خمسون علامة من علامات يوم القيامة من الكتاب والسنة

أعرض المحتوى باللغة الأصلية anchor

translation రచన : శొహైబ్ హసన్
1

అంతిమదినం యొక్క 50 చిహ్నాలు

2.4 MB DOC
2

అంతిమదినం యొక్క 50 చిహ్నాలు

251.2 KB PDF

في هذه المادة تحدث الشيخ حفظه الله عن يوم البعث وأنه يوم عظيم تشيب من هوله الولدان، لشدة ما يرون من تغيرات هائلة في الكون، كما تحدث عن علامات الساعة المستمرة وذكر منها: انشقاق القمر، وظهور الفتن، وخروج الدجالين الذين يدعون النبوة وغيرها من العلامات التي أخبر بها الرسول صلى الله عليه وسلم.

    అల్లాహ్ మరియు ప్రవక్త (స) హదీథుల నుండి అంతిమదినం యొక్క 50 చిహ్నాలు

    ] తెలుగు – Telugu –تلغو [

    సుహైబ్ హసన్ అబ్దుల్ గఫ్ఫార్

    అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్

    రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్

    2012 - 1433

    خمسون علامة من علامات يوم القيامة

    من القرآن والسنة

    « باللغة تلغو »

    صهيب حسن

    ترجمة: محمد كريم الله

    مراجعة: شيخ نذير أحمد

    2012 - 1433

    అల్లాహ్ మరియు ప్రవక్త (స) హదీథుల నుండి అంతిమదినం యొక్క 50 చిహ్నాలు

    వరుసక్రమం, ముఖ్యంగా భవిష్య ఘటనల విషయంలో మరీ అంత ఖచ్ఛితంగా ఉండవలసిన అవసరం లేకపోయినా, కాలక్రమానుసారమే ప్రళయ దిన చిహ్నాలు దాదాపుగా పేర్కొనబడినాయి.

    ప్రళయదిన చిహ్నాల సంక్షిప్త సారాంశమిది; వీటిని సవివరంగా చర్చిస్తున్న అనేక పుస్తకాలు, వ్యాసాలు, క్యాసెట్టులు అందుబాటులో ఉన్నాయి. అల్లాహ్ మమ్ముల్ని వాటిని గుర్తించేలా మరియు జాగ్రత్త పడేలా చేయుగాక మరియు ఆపద సమయాలలో మాకు శక్తినివ్వుగాక.

    "హఠాత్తుగా వారి వద్దకు వచ్చే అంతిమ ఘడియ గురించి గాక, వారు దేని గురించైనా నిరీక్షిస్తున్నారా? అయితే వాటి చిహ్నాలు ఇప్పటికే వచ్చేసాయి!" (సూరహ్ ముహమ్మద్ 47:18)

    ఇప్పటి వరకు సంభవించిన చిహ్నాలు

    1. చంద్రుడు రెండుగా చీలడం.

    2. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మరణం.

    3. ఒక రకమైన చావు కారణంగా వేల మంది ముస్లింలు చనిపోవడం. (ఇది ఖలీఫా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు కాలంలో వచ్చిన ప్లేగు వ్యాధిని సూచిస్తుందని భావించబడింది.)

    4. మదీనాలో ఒక మహాయుద్ధం జరగడం (63వ హిజ్రీ, యజీద్ కాలంలో జరిగిన అల్ హర్రాహ్ యుద్ధాన్ని సూచిస్తుందని భావించబడింది).

    5. జెరూసలెం పట్టణాన్ని ముస్లింలు జయించడం.

    6. కాన్ ష్టాంటినోపుల్ (Constantinople) ను ముస్లింలు జయించడం.

    7. రెండు పెద్ద ముస్లిం సమూహాలు యుద్ధంలో తలబడటం.

    8. చిన్న కళ్ళు కలిగి ఉండి, వెంట్రుకలతో తయారు చేయబడిన చెప్పులు తొడుక్కున్ని ఉండే ఎర్రటి వ్యక్తులకు మరియు ముస్లింలకు మధ్య యుద్ధం జరగడం (ఇస్లామీయ సామ్రాజ్యంపై మంగోల్ తాతారుల దండయాత్ర).

    9. ముస్లింల మరియు పసుపు వర్ణంలోని ముస్లిమేతరుల మధ్య సంధి జరగడం. (చైనీయులు, మంగోలులు ... మొదలైన వారు.)

