×
,,సృష్టికర్త సర్వమానవాళికోసం పంపిన అంతిమ సందేశమైన దివ్యఖుర్ఆన్ యొక్క ప్రాధాన్యత, ప్రతి ఒక్కరూ దానిని చదివి, అర్థం చేసుకుని, దానిపై ఆలోచించవలసిన అవసరం గురించి ఈ వ్యాసం తెలుపుతున్నది.

    ఓ మానవుడా!

    అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో

    మానవజాతి కోసం సృష్టికర్త పంపిన అంతిమ సందేశం

    ((((((((((((((((((((((((((((((((((((((((((((((((( () )))))))))))))))))))))))))))))))))))))))))))))))

    ఓ మానవులారా! సృష్టకర్త మీ కోసం దివ్యఖుర్ఆన్ రూపంలో పంపిన ఋజుమార్గపు మార్గదర్శకత్వాన్ని ఎప్పుడైనా పరిశీలించారా?

    రండి, ఖుర్ఆన్ తెచ్చిన దివ్యసందేశం ద్వారా పరలోకపు భయంకర నరకశిక్ష నుండి కాపాడు కోవటానికి ప్రయత్నిద్దాం.

    ఓ మానవులారా! ‘ఇస్లాం శాంతిని బోధిస్తుంది, శాంతి వైపునకు పిలుస్తుంది’ అని అన్నట్లయితే ‘ఇతర మతాలు కూడా శాంతినే బోధిస్తున్నాయి కదా!’ అంటారు. ఇదే వాస్తవమైతే ప్రపంచంలో జరిగుతున్న అశాంతి, హింస, అరాచకాలు, హత్యాచారాలు, దోపిడీలకు కారణం ఏమిటి? ఎటువంటి పక్షపాతం లేకుండా నిజాయితీగా ఆలోచించితే, వాటికి అసలు కారణాలు ‘ధనం, సంతానం, కీర్తిప్రతిష్ఠలు, స్త్రీ, పురుషుడు.....అందులో మరీ ముఖ్యమైనది ధర్మం’ అనే పచ్చినిజాన్ని కనిపెట్టగలరు.

    అన్ని మతాలు ‘సర్వలోకాలకు సృష్టికర్త అయిన దైవం ఒక్కడే’ అని ఎలుగెత్తి చాటుతున్నప్పుడు, ప్రపంచ అశాంతికి ముఖ్యకారణం ధర్మం ఎలా అవుతుంది? అనే సందేహం మనసులోనికి రావచ్చు. కాని ఇది ముమ్మాటికీ నిజం. అనేక మతాల ప్రకటనలకు మరియు వారి ఆచరణలకు మధ్య, భూమ్యాకాశాల నడుమ ఉన్నంత తేడా ఉన్నది. కొన్ని అపోహల వలన, అజ్ఞానం వలన ఆచరణలో వారు ఎందరినో దైవాలుగా భావించి పూజలు, పురస్కారాలు చేస్తున్నారు.

