فضائل شهر رمضان
أعرض المحتوى باللغة الأصلية
مقالة قيمة في بيان فضائل شهر رمضان، والحث على استغلال الأوقات في الطاعات والأعمال الصالحة.
రమజాన్ శుభాలు
﴿ فضائل شهر رمضان ﴾
] తెలుగు – Telugu – تلغو [
http://ipcblogger.net/salimumri/
అనువాదం : -
పునర్విమర్శ : ముహమ్మద్ కరీముల్లాహ్
2009 - 1430
﴿ فضائل شهر رمضان ﴾
« باللغة التلغو »
http://ipcblogger.net/salimumri/
ترجمة : -
مراجعة : محمد كريم الله
2009 - 1430
రమజాన్ శుభాలు
ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు (ఖుర్ఆన్ వచన భావపు అనువాదం) - ‘విశ్వసించిన ఓ ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించ బడింది ఇదే విధంగా యిది మీకు పూర్వం ప్రవక్తల్ని అనుసరించే వారి పై కూడా విధించబడింది దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది’ (అల్ బఖర -183).
రోజా
అసలు రోజా (ఉపవాసం) అంటే ఆపటం, ఆగి ఉండటం, అదుపు చేసుకోవటం, కట్టుబడి ఉండటం అనే అర్థాలు వస్తాయి. అయితే ఇస్లామీయ పరిభాషలో రోజా (ఉపవాసం) అంటే ఒక నిర్ణీత సమయంలో అన్నపానీయాలను, దాంపత్య సుఖాల్నీ త్యజించటం, లైంగిక వాంఛలను అదుపులో ఉంచుకోవటమని అర్ధం. రోజానే ‘సౌం/సియాం’ అని కూడా అంటారు. రోజేదార్ (ఉపవాసి)ని ‘సాయిం’ అని పేర్కొంటారు. ఉపవాసం (రోజా) యుక్త వయస్సుకు చేరిన ప్రతి ముస్లిం స్త్రీపురుషునిపై విధిగా నిర్ణయించబడింది. ఉషోదయానికి పూర్వం నుండి సూర్యాస్తమయం వరకు కేవలం అల్లాహ్ కోసం అన్నపానీయాలు విడనాడటాన్ని, దాంపత్య సుఖం నుండి దూరంగా ఉండటాన్ని రోజా (ఉపవాసం) అంటారు.
ఈ రోజాలను తిరస్కరించినవాడు కాఫిర్ (దైవధిక్కారి) అవుతాడు. ఎలాంటి సరైన కారణం లేకుండా రమదాన్ ఉపవాసాలను పాటించనివాడు ఘోర అపరాధం చేసిన వాడవుతాడు.
నబాలిగ్ (చిన్న పిల్లల) పై ఉపవాసం తప్పనిసరికాదు. అయితే ఉపవాసం ఉండేందుకు చిన్ననాటి నుండే అలవాటు చేసుకోవటంలో తప్పు లేదు. పిల్లవాడికి 7 ఏండ్లు నిండితే నమాజ్ కోసం ఆజ్ఞాపించమని, 10 ఏండ్లు నిండిన మీదట కూడా పిల్లోడు నమాజ్ చేయకపోతే దండించి మరీ నమాజ్ చేయించాలని హదీసుల ద్వారా తెలుస్తోంది. చిన్నపిల్లల్లో ఎన్ని ఉపవాసాలు పాటించగల శక్తి ఉందో అన్ని ఉపవాసాలు పాటించనీయటం ఉత్తమం .
ఒక హదీసులో ఇలా ఉంది: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించినారు “మీపై ఒక శుభప్రదమైన నెల అవతరించనున్నది. దాని ఉపవాసాలను అల్లాహ్ మీపై విధిగా చేశాడు.”
ఈ నెలలో స్వర్గద్వారాలు తెరచి వేయబడతాయి. నరకద్వారాలు మూసి వేయబడతాయి. షైతాన్లు బంధించబడతారు. వేయి నెలల కంటే శ్రేష్టమయిన రేయి ఒకటి ఈ నెలలోనే ఉంది. ఎవరయితే దాని శుభాలను కోల్పోతాడో, వాస్తావానికి అతడు ఎంతో దౌర్భాగ్యుడు.