×
విశ్వాన్ని ఎవరు సృష్టించారు? నన్ను ఎవరు సృష్టించారు? మరియు ఎందుకు?

విశ్వాన్ని ఎవరు సృష్టించారు? నన్ను ఎవరు సృష్టించారు? మరియు ఎందుకు?

ఏమిటి నేను సరైన మార్గంలో ఉన్నానా?

ఆకాశములను, భూమిని మరియు అందులో లెక్కలేనన్ని గొప్ప జీవరాసులను ఎవరు సృష్టించారు?

భూమ్యాకాశాల ఈ ఖచ్చితమైన, దృడమైన వ్యవస్థను ఎవరు స్థాపించారు?

మనిషిని ఎవరు పుట్టించారు? మరియు అతనికి వినికిడి చూసే శక్తిని, తెలివిని మరియు విచక్షణను ఇచ్చి, జ్ఞానాన్ని మరియు వాస్తవాలను అర్థం చేసుకోగలిగేలా చేసింది ఎవరు?

మీ శరీర భాగాలలో ఈ సంక్లిష్టమైన వ్యవస్థను సృష్టించి, మీకు ఇంత అందమైన ఆకృతిని ఎవరు ప్రసాదించారు?

విశ్వంలోని వివిధ మరియు వైవిధ్యభరితమైన జీవులను పరిగణించండి (వివరించండి) మరియు వాటిని అపరిమిత అంశాలలో ఎవరు సృష్టించారు?

ఈ గొప్ప విశ్వం కాలక్రమేణా దాని చట్టాలతో ఎలా వ్యవస్థీకృతంగా మరియు స్థిరంగా ఉంది?

ఈ ప్రపంచాన్ని నీయంత్రించేవాడు (ఉదా: జీవితం మరియు మరణం, జీవుల పునరుత్పత్తి, పగలు మరియు రాత్రి, రుతువుల మార్పు మొదలైన) వ్యవస్థలను సృష్టించింది ఎవరు?

ఈ విశ్వం తానంతట తాను సృష్టించుకుందా? లేక శూన్యం నుండి ఉనికిలోకి వచ్చిందా? లేక ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందా? సర్వోన్నతుడు మరియు గొప్పవాడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :﴿أَمْ خُلِقُوا مِنْ غَيْرِ شَيْءٍ أَمْ هُمُ الْخَالِقُونَ (٣٥) (వారు ఏ (సృష్టికర్త) లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా?أَمْ خَلَقُوا السَّمَاوَاتِ وَالْأَرْضَ بَلْ لَا يُوقِنُونَ﴾ లేక వారు ఆకాశాలను మరియు భూమిని సృష్టించారా? అలా కాదు, అసలు వారికి విశ్వాసం లేదు.)[అల్ తూర్ : 35-36]

మనల్ని మనం సృష్టించుకోకపోతే మరియు మనం శూన్యం నుండి లేదా అకస్మాత్తుగా ఉనికిలోకి రావడం అసాధ్యం అయితే, ఈ ప్రపంచానికి గొప్ప మరియు శక్తివంతమైన సృష్టికర్త ఉన్నారనేది నిజం. ఈ విశ్వం తనని తాను ఉనికిలోకి తీసుకురావడం లేదా అస్తిత్వం నుండి ఉనికిలోకి రావడం లేదా అకస్మాత్తుగా ఉనికిలోకి రావడం అసాధ్యం.

మనిషి తాను చూడలేని విషయాలను, వాటి ఉనికిని ఎందుకు నమ్ముతున్నాడు? (ఉదా: వివేచనా శక్తి, తెలివి, ఆత్మ, భావోద్వేగాలు మరియు ప్రేమ) వీటి ప్రభావాలను చూడడం వల్ల కాదా? కాబట్టి మనిషి ఈ అద్భుతమైన విశ్వం యొక్క సృష్టికర్త ఉనికిని, ఆయన సృష్టించిన జీవులను, ఆయన కార్య నిర్వహణను మరియు ఆయన దయ యొక్క ప్రభావాలను చూసినప్పటికి ఎలా తిరస్కరించగలడు?!

ఎవరూ నిర్మించకుండా ఇల్లు ఉనికిలోకి వచ్చిందని లేదా ఇల్లు శూన్యం నుండి వచ్చిందని చెప్పడాన్ని హేతుబద్ధమైన వ్యక్తి అంగీకరించడు. కాబట్టి ఈ గొప్ప విశ్వం సృష్టికర్త లేకుండానే ఉనికిలోకి వచ్చిందని వాదించేవారిని కొందరు ఎలా నమ్ముతారు? విశ్వం యొక్క ఖచ్చితమైన క్రమం అకస్మాత్తుగా ఉనికిలోకి వచ్చింది అని చెప్పడాన్ని హేతుబద్ధమైన వ్యక్తి ఎలా అంగీకరించగలడు?

ఈ విషయాలన్నీ ఈ ప్రపంచానికి గొప్ప సర్వశక్తిమంతుడైన సృష్టికర్త ఉన్నాడని, దానిని నడుపుతున్నాడని,ఆయన ఒక్కడే ఆరాధనకు అర్హుడు అనే నిర్ధారణకు దారి తీస్తాయి. ఆయన కాకుండా ఆరాధించబడే వాటి ఆరాధన సరైనది కాదు. ఎందుకంటే ఆయన తప్ప ఆరాధనకు అర్హుడు ఎవరూ లేరు.

ప్రభువు గొప్ప సృష్టికర్త

సృష్టికర్త ప్రభువు ఒక్కడే, ఆయనే యజమాని, నిర్వాహకుడు, ఆహార ప్రదాత, జీవాన్ని ఇచ్చేవాడు మరియు మరణాన్ని కలిగించేవాడు. ఆయనే భూమిని సృష్టించాడు మరియు దానిని తన జీవులకు తగినట్లుగా చేసాడు.ఆయనే ఆకాశాన్ని మరియు అందులో ఉన్న వాటిని సృష్టించాడు సూర్యుడు, చంద్రుడు, రాత్రి మరియు పగలు యొక్క ఖచ్చితమైన క్రమాన్ని స్థాపించాడు, ఇది అతని గొప్పతనాన్ని సూచిస్తుంది.

మరియు ఆయనే మనకు గాలిని లోబరచాడు, అది లేకుండా మనం జీవించలేము. ఆయన మన కోసం వర్షాన్ని కురిపిస్తాడు, మన కోసం సముద్రాలను మరియు నదులను లోబడేలా చేశాడు మరియు మన శక్తి లేకుండా మన తల్లి గర్భాలలో పిండాలుగా ఉన్నప్పుడు మనలను పోషించి, కాపాడినవాడు.మరియు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు మన సిరల్లో రక్తాన్ని ప్రసరించేవాడు.

ఈ ప్రభువు సృష్టికర్త మరియు ఆహార ప్రధాత అయిన అల్లాహ్ మహిమాన్వితమైన వాడు మరియు గొప్పవాడు

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:﴿إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَى عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ﴾ (నిశ్చయంగా, మీ ప్రభువైన అల్లాహ్ యే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో సృష్టించాడు. ఆ పిదప తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు. ఆయన రాత్రిని పగటి వెంట ఎడతెగకుండా అనుసరింపజేసి, దానిపై (పగటిపై) కప్పుతూ ఉంటాడు. మరియు సూర్యచంద్ర, నక్షత్రాలు ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. నిశ్చయంగా, సర్వసృష్టి ఆయనదే! మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే. అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వ లోకాలకు పోషకుడు!)[అల్ ఆరాఫ్ : 54]

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ విశ్వంలో మనం చూసే వాటికి మరియు మనం చూడని వాటికి ప్రతిదానికీ ప్రభువు మరియు సృష్టికర్త. ఆయన తప్ప ప్రతిదీ అతని సృష్టితాల్లోంచి ఒక సృష్టి. భాగస్వాములు లేదా సహచరులు లేకుండా ఆయన మాత్రమే ఆరాధనకు అర్హుడు. అతని ఆధిపత్యం, సృష్టి, నిర్వహణలో లేదా ఆరాధనలో అతనికి భాగస్వామి లేడు.