    వాస్తవానికి సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ ప్రతి ప్రాంతంలో, ప్రతి కాలంలో ఒక ఉత్తమమైన మానవుడిని తన దూతగా ఎన్నుకుని, అతడి ద్వారా ప్రజలకు మార్గదర్శకత్వాన్ని పంపియున్నాడు. ఇంకా ఆ ప్రవక్తల ద్వారా ‘మీ ఆరాధ్యదైవం ఒక్కడే’ అనే దివ్యసందేశాన్నిచ్చి అక్కడి ప్రజలను శాంతిమార్గం వైపునకు పిలవమని ఆదేశించాడు. అయితే అక్కడి ప్రజలు కొంత కాలం వరకు ఆ యా ప్రవక్తల సందేశాన్ని ఆచరిస్తూ, వారి మరణానంతరం ఆ దివ్య బోధనల్ని వదిలి, తమ తమ ఇష్టానుసారం ఆ సందేశహరులనే లేదా ఆ కాలంలోని కొంతమంది పుణ్య పురుషులనే దైవాలుగా చేసుకున్నారు. ఇంకా వేర్వేరు వర్గాలుగా, మతాలుగా విడిపోయి, అశాంతితో జీవించ సాగారు. పూర్వపు దైవప్రవక్తలు, దివ్యగ్రంథాలు ‘మీ ఆరాధ్యదైవం ఒక్కడే’ అని మాటిమాటికీ బోధించిన ఆ దివ్యసందేశాల్ని మరల ఖుర్ఆన్ రూపంలో మొత్తం మానవజాతి కోసం చిట్టచివరిసారిగా సృష్టికర్త పంపినాడు. అయితే పూర్వపు దివ్యసందేశాలు కాలగర్భంలో కలిసిపోయినట్లు మరల తిరిగి జరగకుండా, ఈ అంతిమ దివ్యసందేశాన్ని (ఖుర్ఆన్) ను సృష్టికర్త స్వయంగా తన సంరక్షణలో తీసుకున్నాడు. ఖుర్ఆన్ లో అనేక సార్లు చేయబడిన స్పష్టమైన ప్రకటన మరియు అవతరించిన నాటి నుండి నేటి వరకు అంటే దాదాపుగా 14 శతాబ్దాల సుదీర్ఘ సమయంలో ఎటువంటి మార్పులకు, చేర్పులకు గురికాకుండా అసలైన రూపంలో, అవతరించిన భాషలో, అందరికీ అందుబాటులో ఉండటం కంటే ఇంకేమి ఋజువులు కావాలి? మరి అటువంటి మహాద్భుతమైన దివ్యఖుర్ఆన్ సందేశాన్ని మనం నిజాయితీగా ఎందుకు పరిశీలించకూడదు? ఇంకా, కేవలం సర్వలోకసృష్టికర్తనే ఆరాధ్యుడిగా ఆరాధించటానకి ఏ అజ్ఞానం అడ్డుపడుతున్నది? హృదయాంతరాలలోని భావాలను సైతం పసిగట్టశక్తిగల ఆ ఏకైక ఆరాధ్యుడి భయభక్తుల వలన, అశాంతి, హింస, అరాచకాలు, హత్యాచారాలు, దోపిడీలు నశించి ప్రపంచంలో శాంతి స్థాపించబడకుండా ఉంటుందా?

    ఓ మాష్టారూ!........బాబూ!.........హలో...... ఇలాంటి పిలుపు వినగానే పిలిచేది అపరిచితమైన గొంతైనా సరే, ఒక్కక్షణం ఆగి, పిలుపు వచ్చిన దిశగా, ఎవరు పిలుస్తున్నారా? అని కుతూహలంగా చూస్తాము. పరిచయం లేకపోయినా, ఆ వ్యక్తి చెప్పే విషయాన్ని శ్రద్ధగా విని, ఆ తర్వాత ఏమి చేయాలో నిర్ణయించుకుంటాం. అలాగే నిండు సభలో ప్రసంగిస్తున్న మంత్రి, ఓ ప్రజలారా! అనగానే మన పంచేంద్రియాలను అదుపులోకి తెచ్చుకుని, చాలా శ్రద్ధగా ఏమి చెబుతున్నాడో వింటానికి ప్రయత్నిస్తాము. కొత్తగా టాక్సులేమైనా విధిస్తున్నాడా, ధరలేమైనా పెరగబోతున్నాయా, ఏవైనా కొత్త స్కీములు రాబోతున్నాయా, మన దైనందిన జీవితంలో లాభం చేకూర్చే విషయాలేమైనా చెబుతాడేమోనని శ్రద్ధగా వింటాము. అందరి కంటే ముందు తనే ఆ విషయాలను తెలుసుకుని లాభం పొందాలని శాయశక్తులా ప్రయత్నిస్తాము. అందుకని కళ్ళు, చెవులు అప్పగించి మరీ ఏకాగ్రతతో ప్రసంగాన్ని వింటాము.

