×
అన్నిఫాఖ్ అంటే కపటత్వం యొక్క నిర్వచనం మరియు దాని యొక్క భాగాల గురించి ఈ వ్యాసంలో క్లుప్తంగా చర్చించబడినది.

    అన్నిఫాఖ్ - الــنــفـــاق

    కాపట్యం మరియు దాని యొక్క వేర్వేరు పద్ధతులు

    కాపట్యం రెండు రకాలు, అవి: a) విశ్వాసం (నమ్మకం) లో కాపట్యం

    b) ఆచరణలలో మరియు కార్యములలో (పనులలో) కాపట్యం.

    a) విశ్వాసం (నమ్మకం)లో కాపట్యం: దీనిలో ఆరు రకాలున్నాయి.

    1) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను తిరస్కరించటం

    2) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకు వచ్చిన (ఆయన పై అవతరించిన లేక ఆయన బోధించిన) వాటిలో కొన్నింటిని తిరస్కరించటం (ఉదాహరణ - ఖుర్ఆన్, సున్నహ్, ఇస్లామీయ ధర్మశాస్త్ర నియమ నిబంధనలు)

    3) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ద్వేషించుట, అసహ్యించుట.

    4) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకు వచ్చిన వాటిలో కొన్నింటిని ద్వేషించటం లేక అసహ్యించుకోవటం (ఉదాహరణ - ఏకదైవత్వం లేక ఏక దైవారాధన మొదలైనవి)

    5) అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఇస్లాం ధర్మానికి ఏదైనా తాత్కాలిక పరాభవం గాని లేదా అపకీర్తి గాని కలిగినప్పుడు సంతోషపడటం.

    6) అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఇస్లాం ధర్మానికి విజయం కలిగినట్లయితే విచారపడటం. (ఇస్లాంధర్మపు సాఫల్యాన్ని చూసి అసంతృప్తి చెందటం)

    ఎవరిలోనైతే పైన పేర్కొన్న ఆరు కపటపు గుణాలు ఉంటాయో, వారు నరకాగ్నిలోని అట్టడుగు పొరలలోనికి చేర్చబడతారు. (కపటులు నరకం లోని అట్టడుగు పొరలలోనికి పంపబడతారు - ఖుర్ఆన్ 4:145)

    b) ఆచరణలలో మరియు కార్యములలో (పనులలో) కాపట్యం.

    అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వేర్వేరు ప్రకటనల ఆధారంగా, దీనిలో ఐదు పద్ధతులు ఉన్నాయి. కపటుల చిహ్నాలు -

    1) అతడు మాట్లాడినప్పుడు, అబద్ధం చెబుతాడు.

    2) అతడు వాగ్దానం చేసినప్పుడు, దానిని పూర్తిచేయడు.

    3) ఒకవేళ అతడిని నమ్మినట్లయితే (అతడిపై భరోసా చేసినట్లయితే), అతడు వంచకుడిగా, మోసగాడిగా తేలుతాడు. (మీరు దేనినైనా అతడి దగ్గర ఉంచినట్లయితే, దానిని తిరిగి వాపసు ఇవ్వడు).

    4) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఇంకో హదీథ్ లో- ఘర్షణ పడినప్పుడల్లా (పోట్లాటకు దిగినప్పుడు) అతడు తెలివి లేని వాడిగా, అవివేకిగా, దుష్టుడిగా, చెడ్డవాడిగా, ఇతరులకు అవమానం, పరాభవం కలిగించే విధంగా ప్రవర్తిస్తాడు.

    5) అతడు ఒప్పందం చేసినట్లయితే, స్వయంగా అతడు తనకు తానే విశ్వాసఘాతకుడిగా నిరూపించుకుంటాడు.