ప్రభువైన అల్లాహ్ తో పాటు ఇతర దేవుళ్లు కూడా ఉన్నారని, ఊహించినట్లయితే, అప్పుడు విశ్వ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. ఇద్దరు దేవతలు ఏకకాలంలో విశ్వం యొక్క వ్యవహారాలను నిర్వహించడం సరికాదు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :{لَوْ كَانَ فِيهِمَا آلِهَةٌ إِلَّا اللَّهُ لَفَسَدَتَا} {ఒకవేళ (రెండింటిలో) అందులో అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యు డు ఉన్నట్లైతే అవి సర్వనాశనమైపోయేవి.}[అల్ అంబియా : 22]

సృష్టికర్త అయిన ప్రభువు యొక్క గుణాలు

ప్రభువు, మహిమాన్వితుడు, లెక్కలేనన్ని అందమైన పేర్లను మరియు ఆయన పరిపూర్ణతను సూచించే అనేక గొప్ప లక్షణాలను కలిగి ఉన్నాడు. ఆయన పేర్లలో ఖాలిక్ (సృష్టికర్త )మరియు "అల్లాహ్" ఉన్నాయి, అంటే ఆరాధనకు అర్హుడు, భాగస్వాములు లేకుండా ఒంటరిగా ఉంటాడు. ఆయన నిత్యజీవుడు, సర్వ-సుస్థిరమైనవాడు, అత్యంత దయగలవాడు, ప్రధాత, మరియు అత్యంత ఉదారుడు.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :﴿اللَّهُ لا إِلَهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ لا تَأْخُذُهُ سِنَةٌ وَلا نَوْمٌ لَهُ مَا فِي السَّمَوَاتِ وَمَا فِي الأَرْضِ مَنْ ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلَّا بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلا يُحِيطُونَ بِشَيْءٍ مِنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ وَسِعَ كُرْسِيُّهُ السَّمَوَاتِ وَالأَرْضَ وَلا يَئُودُهُ حِفْظُهُمَا وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ﴾ {అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు. ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో - ఆయన అనుజ్ఞ లేకుండా - సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందున్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్ఠించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు మరియు ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు}.[సూరతుల్ బఖరా : 255]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:-﴿قُلْ هُوَ اللَّهُ أَحَدٌ (١) {ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.اللَّهُ الصَّمَدُ (٢) అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు.لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ (٣) ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ﴾ మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు.}[అల్ ఇఖ్లాస్:1-4]

ఆరాధించబడే ప్రభువు పరిపూర్ణత యొక్క లక్షణాలను కలిగి ఉంటాడు

ఆయన గుణాలలో ఒకటి ఆయన ఆరాధించదగినవాడు మరియు గౌరవనీయుడు, అయితే ఆయనతో పాటు, ప్రతి సృష్టి బాధ్యత యొక్క భారాన్ని కలిగి ఉంటుంది, ఆదేశించబడి మరియు అధీనంలో ఉంటుంది.

ఆయన గుణాలలోఒకటి నిత్యజీవుడు, స్థిరంగా ఉండేవాడు. ఉనికిలో ఉన్న ప్రతి జీవికి జీవం పోసినవాడు, శూన్యం నుండి వాటిని సృష్టించినవాడు. అతను అన్ని జీవులను ఆదుకుంటాడు మరియు ఉపాధిని అందజేస్తాడు మరియు వాటి ఉనికి, నిబంధనలు మరియు వాటి రక్షణను నిర్వహించేది ఆయనే. ప్రభువు సజీవుడు, మరణం లేనివాడు, నశించడం ఆయనకు అసాధ్యం. అతను ఎప్పుడూ నిద్రపోని సర్వస్వభావి. కునుకు గాని, నిద్రగాని ఆయనకు పట్టదు.

అతని గుణాలలో ఒకటి ఏమిటంటే, ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు భూమిలో గాని మరియు ఆకాశాలలో గాని గోప్యం గా ఉన్నది ఏది లేదు.

వినడం, చూడటం ఆయన గుణాలలోనివే ఆయన ప్రతిదీ వింటాడు మరియు ప్రతి జీవిని చూస్తాడు. మనస్సులలో మెదిలే ఆలోచనలు మరియు హృదయాలలో దాగి ఉన్న విషయాలు కూడా ఆయనకు తెలుసు. ఆకాశంలో లేదా భూమిపై ఏదీ ఆయన నుండి దాగిలేదు.

ఆయన గుణాలలో ఒకటి ఆయన సర్వ శక్తిమంతుడు . ఆయనను ఎవరూ బలవంతం చేయలేరు మరియు ఆయన చిత్తాన్ని ఎవరూ ఆపలేరు. ఆయన కోరింది చేస్తాడు, మరియు ఆయన కోరింది ఆపేస్తాడు. ఆయన కోరుకున్న వారిని ముందుకు తెస్తాడు మరియు ఆయన కోరుకున్న వారిని వెనుక వదిలివేస్తాడు. అయన విస్తృత జ్ఞానం కలిగిన వాడు.

ఆయన గుణాలలో ఒకటి ఏమిటంటే, ఆయన సృష్టికర్త, సంరక్షకుడు, నిర్వాహకుడు, సృష్టిని సృష్టించి మరియు నిర్వహించేవాడు, మరియు సృష్టి ఆయన ఆదీనంలో ఉంది మరియు ఆయన అధికార నియంత్రణలో ఉంది.

భదితుల మొరలను వినడం, ఆపదలో ఉన్నవారికి ఉపశమనాన్ని అందించడం మరియు వారి దుఃఖాన్ని దూరం చేయడం ఆయన గుణాలలో ఒకటి. ఏ సృష్టి అయినా ఏదైనా సంక్షోభం చుట్టుముట్టబడి కష్టాల్లో కూరుకుపోయినప్పుడు సహాయం కొరకు ఆయనను ఆశ్రయిస్తుంది.

ఆరాధన కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందుతుంది. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు మరియు ఆయన మాత్రమే ఆరాధనకు అర్హుడు. ఆయనను తప్ప మరెవరినీ పూజించడం తగదు. ఎందుకంటే వారు అసంపూర్ణులు. వారు అందరూ చనిపోతారు మరియు నాశనం చేయబడతారు.

పవిత్రుడు మరియు గొప్పవాడు అయిన అల్లాహ్ మనకు తన గొప్పతనాన్ని గ్రహించగల మనస్సులను మరియు మంచిని ఇష్టపడే, చెడును అసహ్యించుకునే స్వభావాని ప్రసాదించాడు. సమస్త లోకాల ప్రభువు వైపు తిరిగితే ప్రశాంతతను పొందుతుంది. ఈ స్వభావం ప్రభువు యొక్క పరిపూర్ణతను మరియు లోపాల నుండి అతని స్వచ్ఛతను సూచిస్తుంది.

తెలివిగల వ్యక్తి పరిపూర్ణుడిని కాకుండా ఇతరులను ఆరాధించడం తగదు, కాబట్టి అతను తనలాంటి అసంపూర్ణ జీవిని లేదా తన కంటే తక్కువస్థాయిని ఎలా ఆరాధించగలడు!

ఆరాధించబడేవాడు మానవుడు, విగ్రహం, చెట్టు లేదా జంతువు కాలేడు.

ప్రభువు తన ఆకాశాలపై, తన సింహాసనాన్ని అధిష్టించి ఉన్నాడు మరియు తన సృష్టి నుండి వేరుగా ఉన్నాడు. ఆయనలో ఏది సృష్టించబడలేదు మరియు ఆయన సృష్టిలో ఏదీ తన స్వీయ భాగం కాదు మరియు ఏ సృష్టిలోనూ ఆయన లేడు. ఆయన ఏ సృష్టి రూపంలోనూ కనిపించడు.

సర్వశక్తిమంతుడైన ప్రభువును పోలింది ఏదీ లేదు. ఆయన అన్నీ వినేవాడు, చూసేవాడు, ఆయనకు సమానమైనవాడు లేడు. ఆయనక తన సృష్టి యొక్క అక్కర లేనివాడు; ఆయన నిద్రించడు మరియు ఆహారం తీసుకోడు. ఆయన గొప్పవాడు భార్య గాని సంతానం గాని కలిగి ఉండడు. సృష్టికర్త యొక్క గొప్ప లక్షణాలను కలిగి ఉన్నాడు మరియు ఆయన అవసరం లేదా తన లక్షణాలలో లోపం లేనివాడు.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:﴿يَا أَيُّهَا النَّاسُ ضُرِبَ مَثَلٌ فَاسْتَمِعُوا لَهُ إِنَّ الَّذِينَ تَدْعُونَ مِنْ دُونِ اللَّهِ لَنْ يَخْلُقُوا ذُبَابًا وَلَوِ اجْتَمَعُوا لَهُ وَإِنْ يَسْلُبْهُمُ الذُّبَابُ شَيْئًا لَا يَسْتَنْقِذُوهُ مِنْهُ ضَعُفَ الطَّالِبُ وَالْمَطْلُوبُ (٧٣) {ఓ మానవులారా! ఒక ఉదాహరణ ఇవ్వబడుతోంది, దానిని శ్రద్ధగా వినండి! నిశ్చయంగా, మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, వారంతా కలిసి ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. మరియు ఒకవేళ, ఆ ఈగ వారి నుండి ఏమైనా లాక్కొని పోయినా, వారు దానిని, దాని (ఆ ఈగ) నుండి విడిపించుకోనూ లేరు. ఎంత బలహీనులు, ఈ అర్థించేవారు మరియు అర్థించబడేవారు.مَا قَدَرُوا اللَّهَ حَقَّ قَدْرِهِ إِنَّ اللَّهَ لَقَوِيٌّ عَزِيزٌ﴾ అల్లాహ్ ఘనతను వారు గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. వాస్తవానికి, అల్లాహ్ మహా బలవంతుడు, సర్వ శక్తిమంతుడు.}[అల్ హజ్జ్ : 73-74 ]

ఇంత గొప్ప సృష్టికర్త మనల్ని ఎందుకు సృష్టించాడు? మరియు ఆయన మన నుండి ఏమి కోరుకుంటున్నాడు?

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు ఈ సృష్టితాలన్నింటినీ ఎటువంటి ఉద్దేశ్యం లేకుండా వ్యర్ధంగా సృష్టించడం సాధ్యమేనా?మరియు ఆయన సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు!

ఇంత ఖచ్చితంగా మరియు పరిపూర్ణంగా మనల్ని సృష్టించి, భూమ్యాకాశాలలో ఉన్న సమస్తాన్ని మన ప్రయోజనం కోసం మన ఆదీనంలో చేసిన వాడు మనల్ని ఉద్దేశ్యం లేకుండా సృష్టించాడా లేక మనం ఇలాంటి అతి ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వదిలేయడం సమంజసమేనా: మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం? మరణం తర్వాత ఏం జరుగుతుంది? మన సృష్టి యొక్క ఉద్దేశ్యం ఏమిటి?