    ఇంకా మనలో చాలా మంది ఉదయం లేవగానే మొట్టమొదట తాజావార్తలను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. ‘వాటిలో ఏవి లాభదాయమైనవి, ఏవి కష్టాలకు గురిచేసేవి, షేర్ మార్కెట్ స్థితి ఎలాగుంది’ మొదలైన గమనిస్తూ, దగ్గర వాళ్ళతో వాటిలోని మంచిచెడ్డల గురించి ఆ రోజంతా చర్చించుకుంటూనే ఉంటాము. వార్తల్లో తెలిపిన జాగ్రత్తలు (పవర్ కట్, నీటి సమస్యలు, ట్రాఫిక్ మళ్ళింపులు....) వెంటనే తీసుకోవటానికి ప్రయత్నిస్తాము. అంటే పిలుస్తున్న వ్యక్తికి, తాజా వార్తలకు లేదా ప్రసంగిస్తున్న లీడరుకు ప్రాధాన్యత ఇవ్వాలా వద్దా అనేది వారు పిలుస్తున్న పరిస్థితులను, వార్తలను లేదా వారి ప్రసంగ విషయాన్ని బట్టి తేల్చుకుంటాము. లేదా ప్రసంగించే వారి స్థాయిని బట్టి నిర్ణయించుకుంటాము. అంతటితో ఆగకుండా తోటివారి ద్వారా వాటిలోని సత్యాసత్యాలను తెలుసుకోవటానికి, సందేహాలను తీర్చుకోవటానికి తీవ్రప్రయత్నాలు చేస్తాము. అంతే కాని గ్రుడ్డిగా ముందడుగువేయం. అంటే ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు అది తనకు సంబంధించినదా - లేదా, లాభం కలిస్తుందా - లేదా, నష్టం కలిగిస్తుందా - లేదా అనేది ఆ విషయాన్ని విని లేక చదివి అర్థం చేసుకుని, లాభనష్టాలు, కష్టసుఖాలు బేరీజు వేసుకుని మరీ నిర్ణయం తీసుకుంటాం. ఇది దాదాపు గా ప్రతి ఒక్కరు ప్రపంచ జీవిత విషయాలలో చేస్తుంటారు. కాని, ఇదే పద్ధతిని ధార్మిక విషయాలలో ఎంత వరకు వర్తింపజేస్తున్నారు? ఓ మానవుడా అని స్వష్టంగా పిలుస్తున్న దివ్యసందేశాన్ని ఎందుకు శ్రద్ధగా వినటానికి ప్రయత్నించటం లేదు? పరలోక జీవితంతో పోలిస్తే ఈ ప్రపంచ జీవితకాలం చాలా చాలా స్వల్పమైనది. మరి అటువంటి పరలోక జీవిత సాఫల్యం కోసం మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎప్పుడైనా ఆలోచించారా? ఆరాధనలకు అర్హుడైన అసలు సృష్టికర్త ఎవరో, మానవజాతి కోసం ఆయన ఆదేశాలు ఏమిటో తెలుసుకోవటానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? ప్రతి కాలంలో, ప్రతి ప్రాంతంలో ఆయన మానవజాతి కోసం అవసరమైన సందేశాలు పంపాడు. కాని మానవులు వాటిని తమ ఇష్టానుసారంగా మార్చివేయటమే లేకు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకండా కఠిన నియామాలు పెట్టి, దాచేయటమే జరిగినది. ఇక చివరిగా సృష్టికర్త తన సందేశాన్ని పంపుతూ, దాని సంరక్షణ బాధ్యతను కూడా తనే తీసుకున్నాడు. చివరి వరకు ఈ సందేశాన్ని ఎవ్వరూ మార్చలేరని, దాచలేరని స్పష్టమైన ప్రకటన చేసాడు. గత 14 శతాబ్దాల దీర్ఘకాలంలో అవతరించిన అరబీ భాషలోనే యధాతథంగా ఎటువంటి మార్పుచేర్పులకు గురికాకుండా ఉండటమే ఇందుకు సాక్ష్యం. మరి, అటువంటి దివ్యమైన చిట్టచివరి సందేశమైన ఖుర్ఆన్ లో సమస్త మానవజాతి కోసం మన సృష్టికర్త ఏమి ప్రకటించాడనేది తెలుసుకోవటానికి ప్రయత్నించక పోవడం ఎంతటి అవివేకమౌతుందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి, రండి, ముందుకు రండి! అందులోని సత్యమైన విషయాలను తెలుసుకోండి.

