాజాన్ని ఆయన నెలకొల్పినారు.
ఆయన పేరే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)
తన 23 ఏళ్ళ ప్రవక్తత్వపు స్వల్పకాలంలో, అరేబియా ద్వీపకల్పాన్నంతటినీ విగ్రహారాధన మరియు బహుదైవారాధనల నుండి ఏకదైవారాధన వైపుకు, జాతి వైరమ్యాలు మరియు పోరాటాల నుండి జాతీయ సమైక్యత మరియ సంయోజనం వైపుకు, తాగుబోతుతనం మరియు వేశ్యాలోలకం నుండి గంభీరత మరియు అల్లాహ్ యొక్క భయభక్తుల వైపుకు, అన్యాయము మరియు అరాజకత్వముల నుండి చక్కని క్రమశిక్షణ వైపుకు, దివాలాతనం నుండి మహోన్నతమైన నైతిక వ్యవస్థ వైపుకు ఆయన మార్గదర్శకత్వం చేసారు. ఆయన మార్చివేసారు. దానికి పూర్వం లేదా దాని తర్వాత, ఏ ప్రజలలోనూ లేదా ఏ ప్రాంతంలోనూ ఇంత పెద్ద ఎత్తున సంస్కరణ జరగడం మానవజాతి చరిత్రలో జరగలేదు – ఈ నమ్మశక్యంకాని అద్భుతాలన్నీ కేవలం రెండు దశాబ్దాల కాలంలోపలే జరిగిపోయాయి.
లామార్ టైన్ (Lamartine), మానవ గొప్పదనం యొక్క అద్భుత లక్షణాలపై మాట్లాడుతూ, ప్రసిద్ధ చారిత్రకవేత్త ఇలా అన్నారు: "ఒకవేళ లక్ష్యంలో గొప్పదనం, వనరులలో తక్కువదనం మరియు అద్భుత ఫలితాలు – అనే మూడు అంశాలు మానవ బుద్ధికశలత, ప్రతిభ, మేధావితనం మరియు నైపుణ్యానికి ప్రమాణాలైతే, ఆధునిక చరిత్రలోని ఏ మహాపురుషుడినైనా ముహమ్మద్ తో పోల్చడానికి ఎవరు ధైర్యం చేయగలరు? మహాపురుషులు ఆయుధాలు, చట్టాలు మరియు సామ్రాజ్యాలు సృష్టించారు. వారు ఏమైనా స్థాపించారు అంటే అవి తరుచుగా తమ కళ్ళ ఎదుటే కుప్పకూలి పోయిన భౌతిక వ్యవస్థలు తప్ప మరేమీ కావు. అయితే ఆయన సైన్యాలను, చట్టాల్ని, సామ్రాజ్యాలను, ప్రజలను మరియు రాజవంశాలను కదల్చడమే కాకుండా అప్పటి మూడో వంతు ప్రపంచంలోని మిలియన్ల కొద్దీ ప్రజలను, శిలావిగ్రహాలను, కల్పిత దేవుళ్ళను, మతాలను, మూఢనమ్మకాలను, అంధవిశ్వాసాలను మరియు మనస్సులను కూడా సమూలంగా తుడిచి వేసినారు. విజయాలలో ఆయన చూపిన క్షమ మరియు సహనం, ఏదో విధంగా ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించాలనే ప్రయాస కాకుండా సమాజంలో ఏకదైవారాధ స్థాపించాలనే ఏకైక దిశలో మాత్రమే కేంద్రీకృతమైన ఆయన అభ్యుదయేచ్ఛ, ఆయన యొక్క నిరంతరమైన ఆరాధనలు, సృష్టికర్తతో ఆయన దివ్యసంభాషణలు, ఆయన మరణం మరియు మరణం తర్వాత ఆయన సాధించిన అద్భుత విజయాలు – ఇవన్నీ ఒక నియంత గురించి తెలుపడం లేదు. ఆయన యొక్క దృఢమైన సంకల్పం మరియు దృఢవిశ్వాసం ఆ సిద్ధాంతాన్ని పునఃస్థాపించింది. ఈ సిద్ధాంతం రెండంచెలలో ఉంది. ఏకదైవత్వం మరియు ఊహించలేని దేవడి ఆకారం; మొదటిది ‘దేవుడు ఎవరు?’ అనే విషయం తెలుపుతుండగా, రెండోది ‘ఎవరు లేక ఏది దేవుడు కాజాలదు?’ అనే విషయం తెలుపుతున్నది; మొదటిది ఖడ్గంతో అసత్యదైవాలను తునాతునకుల చేస్తే, రెండోది ఉత్తమ పలుకులతో అసలు వాస్తవాన్ని పలకటం ప్రారంభించింది. తత్వవేత్త, వక్త, ప్రవక్త, ధర్మశాస్త్రకర్త, యోధుడు, ఆలోచనలను జయించినవారు, విచక్షణ మరియు హేతుబద్ధ సిద్ధాంతాల్ని పునఃస్థాపించినవారు, రూపురేఖలు తెలియక పోయినా ఎక్కువగా గౌరవింపబడుతున్నవారు, దాదాపు ఇరవై భౌగోళిక సామ్రాజ్యాలు మరియు ఒక అధ్యాత్మిక సామ్రాజ్యాన్ని స్థాపించినవారు – ఆయనే ముహమ్మద్. మానవ గొప్పదనాన్ని కొలవగలిగే ప్రమాణాలన్నింటి ఆధారంగా, ఆయన కంటే గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని మనం ప్రశ్నించవచ్చు?" (Lamartine. Historie de la Turquie. Paris, 1854, Vol. II. pp. 276-277).
ఈ ప్రపంచం అనేక మంది మహా పురుషులను చూసింది. కానీ, వీరందరూ ధార్మిక సిద్ధాంతాలు లేక సైనిక నాయకత్వం మొదలైన ఒకటి లేక రెండు రంగాలలో మాత్రమే విశిష్ఠత సాధించిన ఏక పక్ష రూపాలు. ఆ మహాపురుషుల జీవిత చరిత్రలు మరియు బోధనలు కాలగర్భంలో కలిసి పోయాయి. వారి జన్మస్థలం మరియు తేదీ, వారి జీవిత విధానం, వారి బోధనల స్వభావం మరియు నమోదులు, వారు సాధించిన విజయం లేక అపజయం యొక్క ప్రమాణాల గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఆ మహాపురుషుల జీవితాలను మరియు బోధనలను ఖచ్చితంగా పునర్మించటమనేది మానవ జాతి కొరకు అసాధ్యమైన పని. అయితే ఈ మహా పురుషుని విషయంలో అలా కాదు. మహోజ్వల మానవ చరిత్రలో పైరంగాలన్నింటిలో మానవుడి ఆలోచన మరియు ప్రవర్తనను ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంతో ప్రభావితం చేసారు. ఆయన జీవితపు ప్రతి అంతరంగిక మరియు బహిరంగ పలుకు (హదీథుల రూపంలో) నమోదు చేయబడింది మరియు ఈరోజు వరకు భద్రపరచబడి ఉంది. అలా నమోదు చేయబడిన వాటి ప్రామాణికత నమ్మకస్తులైన అనుచరులచే మాత్రమే కాకుండా ఆయనకు వ్యతిరేకంగా పక్షపాతంతో నిండి ఉన్న విమర్శకులచే కూడా క్షణ్ణంగా పరిశీలించబడినాయి.
ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక ధార్మిక ఉపాధ్యాయులు, ఒక సామాజిక సంస్కరణకర్త, ఒక బ్రహ్మాండమైన పరిపాలకా దక్షుడు, ఒక నైతిక మార్గదర్శి, ఒక నమ్మకస్తుడైన స్నేహితుడు, ఒక మంచి సహవాసి, ఒక నిష్కపటమైన భర్త, ఒక ప్రేమించే తండ్రి - అన్నింటితో కూడిన ఒక మహాపురుషుడు. జీవితపు ఈ అంశాలలో ఆయనను మించిన లేక ఆయనకు సరిసమానమైన ఏ వ్యక్తీ మానవ చరిత్రలో కనబడడు – అలాంటి అపూర్వమైన పరిపూర్ణత సాధించింది కేవలం నిస్వార్ధంతో కూడిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వం మాత్రమే.
మహాత్మా గాంధీ, 'Young India' లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గుణగణాల గురించి పేర్కొంటూ ఇలా అన్నారు; "మిలియన్ల కొద్దీ ప్రజల హృదయాలను నిర్వివాదంగా వశపర్చుకున్న అత్యుత్తమ పురుషుడు ఎవరు అనే విషయాన్ని నేను తెలుసుకోదలిచాను .... “ఆనాటి జీవన సరళిలో ఇస్లాం కొరకు ఒక ప్రత్యేక స్థానాన్ని గెలిచి పెట్టింది ఉక్కు ఖడ్గం కాదనేది నన్ను మునుపటి కంటే ఎక్కువగా ఒప్పించింది. అది కేవలం దాని నిరాడంబరత్వము, దాని ప్రవక్త యొక్క స్వంత దిద్దుబాటు, ఆయన వాగ్దానాల పట్ల సచ్ఛీలత, తన సహచరుల మరియు స్నేహితుల కొరకు ప్రగాఢమైన ఆత్మీయత, ఆయన యొక్క నిర్భయత్వం, వీరత్వము, అల్లాహ్ పై మరియు ఆయన లక్ష్యసాధనపై ఆయన యొక్క అచంచల విశ్వాసం. ఇవే తమ ముందున్న వాటన్నింటినీ సాధించాయి మకిఉ ప్రతి సమస్యనూ పరిష్కరించాయి. అంతే గానీ ఖడ్గం కాదు. ” Young India 1924.
'Heroes and Hero-worship' అనే పుస్తకంలో థామస్ కార్ లైల్ సింపుల్ గా తన ఆశ్చర్యాన్ని ఇలా వ్యక్త పరచారు: "ఒంటరిగా ఒక వ్యక్తి పరస్పర యుద్ధాలలో మునిగి ఉన్న వివిధ జాతులను మరియు దేశదిమ్మరులైన పల్లెవాసులను రెండు దశాబ్దాలలోపలే ఏక త్రాటిపై తీసుకు వచ్చి, అత్యంత శక్తివంతమైన నాగరిక సమాజంగా తయారు చేయగలిగాడు ?"
దివాన్ చంద్ శర్మ ఇలా వ్రాసారు: "కారుణ్యం యొక్క ఆత్మ ముహమ్మద్. ఆయన చుట్టూ ఉన్న సహచరులలో మరిచిపోలేని విధంగా ఆయన ప్రభావం స్పష్టంగా కనబడింది." (D.C. Sharma. 'The Prophets of the East', Calcutta, 1935.pp. 12)
ఎడ్వర్డ్ గిబ్బన్ మరియు సిమన్ ఓక్లే ఇస్లాం గురించి సాక్ష్యప్రకటన చేస్తూ ఇలా పలికారు: "నేను ఏకైక దేవుడిని నమ్ముతాను మరియు ముహమ్మద్ ప్రవక్త అని నేను నమ్ముతాను" ఇది ఒక సులభమైన మరియు మార్పు చెందని ఇస్లాంలో ప్రవేశింపజేసే సాక్ష్యప్రకటన. "ఏకైక ఆరాధ్యుడి వివేకవంతమైన రూపం ఏనాడూ కంటికి కనబడే విగ్రహాల రూపంలోనికి దిగజార్చబడలేదు; ప్రవక్తపై చూపవలసిన ఆదరణ మానవ శుభలక్షణాల ప్రమాణాన్ని ఎన్నడూ దాటలేదు; మరియు ఆయన సజీవ బోధనలు ఆయన సహచరులను హేతుబద్ధ మరియు ధార్మిక హద్దులలో ఉంచాయి." (History of the Saracen Empires, London, 1870, p.54).