తప్పు చేసినవాడికి శిక్ష, మంచి చేసినవాడికి ప్రతిఫలం లేకపోవడం సమంజసమేనా?

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:﴿أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ﴾ (ఏమీ? వాస్తవానికి మేము మిమ్మల్ని వృథాగానే పుట్టించామని మరియు మీరు మా వైపునకు ఎన్నడూ మరలి రారని భావించారా?)[అల్ ముమినూన్ : 115]

బదులుగా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మన ఉనికి యొక్క ఉద్దేశ్యాన్ని తెలియజేయడానికి, ఆయనను ఎలా ఆరాధించాలో మరియు ఆయన సాన్నిద్యం ఎలా పొందాలో మనకు మార్గనిర్దేశం చేయడానికి, ఆయన మన నుండి ఏమి కోరుకుంటున్నాడో మరియు మనం ఆయన ప్రసన్నత ఎలా పొందవచ్చో తెలియజేయడానికి దైవప్రవక్తలను పంపాడు. మరణం తర్వాత మన పయనం ఏమిటో మనకు తెలియజేశాడు.

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తను మాత్రమే ఆరాధనకు అర్హుడని మనకు తెలియజేసేందుకు మరియు ఆయనను ఎలా ఆరాధించాలో నేర్పడానికి, అతని ఆదేశాలను మరియు నిషేధాలను మనకు తెలియజేయడానికి మరియు మన జీవితాలను ఆహ్లాదపరిచే గొప్ప విలువలను బోధించడానికి దైవప్రవక్తలను పంపాడు. ఒకవేళ మనం వాటిని పాటిస్తే మన జీవితం శుభాలు మరియు మెళ్ళ నిండి ఉంటుంది.

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నూహ్, ఇబ్రహీం, మూసా మరియు 'ఈసా' వంటి అనేక మంది సందేశహరులను పంపాడు మరియు వారు ఆయనచే పంపబడ్డారని సాక్ష్యమిచ్చే సంకేతాలతో మరియు అద్భుతాలతో వారికి మద్దతునిచ్చాడు. వారిలో చివరివారు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం).

ఈ జీవితం ఒక పరీక్ష అని మరియు నిజమైన జీవితం మరణం తరువాత ఉంటుందని దైవ సందేశహరులు మనకు స్పష్టంగా తెలియచేసారు.

మరియు అల్లాహ్ ఒక్కడినే ఆరాధించి,ఆయనతోపాటు ఎవరినీ సాటి కల్పించకుండా దైవప్రవక్తలను విశ్వసించే విశ్వాసపరుల కొరకు అక్కడ స్వర్గం ఉన్నదని మరియు అల్లాహ్ తోపాటు వేరే దేవతలను ఆరాధించే లేదా అల్లాహ్ సందేశహరులలో నుంచి ఏ ఒక్క ప్రవక్తను తిరస్కరించినటువంటి అవిశ్వాసపరుల కొరకు అల్లాహ్ సిద్ధపరచిన నరకం అక్కడ ఉందని తెలియపరచారు

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:﴿يَا بَنِي آدَمَ إِمَّا يَأْتِيَنَّكُمْ رُسُلٌ مِنْكُمْ يَقُصُّونَ عَلَيْكُمْ آيَاتِي فَمَنِ اتَّقَى وَأَصْلَحَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ (٣٥) {ఓ ఆదమ్ సంతానమా! మీలో నుంచే మీ వద్దకు నా సూచనలను వినిపించే ప్రవక్తలు వచ్చినపుడు, ఎవరైతే దైవభీతి కలిగి వుండి తమను తాము సరిదిద్దుకుంటారో, అలాంటి వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَاسْتَكْبَرُوا عَنْهَا أُولَئِكَ أَصْحَابُ النَّارِ هُمْ فِيهَا خَالِدُونَ﴾ కాని ఎవరైతే మా సూచనలను అసత్యాలని నిరాకరించి, వాటి యెడల దరహంకారం చూపుతారో, అలాంటి వారు నరకాగ్ని వాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.}[అల్ ఆరాఫ్ : 35-36]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:﴿يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ (٢١) {ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు!الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنْزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَكُمْ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَنْدَادًا وَأَنْتُمْ تَعْلَمُونَ (٢٢) ఆయన (అల్లాహ్) యే మీ కొరకు భూమిని పరుపుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను (పంటలను) ఉత్పత్తి చేశాడు! కావున ఇది తెలుసుకొని కూడా, మీరు ఇతరులను అల్లాహ్ కు సాటిగా నిలబెట్టకండి.وَإِنْ كُنْتُمْ فِي رَيْبٍ مِمَّا نَزَّلْنَا عَلَى عَبْدِنَا فَأْتُوا بِسُورَةٍ مِنْ مِثْلِهِ وَادْعُوا شُهَدَاءَكُمْ مِنْ دُونِ اللَّهِ إِنْ كُنْتُمْ صَادِقِينَ (٢٣) మరియు మేము మా దాసుని (ముహమ్మద్) పై అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) గురించి, మీకు సందేహముంటే; దాని వంటి ఒక్క సూరహ్ నైనా మీరు (రచించి) తీసుకురండి. మరియు అల్లాహ్ తప్ప మీకు ఉన్న సహాయకులను అందరినీ పిలుచుకోండి; మీరు సత్యవంతులే అయితే (ఇది చేసి చూపండి).فَإِنْ لَمْ تَفْعَلُوا وَلَنْ تَفْعَلُوا فَاتَّقُوا النَّارَ الَّتِي وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ أُعِدَّتْ لِلْكَافِرِينَ (٢٤) కానీ, ఒకవేళ మీరు అలా చేయలేక పోతే - నిశ్చయంగా, మీరు అలా చేయలేరు - మానవులు మరియు రాళ్ళు ఇంధనమయ్యే ఆ నరకాగ్నికి భయపడండి. అది సత్యతిరస్కారుల కొరకే తయారు చేయబడింది.وَبَشِّرِ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أَنَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ كُلَّمَا رُزِقُوا مِنْهَا مِنْ ثَمَرَةٍ رِزْقًا قَالُوا هَذَا الَّذِي رُزِقْنَا مِنْ قَبْلُ وَأُتُوا بِهِ مُتَشَابِهًا وَلَهُمْ فِيهَا أَزْوَاجٌ مُطَهَّرَةٌ وَهُمْ فِيهَا خَالِدُونَ﴾ మరియు విశ్వసించి, సత్కార్యాలు చేసేవారి కొరకు నిశ్చయంగా క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ఉంటాయనే శుభవార్తను వినిపించు, ప్రతిసారి వారికి తినటానికి ఫలాలు ఒసంగబడినపుడల్లా, వారు: "ఇవి ఇంతకు ముందు మాకు ఇవ్వబడినవే!" అని అంటారు. ఎందుకంటే వారికి ఇవ్వబడేవి వాటీ పోలిక గలవే. అక్కడ వారికి నిర్మల సహవాసులు (అజ్వాజ్) ఉంటారు. మరియు వారందులో శాశ్వతంగా ఉంటారు.}[అల్ బఖర :21-25]

అనేకమంది సందేశహరులు ఎందుకు పంపబడ్డారు?

అల్లాహ్ అన్ని జాతుల వారి వద్దకు తన ప్రవక్తలను పంపించాడు. అల్లాహ్ ప్రవక్తను పంపించకుండా ఏ జాతీ లేదు. ప్రజలను వారు తమ ప్రభువు యొక్క ఆరాధన వైపు పిలవటానికి,వారికి ఆయన ఆదేశములను,వారింపులను వారి వద్దకు చేరవేయటానికి. వారి పిలుపు యొక్క లక్ష్యం అల్లాహ్ను మాత్రమే ఆరాధించడం. అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలనే ఆజ్ఞకు సంబంధించి ఒక జాతి తమ ప్రవక్త తీసుకువచ్చిన దానిని నిర్లక్ష్యం చేసినా లేదా వక్రీకరించినా, అల్లాహ్ వారి మార్గాన్ని సరిదిద్దడానికి, ఏకదైవారాధన మరియు విధేయత వైపు ప్రజలను తిరిగి తీసుకురావడానికి మరొక ప్రవక్తను పంపుతాడు.

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రవక్తల పరంపరను ముహమ్మద్ (ﷺ) తో ముగించాడు, ఆయన తీర్పు దినం వరకు సమస్త మానవాళి కొరకు సంపూర్ణ ధర్మంతో మరియు శాశ్వతమైన సార్వత్రిక షరియాతో వచ్చాడు. ఇది మునుపటి చట్టాలను పూర్తి చస్తుంది మరియు రద్దు చేస్తుంది మరియు మహోన్నతుడైన ప్రభువు తీర్పు దినం వరకు ఈ ధర్మం యొక్క సంరక్షణ మరియు కొనసాగింపుకు హామీ ఇచ్చాడు.

ప్రవక్తలందరినీ విశ్వసించేంత వరకు ఎవరూ నిజమైన విశ్వాసి కాలేరు.

అల్లాహ్ యే ప్రవక్తలను పంపినవాడు, మరియు ఆయన తన సృష్టినంతటిని వారికి కట్టుబడి ఉండాలని ఆదేశించాడు. ఎవరైన వారిలో ఏ ఒక్కరి దైవదౌత్యమును తిరస్కరించినా అందరినీ తిరస్కరించినట్లే. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ద్యోతకాన్ని తిరస్కరించడం కంటే ఘోరమైన పాపం మరొకటి లేదు, ఎందుకంటే స్వర్గంలో ప్రవేశించడానికి ప్రవక్తలందరిని విశ్వసించడం తప్పనిసరి.