    ఓ మానవులారా! .....ఓ మానవులారా! .....ఓ మానవులారా! ..... అనే సృష్టికర్త పిలుపు దివ్యఖుర్ఆన్ లో అనేక చోట్ల ఉన్నది. కాని అనేక మంది ప్రజలు, ఖుర్ఆన్ కేవలం ముస్లింల దైవగ్రంథమనే అపోహలో పడి ఘోరమైన తప్పు చేస్తున్నారు. దీనికి స్వయంగా తమకు తామే బాధ్యులు తప్ప ఇంతరులెవ్వరూ బాధ్యులు కారు. ఈనాడు కేవలం చేతివ్రేళ్ళ క్లిక్ తో ప్రపంచంలో ఏ మూల ఉన్న విషయాన్నైనా, పుస్తకాన్నైనా ఇంటర్నెట్ వంటి సౌకర్యాల ద్వారా అనుకున్నదే తడవుగా వెంటనే చదవ గలుగుతున్నాం. కాబట్టి, ఖుర్ఆన్ లోని విషయాలు తనకు తెలియవు అని చెప్పి తప్పుచుకునే అవకాశం ఎంతమాత్రం లేదు. ఒకవేళ సృష్టికర్త అంతిమ సందేశం చదవకనే మరణించనట్లయితే, దానికి బాధ్యులు మరెవ్వరో కాదు, స్వయంగా తమకు తామే అందుకు బాధ్యులు. మన జీవితసాఫల్యం కోసం పూర్తి సిలబస్, భోగభాగ్యాలు- సుఖసంతోషాలు శాశ్వతంగా ఉండే స్వర్గలోకంలోకి ప్రవేశించటానకి పాటించవలసిన నియమనిబంధనలు, భయంకర పరలోక నరకశిక్ష నుండి కాపాడుకోవటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ ప్రపంచంలో శాంతిని స్థాపించటానికి, తనకు మరియు ఇతరులకు ఉపయోగపడే విధంగా జీవించటానికి అవసరమయ్యే సూచనలు - సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా చివరి దైవప్రవక్త ద్వారా ఖుర్ఆన్ రూపంలో అవతరించాయి. వాటిని చివరి ప్రవక్త ముహమ్మద్ (శల్లల్లాహు అలైహి వసల్లమ్) స్వయంగా ఆచరించి, హదీథ్ లో రూపంలో బోధించారు. మరి అటువంటి మహాద్భుతమైన, అమూల్యమైన ఈ అంతిమ దివ్యసందేశాన్ని (ఖుర్ఆన్) కనీసం ఒక్కసారైనా చదవటానికి ఎందుకు ప్రయత్నించకూడదు?

    ‘24గంటలు సరిపోవట్లేదని చెబుతూ, రాత్రిపగలు ఎంతో హడావిడి పడుతూ, ఇంకెవరూ పొందని భోగభగ్యాలను, సుఖసంతోషాలను ఇక్కడే అనుభవించేయాలని అత్యాశకు పోవటం ఎంత వరకు సమంజసం? మరమనుషుల లాగా జీవిస్తున్న ఓ సోదరులారా! ప్రశాంతంగా ఒక్క క్షణం తన స్వంతాన్ని గురించి ఆలోచించండి. ఇక్కడి జీవితానికి ఎటువంటి గ్యారంటీ లేదు. ఏ క్షణంలోనైనా మరణించ వచ్చును. సమయమైపోయినట్లయితే, ఎంతటి గొప్పవాడైనా. ధనవంతుడైనా, పండితుడైనా ఒక్క గుక్క నీరు కూడా త్రాగలేడు, ఒక్క గింజ కూడా మింగలేడు. ఈ జీవితం కంటే పరలోక జీవితం శాశ్వతమైనది’ అనే విషయం తెలిసిన తర్వాత కూడా. మరి అక్కడి జీవితానికి అవసరమయ్యే జాగ్రత్తల గురించి ఆలోచించటానకి మన బిజీలైఫులో ఎప్పుడు ప్రయత్నిస్తాము?’ ఈ విశ్వవ్యాప్త సంక్లిష్ట సమస్యకు పరిష్కారంగా చిట్టచివరి దైవగ్రంథమైన ఖుర్ఆన్ సమస్త మానవజాతిని (వారే మతం అనుసరిస్తున్నా సరే) సంబోధిస్తూ, సత్యమార్గ సూచనలను అంటే ఏక దైవారాధన వైపుకు పిలుస్తూ, మానవ జీవిత లక్ష్యాన్ని స్పష్టంగా విశదీకరిస్తూ, ఒకటిగా చేసే సర్వమానవశాంతి సందేశాన్ని ఇస్తున్నది. మర మనకోసం అవతింపబడిన సందేశం ఏమి చెబుతున్నదనే విషయాన్ని కనీసం ఒక్కసారైనా గమనించటానికి ప్రయత్నిద్దాం. దివ్యఖుర్ఆన్ లో మానవజాతిని ఉద్ధేశిస్తూ వెలువడిన కొన్ని సందేశాలు క్రింద ఇవ్వబడినవి.