    10. ముప్పై వంచకులు (దజ్జాల్) బయటపడడం, ప్రతి ఒక్కరూ తాను కూడా ప్రవక్తేనని ప్రకటించడం.

    ప్రస్తుత కాలంలో సంభవిస్తున్న చిహ్నాలు?

    11. నగ్న, అభాగ్య, ఒట్టి కాళ్ళ గొర్రెల కాపరులు ఎత్తైన బిల్డింగులు కట్టడంలో పోటీపడడం.

    12. బానిస స్త్రీ తన యజమానికి జన్మనివ్వడం.

    13. ప్రతి అరబ్బు ఇంటిలో ప్రవేశించే ఒక విపత్తు (ఫిత్నా).

    14. జ్ఞానం పైకి లేపుకోబడటం (విజ్ఞానుల మరణం), మరియు అజ్ఞానం మూలమూలలా విస్తరించడం.

    15. మద్యం ఎక్కువ మోతాదులో సేవించబడడం.

    16. విచ్చల విడిగా అక్రమ సంబంధాలు వ్యాపించడం.

    17. భూకంపాలు పెరిగిపోవడం.

    18. సమయం చాలా త్వరగా గడిచిపోవడం.

    19. విపత్తులు, దుష్టకార్యాలు (ఫిత్నా) పెరిగి పోవడం.

    20. రక్తపాతం పెరిగి పోవడం.

    21. ఒక వ్యక్తి మరొక వ్యక్తి సమాధి దరిదాపులలో ముందుకు సాగుతూ, ఆ రెండో వాని స్థానంలో తనుంటే ఎంత బాగుండేది అని భావించడం.

    22. నమ్మకం నశించి పోతుంది, i.e. అనర్హులు అధికారంలోనికి రావడం.

    23. ప్రజలు నమాజు కొరకు సమావేశమవగా, నమాజులో వారికి నాయకత్వం వహించడానికి ఇమాం లభించకపోవడం.

    భవిష్యత్తులో జరగబోయే చిహ్నాలు ?

    24. పురుషుల సంఖ్య తగ్గిపోతుంది, స్త్రీల సంఖ్య పెరిగిపోతుంది - స్త్రీల సంఖ్య పురుషుల కంటే 50 రెట్లు అయ్యే వరకు.

    25. యూఫరేట్ నది (ఇరాఖ్) బంగారపు ఖజానాను బైట పెడుతుంది. దానిని తామే చేజిక్కించుకోవాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ చేసే పోరాటంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతారు.

    26. అమఖ్ లేక వాబిఖ్ అనే ప్రాంతంపై రోమన్లు (యూరోపియన్లు) దాడి చేస్తారు, వారిని ఎదుర్కొనటానికి మదీనా నుండి ఉత్తమ వ్యక్తులతో కూడిన సైన్యం బయలు దేరుతుంది.

    27. ముస్లింలు రోమ్ దేశాన్ని జయిస్తారు.

    28. మహ్ది (సన్మార్గం చూపబడినవాడు) బైటపడతారు మరియు ముస్లింల నాయకుడు అవుతారు.

    29. డమాస్కస్ లో ప్రవక్త జీసస్ అలైహిస్సలాం భూమి పైకి దిగి వస్తారు మరియు ఇమాం మహ్ది వెనుక నమాజు చేస్తారు.

    30. ప్రవక్త జీసస్ అలైహిస్సలాం శిలువను విరిచేస్తారు మరియు పందిని చంపుతారు అంటే అసత్య క్రైస్తవాన్ని నాశనం చేస్తారు.

    31. మోసం, వంచన మొదలైన పరికరాలతో యాంటీ క్రైస్ట్ (అల్ మసీహ్ దజ్జాల్ – క్రీస్తువిరోధి) బైటబడతాడు. అది ఒక కఠినాతి కఠినమైన పరీక్షా సమయం. అస్ఫహాన్ (ప్రస్తుత ఇరాన్ దేశంలోని ఒక పట్టణం) నుండి 70,000 మంది యూదులు అతడిని అనుసరిస్తారు.

    32. యూజూజ్ మరియు మాజూజ్ (గోగ్ మరియు మాగోగ్) బైటపడతారు మరియు వారికి చెందిన ఉపద్రవాలు సంభవిస్తాయి.