కాబట్టి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తలందరిని విశ్వసించడం మరియు అంతిమదినాన్ని విశ్వసించడం ఈ కాలంలో ప్రతి ఒక్కరిపై తప్పనిసరి. ఇది అంతిమ ప్రవక్త ముహమ్మద్ (ﷺ) ను విశ్వసించడం మరియు అనుసరించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇది శాశ్వతమైన అద్భుతం దివ్య ఖురాన్ ద్వారా దీని మద్దతు వెలువడుతుంది. అల్లాహ్ ఈ భూమి మరియు దానిపై ఉన్న సమస్తం ఉన్నంత వరకు దాని పరిరక్షణకు హామీ ఇచ్చాడు.

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దివ్య ఖురాన్లో తన ప్రవక్తలలో ఎవరిపైనైనా విశ్వాసాన్ని తిరస్కరించేవాడు అల్లాహ్ ను, ఆయన దైవవాణిని తిరస్కరిస్తున్నాడని పేర్కొన్నాడు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :﴿إِنَّ الَّذِينَ يَكْفُرُونَ بِاللَّهِ وَرُسُلِهِ وَيُرِيدُونَ أَنْ يُفَرِّقُوا بَيْنَ اللَّهِ وَرُسُلِهِ وَيَقُولُونَ نُؤْمِنُ بِبَعْضٍ وَنَكْفُرُ بِبَعْضٍ وَيُرِيدُونَ أَنْ يَتَّخِذُوا بَيْنَ ذَلِكَ سَبِيلًا (١٥٠) {నిశ్చయంగా, అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించే వారూ మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం చూపగోరే వారూ (అంటే అల్లాహ్ ను విశ్వసించి, ప్రవక్తలను తిరస్కరించే వారూ) మరియు: "మేము కొందరు ప్రవక్తలను విశ్వసిస్తాము, మరి కొందరిని తిరస్కరిస్తాము." అని అనే వారూ మరియు (విశ్వాస - అవిశ్వాసాలకు) మధ్య మార్గాన్ని కల్పించ గోరేవారూ .أُولَئِكَ هُمُ الْكَافِرُونَ حَقًّا وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ عَذَابًا مُهِينًا﴾ ఇలాంటి వారే - నిస్సందేహంగా సత్యతిరస్కారులు మరియు సత్యతిరస్కారుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము.}[అన్ నిసా :150-151]

కాబట్టి, ముస్లింలమైన మేమే అల్లాహ్ ఆదేశించినట్లుగా ఆయనను, అంతిమ దినాన్ని విశ్వసిస్తాము, ప్రవక్తలందరినీ విశ్వసిస్తాము మరియు మునుపటి గ్రంథాలపై విశ్వాసం కలిగి ఉంటాము. సర్వోన్నతుడు మరియు గొప్పవాడు అయిన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :﴿آمَنَ الرَّسُولُ بِمَا أُنْزِلَ إِلَيْهِ مِنْ رَبِّهِ وَالْمُؤْمِنُونَ كُلٌّ آمَنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِنْ رُسُلِهِ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ﴾ {ఈ ప్రవక్త తన ప్రభువు తరుపు నుండి, తన పై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు మరియు (అదే విధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంధాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. వారంటారు: "మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము. మరియు మేము (ఆదేశం) విన్నాము మరియు దానిని శిరసావహించాము, నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము, ఓ మా ప్రభూ! మా గమ్యస్థానం నీ వైపుకే ఉంది.}[అల్ బఖర :285]

దివ్యఖుర్ఆన్ అంటే ఏమిటి?

దివ్యఖుర్ఆన్ అనేది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క వాక్కు మరియు ఆయన ప్రవక్తలలో చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేసిన దైవవాణీ. ఇది ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవదౌత్య సత్యాన్ని ధృవీకరించే గొప్ప అద్భుతం. దివ్యఖుర్ఆన్ తన ఆదేశాలలో సత్యాన్ని మరియు తన కథనాలలో ప్రామాణికతను కలిగి ఉంది.సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తిరస్కారులకు దాని లాంటి ఒక్క సూరా తీసుకురావాలని సవాలు చేసాడు, అయితే వారు ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో మానవ జీవితానికి సంబంధించిన ప్రతిదాన్ని కలిగి ఉన్న ఖురాన్ వచనం యొక్క గొప్పతనం మరియు సమగ్రత కారణంగా అలా చేయలేకపోయారు. మనిషి తప్పనిసరిగా విశ్వసించే విశ్వాసానికి సంబంధించిన అన్ని వాస్తవాలు ఇందులో ఉన్నాయి.ఇది ఒక వ్యక్తి తనకు మరియు తన ప్రభువుకు మధ్య, లేదా తనకు మరియు తన ఆత్మకు మధ్య, లేదా తనకు మరియు మిగిలిన సృష్టికి మధ్య అనుసరించాల్సిన ఆదేశాలు మరియు నిషేధాలను కూడా కలిగి ఉంటుంది మరియు వాక్చాతుర్యం మరియు స్పష్టత యొక్క ఉన్నతమైన శైలిలో ఇవన్నీ ప్రదర్శించబడ్డాయి.అంతేకాకుండా, ఈ పుస్తకం మానవుల రచన కాదని సూచించే అనేక హేతుబద్ధమైన ఆధారాలు మరియు శాస్త్రీయ వాస్తవాలను కలిగి ఉంది, అయితే ఇది నిజంగా మానవజాతి ప్రభువు యొక్క వాక్కు. ఆయన పరిశుద్ధుడు,మహోన్నతుడు.

ఇస్లాం అంటే ఏమిటి?

ఇస్లాం అంటే ఏకేశ్వరోపాసన ద్వారా సర్వశక్తిమంతుడైన అల్లాహ్కు లొంగిపోవడం, ఆయనకు విధేయత చూపడం, సుముఖత మరియు అంగీకారంతో ఆయన శాసనానికి అనుగుణంగా ఉండటం మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కాకుండా ఇతరుల ఆరాధనను తిరస్కరించడం.

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఒకే సందేశంతో దైవప్రవక్తలందరిని పంపాడు అది ఏమిటంటే : అల్లాహ్ను మాత్రమే ఆరాధించమని, ఆయనతో భాగస్వాములను చేయకుండా మరియు ఆయనను వదిలి ఇతరుల ఆరాధనను తిరస్కరించమని ప్రజలను పిలవడం.

ఇస్లాం అనేది ప్రవక్తలందరి మతం, కాబట్టి వారి సందేశం కూడా ఒకటే,వారి షరీఅత్ లు (చట్టాలు) భిన్నమైనవి. ప్రవక్తలందరూ ప్రబోధించిన సరైన ధర్మాన్ని నేడు ముస్లింలు మాత్రమే పాటిస్తున్నారు. ఈ యుగంలో ఇస్లాం సందేశమే నిజమైనది, ఇది సృష్టికర్త నుండి మానవాళికి చివరి సందేశం.ఇబ్రాహీం, మూసా, ఈసా అలైహిమస్సలాంలను పంపిన ప్రభువు ఆయనే, ఆయనే ప్రవక్తల పరిసమాప్తి అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పంపాడు. ఇస్లామిక్ షరియా మునుపటి చట్టాలన్నింటినీ రద్దు చేయడానికి వచ్చింది.

ఇస్లాం తప్ప నేడు ప్రజలు అనుసరించే అన్ని మతాలు మానవ నిర్మిత మతాలు, వాస్తవానికి దైవికమైనవి కావు మానవ చేతులతో వక్రీకరించబడిన మూఢనమ్మకాలు, వారసత్వంగా వచ్చిన పురాణాలు మరియు మానవ ప్రయత్నాల మిశ్రమంగా మారాయి.

ముస్లింల ధర్మం విషయానికొస్తే, ఇది ఒక స్పష్టమైన ధర్మం మార్చలేనిది. అదేవిధంగా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్కు మాత్రమే అంకితం చేయబడిన వారి ఆరాధనలు ఏకరీతిగా ఉంటాయి, వారంతా ఐదు పూటల నమాజులు చేస్తారు, జకాత్ ఇస్తారు మరియు రంజాన్ మాసంలో ఉపవాసాన్ని పాటిస్తారు. వారి శాస్త్రం అయిన దివ్య ఖురాన్ పై మీరు యోచన చేస్తే అది అన్ని దేశాలలో ఒకే విధంగా కనబడుతుంది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :﴿ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ وَأَتۡمَمۡتُ عَلَيۡكُمۡ نِعۡمَتِي وَرَضِيتُ لَكُمُ ٱلۡإِسۡلَٰمَ دِينٗاۚ فَمَنِ ٱضۡطُرَّ فِي مَخۡمَصَةٍ غَيۡرَ مُتَجَانِفٖ لِّإِثۡمٖ فَإِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٞ﴾ {ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. ఎవడయినా తీవ్రమయిన ఆకలి బాధతో అల్లాడిపోతూ గత్యంతరంలేని పరిస్థితిలో పాపానికి పాల్పడే ఉద్దేశం లేకుండా ఉండి (పై వాటిలో దేన్నయినా తిన్నట్లయితే) నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు,కనికరించేవాడు.}[సూరతుల్ మాయిదహ్ : 3]

దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :﴿قُلْ آمَنَّا بِاللَّهِ وَمَا أُنْزِلَ عَلَيْنَا وَمَا أُنْزِلَ عَلَى إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَمَا أُوتِيَ مُوسَى وَعِيسَى وَالنَّبِيُّونَ مِنْ رَبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِنْهُمْ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ (٨٤) {(ఓ ప్రవక్తా!) ఇలా అను: "మేము అల్లాహ్ ను విశ్వసించాము; మరియు మాపై అవతరింపజేయబడిన దానిని మరియు ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ లపై మరియు అతని సంతానంపై అవతరింపజేయబడిన వాటిని కూడా (విశ్వసించాము). ఇంకా మూసా, ఈసా మరియు ఇతర ప్రవక్తలపై వారి ప్రభువు తరఫు నుండి (అవతరింపజేయబడిన వాటిని) కూడా విశ్వసించాము). మేము వారి మధ్య ఎలాంటి విచక్షణ చేయము. మరియు మేము ఆయనకే విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము."}وَمَنْ يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ﴾ {మరియు ఎవడైనా ఇస్లాం తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు.}[ఆలి ఇమ్రాన్ : 84-85]

మరియు ఇస్లాం ధర్మం సంపూర్ణమైన జీవిత విధానాన్నికలిగి ఉంది. ఇది సహజసిద్ధమైనది మరియు హేతుబద్ధమైనది. దీనిని సవ్యమైన ఆత్మలు తప్పక అంగీకరిస్తాయి. దీనిని మహోన్నతుడైన సృష్టికర్త తన సృష్టికోసం నియమించాడు. మరియు ఇది ప్రజలకు ఇహపరలోకాలలో మేలు మరియు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇందులో జాతి లేదా రంగు ఆధారంగా వివక్షత లేదు. మరియు ఇందులో మానవులంతా సమానమే. ఇస్లాంలో ఒకరిపై మరొకరి మధ్య వ్యత్యాసం వారి సత్క్యార్యాల ఆధారంగా మాత్రమే ఉన్నది.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:(مَنۡ عَمِلَ صَٰلِحٗا مِّن ذَكَرٍ أَوۡ أُنثَىٰ وَهُوَ مُؤۡمِنٞ فَلَنُحۡيِيَنَّهُۥ حَيَوٰةٗ طَيِّبَةٗۖ وَلَنَجۡزِيَنَّهُمۡ أَجۡرَهُم بِأَحۡسَنِ مَا كَانُواْ يَعۡمَلُونَ) {ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.}[అన్ నహ్ల్ : 97]

ఇస్లాం ఆనందానికి మార్గం

ఇస్లాం ప్రవక్తలందరి ధర్మం ప్రజలందరి కొరకు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ధర్మం. మరియు ఇది ప్రత్యేకంగా అరబ్బుల ధర్మం కాదు.

ఇస్లాం ఈ ఇహలోకంలో నిజమైన ఆనందానికి మరియు పరలోకంలో శాశ్వతమైన ఆనందానికి మార్గం.

ఆత్మ మరియు శరీర అవసరాలను తీర్చే ఏకైక మతం ఇస్లాం మాత్రమే, మరియు మానవ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :﴿قَالَ اهْبِطَا مِنْهَا جَمِيعًا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ فَإِمَّا يَأْتِيَنَّكُمْ مِنِّي هُدًى فَمَنِ اتَّبَعَ هُدَايَ فَلا يَضِلُّ وَلا يَشْقَى (123) {(అల్లాహ్) అన్నాడు: "మీరిద్దరూ కలసి ఇక్కడి నుండి దిగిపోండి. మీరు ఒకరి కొకరు శత్రువులై ఉంటారు. కాని నా తరపు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది, కావున నా మార్గదర్శకత్వాన్ని అనుసరించే వాడు, మార్గభ్రష్టుడూ కాడు మరియు దురవస్థకు గురికాడు.وَمَنْ أَعْرَضَ عَنْ ذِكْرِي فَإِنَّ لَهُ مَعِيشَةً ضَنْكًا وَنَحْشُرُهُ يَوْمَ الْقِيَامَةِ أَعْمَى﴾ మరియు ఎవడైతే నా సందేశం నుండి విముఖుడవుతాడో నిశ్చయంగా, అతని జీవితం ఇరుకై పోతుంది మరియు పునరుత్థాన దినమున అతినిని అంధునిగా లేపుతాము."}[తాహా : 123-124]

ఇస్లాం స్వీకరించడం వలన నాకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?

ఇస్లాంలోకి ప్రవేశించడం వలన గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి, వాటిలో నుంచి ఇవి కొన్ని :

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క దాసునిగా మారడం ద్వారా ప్రాపంచిక జీవితంలో విజయం మరియు గౌరవాన్ని పొందుతాడు, లేకపోతే, అతడు షైతానుకు మరియు కోరికలకు బానిస అవుతాడు.

పరలోకంలో విజయం అంటే అల్లాహ్ దాసుడిని క్షమించి, అతని పట్ల సంతృప్తి చెందుతాడు మరియు అతనిని స్వర్గంలోకి ప్రవేశపెడతాడు, తద్వారా అతను మన్నత మరియు శాశ్వతమైన అనుగ్రహాలను పొందుతాడు. నరకాగ్ని శిక్ష నుండి మనిషి రక్షించబడుతాడు.

విశ్వాసి ప్రళయ దినాన ప్రవక్తలతో, సత్యవంతులతో, అమరవీరులతో మరియు సద్వర్తనులతో ఉంటాడు. మరియు ఇది ఎంత మధురమైన సాంగత్యం! మరియు విశ్వసించని వారి విషయానికొస్తే, వారు నిరంకుశులు, దుర్మార్గులు, నేరస్థులు మరియు అవినీతిపరులతో ఉంటారు.

ఎవరినైతే అల్లాహ్ స్వర్గంలోకి ప్రవేశింపజేస్తాడో వారు మరణం, అనారోగ్యం, బాధ, వృద్ధాప్యం లేదా విచారం లేని శాశ్వతమైన అనుగ్రహాలలో జీవిస్తారు. వారి కోరికలు నెరవేరుతాయి మరియు వారు కోరుకున్నదంతా వారికి లభిస్తుంది. నరకాగ్నిలోకి ప్రవేశించిన వారి విషయానికొస్తే, వారు శాశ్వతమైన మరియు నిరంతరాయమైన వేదనను అనుభవిస్తారు.

స్వర్గంలో, ఏ కన్ను చూడని, ఏ చెవి వినని మరియు ఏ మానవ మేదస్సు ఊహించలేని ఆనందాలున్నాయి. దీనికి నిదర్శనాలలో ఒకటి అల్లాహ్ సూక్తి:﴿مَنْ عَمِلَ صَالِحًا مِنْ ذَكَرٍ أَوْ أُنْثَى وَهُوَ مُؤْمِنٌ فَلَنُحْيِيَنَّهُ حَيَاةً طَيِّبَةً وَلَنَجْزِيَنَّهُمْ أَجْرَهُمْ بِأَحْسَنِ مَا كَانُوا يَعْمَلُونَ﴾ (ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.)[అన్ నహ్ల్ : 97]మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:﴿فَلَا تَعۡلَمُ نَفۡسٞ مَّآ أُخۡفِيَ لَهُم مِّن قُرَّةِ أَعۡيُنٖ جَزَآءَۢ بِمَا كَانُواْ يَعۡمَلُونَ﴾ (కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచి పెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు.)[సూరతుల్ సజ్దహ్ : 17]

ఒకవేళ నేను ఇస్లాంను స్వీకరించడానికి నిరాకరిస్తే ఏమి నష్టపోతాను ?

ఇస్లాంను స్వీకరించడానికి నిరాకరించిన వారు అల్లాహ్ను గురించి తెలుసుకోవడం మరియు ఆయన గురించి అంతర్దృష్టిని పొందడం అనే గొప్ప జ్ఞానాన్ని పొందే అవకాశాన్ని కోల్పోతారు. అదనంగా, వారు ఈ జీవితంలో భద్రత మరియు మనశ్శాంతిని ఇచ్చే , అలాగే పరలోకంలో శాశ్వతమైన అనుగ్రహాలను ప్రసాదించే అల్లాహ్పై విశ్వాసాన్ని కోల్పోతారు.

అల్లాహ్ మానవుల వైపు అవతరింపజేసిన గొప్ప గ్రంధమును, మరియు ఆ గొప్ప గ్రంధం పై విశ్వాసాన్ని మానవుడు కోల్పోతాడు.

వారు గొప్ప ప్రవక్తలపై విశ్వాసం ఉంచే అవకాశాన్ని కోల్పోతారు, అలాగే తీర్పు రోజున స్వర్గంలో వారితో పాటు వెళ్ళే అవకాశాన్ని కోల్పోతారు. బదులుగా, వారు నరకం యొక్క అగ్నిలో షైతానులు, నేరస్థులు మరియు నిరంకుశులతో కలిసి ఉంటారు. వారి నివాసం మరియు సాంగత్యం ఎంత నీచమైనది!