    01) పవిత్ర ఖుర్ఆన్ అవతరించిన నెల రమదాన్ నెల. మానవులందరికీ మార్గదర్శకత్వం, ఋజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరు పరచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. (ఖుర్ఆన్ 2:185)

    02) సర్వ మానవులకు ఇదొక సందేశం. వారిని (మానవులను) హెచ్చరించాలనీ, యదార్ధంగా మీ ఆరాధ్య దైవం కేవలం ఒక్కడే అని వారు తెలుసుకోవాలనీ, జ్ఞానం ఉన్నవారు గ్రహించాలనీ ఇది (ఖుర్ఆన్) పంపబడినది. (ఖుర్ఆన్ 14:52)

    03) మానవులారా! మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్ముల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను అవనిలో వ్యాపింపజేశాడు. ఏ దైవం పేరు చెప్పుకుని మీరు పరస్పరం మీ మీ హక్కులను కోరుకుంటారో, ఆ దైవానికి భయపడండి. బంధుత్వ సంబంధాలను తెంచటం మానుకోండి. అల్లాహ్ (దైవం) మిమ్ముల్ని పరికిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోండి. (ఖుర్ఆన్ 4:1)

    04) ప్రారంభంలో సర్వమానవులూ ఒకే సంఘంగా ఉండేవారు. తరువాత వారు విభిన్న విశ్వాసాలను, ఆచారాలను సృష్టించుకున్నారు. నీ ప్రభువు తరపు నుండి ముందుగానే ఒక విషయం నిర్ణయించబడకుండా ఉన్నట్లయితే వారు పరస్పరం విభేదించుకుంటున్నటు వంటి విషయాన్ని గురించి ఎప్పుడో తీర్పు ఇవ్వబడి ఉండేది. (ఖుర్ఆన్ 10:19)

    05) (చివరి)ప్రవక్తా! మేము నీకు పూర్వం కూడా ప్రవక్తలను పంపినప్పుడల్లా మానవులనే ప్రవక్తలుగా పంపాము. వారి వైపునకు మేము మా సందేశాలను దైవ వాక్యాల ద్వారా పంపుతూ ఉండేవారము. మీకు (ప్రజలకు) తెలియకపోతే జ్ఞాపిక (దివ్యగ్రంథం) కలవారిని అడగండి. పూర్వపు ప్రవక్తలను కూడా మేము స్పష్టమైన నిదర్శనాలతోనూ, గ్రంథాలతోనూ, పంపి ఉన్నాము. ఇప్పుడు ఈ జ్ఞాపిక(ఖుర్ఆన్) ను నీపై అవతరింపజేశాము. నీవు ప్రజల ముందు వారి కోసం అవతరింపజేయబడిన సందేశాన్ని స్పష్టంగా వివరించటానికి, ప్రజలు కూడా ఆలోచించటానికి. (ఖుర్ఆన్ 16:43-44)

    06) మేము మా సందేశాన్ని అందజేసే నిమిత్తం ప్రవక్తను పంపినప్పుడల్లా, అతడు తన జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే మా సందేశాన్ని అందజేశాడు, వారికి అతడు విషయాన్ని చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పటానికి. (ఖుర్ఆన్ 14:4)

    07) మేము మా ప్రవక్తలను స్పష్టమైన సూచనలతో, హితోపదేశాలతో పంపాము. వారితో పాటు గ్రంథాన్నీ, త్రాసునూ అవతరింపజేసాము, ప్రజలు న్యాయంపై స్థిరంగా నిలబడాలని ఇనుమునూ దింపాము. అందులో మహత్తరమైన శక్తి ఉన్నది. ప్రజలకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా ఎందుకు చెయ్యబడినదంటే, ఆయనను(సృష్టకర్తను) చూడకుండానే ఎవడు ఆయనకూ, ఆయన ప్రవక్తలకూ సహాయపడతాడో అల్లాహ్ కు తెలియాలని, నిశ్చయంగా అల్లాహ్ (దైవం) ఎంతో దృఢమైన వాడు, శక్తిమంతుడూను. (ఖుర్ఆన్ 57:25)