    33. ప్రవక్త మూసా అలైహిస్సలాం యొక్క కర్రను మరియు ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం యొక్క సీలు ముద్రను మోసుకంటూ, భూమిలో నండి ఒక రకమైన జంతువు బయటపడుతుంది. అది ప్రజలతో మాట్లాడు తుంది మరియు దివ్య చిహ్నాలను రూఢీగా నమ్మని విషయం వారికి జ్ఞాపకం చేస్తుంది.

    34. తిరిగి వచ్చిన ప్రవక్త జీసస్ అలైహిస్సలాంను విశ్వసించే యూదులు మరియు క్రైస్తవులతో కూడిన ఇమాం మహ్ది నాయకత్వంలోని ముస్లింల పక్షానికీ మరియు ఇతర యూదులు, ముస్లిమేతరులతో కూడిన క్రీస్తువిరోధి నాయత్వంలోని పక్షానికీ మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది.

    35. లుద్ద్ ద్వారం వద్ద (ప్రస్తుత ఇస్రాయీల్ లోని ఒక విమానాశ్రయం మరియు ఒక పెద్ద సైనిక స్థావరం) ప్రవక్త జీసస్ అలైహిస్సలాం క్రీస్తువిరోధిని చంపుతారు.

    36. ప్రవక్త జీసస్ అలైహిస్సలాం జీవితకాలంలోని మరియు ఆయన తర్వాతి శాంతిభద్రతల ఒక బంగారు సమయం.

    37. ఐశ్వర్యం ఎంతగా పెరిగి పోతుందంటే, దానం తీసుకునే బీదవాళ్ళను కనుక్కోవడం చాలా కష్టమవుతుంది.

    38. అరబ్ దేశం తోటలతో నిండిపోయి, నదులు ప్రవహించే ప్రాంతంగా మారిపోతుంది.

    39. ఆ తర్వాత సమాజం క్షీణించడం మొదలవుతుంది.

    40. దుల్ ఖుల్సా అనే విగ్రహం యొక్క ప్రదక్షిణలో డౌస్ తెగ మహిళల పిరుదులు మరలా ఊగుతాయి.

    41. హిజాజ్ లో ఘోరమైన అగ్నిప్రమాదం. అది ఎంతగా పైకి లేస్తాయంటే, దాని మంటలను (ఇరాఖ్) బస్రా పట్టణవాసులు కూడా చూడగలుగుతారు.

    42. మూడు పెద్ద సైన్యాలు భూమిలో కూరుకుపోతాయి: తూర్పులో ఒకటి, పశ్చిమంలో రెండోది, అరబ్ ప్రాంతంలో మూడోది.

    43. సన్నటి కాలిపిక్క ముందటి భాగం కలిగి ఉన్న ఒక అబిసీనియా (ఇథియోపియా) నాయకుడు కాబాగృహాన్ని ధ్వంసం చేస్తాడు.

    44. పొగతో నిండిన ఒక బ్రహ్మాండమైన మబ్బు కమ్ముకుంటుంది.

    45. సూర్యుడు (రోజూ అస్తమించే) పడమటి స్థానం నుండి ఉదయిస్తాడు.

    46. ఒక చల్లటి గాలి విశ్వాసుల (మోమినుల) ప్రాణాలు తీస్తుంది.

    47. "అల్లాహ్, అల్లాహ్" లేక "లా ఇలాహ ఇల్లల్లాహ్ – అల్లాహ్ తప్ప, వేరే ఆరాధ్యుడెవరూ లేరు" అని పలికేవాళ్ళలో ఒక్కరు కూడా భూమిపై మిగిలి ఉండరు.

    48. గాడిదల వలే ప్రజల మధ్య బహిరంగంగా సంభోగం చేసే నీచులపై చివరికి తీర్పుదినం స్థాపితమవుతుంది.

    49. దైవదూత ఇస్రాఫీల్ శంఖం ఊదగా, ఆ ధ్వనికి అల్లాహ్ తలిచిన వారు తప్ప, మిగిలిన వారందరూ సృహ తప్పిపోతారు.

    50. రెండోసారి శంఖం ఊదబడగా, ప్రతి ఒక్కరూ తిరిగి లేపబడతారు.

    ఇస్లామిక్ సొసైటీ చే షవ్వాల్ నెల 1420, (జనవరి 2000) సంవత్సరంలో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఇవ్వబడిన తీర్పుదిన చిహ్నాలు (Signs of the Day of Judgment) అనే ఉపన్యాసం నుండి...

    కూర్పులు