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:﴿قُلْ إِنَّ الْخَاسِرِينَ الَّذِينَ خَسِرُوا أَنْفُسَهُمْ وَأَهْلِيهِمْ يَوْمَ الْقِيَامَةِ أَلا ذَلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِينُ (15) ( ఇంకా ఇలా చెప్పు: "ప్రళయదినాన తాము నష్టపోయినదిగాక, తమ పరివారానికి కూడా నష్టం చేకూర్చిన వారే పూర్తిగా నష్టపోయినవారు. బాగా వినండి! ఘోరమైన నష్టం ఇదే."لَهُمْ مِنْ فَوْقِهِمْ ظُلَلٌ مِنَ النَّارِ وَمِنْ تَحْتِهِمْ ظُلَلٌ ذَلِكَ يُخَوِّفُ اللَّهُ بِهِ عِبَادَهُ يَا عِبَادِ فَاتَّقُونِ﴾ వారిని, వారిపై నుండి అగ్ని జ్వాలలు క్రమ్ముకుంటాయి మరియు వారి క్రింది నుండి (అగ్ని జ్వాలలు) క్రమ్ముకుంటాయి. ఈ విధంగా, అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు: "ఓ నా దాసులారా! నా పట్ల మాత్రమే భయభక్తులు కలిగి ఉండండి.")[అజ్ జుమర్ : 15-16]

ఎవరైతే పరలోకంలో మోక్షాన్ని కోరుకుంటారో, అతను ఇస్లాంలోకి ప్రవేశించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను అనుసరించాలి.

ప్రవక్తలు మరియు సందేశహరులు అలైహిముస్సలాం ఏకగ్రీవంగా అంగీకరించిన ఒక వాస్తవం ఏమిటంటే, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను విశ్వసించి మరియు ఆరాధనలో ఆయనకు భాగస్వాములను చేయకుండా, ప్రవక్తలను, సందేశహరులందరిని విశ్వసించే ముస్లింలు మాత్రమే పరలోకంలో రక్షింపబడతారు. ప్రవక్తలను అనుసరించి, వారిని విశ్వసించి, వారి సందేశాన్ని ధృవీకరించే వారందరూ స్వర్గంలోకి ప్రవేశిస్తారు మరియు నరకాగ్ని నుండి రక్షించబడతారు.

మూసా ప్రవక్త కాలంలో జీవించి ఆయనను విశ్వసించి, ఆయన బోధనలను అనుసరించిన వారు ముస్లిములు,పుణ్య విశ్వాసులు. అయితే, అల్లాహ్ యేసును ప్రవక్తగా పంపిన తర్వాత, మూసా అనుచరులు యేసును విశ్వసించి, ఆయనను అనుసరించటం తప్పనిసరి అయినది.కాబట్టి, ఈసాను విశ్వసించిన వారు నీతిమంతులైన ముస్లింలు, మరియు ఈసాను విశ్వసించడానికి నిరాకరించి, నేను మూసా మతాన్నే అనుసరిస్తాను, అని అనేవారు ఆవిశ్వాసులు. ఎందుకంటే వారు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పంపిన ప్రవక్తను విశ్వసించడానికి నిరాకరించారు.తరువాత, అల్లాహ్ చివరి చిట్టచివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పంపారు, ఆయన్ను విశ్వసించడం ప్రతి ఒక్కరిపై విధిగా మారింది. మూసా మరియు ఈసాలను పంపిన ప్రభువే, చిట్ట చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రవక్తగా పంపాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవదౌత్యాన్ని తిరస్కరించి, 'నేను మూసా లేదా ఈసాను అనుసరిస్తూనే ఉంటాను అని అనే వాడు విశ్వాసి కాదు.

ఒక వ్యక్తి నిజానికి ముస్లింల పట్ల గౌరవం కలవాడని పలకటం మాత్రమే సరిపోదు మరియు పరలోకంలో తన మోక్షం కొరకు దానధర్మాలు చేసి మరియు పేదలకు సహాయం చేస్తే సరిపోదు. బదులుగా, అతను సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను, ఆయన గ్రంధాలను, ఆయన ప్రవక్తలను మరియు అంతిమ దినాన్ని విశ్వసించడం అవసరం. అల్లాహ్ అతని కర్మలను అప్పుడే అంగీకరిస్తాడు! సర్వశక్తిమంతుడైన అల్లాహ్తో భాగస్వాములను చేయడం, ఆయనను విశ్వసించడం, ఆయన అవతరింపజేసిన దివ్యగ్రంథాన్ని తిరస్కరించడం లేదా అతని చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్తత్వాన్ని తిరస్కరించడం కంటే ఘోరమైన పాపం మరొకటి లేదు.

కాబట్టి, అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించంటం గురించి విన్న యూదులు, క్రైస్తవులు మరియు ఇతరులు ఆయనను విశ్వసించడానికి నిరాకరించారు మరియు ఇస్లాం ధర్మంలోకి ప్రవేశించడానికి నిరాకరించారు. కాబట్టి వారు నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటారు. ఇది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క తీర్పు, ఏ మానవుని తీర్పు కాదు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :﴿إِنَّ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ فِي نَارِ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۚ أُولَـٰئِكَ هُمْ شَرُّ الْبَرِيَّة﴾ (నిశ్చయంగా, సత్యతిరస్కారులైన గ్రంథ ప్రజలు మరియు బహుదైవారాధకులు నరకాగ్నిలోకి పోతారు. వారందులో శాశ్వతంగా ఉంటారు. ఇలాంటి వారే, సృష్టిలో అత్యంత నికృష్ట జీవులు.)[అల్ బయ్యిన : 6]

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి మానవాళికి చివరి సందేశం అవతరించినందున, ఇస్లాం గురించి మరియు చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశం గురించి విన్న ప్రతి వ్యక్తి ఆయనను విశ్వసించడం, ఆయన షరియాను అనుసరించడం మరియు ఆయనను ఆయన ఆదేశాలలో,ఆయన వారింపులలో అనుసరించటం తప్పనిసరి అవుతుంది. కాబట్టి, ఎవరైతే ఈ చివరి సందేశం గురించి విని దానిని తిరస్కరిస్తారో, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వారి నుండి దేనినీ అంగీకరించడు మరియు పరలోకంలో అతన్ని శిక్షిస్తాడు.

దీనికి ఆధారంగా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సూక్తి కూడా ఉంది:﴿وَمَنْ يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ﴾ {మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంభించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు.}[ఆలి ఇమ్రాన్ : 85]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:﴿قُلْ يَا أَهْلَ الْكِتَابِ تَعَالَوْا إِلَى كَلِمَةٍ سَوَاءٍ بَيْنَنَا وَبَيْنَكُمْ أَلَّا نَعْبُدَ إِلَّا اللَّهَ وَلَا نُشْرِكَ بِهِ شَيْئًا وَلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا أَرْبَابًا مِنْ دُونِ اللَّهِ فَإِنْ تَوَلَّوْا فَقُولُوا اشْهَدُوا بِأَنَّا مُسْلِمُونَ﴾ (ఇలా అను: " ఓ గ్రంథ ప్రజలారా! మాకూ మరియు మీకూ మధ్య ఉమ్మడిగా ఉన్న ధర్మ విషయం (ఉత్తరువు) వైపునకు రండి, అది ఏమిటంటే: 'మనం అల్లాహ్ తప్ప మరెవ్వరినీ ఆరాధించరాదు, ఆయనకు భాగస్వాములను ఎవ్వరినీ నిలబెట్టరాదు మరియు అల్లాహ్ తప్ప, మనవారిలో నుండి ఎవ్వరినీ ప్రభువులుగా చేసుకోరాదు." వారు (సమ్మతించక) తిరిగి పోతే: "మేము నిశ్చయంగా అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము), దీనికి మీరు సాక్షులుగా ఉండండి." అని పలుకు.)[ఆలి ఇమ్రాన్ : 64]

నేను ముస్లింగా మారడానికి ఏం చేయాలి?

ఇస్లాం స్వీకరించుటకు, ఈ ఆరు విశ్వాస మూల స్తంభాలను విశ్వసించాలి, అవి:

1. సృష్టికర్తగా,ఆహార ప్రధాతగా, ప్రణాళికకర్తగా మరియు యజమానిగా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పై విశ్వాసం. ఆయనను పోలింది ఏదీ లేదు, ఆయనకు భార్య లేదా సంతానం లేరు. ఆయన మాత్రమే ఆరాధనకు అర్హుడు మరియు ఆయనతో పాటు వేరేతరులను పూజించరాదు. ఆయనను తప్ప ఇతరులను పూజించడం చెల్లదని నమ్మడం తప్పనిసరి.

2. దైవదూతల పట్ల విశ్వాసం వారు అల్లాహ్ దాసులని, ఆయన వారిని కాంతి నుండి సృష్టించాడని విశ్వసించడం. మరియు ఆయన తన ప్రవక్తలకు దైవవాణిని అవతరింపజేయడాన్ని వారి కార్యాలలో ఒకటిగా చేశాడు.

3. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన ప్రవక్తలపై అవతరింపజేసిన అన్ని గ్రంధాలపై విశ్వాసం (తౌరాత్ మరియు ఇంజీలు వాటి వక్రీకరణకు ముందు వంటివి) మరియు చివరి గ్రంధం దివ్యఖురాన్.

4. నూహ్, ఇబ్రాహీం, మూసా, ఈసా మరియు వారిలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వంటి ప్రవక్తలందరిపై విశ్వాసం. వారు దైవిక ద్యోతకం ద్వారా మద్దతివ్వబడిన మానవులు మరియు వారి నిజాయితీని ధృవీకరించదానికి సంకేతాలు మరియు అద్భుతాలు ఇవ్వబడ్డాయి.

5. తీర్పు దినంపై విశ్వాసం, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆ రోజున పూర్వం మరియు తరువాతి తరాలతో సహా ప్రజలందరినీ మరణాంతరం లేపుతాడు. మరియు తన సృష్టిరాసుల మధ్య తీర్పునిస్తాడు. ఆయన విశ్వాసులను స్వర్గంలోకి ప్రవేశపెడతాడు, అవిశ్వాసులను నరకాగ్నిలోకి ప్రవేశింపజేస్తాడు.