    08) నీకు (అంతిమ ప్రవక్త ముహమ్మద్ (శల్లల్లాహు అలైహి వసల్లమ్ కు) పూర్వం కూడా మేము చాలామంది ప్రవక్తలను పంపాము. మేము వారిని ఆలుబిడ్డలు కలవారుగానే చేశాము. అల్లాహ్ అనుమతి లేకుండా ఏ సూచననూ స్వయంగా తెచ్చి చూపే శక్తి ఏ ప్రవక్తకూ లేదు. ప్రతియుగానికీ ఒక గ్రంథం ఉన్నది. అల్లాహ్ తాను రద్దు చేయదలచుకున్న దానిని రద్దు చేస్తాడు. తాను ఉంచదలచుకున్న దానిని స్థిరంగా ఉంచుతాడు. అసలు (మూల) గ్రంథం ఆయన దగ్గరే ఉన్నది. (ఖుర్ఆన్ 13:38-30)

    09) అల్లాహ్ తోడూ (తెలుపబోయే ఆదేశపు ప్రాధాన్యతను సూచించటానికి కొన్నిచోట్ల ఇలా తనపైనే స్వయంగా శపధం చేసుకోవటం జరిగినది), (చివరి) ప్రవక్తా! నీకు పూర్వం కూడా ఎన్నో జాతుల వద్దకు మేము ప్రవక్తలను పంపియున్నాము. షైతాన్ చెడ్డపనులను వారికి మనోహరమైనవిగా చేసి చూపాడు. ఆ షైతానే ఈనాడు వీరికి కూడా సంరక్షకుడై కూర్చున్నాడు. వీరు వేదనాభరితమైన (నరక) శిక్షకు అర్హులవుతున్నారు. మేము ఈ (ఖుర్ఆన్) గ్రంథాన్ని నీపా ఎందుకు అవతరింపజేశామంటే, వారు గురి అయిన విభేదాల యదార్ధాన్ని నీవు వారికి స్పష్టం చెయ్యాలని. ఈ గ్రంథం తనను (అల్లాహ్)ను విశ్వసించే వారికోసం మార్గదర్శకత్వం గానూ, కారుణ్యంగానూ అవతరించింది. (ఖుర్ఆన్ 16:63-64)

    10) మేము అవతరింపజేసిన (ఖుర్ఆన్) స్పష్టమైన జ్ఞాన బోధనలుస ధర్మోపదేశాలు వాస్తవానికి మావవులందరి మార్గదర్శకత్వం కోసం అని మేము మా గ్రంథంలో విశదం చేసిన తర్వాత కూడా వాటిని దాచే వారిని సృష్టికర్త (అల్లాహ్) తప్పకుండా శపిస్తాడు. ఇంకా శపించే వారంతా వారిని శపిస్తారు. (ఖుర్ఆన్ 2:159)

    11) ప్రవక్తా! ఆయన ఈ (ఖుర్ఆన్) గ్రంథాన్ని నీపై అవతరింపజేశాడు. అది సత్యాన్ని తీసుకువచ్చింది. మునుపు అవతరించిన గ్రంధాలను ధృవపరుస్తుంది. దీనికి పూర్వం మానవులకు ఋజుమార్గం చూపటానికి తౌరాతు, ఇన్.జీల్ గ్రంధాలను అవతరింపజేశాడు. (ఖుర్ఆన్ 8:3)

    12) మానవులారా! మీ ప్రభువు తరుపు నుండి మీ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చినది. మేము మీ వద్ద మీకు స్పష్టంగా మార్గం చూపే జ్యోతిని పంపాము. ఇక అల్లాహ్ (దైవం) మాటను ఆలకించేవారిని, ఆయన శరణు వేడుకునే వారిని అల్లాహ్ తన కరుణతో, తన ఆగ్రహంతో కప్పివేస్తాడు. వారికి తన వైపుకు వచ్చే ఋజుమార్గం చూపుతాడు. (ఖుర్ఆన్ 4:174-175)