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మానవుడి కంటే ఎక్కువ కాదు మరియు తక్కువ కాదు. కానీ ఆయన ‘దేవుడు ఒక్కడే’, అల్లాహ్ యొక్క ఆదేశాల మేరకు నిజాయితీ మరియు జీవిత ఉన్నత ప్రమాణాలను బోధించే ఉత్తమ లక్ష్యంతో వచ్చిన ఒక మహాపురుషుడు. ఆయన ఎప్పుడూ తనను దేవుడి దాసుడిగా మరియు సందేశహరుడిగా తెలుపుకున్నారు" అంతేగాక ఆయన యొక్క ప్రతి ఆచరణా దీనినే ధృవీకరించింది.
ఇస్లాం దేవుడి ముందు అందరూ ఒక్కటే అనే సమానత గురించి మాట్లాడుతూ, భారతదేశ సుప్రసిద్ధ కవి సరోజినీ నాయుడు ఇలా పలికారు: "మస్జిదులో ప్రజాస్వామ్యం గురించి బోధించిన మరియు ఆచరణలో పెట్టిన మొట్టమొదటి ధర్మం ఇది. నమాజు కొరకు పిలుపు ఇవ్వగానే, అందరూ ఒకచోట గుమిగూడతారు (మస్జిదులో చేరుకుంటారు). ఇస్లాంలోని ప్రజాస్వామ్యం ప్రతిరోజు ఐదు పూటలా స్థాపించబడింది – ఒక రాజు అయినా, ఒక సామాన్య వ్యక్తి అయినా ఒకరి ప్రక్క మరొకరు మోకరిల్లుతారు మరియు ఇలా ప్రకటిస్తారు": "అల్లాహ్ అక్బర్ – అల్లాహ్ మహోన్నతుడు."
"సహజసిద్ధంగా ఎవరినైనా సోదరుడిని చేసి వేసే ఇస్లాంలోని ఈ అభేద్యమైన ఐకమత్యం నన్ను మాటిమాటికీ తాకుతున్నది." (S. Naidu, Ideals of Islam, vide speeches & Writings, Madras, 1918, P.169).
ప్రొఫెసర్ హుర్గోంజే (Prof. Hurgronje) పలుకులలో: "ఇస్లాం యొక్క ప్రవక్త కనిపెట్టిన ఐక్యరాజ్యసమితిలోని అంతర్జాతీయ ఐక్యత మరియు మానవ సహోదరత్వం నియమాలు ఇతరులకు మార్గదర్శకత్వం వహించే దీపం వంటి విశ్వవ్యాప్త పునాదులపై వేయబడింది."
ఇంకా ఇలా కొనసాగించారు: "ఐక్యరాజ్యసమితి ఆలోచనకు వాస్తవ రూపాన్ని ఇవ్వడంలో ఇస్లాం అందించిన తోడ్పాటుకు సమాంతరంగా ఇతర ఏ దేశమూ అందించలేదు."
వారి జీవితాలు మరియు సాధించిన లక్ష్యాలు కాలగర్భంలో కలిసి పోయినా, ప్రపంచం కొందరు మహాపురుషులను దైవత్వ స్థాయికి చేర్చటంలో వెనుకాడలేదు. అయితే చారిత్రకపరంగా ఈ మహాపురుషులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాధించిన దానిలో చిన్న భాగమంత కూడా సాధించలేదు. ఆయన పడిన ప్రయాసంతా మొత్తం మానవజాతిని ఏకదైవారాధనలో ఏకం చేసే మరియు నైతిక నియమాలను నెలకల్పే లక్ష్యాన్ని సాధించడం కొరకే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేదా ఆయన సహచరులు ఎన్నడూ ఆయన దేవుని కుమారుడని లేదా ఆయనలో దేవుడు అవతరించాడని లేదా ఆయనలో దైవత్వం ఉందని దావా చేయలేదు – కానీ ఆయన ఎల్లప్పుడూ అల్లాహ్ చే ఎంచుకోబడిన ఒక సందేశహరుడిగానే పరిగణించబడినారు.