6. విధి వ్రాతపై విశ్వాసం, మరియు అల్లాహ్ కు గతంలో జరిగినదంతా మరియు భవిష్యత్తులో జరగబోయేవన్నీ తెలుసునని విశ్వసించటం. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సర్వ జ్ఞాని, ప్రతి దానిని వ్రాసి ఉంచాడు మరియు ఆయనే ప్రతీది సృష్టించాడు.

నిర్ణయంలో ఆలస్యం చేయవద్దు!

ఇహలోక జీవితం శాశ్వత నివాసం కాదు...

దీని అందమంతా కనుమరుగవుతుంది మరియు కోరికలన్ని నశిస్తాయి...

ప్రతి వ్యక్తి తాను చేసిన ప్రతీ దానికీ లెక్క తీసుకోబడే రోజు వస్తుంది. అదే ప్రళయదినము. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :﴿وَوُضِعَ الْكِتَابُ فَتَرَى الْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ وَيَقُولُونَ يَا وَيْلَتَنَا مَالِ هَذَا الْكِتَابِ لاَ يُغَادِرُ صَغِيرَةً وَلاَ كَبِيرَةً إِلاَّ أَحْصَاهَا وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا وَلاَ يَظْلِمُ رَبُّكَ أَحَدًا﴾ (మరియు కర్మపత్రం వారి ముందు ఉంచబడినపుడు, ఆ అపరాధులు, అందులో ఉన్న దానిని చూసి భయపడటాన్ని నీవు చూస్తావు. వారు ఇలా అంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం, ఇదేమి గ్రంథం! ఏ చిన్న విషయాన్న గానీ, ఏ పెద్ద విషయాన్ని గానీ ఇది లెక్కపెట్టకుండా విడువ లేదే!" తాము చేసిందంతా వారు తమ ఎదుట పొందుతారు. నీ ప్రభువు ఎవ్వరికీ అన్యాయం చేయడు.)[ అల్ కహఫ్ : 49]

ఇస్లాంను స్వీకరించని వారు నరకాగ్నిలో ఉంటారని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పేర్కొన్నాడు, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు.

ఇది చిన్న నష్టం కాదు, భారీ నష్టం. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :﴿وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ﴾ (మరియు ఎవడైనా ఇస్లాం తప్ప ఇతర ధర్మాన్ని అవలంభించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు.)[ఆలి ఇమ్రాన్ : 85]

అల్లాహ్ ధర్మాలలో నుంచి ఇస్లాం తప్ప మరే ధర్మాన్ని అంగీకరించడు.

అల్లాహ్ మనలను సృష్టించాడు మరియు ఆయన వైపుకే మేము మరలివెళతాము మరియు ఈ ఇహలోకము మనకు ఒక పరీక్ష.

మనిషి ఈ నమ్మకం కలిగి ఉండాలి : ఈ జీవితం ఒక కలలా చిన్నది... ఎప్పుడు చనిపోతాడో ఎవరికీ తెలియదు!

అతడు సత్యాన్ని ఎందుకు అనుసరించలేదు?,అతను ప్రవక్తల పరిసమాప్తి అయిన ప్రవక్తను ఎందుకు అనుసరించలేదు? అని ప్రళయదినాన సృష్టికర్త ప్రశ్నిస్తే అతడు తన సృష్టికర్తకు ఏం సమాధానం చెబుతాడు?

ఇస్లాంలో అవిశ్వాసాన్ని అనుసరించవద్దని హెచ్చరించినప్పుడు మరియు అవిశ్వాసుల ముగింపు నరకంలో శాశ్వతమైన వినాశనం అని చెప్పినప్పుడు అతను తీర్పు దినం రోజున తన ప్రభువుకు ఏం సమాధానం ఇస్తాడు?

మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:﴿وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَئِكَ أَصْحَابُ النَّارِ هُمْ فِيهَا خَالِدُونَ﴾ (కానీ, ఎవరైతే (మార్గదర్శకత్వాన్ని) తిరస్కరిస్తారో మరియు మా సూచన(ఆయత్)లను అసత్యాలని తిరస్కరిస్తారో, అలాంటి వారు నరకాగ్ని వాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.)[అల్ బఖర : 39]

తన తాతముత్తాతలను అనుకరిస్తూ సత్యాన్ని తిరస్కరించిన వ్యక్తి కొరకు ఎటువంటి సాకులుండవు.

చాలా మంది ప్రజలు తాము నివసించే పర్యావరణానికి భయపడి ఇస్లాంలోకి మారడానికి నిరాకరిస్తున్నారని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మనకు తెలియపరచాడు.

మరికొందరు ఇప్పటికీ ఇస్లాంను తిరస్కరిస్తారు! ఎందుకంటే వారు తమ పూర్వీకుల నుండి వారసత్వంగా పొందిన లేదా వారి పర్యావరణాలు మరియు సమాజాల నుండి పొందిన వారి నమ్మకాలను మార్చడానికి ఇష్టపడరు మరియు వారు వాటికి అలవాటు పడ్డారు. వారిలో చాలా మంది వారు వారసత్వంగా వచ్చిన అసత్యం పట్ల మతోన్మాదం మరియు పక్షపాతంతో నిరోధించబడ్డారు.

ఈ ప్రజలందరికీ దీనిలో ఎటువంటి సాకు లేదు, మరియు వారు ఎటువంటి వాదన లేకుండా అల్లాహ్ ముందు నిలబడతారు.

"నేను నాస్తిక కుటుంబంలో పుట్టాను కాబట్టి నాస్తికుడిగానే ఉంటాను!" అని నాస్తికుడు అనడం సబబు కాదు. బదులుగా, అతను అల్లాహ్ తనకు ఇచ్చిన బుద్దిని ఉపయోగించాలి, భూమ్యాకాశాల గొప్పతనాన్ని గురించి ఆలోచించాలి మరియు ఈ విశ్వానికి సృష్టికర్త ఉన్నాడని గ్రహించడానికి తన సృష్టికర్త తనకు ఇచ్చిన బుద్దితో ఆలోచించాలి.అలాగే, రాళ్లను మరియు విగ్రహాలను పూజించే వ్యక్తి తన తాతముత్తాతలను అనుకరించడానికి ఎటువంటి కారణం లేదు, అతను సత్యాన్ని అన్వేషించాలి మరియు తనను తాను ఇలా ప్రశ్నించుకోవాలి: నా మాట వినలేని, నన్ను చూడలేని మరియు దేనిలోనూ నాకు ప్రయోజనం కలిగించని ఒక నిర్జీవ వస్తువును నేను ఎలా పూజించగలను?!

అలాగే, ఇంగితజ్ఞానం మరియు హేతువుకు విరుద్ధమైన విషయాలను విశ్వసించే క్రైస్తవుడు తనను తాను ఇలా ప్రశ్నించుకోవాలి: ఇతరుల పాపాల కోసం పాపం చేయని తన కొడుకును ప్రభువు ఎలా చంపగలడు?! ఇది అన్యాయం! మానవులు ప్రభువు కుమారుడికి సిలువ వేసి ఎలా చంపగలరు?! ప్రభువు తన కుమారుడిని చంపడానికి అనుమతించకుండా మానవాళి పాపాలను క్షమించలేడా? ప్రభువు తన కుమారుడిని రక్షించలేడా?

సత్యాన్ని అనుసరించడం తెలివైన వ్యక్తి యొక్క విధి. మరియు అతడు అసత్య విషయంలో తాతముత్తాతలను అనుసరించకూడదు.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:﴿وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا إِلَى مَا أَنْزَلَ اللَّهُ وَإِلَى الرَّسُولِ قَالُوا حَسْبُنَا مَا وَجَدْنَا عَلَيْهِ آبَاءَنَا أَوَلَوْ كَانَ آبَاؤُهُمْ لَا يَعْلَمُونَ شَيْئًا وَلَا يَهْتَدُونَ﴾ (మరియు వారితో: "అల్లాహ్ అవతరింప జేసిన దాని (సందేశం) వైపునకు మరియు ప్రవక్త వైపునకు రండి." అని పిలిచినప్పుడు! వారు: "మా తండ్రితాతలు అవలంబిస్తూ ఉండగా మేము చూసిన (మార్గమే) మాకు చాలు!" అని జవాబిస్తారు. ఏమీ? వారి తండ్రితాతలకు ఏమీ తెలియకున్నా మరియు వారు సన్మార్గం మీద లేకున్నా (వారి మార్గాన్నే వీరు అనుసరిస్తారా)?)[అల్ మాయిదా :104]

ఇస్లాం స్వీకరించాలని కోరుకున్న వ్యక్తి, తన కుటుంబ సభ్యులు పెట్టే బాధల గురించి ఆందోళన చెందితే ఏమి చేయాలి?

ఎవరైతే ఇస్లాంలోకి మారాలనుకుంటున్నారో వారు తమ చుట్టూ ఉన్న వాతావరణానికి భయపడితే, వారు ఇస్లాంను బహిర్గతం చేయడానికి అల్లాహ్ వారికి ఆనుకూలమైన మంచి మార్గాన్ని కల్పించే వరకు తన ఇస్లాంను దాచవచ్చు.

ఒక వ్యక్తి వెంటనే ఇస్లాంలోకి మారడం తప్పనిసరి, కానీ అతను ఇస్లాంలోకి మారడం అతనికి హానికరం అయితే దానిని అతని చుట్టూ ఉన్నవారికి తెలియజేయడం లేదా ప్రచారం చేయడం తప్పనిసరి కాదు.