    13) మానవులారా! మీ ప్రభువు ఆగ్రహం నుండి మిమ్ముల్ని మీరు రక్షించుకోండి. ఏ తండ్రీ తన కుమారుడికి బదులుగా ముందుకు రాని, ఏ కుమారుడు తన తండ్రికి బదులుగా నిలబడని ఆ (ప్రళయం) రోజుకు భయపడండి, నిస్సందేహంగా అల్లాహ్ (దైవ) వాగ్దానం సత్యం. కనుక ఈ ఐహిక జీవితం మిమ్ముల్ని మోసానికి గురి చేయకూడదు. వంచకులు మిమ్నుల్ని అల్లాహ్ విషయంలో వంచనకు గురిచేయకూడదు. (ఖుర్ఆన్ 31:33)

    14) మానవులారా! అల్లాహ్ (దైవం) మీకు చేసిన ఉపకారాలను జ్ఞాపకం ఉంచుకోండి. అల్లాహ్ కాక, భూమ్యాకాశాల నుండి మీకు ఉపాధినిచ్చే మరొక సృష్టికర్త కూడా ఎవడైనా ఉన్నాడా? ఆయన తప్ప మరొక ఆరాధ్యుడెవ్వడూ లేడు. అసలు మీరు ఎవరి వల్ల మోసపోతున్నారు? ఇప్పుడు ఒకవేళ (అంతిమ ప్రవక్తా!) వారు నిన్ను తిరస్కరిస్తున్నారు అంటే నీకు పూర్వం కూడా చాలామంది దైవప్రవక్తలు తిరస్కరింపబడ్డారు. వ్యవహారాలన్నీ చివరకు అల్లాహ్ వైపునకే మరలనున్నాయి. (ఖుర్ఆన్ 35:3-4)

    15) ప్రవక్తా! వారితో ఇలా అను, “నేను ఈ ధర్మప్రచారానికి మీ నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని కోరను, నేను వంచకులలోని వాడను కాను. ఇది ఒక హితబోధ, విశ్వ ప్రజలందరికినీ, అచిరకాలంలోనే మీకు స్వయంగా దీని పరిస్థితి ఏమిటో తెలిసిపోతుంది.” (ఖుర్ఆన్ 38: 86-88)

    16) ప్రవక్తా! మేము నిన్ను ప్రపంచ మానవులకు కారుణ్యంగా పంపాము. వారితో ఇలా అను “నా వద్ద వచ్చే దైవవాక్యాలు ఏమిటంటే, మీ దైవం కేవలం ఒక్కడే. ఇకనైనా మీరు విశ్వసించారా?” (ఖుర్ఆన్ 21:107)

    17) “సృష్టిని మొదటిసారిగా చేసినవాడు ఎవడు? దానిని పున:సృష్టించేవాడు ఎవడు? అల్లాహ్ తో పాటు మరొక దైవం ఎవడైనా ఉన్నాడా? మీరు సత్యవంతులే అయితే మీ ఆధారాన్ని తీసుకురండి” అని అడగు. (ఖుర్ఆన్ 27:64)

    18) బాగా తెలుసుకోండి. ఈ లౌకిక జీవితం ఒక ఆట. ఒక వినోదం, బాహ్య పటాటోపం, పరస్పరం ప్రగల్భాలు పలకటం, సంపద, సంతానాల విషయంలో ఒకరిపై ఒకరు ఆధిక్యం పొందటానికి ప్రయత్నించటం తప్ప మరేమీ కాదు. (ఖుర్ఆన్ 57:20)

    19) ఎప్పుడైనా మీరు కళ్ళు తెరచి చూశారా, మీరు త్రాగే ఈ నీటిని మేఘాల నుండి మీరు కురిపించారా లేక దానిని కురిపించేవారము మేమా? మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పగా ఉండేలా చేయగలము. అలాంటప్పుడు మీరు కృతజ్ఞులై ఎందుకు ఉండరు? (ఖుర్ఆన్ 56: 68 – 70)

    20) మీ కొరకు భూమిని నివాస స్థలంగా చేసినవాడూ, పైన ఆకాశాన్ని కప్పుగా నిర్మించినవాడూ, మీ రూపాన్ని తీర్చిదిద్దినవాడు, దానిని ఎంతో చక్కగా మలచినవాడూ, మీకు పరిశుభ్రమైన పదార్ధాలను ఆహారంగా ఇచ్చినవాడూ అల్లాహ్ యే కదా! ఆ అల్లాహ్ యే మీ ప్రభువు. ఆ విశ్వప్రభువు అసంఖ్యాకమైన శుభాలు కలవాడు, ఆయనే సజీవుడు, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. ఆయననే మీరు వేడుకోండి. మీ ధర్మాన్ని ఆయనకే ప్రత్యేకం చేయండి. సకల ప్రశంసలూ సర్వలోకాలకూ ప్రభువైన అల్లాహ్ కే చెందుతాయి. (ఖుర్ఆన్ 40:64-65)