మైకేల్ హెచ్. హర్ట్ (Micheal H. Hart) మానవజాతి ప్రయోజనం కొరకు మరియు అభివృద్ధి కొరకు పాటుబడిన వ్యక్తుల జాబితా తయారు చేసి, వారి గురించి వివరిస్తూ ప్రచురించిన తన పుస్తకంలో ఆయనిలా పేర్కొన్నారు:" ప్రపంచ అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో మొట్టమొదటి స్థానం ముహమ్మద్ ఇవ్వటం అనేది కొందరు పాఠకులను ఆశ్చర్యంలో ముంచెత్తి ఉండవచ్చు మరియు ఇతరులలో దీని గురించి ప్రశ్నలు జనించి ఉండవచ్చు. అయితే చరిత్రలో కేవలం ఆయన మాత్రమే ధార్మికపరంగా మరియు ప్రాపంచికపరంగా రెండింటిలోనూ తిరుగులేని విజయం సాధించిన ఏకైక మహాపురుషుడు." (M.H. Hart, The 100: A ranking of the most influential persons in History ' , New York, 1987, pp.33).
ఈనాడు 14 శతాబ్దాలు గడిచిపోయినా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర మరియు బోధనలు కొంచెం కూడా పోగొట్టుకోకుండా, మార్పులకు చేర్పులకు గురి కాకుండా, స్వచ్ఛంగా మిగిలి ఉన్నాయి. మానవజాతి యొక్క అనేక రోగాలకు ఆయన జీవిత కాలంలో ఎలా నిశ్శంకోచమైన ఆశలను అవి చిగురింపజేసాయో, అలాంటి ఆశలనే నేడు కూడా కలిగిస్తున్నాయి. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల దావా మాత్రమే కాదు, నిష్పక్షపాతమైన మరియు విమర్శనాత్మకమైన చరిత్ర బలంగా రుద్దుతున్న తప్పించుకోలేని ముగింపు.
“వివేకం మరియు చింతన గల ఒక మానవుడిగా కనీసం మీరు చేయవలసినది ఏమిటంటే, ఒక్క క్షణం ఆగి, మిమ్ముల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవాలి: అపూర్వంగా, విచిత్రంగా, అద్భుతంగా మరియు విప్లవాత్మకంగా కనబడుతున్న ఈ ప్రకటనలు వాస్తవంగా నిజమైనవేనా? ఒకవేళ అవి నిజమైనవే అయితే, ఈ మహాపురుషుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మీకు ఇంత వరకు తెలియదా లేక మీరు ఆయన గురించి ఇంత వరకు వినలేదా? ఈ తిరుగులేని సవాలును ఎదుర్కొని, ఆయన గురించి తెలుసుకోవలసిన సమయం ఇంకా రాలేదా?
దీని కోసం మీకేమీ ఖర్చు కాదు, కానీ ఇది పూర్తిగా మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభ మవటానికి నిదర్శనం కాగలదు.
ఎన్నడూ భూఉపరితలంపై ఆయనను పోలిన వ్యక్తి చరిత్రలో కనపడని, ఈ మహాద్భుత మరియు మహాపురుషుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మీరే స్వయంగా కనిపెట్టమని మేము మిమ్ములన్ని ఆహ్వానిస్తున్నాము.
ఇస్లాం గురించి వివరించే మరికొన్ని రచనలు:
-T.B. Irving, et al. : The Quran: Basic Teachings
-Hamuda Abdalati : Islam in Focus
- M. Qutb : Islam: The Misunderstood Religion
-Maudoodi : Towards Understanding Islam
-Maurice Bucaille : The Bible, The Quran and Science
-Suzanne Haneef : What Everyone Should know About Islam and the Muslims