ఒక వ్యక్తి ఇస్లాంలోకి మారితే, అతను లక్షలాది మంది ముస్లింలకు సోదరుడు అవుతాడని తెలుసుకోండి మరియు అతను తన పట్టణంలోని మస్జిద్ లేదా ఇస్లామిక్ సెంటర్తో సంబంధం ఏర్పరచుకోవాలి. సలహాలు మరియు సహాయం కోసం వారిని అడగవచ్చు అది వారిని సంతోషపరుస్తుంది.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:﴿وَمَنْ يَتَّقِ اللَّهَ يَجْعَلْ لَهُ مَخْرَجًا (ఎవడయితే అల్లాహ్కు భయపడుతూ మసలుకుంటాడో అతనికి అల్లాహ్ (ఈ సంక్షోభం నుండి) బయటపడే మార్గం కల్పిస్తాడు.وَيَرْزُقْهُ مِنْ حَيْثُ لَا يَحْتَسِب﴾ అతను ఊహించనయినాలేని చోటు నుండి అతనికి ఉపాధిని సమకూరుస్తాడు.)[అత్ తలాఖ్ : 2,3]

ఓ నా ప్రియ పాఠకుడా

సృష్టికర్త అయిన అల్లాహ్ మనకు తన అనుగ్రహాలన్నింటిని ప్రసాదించాడు, మనం మన తల్లుల కడుపులలో పిండాలుగా ఉన్నప్పుడు మనకు జీవనోపాధిని అందించాడు మరియు ఇప్పుడు మనం పీల్చే గాలిని ప్రసాదించాడు - ప్రజలను సంతోషపెట్టడం కంటే ఆయనను సంతోషపెట్టడం ముఖ్యం కాదా?

జీవితంలోని క్షణికమైన ఆనందాలన్నింటినీ త్యాగం చేయడం కంటే ఇహపరాల విజయం విలువైనది కాదా? ఎందుకు కాదు, అల్లాహ్ సాక్షిగా!

కాబట్టి, ఒక వ్యక్తి తన గతం కారణంగా తన తప్పు మార్గాన్ని సరిదిద్దుకోకుండా మరియు సరైన పనిని చేయకుండా అడ్డుకోరాదు.

కాబట్టి మనిషిని నేడు నిజమైన విశ్వాసిగా ఉండనివ్వండి మరియు సత్యాన్ని అనుసరించకుండా నిరోధించడానికి షైతానుకు అనుమతించవద్దు!

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:﴿يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَكُمْ بُرْهَانٌ مِنْ رَبِّكُمْ وَأَنزلْنَا إِلَيْكُمْ نُورًا مُبِينًا (174) (ఓ మానవులారా! మీ ప్రభువు నుండి మీకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది. మరియు మేము మీపై స్పష్టమైన జ్యోతిని (ఈ ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము.فَأَمَّا الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَاعْتَصَمُوا بِهِ فَسَيُدْخِلُهُمْ فِي رَحْمَةٍ مِنْهُ وَفَضْلٍ وَيَهْدِيهِمْ إِلَيْهِ صِرَاطًا مُسْتَقِيمًا﴾ కావున ఎవరు అల్లాహ్ ను విశ్వసించి, ఆయననే దృఢంగా నమ్ముకుంటారో, వారిని ఆయన తన కారుణ్యానికి మరియు అనుగ్రహానికి పాత్రులుగా చేసుకొని తన వద్దకు చేరే ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.)[ అన్ నిసా :174-175]

మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

ప్రస్తావించబడినదంతా తార్కికంగా ఉంటే, మరియు ఒక వ్యక్తి తన హృదయంలో సత్యాన్ని గుర్తించినట్లయితే, అతను ముస్లింగా మారడానికి మొదటి అడుగు వేయాలి.

తన జీవితంలో అత్యుత్తమ నిర్ణయం తీసుకోవడంలో సహాయం మరియు ముస్లింగా ఎలా మారాలనే దానిపై మార్గదర్శకత్వం ఎవరికి కావాలి?

అతని పాపాలు అతన్ని ఇస్లాం స్వీకరించకుండా నిరోదించేవి కాకుడదు. ఎందుకంటే ఒక వ్యక్తి తన సృష్టికర్త ముందు పశ్చాత్తాపపడితే అల్లాహ్ అతని పాపాలన్నిటినీ క్షమిస్తాడని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పవిత్ర ఖురాన్లో మనకు తెలియపరచాడు. ఇస్లాం స్వీకరించిన తర్వాత కూడా, ఒక వ్యక్తి కొన్ని పాపాలకు పాల్పడటం సహజం. ఎందుకంటే మనం మనుషులం. పాపాల నుండి స్వచ్ఛమైన దైవదూతలు కాము.అటువంటి పరిస్థితిలో, అల్లాహ్ నుండి క్షమాపణ కోరడం మరియు ఆయన ముందు పశ్చాత్తాపం చెందడం మన విధి. మనం సమయాన్ని వృధా చేయకుండా సత్యాన్ని అంగీకరించి, ఇస్లాం స్వీకరించి, రెండు సాక్ష్యాలను ఇచ్చామని అల్లాహ్ చూస్తే, పాపాలను విడిచి పెట్టడంలో ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఎవరైతే అల్లాహ్ వైపు మరులుతారో మరియు సత్యాన్ని అంగీకరిస్తారో, అల్లాహ్ అతనికి మరిన్ని మంచి పనులు చేసే అవకాశాన్ని కల్పిస్తాడు. కాబట్టి, ఒక వ్యక్తి ఇస్లాంను స్వీకరించడంలో వెనుకాడకూడదు.

దీనికి ఆధారం సర్వశక్తిమంతుడి వాక్కు:﴿قُلْ لِلَّذِينَ كَفَرُوا إِنْ يَنْتَهُوا يُغْفَرْ لَهُمْ مَا قَدْ سَلَفَ﴾ {[ఓ ప్రవక్త] ఈ అవిశ్వాసులకు చెప్పు వారు గనక మానుకుంటే గతంలో వారి వల్ల జరిగిన పాపాలన్నీ క్షమించబడతాయి}[అల్-అన్'ఫాల్ :38 ]

ముస్లింగా మారడానికి, నేను ఏమి చేయాలి?

ఇస్లాంను స్వీకరించడం చాలా సులభం మరియు ఎటువంటి ఆచారాలను కలిగి ఉండదు. మీరు ఈ రెండు సాధారణ దశలను మాత్రమే అనుసరించండి: 1. విశ్వాసం యొక్క రెండు సాక్ష్యాలను ఉచ్చరించడం, వాటి అర్థాన్ని అర్థం చేసుకోవాడం మరియు వాటిని విశ్వసించడం. రెండు సాక్ష్యాలు: "అల్లాహ్ తప్ప మరే ఆరాధ్యదేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహారులు అని నేను సాక్ష్యమిస్తున్నాను." వాటిని అరబీ లో చెప్పడం ఉత్తమం అయితే, మీకు కష్టం అనిపిస్తే వాటిని మీ మాతృభాషలో కూడా చెప్పవచ్చు. 2. మీ మతం గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది ఈ ప్రపంచంలో మీ ఆనందానికి మరియు పరలోకంలో మీ మోక్షానికి మూలం.





విశ్వాన్ని ఎవరు సృష్టించారు? నన్ను ఎవరు సృష్టించారు? మరియు ఎందుకు?

ప్రభువు గొప్ప సృష్టికర్త

ఈ ప్రభువు సృష్టికర్త మరియు ఆహార ప్రధాత అయిన అల్లాహ్ మహిమాన్వితమైన వాడు మరియు గొప్పవాడు

సృష్టికర్త అయిన ప్రభువు యొక్క గుణాలు

ఆరాధించబడే ప్రభువు పరిపూర్ణత యొక్క లక్షణాలను కలిగి ఉంటాడు

ఇంత గొప్ప సృష్టికర్త మనల్ని ఎందుకు సృష్టించాడు? మరియు ఆయన మన నుండి ఏమి కోరుకుంటున్నాడు?

అనేకమంది సందేశహరులు ఎందుకు పంపబడ్డారు?

ప్రవక్తలందరినీ విశ్వసించేంత వరకు ఎవరూ నిజమైన విశ్వాసి కాలేరు.

దివ్యఖుర్ఆన్ అంటే ఏమిటి?

ఇస్లాం అంటే ఏమిటి?

ఇస్లాం ఆనందానికి మార్గం

ఇస్లాం స్వీకరించడం వలన నాకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?

ఒకవేళ నేను ఇస్లాంను స్వీకరించడానికి నిరాకరిస్తే ఏమి నష్టపోతాను ?

ఎవరైతే పరలోకంలో మోక్షాన్ని కోరుకుంటారో, అతను ఇస్లాంలోకి ప్రవేశించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను అనుసరించాలి.

నేను ముస్లింగా మారడానికి ఏం చేయాలి?

నిర్ణయంలో ఆలస్యం చేయవద్దు!

తన తాతముత్తాతలను అనుకరిస్తూ సత్యాన్ని తిరస్కరించిన వ్యక్తి కొరకు ఎటువంటి సాకులుండవు.

ఇస్లాం స్వీకరించాలని కోరుకున్న వ్యక్తి, తన కుటుంబ సభ్యులు పెట్టే బాధల గురించి ఆందోళన చెందితే ఏమి చేయాలి?

ఓ నా ప్రియ పాఠకుడా

మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

ముస్లింగా మారడానికి, నేను ఏమి చేయాలి?