    21) మేము భూమిని పాన్పుగా చేశాము, అందులో పర్వతాలను మేకులుగా పాతాము, మిమ్ముల్ని (స్త్రీ - పురుషుల్ని) జంటలుగా సృష్టంచాము, మీకు నిద్ర ద్వారా సుఖం కలుగజేశాము, రేయిని తెరగా, పగటిని ఉపాధి సమయంగా చేశాము, మీపైన దృఢమైన ఏడు ఆకాశాలను నిర్మించాము, దేదీప్యమానంగా వెలిగే వెచ్చని దీపాన్ని సృష్టంచాము. ధాన్యం, కూరగాయలు పండేందుకు, దట్టమైన తోటలు పెరిగేందుకు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాము, ఇదంతా వాస్తవం కాదా? (ఖుర్ఆన్ 78:6-16)

    22) మేము త్వరలోనే వారికి మా సూచనలను వారి చుట్టూ ఉన్న ప్రపంచంలోనూ చూపిస్తాము, వారిలోనూ చూపిస్తాము, చివరకు ఈ ఖుర్ఆన్ నిస్సందేహంగా సత్యమైనదని వారికి విశదమైపోతుంది. నీ ప్రభువు ప్రతిదానికి సాక్షి అనే విషయం సరిపోదా? తెలుసుకో! వారు తమ ప్రభువును కలుసుకునే విషయం పట్ల సందేహం కలిగి ఉన్నారు. విను, ఆయన ప్రతి వస్తువునూ పరివేష్టించి ఉన్నాడు. (ఖుర్ఆన్ 41:53-54)

    23) మానవులారా! మిమ్ముల్ని, మీకు పూర్వం వారినీ సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. దీని ద్వారానే మిమ్ముల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. మీ కొరకు భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ, సృష్టించినవాడూ, పై నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసి మీకు ఉపాధి కల్పించిన వాడూ ఆయనే (అల్లాహ్ యే), ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులను అల్లాహ్ కు సమానులుగా నిలబెట్టకండి. (ఖుర్ఆన్ 2:21-22)

    24) మానవులారా! నిశ్చయంగా అల్లాహ్ వాగ్ధానం సత్యమైనది. కనుక ప్రాపంచిక జీవితం మిమ్ముల్ని మోసానికి గురిచేయకూడదు. ఆ మహావంచకుడు (షైతాన్) కూడా మిమ్ముల్లి అల్లాహ్ విషయంలో మోసగించగలగ కూడదు. (ఖుర్ఆన్ 10:9-10)

    25) ఇదీ యదార్థం, విశ్వసించి, మంచి పనులు చేస్తూ ఉండిన వారిని వారి ప్రభువు వారి విశ్వాసం కారణంగా సరియైన మార్గంపై నడుపుతాడు. భోగభాగ్యాలతో నిండి ఉన్న స్వర్గవనాలలో వారి క్రింద కాలువలు ప్రవహిస్తాయి. అక్కడ వారు “ఓ అల్లాహ్! నీవు పవిత్రుడవు” అని స్తుతిస్తారు, “శాంతి కలుగుగాక” అని ప్రార్థిస్తారు. వారి ప్రతిమాటకు ముగింపు ఇలా ఉంటుంది. ప్రశంసలన్నీ సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే. (ఖుర్ఆన్ 10:9-10)

    26) చూడండి! మీ వద్దకు మీ ప్రభువు తరపు నుండి వివేచనా కాంతులు వచ్చేశాయి. కనుక ఇక దృష్టిని వినియోగించుకునే వ్యక్తి తనకు తానే మేలు చేసుకుంటాడు. మరి గ్రుడ్డిగా వ్యవహరించే వ్యక్తి తనే నష్టపోతాడు. నేను మాత్రం మీకు కాపలావాణ్ణి కాను. (ఖుర్ఆన్ 6:104)